*'భాగవతం వింటే బాగవుతాం'*
_శ్రీ పోతన భాగవత మధురిమలు_
(6-187-క)
అదిగాన విష్ణుభక్తులఁ
గదియఁగఁ జనవలదు మీరు కరివరదు లస
త్పదపద్మ వినతి విముఖులఁ
దుది నంటఁగఁ గట్టి తెండు ధూర్తులు వారల్.
*భావము:-* కావున, మీరు విష్ణుభక్తులను సమీపించవద్దు. శ్రీహరి పాదపద్మారాధనకు విముఖులైన ధూర్తులను పట్టి బంధించి తీసుకురండి.
శ్రీ భక్త రామదాసు కీర్తనతో శుభోదయం.
*శ్రీ కృష్ణం వందే జగద్గురుం*
_ధర్మో రక్షతి రక్షితః_
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి