*మాఘమాస శివస్తుతి
6/2/26 (27)
కం .
పరులకు మేలది జేసెడు
పరహితమను మంచిబుద్ధి వర ముగనిమ్మా
పరమశివా ప్రజ్ఞలనిడు
ధరణిన్ నీ భక్తుకెపుడు దప్పక దేవా||
|| (27)
కం.
సుగుణగుణ సాంప్రదాయము
ప్రగతులగొను పథము నదియు పార్థివనిడుమా
సుగుణమణి శంభు యీశా
సుగతిని నడిపించు మమ్ము సుర గణశ్రేష్ఠా||
|| (28)
డా|| శేషం వేణుగోపాల శర్మ
స్కూల్ అసిస్టెంట్ తెలుగు
కరీణ్ణగరమ్
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి