4, నవంబర్ 2022, శుక్రవారం

Srimadhandhra Bhagavatham

 Srimadhandhra Bhagavatham -- 63 by Pujya Guruvulu "Pravachana Chakravarthy" , "Vachaspathy" Brahmasri Chaganti Koteswara Rao Garu


నవమస్కంధము – అంబరీషోపాఖ్యానము

అంబరీషోపాఖ్యానం ఒక మహాద్భుతమయిన విషయము. అంబరీషుడు నాభాగుని కుమారుడు. నాభాగుడనే చక్రవర్తి సామాన్యుడు కాదు. ఆయన చాలా గొప్ప రాజు. అంబరీషుడు బ్రహ్మచారిగా ఉన్నప్పటినుంచి సహజముగా కొన్ని గుణములు అలవడ్డాయి. తపస్సు చేయడం ఎంత గొప్పదో తపస్సు చేసిన వాడికి పక్కన క్రోధం ఉండడం అంత భయంకరమయిన విషయము. చాలా గొప్ప అధికారం ఉండి చటుక్కున కోపం వచ్చే స్వభావం ఉన్నవాడు ఈ ప్రపంచంలో అందరికన్నా ప్రమాదకరమయిన వ్యక్తి. ఒక మహర్షి శాపమును ఇస్తే దానిని తప్పుకున్నవాడు కనపడడు. అంబరీషుడు మాత్రం మహర్షి శాపము నుండి తప్పించుకున్నాడు. అదీ ఈ చరిత్రకు ఉన్న గొప్పతనం.

అంబరీషుని చిత్తము ఎప్పుడూ శ్రీమహావిష్ణువు పాదములను పట్టుకుని ఉండేది. ఆయన ప్రవిఢవిల్లిన భక్తి చేత ఉన్నాడు. ఏది మాట్లాడినా హరి గుణములను వర్ణన చేస్తూ ఉంటాడు. ఆయన చెవులు ఎప్పుడూ మాధవుని కథాశ్రవణము వినడానికి ఉత్సాహమును పొందుతూ ఉండేవి. అంబరీషుడు భగవంతుని ముందు వంగి నమస్కరించే శిరస్సు ఉన్నవాడు. భగవంతుడిని నమ్ముకున్న భాగవతులు కనపడితే వారి పాదముల వాసన ముక్కుకు పట్టేటట్లు వారి పాదముల మీద పడేవాడు. వారి పాదములనుండి వెలువడే పద్మముల సువాసనను ఆయన ఆస్వాదించేవాడు. అంబరీషుడు రసేంద్రియమును గెలవగలిగాడు. ఏది పడితే అది రుచి చూపించాలని ప్రయత్నం చేసేవాడు కాదు. ఎప్పుడూ ఈశ్వరుని యందు మగ్నమై ఉండేవాడు. అయినా ఆయన రాజ్యపాలనమును విస్మరించలేదు. అంబరీషునికి అంతఃపురముల మీద కోరిక లేదు. ఏనుగుల మీద, గుఱ్ఱముల మీద, ధనం మీద, ఉద్యానవనముల మీద, కొడుకుల మీద, బంధుమిత్రుల మీద రాజ్యం మీద, భార్య మీద, దేనిమీదా కోరిక లేదు. అన్నింటితో ఉన్నాడు. దీనినే కర్తవ్యనిష్ఠ అంటారు.

పరమ పవిత్రమయిన జీవితమును గడుపుతున్న స్థితిలో అంబరీషుడు సరస్వతీనదీ తీరంలో అశ్వమేధయాగం చేశాడు. దానికి వసిష్ఠాది మహర్షులు వచ్చారు. ఆ మహర్షులందరినీ సేవించాడు. భూరి తాంబూలములను ఇచ్చాడు. ఒక సంవత్సరం పాటు ద్వాదశీవ్రతము చెయ్యాలని అనుకున్నాడు. ఏకాదశీ వ్రతమునకు, ద్వాదశీ వ్రతమునకు తేడా ఏమీ లేదు. దశమినాటి సాయంత్రము నుండి ఉపవాసం ప్రారంభం చేస్తారు. ఉపవాసము అంటే ‘అశనము’ అని శాస్త్రంలో ఒక మాట ఉన్నది. అశనము అంటే వ్యక్తికి క్రిందటి జన్మలలో ఉన్న దరిద్రమును అనుభవించడానికి ఈ జన్మలో ఐశ్వర్యము ఉన్నా, ఆకలి వేస్తున్నా తినకుండా తనని తాను ఒకరోజు మాడ్చుకోవడం. ఈశ్వరునికి దగ్గరగా బుద్ధి నిలబడడానికి ఎంత సాత్వికమయిన పదార్ధం తిని శరీరం నిలబెట్టుకోవాలో ఈశ్వరార్చితమయిన అంత ప్రసాదమును తిని నిలబెట్టుకుంటే దానిని ఉపవాసము ఉంటారు. అంబరీషుడు ఏకాదశీ వ్రతమును చేస్తున్నాడు. ఏకాదశి నాడు ఉపవాసం చెయ్యాలి. ద్వాదశినాడు పారణ చెయ్యాలి. ఎంత తొందరగా వీలయితే అంత తొందరగా పదార్థములను తినేయ్యడాన్ని పారణ అంటారు. పారణ చేసేటప్పుడు సూర్యోదయం అవగానే భోజనం చేసేసినా ఏమీ తప్పు లేదు. నిత్యానుష్ఠానం చేసేసుకుని ద్వాదశినాడు భోజనం చేసేయవచ్చు. అంబరీషుడు సంవత్సరం పాటు సంతోషంగా ఏకాదశీ వ్రతమును పూర్తి చేసాడు. ఏకాదశి తిథి అయి తెల్లవారి సూర్యోదయం అయింది. సంవత్సరకాలం పాటు చేసిన ఏకాదశీ వ్రతం పరిపూర్ణమయింది. యజ్ఞమును పూర్ణాహుతి చేయకుండా అసంపూర్తిగా ఆపివేసినట్లయితే ఆ యజ్ఞం పూర్తయినట్లు లెక్కకు రాదు. యజ్ఞభ్రంశం అవుతుంది. ఏకాదశీ వ్రతం పూర్తవుతున్నది. ద్వాదశి తిథి ఉండగా భోజనం చేయాలి. తాము భోజనం చేసేముందు ఏడాదిపాటు వ్రతం చేశారు కాబట్టి మొట్టమొదట కాళిందీనది ఒడ్డుకు వెళ్ళి నదీస్నానం చేసారు. అనంతరం మధువనంలోకి వెళ్ళి చక్కగా శ్రీకృష్ణపరమాత్మకు అభిషేకం చేశారు. అక్కడికి బ్రాహ్మణులు వచ్చారు. వారికి దానములను ఇచ్చారు. వారికి కడుపునిండా భోజనం పెట్టాడు. వాళ్ళందరూ కడుపునిండా తిన్న తరువాత ఇతడు ద్వాదశి పారణం చేయాలి. తనుకూడా భోజనం చేయాలి.

అందరి భోజనములు పూర్తయిన తరువాత తాను భోజనం చేద్దామని సిద్ధ పడుతుండగా అక్కడికి దుర్వాసో మహాముని వచ్చారు. దుర్వాసుడు సర్వకాలముల యందు వేదములయందు, వేదాంతములయందు బుద్ధిని నిక్షేపించిన వాడు. గొప్ప తపస్సును పాటించిన వాడు. సూర్యుడు ఎలా ఉంటాడో అటువంటి తేజస్సును పొందినవాడు. వచ్చిన దుర్వాసోమహర్షిని అంబరీషుడు ఈశ్వరునిగా భావించాడు. పొంగిపోయి ‘ఊరకరారు మహాత్ములు! ఇవాళ నేను చాలా అదృష్టవంతుడిని. నీవు శివాంశ సంభూతుడివి నా ఇంటికి అతిథిగా వచ్చావు. ఏమి నా భాగ్యము? ఇంతమందికి పారణ సమయంలో భోజనం పెట్టాను. ఇవాళ ద్వాదశి పారణ. మీరు మహాత్ములు కనుక ముందువచ్చి భోజనం చేయాలి. మీరు భోజనం చేశాక నేను భోజనం చేస్తాను. మీరూ నేనూ తొందరగా భోజనం చేయాలి. ద్వాదశి కాబట్టి మన ఇద్దరికీ యిదే ధర్మం. మీరు తొందరగా స్నానం చేసి వస్తే మీరు భోజనం చేశాక భుక్తశేషమును నేను తింటాను’ అన్నాడు.

దుర్వాసోమహర్షి అలాగే వస్తాను అని తొందరగా స్నానం చేసి వద్దామని వెళ్ళాడు. ఆయన యమునా నదీజలములలో స్నానమునకు దిగాడు. ఇక్కడ మాయ కమ్మింది. దుర్వాసోమహర్షి మహాభక్తుడు. ఈశ్వర ధ్యానమునందు సమయమును మరచిపోయి జలములలో ఉండిపోయాడు. ద్వాదశి తిథి వెళ్ళిపోతుంది. మహర్షి ధ్యానమునందు ఉండిపోయాడు కాబట్టి ఆయనకు దోషం లేదు. ఇపుడు అంబరీషునికి ఇబ్బంది వచ్చింది అతను పారణ చేయాలి. లేకపోతే ద్వాదశి తిథి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయేలోపల పారణ చేయకపోతే వ్రతభంగం అవుతుంది. వ్రత భంగం అయితే ఆయన మరల ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. విద్వాంసులను, మహా పండితులను పిలిచాడు. విద్వాంసులు ఎంతో గొప్పగా చెప్పారు ‘ఆయన చూస్తే మహర్షి ధ్యానంలో ఉన్నాడు పిలవకూడదు. నీవు చూస్తే గృహస్థు. వ్రతం చేసి ఉన్నావు. భంగం జరుగ కూడదు. పోనీ పారణ చేసేయ్యడమే కదా అని ముందు తింటే వచ్చిన అతిథికి నీవు మహా అవమానము చేసినట్లు అవుతుంది. తినకుండా ఉంటే తిథి దాటిపోతుంది. నీకు మధ్యే మార్గం ఒకటి చెపుతాము. సలిలము పుచ్చుకో ’ అన్నారు. అంటే కాసిని నీళ్ళు తాగమన్నారు. అయితే ‘నేను కొద్ది నీళ్ళు పుచ్చుకుంటాను ఆయన తినగా మిగిలిన శేషమునే నేను భోజనముగా తింటాను. నీటికి ఎప్పుడూ పవిత్రత ఉంటుంది నీళ్ళు ఒక్కటే పుచ్చుకుంటాను’ అని నీళ్ళను పుచ్చుకున్నాడు.

ఇలా ఇక్కడ నీళ్ళు పుచ్చుకోగానే దుర్వాసోమహర్షి ధ్యానంలోంచి బయటకు వచ్చారు. ధ్యానంలోంచి బయటకు రాగానే ఆయనకు తన ఆకలి గుర్తుకు వచ్చి గబగబా అంబరీషుని వద్దకు వచ్చారు. అంబరీషుడు ఎదురువచ్చి అయ్యా! ద్వాదశి తిథి వెళ్ళిపోబోతోంది. మీ గురించే చూస్తున్నాను. ముందు మీరు భోజనమునకు కూర్చోండి. తరువాత నేను చేస్తాను’ అన్నాడు. దుర్వాసుడు అంబరీషుడు నీళ్ళు త్రాగాడని తెలుసుకుని కోపం వచ్చింది. ఆయనకు ఒక పక్క లోపల ఆకలి. ఒక పక్క అతిథిని పిలిచి అవమానించాడనే దుగ్ధ. రెండూ కలిసి ‘ఇంత మహర్షిని నేను నీకు ఇంత చవకబారు వానిలా కనపడ్డానా? పిలిచి ముందు నువ్వు త్రాగి నాకు నీ ఇంట్లో అన్నం పెడతావా? అంటే నీ భుక్తశేషం నేను తింటున్నాను. నా భుక్త శేషం నువ్వు తినడం లేదు. ఇది నాకు అవమానము. నిన్ను ఉపేక్షించను. నీవు విష్ణు భక్తుడివా? చూడు నిన్ను ఏమి చేస్తానో! ఇప్పుడు నేను గొప్పో నీవు గొప్పో తెలియాలి’ అన్నాడు. కోపంతో చేతిలోకి నీళ్ళు తీసుకుని తన జటాజూటం నుండి జటనొకదానిని సమూలంగా పెరికి నేలకేసి కొట్టి భయంకరమయిన ఒక కృత్యను సృష్టించాడు. కృత్య అనేది ఆయన దేనిని చెపితే దానితో ఆకలి తీర్చుకుంటుంది. తన కళ్ళముందు కృత్య అంబరీషుని తినెయ్యాలని అనుకున్నాడు. హద్దులేని క్రోధమునకు వెళ్ళిపోయాడు. ఇపుడు ఆ కృత్యను ప్రయోగించాడు. ఈ కృత్య చేతిలో భయంకరమయిన శూలం పట్టుకుని ఆకలితో ఎగురుతుంటే భూమి గోతులు పడింది. భయంకరమయిన క్రోధంతో కృత్య అంబరీషుని మీద పడింది. దీనిని చూసి దుర్వాసుడు ఒక్కడే సంతోషిస్తున్నాడు. తాను బ్రాహ్మణుడయివుండి అవతల వారి స్థితి గమనించకుండా నిష్కారణమయిన కోపం పెంచేసుకున్నాడు. ఆ కోపమునకు అందరూ బాధ పడుతున్నారు. అంబరీషుడు మాత్రం చిరునవ్వుతోనే ఉన్నాడు. శ్రీమన్నారాయణుని ధ్యానం చేస్తున్నాడు. ‘నాకు తెలిసి అపరాధం చేయలేదు. తెలియక చేసిన దోషము దోషము కాదు. నేను ధర్మం తప్పలేదు’ అని నమస్కారం చేస్తూ నిలబడి పోయాడు. ధర్మాధర్మములకు ఫలితమును ఇవ్వగలవాడు కదలాలి.

ధర్మం అంబరీషుని యందు ఉన్నది. సుదర్శనం కదిలి కృత్య మీదకి వెళ్ళింది. కృత్య కాలిపోయింది. సుదర్శనం బ్రాహ్మణుడి వెంట పడింది. సుదర్శనమునకు వెన్నిచ్చి దుర్వాసుడు పరుగెత్తడం మొదలు పెట్టాడు. ఆయన ఆకలి, కోపము అన్నీ మరచిపోయి ప్రాణరక్షణలోకి వచ్చాడు. దుర్వాసుడు పరుగెత్తి పరుగెత్తి బ్రహ్మలోకమునకు వెళ్ళాడు. బ్రహ్మగారు మిక్కిలి చతురతతో ‘ మహర్షీ! నీకు ఎంత కష్టం వచ్చింది? అంబరీషుడి జోలికి వెళ్ళావా? ఇప్పుడు నీవు విష్ణుమూర్తి పాదములను ఆశ్రయించు. ఏ మహానుభావుడి కనుకొలకులు ఎర్రబడితే నా బ్రహ్మస్థానము ఊడిపోయి, సత్యలోకము ఆగిపోతుందో అటువంటి వాని జోలికి నేను వెళ్ళలేను. ఆ చక్రమును నేను ఆపలేను’ అన్నారు. దుర్వాసుడు కైలాసమునకు పరుగెత్తాడు. దుర్వాసుడు పరమశివుని అంశ. మహాదేవా! నీకన్నా గొప్పవాడెవడున్నాడు? నన్ను కాపాడవలసింది’ అన్నాడు. పరమశివుడు ‘నాకూ, దక్షునికి, ఇంద్రునికి, ఉపేంద్రునికి, బ్రహ్మగారికి అర్థం కానిది ఏదయినా ఉన్నదంటే అది విష్ణుమాయ ఒక్కటే. ఆయన సుదర్శనమును నేను ఆపలేను. వైకుంఠమునకు వెళ్ళి విష్ణువు కాళ్ళమీద పడి ప్రార్థించు’ అని అన్నాడు. దుర్వాసుడు వైకుంఠమునకు వెళ్ళాడు. శ్రీమహావిష్ణువు లక్ష్మీదేవితో చక్కగా సభ తీర్చి ఉన్నాడు. దుర్వాసుడు వెళుతూనే శ్రీమన్నారాయణుని స్తోత్రం చేస్తూ ఆయన పాదముల మీద పడిపోయి ఆయన రెండుకాళ్ళను తన రెండుచేతులతో గట్టిగా పట్టుకుని పాదముల మీద శిరస్సు పెట్టి లేవడం మానేసి అలా ఉండిపోయాడు. ఆయన ‘ఏమిటి ఇలా పడిపోయావు. ఏమయింది? లేవవలసింది’ అన్నాడు. ఆయనకు తెలియదా? సుదర్శనమును పెట్టినవాడు ఆయనే కదా! ఏమీ తెలియని వాడిలా మాట్లాడుతున్నాడు. దుర్వాసుడు జరిగినది చెప్పి తనను రక్షించమని కోరాడు. ఆయన ‘నాకు ఒక బలహీనత ఉన్నది. తీగలన్నీ పీకి తాడుచేసి పెద్ద ఏనుగుని కట్టేసినట్లు నన్నిలా నిలబెట్టేసి తాళ్ళతో కట్టి లక్ష్మీదేవి ఉన్నదని కూడా చూడకుండా నన్ను ఎత్తుకుపోగలిగిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళు నా మహాభక్తులు. వాళ్ళు నన్నే తలచుకుంటూ ఉంటారు. అలా పట్టుకుని వెళ్ళిపోయిన వారిలో అంబరీషుడు ఒకడు. నేనేకావాలి అని తాపత్రయపడే వాడి వెంట రక్షించుకోవడానికి నేను ఎలా ఉంటానో తెలుసా కోడెదూడ తెలియక ఏ ఏట్లో మూతి పెడుతుందోనని దానివెనక ఆవు పరుగెత్తినట్లు నేను వానిని రక్షించుకుంటూ ఆ భక్తుని వెంట పరుగెడుతుంటాను. నీ వెనుక వస్తున్న నా సుదర్శన చక్రం అంబరీషుడిని రక్షిస్తోంది. వాడు బ్రాహ్మణుడా! తపస్సు చేశాడా! రాజా! కేవలం వ్రతం చేసాడా? ఇవన్నీ నేను చూడను పరమభక్తితో ఉన్నవాడికి నేను వశుడనయి ఉంటాను. అన్నిటితో ఉండి అన్నిటి విడిచి నన్ను పట్టుకున్నటువంటి వాడిని నేను పట్టుకుంటాను. అది నా లక్షణము’ అన్నాడు.

నీవు వానిపట్ల చేసిన తప్పు నేను క్షమించలేను. అంబరీషుడు సాధువు ఈ శరణాగతి ఏదో అంబరీషుడి దగ్గరకు వెళ్ళి ఆయన కాళ్ళుపట్టుకో అనగానే పరుగు పరుగున అంబరీషుని వద్దకు వెళ్ళాడు. దుర్వాసోమహర్షి భోజనం చేయలేదని తాను అప్పటికీ భోజనం చేయకుండా కూర్చున్నాడు అదీ ఆయన ధర్మం అంబరీషుని పాదములు పట్టుకుని ‘మహానుభావా! ఈ సుదర్శన చక్రధారల నుండి నీవే నన్ను రక్షించాలి’ అన్నాడు. మహాత్ముడు తనవలన క్రోధమును పొంది అన్ని కష్టములు పడి తన కాళ్ళు పట్టుకొన్నందుకు అంబరీషుడు సిగ్గుపడి వెంటనే లేచి సుదర్శన చక్రమును ప్రార్థన చేశాడు. ఈ ప్రార్థనను వింటే మనలను తరుముకు వస్తున్న దురితములనుండి మనం కాపాడబడతాము. సుదర్శనచక్రమునకు నమస్కరించి ‘కోరిన వాళ్లకి నా దగ్గర ఉన్నది లేకుండా ఇచ్చిన వాడనయితే నేను ఎప్పుడు ధర్మము తప్పకుండా ప్రవర్తించిన వాడనయితే నేను చేసిన పూజలకు శ్రీమహావిష్ణువు సంతోషమును పొందిన వాడయితే, ఈనాడు మహర్షిని సంహరించాలని ఉద్యుక్తతను పొందుతున్న నువ్వు ప్రశాంతతను పొంది, శాంతిని పొంది నీ యథాస్థానమునకు మరలిపోదువు గాక’ అన్నాడు. దుర్వాసుని రక్షించడానికి తాను చేసిన తపస్సునంతటిని ఒట్టు పెట్టాడు. ఉత్తరక్షణం ప్రశాంతతను పొంది సుదర్శన చక్రం వైకుంఠమునకు వెళ్ళిపోయింది.

దుర్వాసుడు ‘ఆహా! గృహస్థుగా ఉంటూ నీవు పొందిన దానిని నేను ఇన్ని ఏళ్ళు తపస్సు చేసి పొందలేక పోయాను. శ్రీ మహావిష్ణువు నామము జీవితంలో ఒక్కసారి ప్రీతితో చెప్పినా, శ్రీమన్నారాయణుని పాదములకు నమస్కరించినా, వారిని ఏ కష్టములు అడ్డవు. నీవు మహానుభావుడవు. నిరంతరం శ్రీమన్నారాయణ స్మరణ చేసేవాడివి. నీ వైభవము ఏమిటో నేను ఈ వేళ చూశాను. మిత్రుడవై రక్షించావు. ఇకనుండి నీపేరు అన్నిలోకములలో చెప్పుకుంటారు. నీ పేరు చెప్పుకున్న వాళ్లకి శ్రీమన్నారాయణుని పాదములయందు భక్తి కలుగుతుంది’ అని అంబరీషుడిని స్తోత్రం చేస్తూ దుర్వాసోమహర్షి వెళ్ళబోయాడు. అంబరీషుడు ‘మీరు బయలుదేరినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా నేను భోజనం చేయలేదు. మీరు భోజనం చేస్తే మిగిలిన పదార్ధమును భుక్తశేషంగా భావించి నేను తింటాను. ముందు మీరు భోజనం చేయండి’ అన్నాడు. దుర్వాసుడు పరమసంతోషంగా భోజనమునకు కూర్చున్నాడు.

క్రోధము ఒక్కటి వుంటే ఎంతటి దానిని ఎలా పాడుచేస్తుందో గమనించాలి. అందువలన క్రోధము నొక్క దానిని ప్రక్కన పెడితే తపస్సులో ఎంత కిందనున్న వాడయినా అంబరీషుడు ఏ స్థితిని పొందాడో గ్రహించాలి. గృహస్థాశ్రమంలో ఉండి అంబరీషుడు సాధించిన విజయమునకు అందరు పొంగిపోయి అంబరీషుని పాదములకు వేయి నమస్కారములు చేయాలి.

ఆ మహానుభావుడు అంబరీషుడు తదనంతరం తపస్సు చేసి ఈశ్వరుని పునరావృత్తిరహిత శాశ్వత నారాయణ సాయుజ్యమును పొంది తరించాడు.

https://www.facebook.com/SriChagantiGuruvuGaariFollowersUnofficialPage


instagram.com/pravachana_chakravarthy

బెట్ ద్వారకలోని 2 దీవులను స్వాధీనం చేసుకోవాలన్న

 బెట్ ద్వారకలోని 2 దీవులను స్వాధీనం చేసుకోవాలన్న కాంగ్రెస్ పార్టీ, సెక్యులర్ పార్టీల మరియు ఇస్లామిక్ సున్నీ వక్ఫ్ బోర్డు కుట్రను గుజరాత్ హైకోర్టు భగ్నం చేసింది.*


 *ఈ సమయంలో గుజరాత్‌కు సంబంధించిన ఈ అంశం చాలా చర్చనీయాంశమైంది.  సోషల్ మీడియా ద్వారా తెలిసింది. కమ్మ, కల్వరి మీడియాలు ఈ విషయాలను చెప్పవు*.


 *వలసలు, కబ్జాలు ఎలా జరుగుతున్నాయో, ల్యాండ్ జిహాద్ ఉందో అర్థం చేసుకోవడానికి, మీరు కేవలం బెట్ ద్వారకా ద్వీపాన్ని అధ్యయనం చేస్తే, ప్రక్రియ అంతా అర్థం అవుతుంది.*


 *కొన్ని సంవత్సరాల క్రితం వరకు ఇక్కడ దాదాపు మొత్తం జనాభా హిందువులే.*


 *ఇది ఓఖా మున్సిపాలిటీ పరిధిలోని ప్రాంతం, ఇక్కడికి వెళ్లాలంటే నీటి మార్గం మాత్రమే.అందుకే బెట్ ద్వారక నుంచి బయటకు వెళ్లేందుకు ప్రజలు పడవలను ఉపయోగిస్తారు*.


 *ద్వారకాధీష్ యొక్క పురాతన ఆలయం ఇక్కడ ఉంది. ఐదు వేల సంవత్సరాల క్రితం ఇక్కడ రుక్మిణి విగ్రహం ప్రతిష్టించిందని చెబుతారు*.


 *సముద్రం చుట్టూ ఉన్న ఈ ద్వీపం చాలా ప్రశాంతంగా ఉండేది*.


 *ప్రజల ప్రధాన వృత్తి చేపలు పట్టడం. క్రమంగా బయటి నుంచి చేపలు పట్టే ముస్లింలు ఇక్కడికి రావడం ప్రారంభించారు. దయగల హిందూ జనాభా వారిని అక్కడే ఉండి చేపలు పట్టడానికి అనుమతించింది. క్రమక్రమంగా చేపల వేట మొత్తం వ్యాపారాన్ని ముస్లింలు ఆక్రమించారు*.

 

*బయటి నుండి నిధులు రావడంతో, అతను మార్కెట్‌లో తక్కువ ధరలో చేపలను విక్రయించాడు, దాని కారణంగా హిందూ మత్స్యకారులందరూ నిరుద్యోగులయ్యారు. ఇప్పుడు హిందూ జనాభా ఉపాధి కోసం ద్వీపం నుండి వెళ్లడం ప్రారంభించారు*.


 *అయితే ఇక్కడ మరో అద్భుతం జరిగింది*.

 *బెట్ ద్వారక నుంచి ఓఖా వెళ్లేందుకు బోటు చార్జీ రూ.8. ఇప్పుడు పడవలన్నీ ముస్లింలు ఆక్రమించుకోవడంతో అద్దెకు కొత్త నిబంధన పెట్టారు. ఓఖాకు పడవలో వెళ్లే హిందువు రూ.100 అద్దె చెల్లిస్తే, అదే ముస్లిం రూ.8 చెల్లిస్తారు.*


*ఇప్పుడు దినసరి కూలీ హిందువు ఉద్యమానికి రూ.200 ఇస్తే ఆదా చేస్తాడా? అందువల్ల హిందువులు ఉపాధి కోసం అక్కడి నుంచి వలసలు వెళ్లడం ప్రారంభించారు.*

 

*ఇప్పుడు హిందూ జనాభాలో కేవలం 15 శాతం మాత్రమే అక్కడ నివసిస్తున్నారు. వలసలకు మొదటి కారణాన్ని మీరు ఇక్కడ చదవండి*.

 

*రెండు ప్రధాన ఉపాధి మార్గాలైన చేపలు పట్టడం మరియు రవాణా చేయడం హిందువుల నుండి లాక్కుంది*.


*అన్ని చోట్ల లాగానే, తాపీ మేస్త్రీలు, కార్పెంటర్లు, ఎలక్ట్రానిక్ మెకానిక్‌లు, డ్రైవర్లు, బార్బర్లు మరియు ఇతర చేతి ఉద్యోగాలు 90% వరకు హిందువులకు అప్పగించబడ్డాయి*.


*ఇప్పుడు బెట్ ద్వారకలో 5000 సంవత్సరాల పురాతన దేవాలయం ఉంది, దాని కోసం హిందువులు సందర్శించేవారు, కాబట్టి జిహాదీలు దానిలో కొత్త మార్గాన్ని కనుగొన్నారు*.


 *ఉద్యమ సాధనాలు తమకు దక్కినందున కేవలం 20-30 నిమిషాల నీటి ప్రయాణానికి వచ్చే భక్తుల నుంచి రూ.4 వేల నుంచి 5 వేలు డిమాండ్ చేయడం ప్రారంభించారు. సామాన్యుడు ఇంత ఖరీదైన అద్దె ఎలా చెల్లించగలడు కాబట్టి అక్కడికి వెళ్లడం మానేశారు*.


 *ఇప్పుడు అక్కడ జిహాదీలు పూర్తిగా పట్టు సాధించారు, కాబట్టి పురాతన దేవాలయం చుట్టూ అన్ని వైపుల నుండి దాని సమాధులు ఉండటం చూసి వారు ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి ఇళ్లను నిర్మించడం ప్రారంభించారు*.


 *మిగిలిన హిందూ జనాభా వారి మాటలు చెప్పి ప్రభుత్వాన్ని కోల్పోయారు, అప్పుడు కొంతమంది హిందూ సామాజిక కార్యకర్తలు దానిని గ్రహించి ప్రభుత్వాన్ని హెచ్చరించారు*.


 *ఓఖా నుంచి బెట్ ద్వారక వరకు సిగ్నేచర్ బ్రిడ్జి నిర్మాణ పనులను ప్రభుత్వం ప్రారంభించింది.  మిగిలిన సబ్జెక్టుల విచారణ మొదలు కాగానే దర్యాప్తు సంస్థ షాక్‌కు గురైంది*.


 *గుజరాత్‌లో, శ్రీ కృష్ణ నగరంలోని ద్వారకలో ఉన్న బెట్ ద్వారకలోని రెండు ద్వీపాలపై సున్నీ వక్ఫ్ బోర్డు తన దావా వేసింది.  బెట్ ద్వారకా ద్వీపంలోని రెండు దీవులు వక్ఫ్ బోర్డు ఆధీనంలో ఉన్నాయని వక్ఫ్ బోర్డు తన దరఖాస్తులో పేర్కొంది.  మీరు కృష్ణా నగరిపై ఎలా క్లెయిమ్ చేస్తారని గుజరాత్ హైకోర్టు ఆశ్చర్యపోయింది మరియు గుజరాత్ హైకోర్టు ఈ పిటిషన్‌ను కూడా కొట్టివేసింది.*


 *బెట్ ద్వారకలో దాదాపు ఎనిమిది ద్వీపాలు ఉన్నాయి, వాటిలో రెండు కృష్ణుడి ఆలయాలు నిర్మించబడ్డాయి.  శ్రీకృష్ణుడిని పూజిస్తున్నప్పుడు, మీరా ఇక్కడ అతని విగ్రహంలో మునిగిపోయిందని పురాతన కథలు చెబుతున్నాయి.  బెట్ ద్వారకలోని ఈ రెండు ద్వీపాలలో సుమారు 7000 కుటుంబాలు నివసిస్తున్నాయి, అందులో దాదాపు 6000 కుటుంబాలు ముస్లింలు.  ఇది ద్వారక తీరంలో ఒక చిన్న ద్వీపం మరియు ఓఖా నుండి కొద్ది దూరంలో ఉంది.  దీని ఆధారంగా ఈ రెండు దీవులపై వక్ఫ్ బోర్డు తన వాదనను వినిపిస్తోంది*.


 *ఇక్కడ ఈ కుట్ర ప్రారంభ దశ మాత్రమే వెల్లడైంది.  భద్రతా సంస్థల ప్రకారం, ఈ దశలో కొందరు వ్యక్తులు అటువంటి భూములను ఆక్రమించడం ద్వారా అక్రమ నిర్మాణాలు చేస్తున్నారు, ఇది వ్యూహాత్మకంగా, భారతదేశ అంతర్గత భద్రతకు పెను ముప్పుగా పరిణమిస్తుంది.*


 *ఇప్పుడు అక్రమ ఆక్రమణలు, మజార్లు అన్నీ కూల్చివేయబడుతున్నాయి*.


*బెట్ ద్వారకకు వచ్చే ముస్లింలు ఎవరూ అక్కడ స్థానికులు కారు, అందరూ బయటి నుంచి వచ్చినవారే. అయినప్పటికీ, అతను కొన్ని సంవత్సరాలలో అక్కడ ఉన్న హిందువుల నుండి క్రమంగా ప్రతిదీ లాక్కున్నాడు మరియు భారతదేశంలోని గుజరాత్ వంటి రాష్ట్ర ద్వీపం సిరియాగా మారింది.*

 

 *జాగ్రత్తగా మరియు అప్రమత్తంగా ఉండటం చాలా ముఖ్యం*.


 *ఇలాంటి విషయాలు సెక్యులర్ హిందువులకు అర్థం కావు కానీ కింద స్థాయిలో పనిచేసే హిందుత్వవాదులకు అర్థమవుతుంది*.


 *ల్యాండ్ జిహాద్, లవ్ జిహాద్ వ్యాపార జిహాదులు గురించి అప్రమత్తంగా ఉండగలరు...*

గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన విషయాలు :-* 🙏🏻

 🙏🏻 జీవితంలో అందరూ గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన విషయాలు :-* 🙏🏻


 1. BP: 120/80

 2. పల్స్: 70 - 100

 3. ఉష్ణోగ్రత: 36.8 - 37

 4. శ్వాస : 12-16

 5. హిమోగ్లోబిన్:

     పురుషులు -13.50-18

     స్త్రీ - 11.50 - 16

 6. కొలెస్ట్రాల్: 130 - 200

 7. పొటాషియం: 3.50 - 5

 8. సోడియం: 135 - 145

 9. ట్రైగ్లిజరైడ్స్: 220

 10. శరీరంలో రక్తం మొత్తం:

       PCV 30-40%

 11. చక్కెర స్థాయి:

      పిల్లలకు (70-130)

      పెద్దలు: 70 - 115

 12. ఐరన్: 8-15 మి.గ్రా

 13. తెల్ల రక్త కణాలు WBC:

      4000 - 11000

 14. ప్లేట్‌లెట్స్:

      1,50,000 - 4,00,000

 15. ఎర్ర రక్త కణాలు RBC:

      4.50 - 6 మిలియన్లు..

 16. కాల్షియం:

       8.6 - 10.3 mg/dL

 17. విటమిన్ D3:

      20 - 50 ng/ml

18. విటమిన్ B12:

    200 - 900 pg/ml

*సీనియర్స్ అంటే 40/ 50/ 60 ఏళ్ల వారికి ప్రత్యేక చిట్కాలు:*

1- *మొదటి సూచన:*

 మీకు దాహం లేదా ఆవశ్యకత అనిపించకపోయినా ఎల్లప్పుడూ నీరు త్రాగండి…, అతి పెద్ద ఆరోగ్య సమస్యలు మరియు వాటిలో చాలా వరకు శరీరంలో నీటి కొరత కారణంగా ఉంటాయి. రోజుకు కనీసం 2 లీటర్ల నీరు త్రాగాలి.

2- *రెండవ సూచన:*

శరీరం నుండి మరింత ఎక్కువ పని చేయడానికి, శరీరం కదలాలి, నడక లేదా ఈత... లేదా ఏదైనా క్రీడ ద్వారా మాత్రమే.

3- *మూడవ సూచన:*

 తక్కువ తినండి...

ఎక్కువ ఆహారం కోసం తృష్ణ విడిచిపెట్టండి... ఎందుకంటే ఇది ఎప్పుడూ మంచి ఆరోగ్యాన్ని అందించదు. మిమ్మల్ని మీరు కోల్పోకండి, కానీ మొత్తాన్ని తగ్గించండి. ఎక్కువ ప్రోటీన్, కార్బోహైడ్రేట్ ఆధారిత ఆహారాలను ఉపయోగించండి.

 4- *నాల్గవ సూచన*

 అత్యవసరమైతే తప్ప వీలైనంత వరకు వాహనాన్ని ఉపయోగించకండి... , మీరు ఎక్కడికైనా కిరాణా సామాన్లు తీసుకోవడానికి, ఎవరినైనా కలవడానికి... లేదా ఏదైనా పని కోసం మీ కాళ్లపై నడవడానికి ప్రయత్నించండి. ఎలివేటర్, ఎస్కలేటర్ ఉపయోగించకుండా మెట్లు ఎక్కండి.

5- *ఐదవ సూచన*

 కోపం వదలండి...

 చింతించడం మానేయండి... విషయాలను పట్టించుకోకుండా ప్రయత్నించండి...

అవాంతరాలలో చిక్కుకోకండి.... అవన్నీ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి మరియు ఆత్మ యొక్క వైభవాన్ని దూరం చేస్తాయి. సానుకూల వ్యక్తులతో మాట్లాడండి మరియు వారి మాటలు వినండి!

6- *ఆరవ సూచన*

 ముందు డబ్బు వదులుకో

మీ చుట్టూ ఉన్న వ్యక్తులతో సన్నిహితంగా ఉండండి, నవ్వండి మరియు మాట్లాడండి!

డబ్బు జీవించడం కోసం సంపాదించబడింది, జీవితం డబ్బు కోసం కాదు.

7- *ఏడవ సూచన*

 మీ గురించి, మీరు సాధించలేనిది లేదా మీరు స్వంతం చేసుకోలేని దేని గురించి జాలిపడకండి.

 దానిని విస్మరించండి మరియు మరచిపోండి.

8- *ఎనిమిదవ సూచన*

డబ్బు, పదవి, పలుకుబడి, అధికారం, అందం, కులం మరియు ప్రభావం....

ఇవన్నీ మనిషిలో అహంకారాన్ని నింపేవే....

వినయం అనేది ప్రేమతో ప్రజలను మీకు దగ్గర చేస్తుంది.

9- *తొమ్మిదవ సూచన*

 మీ వెంట్రుకలు తెల్లగా మారినట్లయితే, అది జీవితాంతం అని కాదు. ఇది మెరుగైన జీవితానికి నాంది. ఆశాజనకంగా ఉండండి, జ్ఞాపకశక్తితో జీవించండి, ప్రయాణం చేయండి, ఆనందించండి. ప్రత్యేక జ్ఞాపకాలను చేసుకోండి!

10- *పదో సూచన*

మీ చిన్నారులను ప్రేమతో, సానుభూతితో కలవండి! వ్యంగ్యంగా ఏమీ అనకండి! మీ ముఖంపై ఎల్లప్పుడూ చిరునవ్వు ఉంచండి!

గతంలో ఎంత పెద్ద పదవిలో ఉన్నా, వర్తమానంలో దాన్ని మరచిపోయి అన్నింటికి కట్టుబడి ఉండండి. *ఆరోగ్యమే మహాభాగ్యం సర్వేజనా సుఖినోసవంతు*🙏🙏👍👍

తెలివైన వ్యక్తి

 శ్లోకం:☝️

   *అపమానం పురస్కృత్య*

*మానం కృత్వా తు పృష్ఠతః ।*

   *స్వార్థమభ్యుద్ధరేత్ ప్రాజ్ఞః*

*స్వార్థభ్రంశో హి మూర్ఖతా ॥*

 - పంచతంత్రం - కాకోలుకీయం


భావం: తన పనికి హాని కలిగించడం మూర్ఖత్వం కాబట్టి, తెలివైన వ్యక్తి అవమానాన్ని సహించి, గౌరవాన్ని పట్టించుకోకుండా తన పనిని నేర్పుగా జరిపించుకుంటాడు.

రామ భక్తులకు భోజన, వసతి

 రామ భక్తులకు సూచన

సుదూర ప్రయాణం చేసి అయోధ్య చేరుకున్న మన తెలుగు భక్తులకు ప్రతి రోజు స్వామివారి దర్శనం అయితే లభిస్తుంది, కానీ భోజన, వసతికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము. అలాంటి సమయంలో అయోధ్యలో మన తెలుగు వారికి అన్నసమారాధన కార్యక్రమం శ్రీ సీతారామచంద్ర చారిటబుల్ ట్రస్ట్ వారు అయోధ్యలో కనక్ భవన్ సమీపంలోనే కల్పిస్తూ ఉన్నారు. మీకు ఏ రోజు అన్నసమారాధన కావాలో, ఏ రోజు మీరు భోజనం చేయదలచారో వివరాలకు 9305205903 లేదా 9550754389 నెంబర్లను సంప్రదిచగలరు.


గమనిక : ముందుగా తెలియజేసినట్లయితే వారు మీకు భోజన ఏర్పాట్లు చేయగలరు.


సూచన : భక్తుల సౌకర్యార్థం మీ whatsapp groupల ద్వారా ప్రచారం కల్పించవలసినదిగా కోరుచున్నాను.

     🙏🙏   జైశ్రీరామ్ 🙏🙏

Srimadhandhra Bhagavatham

 Srimadhandhra Bhagavatham -- 62 by Pujya Guruvulu "Pravachana Chakravarthy" , "Vachaspathy" Brahmasri Chaganti Koteswara Rao Garu


వెంటనే బలిచక్రవర్తి స్వామి పాదములను బంగారుపళ్ళెంలో పెట్టమన్నాడు. వామనుడు వచ్చి పళ్ళెంలో పాదమును పెడదామని కుడిపాదము కొద్దిగా పైకి ఎత్తాడు. బలిచక్రవర్తి కింద కూర్చుని పాదము వంక చూస్తున్నాడు. ఆ పాదము క్రింద ధ్వజరేఖ, అమృతపాత్ర, నాగలి వంటి దివ్యమయిన చిహ్నములు కనపడ్డాయి. ఎర్రటి అరికాలు. పైన నల్లనిపాదము. ఏ వేదమును చదువుకుని ఆమ్నాయము చేస్తారో అటువంటి వేదము ఆయన కాలి అందెగా మారి అలంకరింపబడి ఉన్నది. బ్రహ్మచారిగా ఉన్నా నిద్రలేవగానే శ్రీమహావిష్ణువు పాదముల దగ్గర వంగి లక్ష్మీ దేవి నమస్కరించడంలో లక్ష్మీదేవి నొసటన ఉన్న కస్తూరీ తిలకం ఆయన పాదము మీద ముద్రపడి ఉన్నది. అటువంటి పాదమును దగ్గరనుంచి చూసాడు. మహా యోగులయిన వారు ఇక్కడ దర్శనం చేసి పొంగిపోయి జన్మ పరంపరల నుండి గట్టెక్కే భవసాగరమును దాటించ గలిగిన ఓడ అయిన పాదము ఏది ఉన్నదో ఆ పాదమును చూసాడు. ఇంకా బ్రాహ్మీ ముహూర్తంలోనే సప్తర్షుల చేత పూజింపబడిన తామరల చేత సుగంధమును పొందిన పాదమును చూసాడు. చూసి పొంగిపోయి బంగారు పళ్ళెము ముందుకు జరిపాడు. వామనుడు అందులో కుడికాలు వుంచి ఎడమకాలు ఎత్తి అందులో పెట్టాడు. ఆ రెండు పాదములను చూసి బలిచక్రవర్తి ‘ఆహా ఏమి నా భాగ్యము! ఈ పాదములను ఎవరు కడుగగలరు! ఈ పాదములను ముట్టుకోగలిగిన వాడెవడు? ఈ కీర్తి ఎవడూ పొందలేడు. నేను పొందుతున్నాను’ అనుకుని వింధ్యావళిని నీళ్ళు పోయమన్నాడు. పైకి చూసాడు. బలిచక్రవర్తి తాను పతనం అయిపోతానని తెలిసి దానం ఇస్తున్నాడు. శుక్రాచార్యుల వారు చూస్తున్నారు. వింధ్యావళి కమండలంలో నీళ్ళు పోస్తోంది. శుక్రాచార్యుల వారికి ఇంకా తాపత్రయం పోలేదు. సూక్ష్మ రూపంలో వెళ్ళి ఆ కమండల తొండమునకు అడ్డుపడ్డాడు. బలిచక్రవర్తి నీళ్ళు పోస్తున్నా నీరు కమండలంలోంచి పడడం లేదు. స్వామి నవ్వి చేతిలో దర్భ ఒకటి తీసి కమండలం లోకి పెట్టి ఒక్కపోటు పొడిచాడు. పొడిచేసరికి శుక్రుని కంట్లో గుచ్చుకుని ఒక కన్ను పోయి శుక్రాచార్యుల వారు బయటపడ్డారు. వెంటనే నీటి ధార పడిపోయింది బలిచక్రవర్తి కంకణములు మెరిసిపోయే వామనుని చేతిని తన రెండు చేతులతో పట్టుకుని కళ్ళకు అద్దుకుని ‘స్వామీ! ఈ చేతులు కదా లోకరక్షణ చేసే చేతులు’ అని దానం చేసాడు.

వెంటనే వామనుడు పెరిగిపోవడం మొదలు పెట్టాడు.

ఇంతింతై, వటుడింతయై, మఱియుదానింతై, నభోవీధిపై

నంతై, తోయదమండలాగ్రమున కల్లంతై, ప్రభారాశిపై

నంతై, చంద్రునికంతయై, ధ్రువునిపైనంతై, మహర్వాటిపై

నంతై, సత్యపదోన్నతుండగుచు బ్రహ్మాండాంతసంవర్థియై.

పొట్టివానిగా వచ్చిన వామనుడు అంతకంతకు పెరిగిపోతున్నాడు. బ్రహ్మాండములు ఎంతవరకు ఉన్నాయో అంతకన్నా పది అంగుళములు పైకి ఎదిగిపోయాడు. లోకములన్నిటిలో పైకి కొలవడానికి విష్ణుపాదం వస్తున్నదని బ్రహ్మగారు తపస్సమాధిలోనుండి పైకి వచ్చి కమండలం పట్టుకుని ఆ పాదమును తన కమండలం లోని జలములతో కడిగి శిరస్సున ప్రోక్షణ చేసుకొని ఆచమనం చేశారు. ఆ పాదములు కడిగిన నీళ్ళు ఆకాశంలో దేవనదిగా ప్రవహించాయి. ఆ పాదం ఇంకా పెరిగి వెళ్ళిపోయింది. అలా పైకి వెళ్ళి పై లోకములనన్నిటిని కొలిచినది. కింది లోకముల నన్నిటిని ఒక పాదము కొలిచినది. ఆ విధంగా రెండు అడుగులతో వామనుడు భూమ్యాకాశములను కొలిచాడు.

రవిబింబం బుపమింపఁ బాత్ర మగు ఛత్రం బై, శిరోరత్న మై

శ్రవణాలంకృతియై గళాభరణ మై సౌవర్ణకేయూరమై

ఛవిమత్కంకణమై కటిస్థలి నుదంచ ద్ఘంటయై నూపుర

ప్రవరంబై పదపీఠమై వటుఁడు దా బ్రహ్మాండమున్ నిండుచోన్.

వామనమూర్తి ఇలా పెరగడం మొదలుపెట్టగానే ఆకాశంలోని సూర్యబింబము మొట్టమొదట ఆయన తలమీది గొడుగులా, తరువాత తలమీద పెట్టుకున్న రత్నంలా మెరిసింది. ఇంకా కొంచెం పైకి వెళ్ళినపుడు కంఠంలో పెట్టుకున్న ఆభరణం అయింది. చెవులకు పెట్టుకున్న మకర కుండలంగా ఉన్నది. స్వామి సూర్యుని దాటి ఇంకా పైకి వెళ్ళిపోయారు. సూర్య బింబము నడుముకి పెట్టుకున్న వడ్డాణమునకు చిన్న గంటలా గుండ్రంగా అయింది. ఇంకా దాటితే పాదములకు పెట్టుకున్న అందెలా అయింది. ఆ తరువాత పాదముల క్రింద వేసుకున్న గుండ్రని పీటలా అయిపోయింది. బ్రహ్మాండమంతా నిండిపోయిన వామనమూర్తికి సూర్యుడు అలా మారిపోయాడు. ఆయన లోకం అంతా అలా నిండిపోయి రెండు అడుగులతో లోకం అంతా కొలిచాడు.

ఆయన బలిచక్రవర్తితో నేను రెండడుగుల నేలను కొలుచుకున్నాను. ఇంకొక అడుగు భూమి ఏది? అని అడిగాడు. బలిచక్రవర్తి

సూనృతంబు గాని సుడియదు నా జిహ్వ, బొంకజాల; నాకు బొంకు లేదు;

నీ తృతీయ పదము నిజము నా శిరమున, నెలవు సేసి పెట్టు నిర్మలాత్మ!

నా నోరు ఎప్పుడూ అబద్ధం చెప్పదు. నేను అబద్ధం చెప్పలేదు. నీ మూడవ అడుగు నా తలమీద పెట్టు అని చెప్పి బలిచక్రవర్తి లేచాడు. వరుణుడికి అనుజ్ఞ ఇవ్వబడింది. ఆయన వరుణ పాశములతో కట్టేశారు. బలిచక్రవర్తి అలా నిలబడిపోయాడు. శ్రీమన్నారాయణుడు వటువు రూపంలో వచ్చి తమ రాజ్యమును కొల్లగొట్టాడని రాక్షసులు గ్రహించారు. నిర్జించడానికి ఆయుధములను పట్టుకు వచ్చారు. బలిచక్రవర్తి ‘వేళకాని వేళా క్రోధము తెచ్చుకోకూడదు. ఎవరు తనకు సిరిని ఇచ్చిన వాడే తిరిగి ఈ సిరిని తీసేసుకున్నాడు. మీరంతా ప్రశాంత మనస్కులై ఉండండి. ఎవ్వరూ యుద్ధం చేయకండి’ అన్నాడు. రాక్షసులంతా రసాతలమునకు పారిపోయారు. వింధ్యావళి శ్రీమన్నారాయణుని పాదముల మీద పడి స్వామీ! నా భర్తకి వచ్చిన వాడెవడో తెలుసు. రాజ్యము పోతుందని తెలిసికూడా దానం చేశాడు. ఏం పాపం చేశాడని ఇలా కట్టి నిలబెట్టావు? నాకు జవాబు చెప్పవలసింది. నీకు అనాథరక్షకుడని పేరు. నీ సన్నిధానములో నేను అనాథను కావడమా! నాకు భర్తృ భిక్ష పెట్టు’ అని ప్రార్థన చేసింది. ఆశ్చర్యకరంగా అక్కడికి బ్రహ్మగారు వచ్చి ప్రార్థన చేశారు.

పది దిక్కుల వాళ్ళు కూడా బలిని చూసి శ్రీమన్నారాయణుడు బలిచక్రవర్తికి ఇంత శిక్ష వేయడమా! అని హాహాకారములు చేశారు. బ్రహ్మగారు వచ్చి ‘ఇటువంటి భక్తుడిని నేను ఇంతకు పూర్వం చూడలేదు. దయచేసి బలిచక్రవర్తిని విడిచి పెట్టవలసినది’ అని కోరారు. బలిచక్రవర్తి తాతగారయిన ప్రహ్లాదుడు వస్తే బలిచక్రవర్తి ‘నా కాళ్ళు చేతులు వరుణ పాశములతో కట్టేశారు. అంతటి మహాపురుషుడయిన తాతగారు వస్తుంటే నా చేతులు ఉండి కూడా నేను నమస్కరించలేకపోతున్నాను’ అని ఏడుస్తూ నిలబడ్డాడు. ప్రహ్లాదుడు వామనుని వద్దకు వచ్చి ‘స్వామీ! ఇంతకూ పూర్వం ఇతనికి ఇంద్రపదవి నీ అనుగ్రహం వలననే వచ్చింది. నీవే మొదటి గురువువి. నీవే శుక్రాచార్యులలో ప్రవేశించి యాగం చేయించావు. గురువు అనుగ్రహంగా యాగభోక్తవై ఆనాడు విశ్వజిత్ యాగమును ఆదరించి బ్రహ్మాండమయిన రథమును ఇచ్చావు. దానివల్ల అమరలోకం వచ్చింది. ఇంద్రపదవి వచ్చింది. వీటినన్నిటిని నీవే ఇచ్చావు. ఈవేళ నీవే తీసేశావు. చాలా మంచిపని చేశావు. హాయిగా నీ పాదములు నమ్ముకుని నిన్ను సేవించు కోవడంలో ఉన్న ఐశ్వర్యం మరెక్కడా లేదు. స్వామీ!ఎంత వరమును ఇచ్చావు’ అన్నాడు.

శ్రీమహావిష్ణువు ‘మీరందరూ నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. నేను బలిచక్రవర్తికి గొప్ప సన్మానమును చేశాను. అతను ఆత్మను తెచ్చి నా పాదముల దగ్గర పెట్టేశాడు. ఆత్మనివేదనం చేశాడు. సంపూర్ణ శరణాగతి చేశాడు. ఇటువంటి వాడిని నేను పాడుచేస్తానా? నేను ఉన్నాను అనడానికి నేను వీనిని రక్షించాలి. వానిని వరుణపాశములతో కట్టాను. అలా నిలబడిపోయాడే కానీ తెంచుకునేందుకు ప్రయత్నించ లేదు. సావర్ణిమనువు అయిన కాలంలో ఇతనిని నేను దేవేంద్రుని చేస్తాను. ఆ తరువాత ఎవ్వరూ రాని ప్రదేశము, ఎవ్వరూ దర్శించని ప్రదేశము కేవలము నిలబడి ప్రార్థన చేస్తే నా అశరీరవాణి వినపడుతుంది తప్ప నేనున్న మూలమయిన చోటును ఎవరు చూడరో అటువంటి చోటుకు వీనిని రప్పించుకుని నాలో కలిపేసుకుంటాను. అప్పటివరకు దేవతలు కూడా ఎక్కడ ఉండాలని కోరుకుంటారో అటువంటి సుతల లోకమునకంతటికీ ఇతనిని అధిపతి చేస్తున్నాను. సర్వకాలములయందు నా సుదర్శన చక్రము ఇతనికి అండగా వుండి రక్షిస్తుంది. పదిదిక్కులను పరిపాలించే దిక్పాలకులు ఎవరూ కూడా బలిచక్రవర్తి జోలికి వెళ్ళడానికి వీలులేదు ఇది నా శాసనం. అటువంటి వాడై సుతల లోకంలో రోగములు కాని, ఆకలి గాని, దప్పిక గాని, ఏమీ లేకుండా ఉంటాడు’ అన్నారు.

మరి బలిచక్రవర్తి యందు దోషమేమిటి? అతనికి శిక్ష ఎందుకు పడింది? బలిచక్రవర్తికి దుర్జన సాంగత్యము ఉన్నది. అతను లోపల ఎంత గొప్పవాడయినా చాలాకాలం రాక్షసులతో కలిసి తిరిగాడు. ఇవాళ సజ్జనుడై మనస్సు నిలబెట్టుకున్నాడు. భ్రుగువంశ సంజాతులయిన బ్రాహ్మణులతో కలిసి తిరగడంతో అతనికి ఇప్పుడు ఈశ్వరుడు అంటే ఏమిటో అర్థం అయింది. ఈ తిరిగిన ఫలితమునకు ఇంత గొప్ప వరమును ఇస్తున్నాను. రాక్షసులతో తిరగడం వలన మనసులో ఉండిపోయిన ‘నేను దానం ఇస్తున్నాను’ అనే చిన్న అభిజాత్యానికి వరుణపాశంతో కట్టాను. కానీ అతను చేసిన శరణాగతికి అతడిని సుతల లోకమునకు అధిపతిని చేసి సావర్ణిమనువు వేళకు ఇంద్రుడిని చేసి తదనంతరము నాలో కలుపుకుంటాను.

‘అదితి ఆరోజు కోరింది కాబట్టి ఇంద్రునికి తమ్మునిగా పుట్టాను. ఇవాళ నుండి నన్ను ఉపేంద్రుడని పిలుస్తారు’ అని అన్నారు. యథార్థమునకు ఇంద్రుడు ఆయన కాలి గోటికి చాలడు. అటువంటి వానికి తమ్ముడని పిలిపించుకుని పొంగిపోతున్నాడు. తాను సంపాదించిన రాజ్యములో భాగము అడగకుండా ఇంద్రునికి ఇచ్చేశాడు. ఇంద్రుడు రాజ్యాభిషిక్తుడై తిరిగి స్వర్గమును పొందాడు. అమ్మకి ఇచ్చిన వరమును పూర్తిచేశాడు. తను మళ్ళీ శ్రీమన్నారాయణుని పథమును చేరుకుంటూ ఒకమాట చెప్పాడు.

ఈ వామనమూర్తి కథను వింటున్నవారు ‘ఎక్కడయినా పితృ కార్యములు చేయకపోతే వామనమూర్తి కథ వింటే వారు సశాస్త్రీయంగా పితృకార్యం చేసినట్లే. ఎక్కడైనా ఉపనయనం చేస్తే ఆ ఉపనయనంలో తెలిసి కాని, తెలియక గాని, ఏమయినా దోషములు దొర్లితే ఆ దోషములు పరిహరింపబడతాయి. ఆ ఉపనయనము పరిపూర్తియై ఆ బ్రహ్మచారి గాయత్రీ మంత్రము చేసుకోవడానికి పూర్ణమయిన సిద్ధిని పొందాలంటే వటువు వామనమూర్తి కథను వినాలి. ఎవరు ఈ వామనమూర్తి కథను చదువుతున్నారో అటువంటి వారి పాపములను దహించి ఊర్ధ్వలోకములయందు నివాసము ఇస్తాను. వారికి లక్ష్మీకటాక్షము కలుగుతుంది. వాళ్లకి ఉన్న దుర్నిమిత్తములు అన్నీ పోతాయి’ అని సాక్షాత్తుగా భగవానుడే ఫలశ్రుతిని చెప్పారు.

ఇది అంత పరమ ప్రఖ్యాతమయిన ఆఖ్యానము.


https://www.facebook.com/SriChagantiGuruvuGaariFollowersUnofficialPage


instagram.com/pravachana_chakravarthy

Sri Siva Maha Puranam

 Sri Siva Maha Puranam -- 8 By Pujya Guruvulu Brahmasri Chaganti Koteswara Rao Garu

సోమనాథుడు

ఇక్కడ ఒక చిత్రం జరిగింది. శంకరుడు చంద్రుడిని నెత్తిమీద పెట్టుకోవడం మంచిదే. అదే సోమనాథ లింగం. స+ఉమ+నాథుడు=సోమనాథుడు. అనగా పార్వతీదేవి పక్కన ఉన్న కారుణ్యమూర్తి. సశక్తిపరుడు అని ఒక అర్థం. సోముడు అనగా చంద్రుడు. సోముడు ప్రార్థన చేశాడు. ‘నన్ను ఇంత అనుగ్రహించిన నీవు ఉత్తరోత్తరా ఎవరు వచ్చినా రక్షించడానికి ఇక్కడే వెలయవలసినది’ అన్నాడు. శివుడు అక్కడ జ్యోతిర్లింగమై వెలిశాడు. ఆ కారణముగా అది స్వయంభూ జ్యోతిర్లింగములలో మొట్టమొదటి లింగము. తెలిసి వెళ్ళినా తెలియక వెళ్ళినా అక్కడికి వెళ్ళి సోమనాథ జ్యోతిర్లింగమును దర్శించుకుంటే దీర్ఘకాలంగా పీడిస్తున్న వ్యాధులు నయం అవుతాయని, భవిష్య జన్మలో చేసిన పాపముల వలన భయంకరమయిన కుష్ఠు మొదలయిన వ్యాధులు రావలసిన పాపములు ఖాతాలో ఉండిపోయినా అవి భగ్నం అయిపోతాయని సోమనాథలింగ దర్శనము చెయ్యాలని శాస్త్రం చెపుతున్నది.

సోమనాథ దేవాలయం శ్రీ సర్దార్ వల్లభాయ్ సారధ్యంలో పునర్నిర్మాణం అయింది. ఈ లింగం మీద కన్నుపడే ఈ సోమనాథ దేవాలయమును పూర్వం ఎందరో ఎన్నో మార్లు ధ్వంసం చేస్తే మహానుభావుడు ఉక్కుమనిషి అనిపించుకున్న భారతదేశపు తొలి ఉప ప్రధానిగా పనిచేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి ఆధ్వర్యంలో ఒక కమిటీ ఏర్పడి, సోమనాథ దేవాలయమును పునర్నిర్మాణం చేసి, అత్యద్భుతంగా రూపుదిద్దారు.


Sri Siva Maha Puranam -- 9 By Pujya Guruvulu Brahmasri Chaganti Koteswara Rao Garu


శ్రీశైల క్షేత్రం:


శ్రీశైలం సాక్షాత్తుగా మన ఆంధ్రదేశంలోనే కర్నూలు జిల్లాలో వెలసిన స్వయంభూలింగ మూర్తి ఉన్న క్షేత్రము. విశేషించి అష్టాదశశక్తి పీఠములలో శ్రీశైలంలో ఉన్న భ్రమరాంబికా అమ్మవారు ఒక శక్తిపీఠం. శ్రీశైలం అంత గొప్ప క్షేత్రం. ఆ పరమేశ్వరుడు వెలసిన కొండపేరు శ్రీగిరి. మనం ఎవరినయినా గౌరవవాచకంతో పిలవాలని అనుకున్నప్పుడు పక్కన శ్రీకారం చుడతాము. శైలమునకు ముందు శ్రీకారం వ్రాయబడి శ్రీశైలం అయింది. దానిపేరు శ్రీగిరి. శ్రీశైలంలో స్వామి లింగమూర్తియై అరూపరూపిగా ఉన్నాడు. ఉన్నది ఒక్క పరమాత్మే రెండుగా భాసిస్తున్నాడు. శ్రీగిరి అన్న పేరు రావడానికి సంబంధించి స్థల పురాణం ఒకమాట చెప్పింది. ఒక భక్తురాలు తాను ఒక కొండగా మారాలని కోరుకుని శైలముగా మారినదని చెబుతారు. దాని తాత్త్వికమయిన రహస్యం వేరు. శ్రీ’లో ‘శ’కార, ‘ర’కార, ‘ఈ’కారములు ఉన్నాయి. ఈ మూడక్షరములు బ్రహ్మశక్తి, రుద్రశక్తి, విష్ణుశక్తి – ఈ మూడు శక్తులను తెలియజేస్తాయి. ఈ మూడు శక్తులు ఉన్న కొండ శ్రీశైలం. ఈ మూడు శక్తులు మమైకమయిన శక్తి రూపిణి భ్రమరాంబిక. అందుకని శ్రీశైలం ఒక శక్తి పీఠం. ఆ కొండమీద అడుగుపెట్టిన వాడు సరస్వతీ కటాక్షమును కానీ, లక్ష్మీ కటాక్షమును గానీ, జ్ఞానమును గానీ నోరువిప్పి అడగక్కరలేదు. అతనికి కావలసినది ఆ కొండలోంచి ప్రసరిస్తుంది. అంత శక్తిమంతమయిన కొండ. శ్రీశైల పర్వతం ఎన్నో ఓషధులకు ఆలవాలము. శ్రీశైలము ఎన్నో ఉపాసనలకు ఆలవాలము. అటువంటి శ్రీశైలంలో పర్వతం మీద పరమశివుడు స్వయంభువుగా వెలిశాడు. ఆయన అక్కడ వెలవడానికి గల కారణం గురించి పెద్దలు ఒక విషయమును చెప్తారు.

గణాధిపత్యం ఎవరికి ఇవ్వాలి అని నిర్ణయం చేయవలసి వచ్చినప్పుడు శంకరుడు తన ఇద్దరు కుమారులను పిలిచి, ఎవరు భూమండలమునంతటిని తొందరగా ప్రదక్షిణం చేసి వస్తారో వారికి గణాధిపత్యం ఇస్తాను అని చెప్పగానే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గబగబా బయలుదేరి భూమండలంలో ఉన్న దేవాలయములన్నింటినీ దర్శనం చేసుకుంటూ వస్తున్నారు. గణపతి మాత్రం అలా అన్ని దేవాలయములకు వెళ్ళలేదు. సూక్ష్మలో మోక్షం అన్నట్లుగా ఆయన ‘నాన్నగారూ! తల్లిదండ్రులకు చేసిన ప్రదక్షిణం భూమండలమునకు చేసిన ప్రదక్షిణతో సమానం. నేను మీకే ప్రదక్షిణం చేసి మీకే నమస్కరిస్తున్నాను’ అని తన తల్లిదండ్రులకు ప్రదక్షిణం చేశాడు. ఈవిధంగా గణపతి తన బుద్ధి కుశలతను ప్రదర్శించాడు. శంకరుడు గణపతికి గణాధిపత్య పదవిని ఇచ్చారు.

సుబ్రహ్మణ్యుడికి కోపం వచ్చి అక్కడినుంచి వెళ్ళిపోయాడు. పార్వతీ పరమేశ్వరులిద్దరూ సుబ్రహ్మణ్యుడిని ఇంటికి రమ్మనమని కోరడానికి వెళ్ళారు. వీరిని చూసి సుబ్రహ్మణ్యుడు 24 క్రోసుల ముందుకు వెళ్ళిపోయాడు. శంకరుడు మల్లెతీగల చేత చుట్టుకోబడిన ఒక అర్జున వృక్షం క్రింద కూర్చున్నాడు. పార్వతీదేవి కూడా వెళ్ళింది. పిల్లవాడు ఎలా ఉన్నాడో అని శంకరుడు సుబ్రహ్మణ్యుడు ఉన్న చోటుకు వెళ్లి కొడుకును బుజ్జగించాడు. ఆయన అలక తీరిపోయింది. ఆయన మహా జ్ఞానిగా నిలబడ్డాడు. శ్రీశైలమునకు పరమేశ్వరుడు ప్రతి అమావాస్య నాడు వెళ్లి దర్శనం చేసి వస్తూ ఉంటాడు. ప్రతి పౌర్ణమి నాడు అమ్మవారు వెళ్లి దర్శనం చేసి వస్తూ ఉంటుంది. పిల్లవానికి దగ్గరలో ఉన్నామని అనిపించుకోవడానికి అక్కడే ఉండి సుబ్రహ్మణ్యుడిని చూసుకుంటూ ఈ మల్లెచెట్టు క్రిందకి వచ్చాము కదా అని అక్కడ వెలశారు. అలకచేతనో, అజ్ఞానం చేతనో మన శరీరములను చూసుకుని భగవంతునికి దూరం అవుతున్నాము. ఇలాంటి వాళ్ళు ఎవరయినా ఉంటే వాళ్ళ దగ్గరకు తానే వెళ్ళిపోతాను అని చెప్పి వచ్చి పరమశివుడు శ్రీశైలంలో కూర్చున్నాడు. శ్రీశైల మల్లికార్జునుడిది ధూళి దర్శనం. మీరు మీ ప్రదేశం నుంచి శ్రీశైలం వెళ్ళే లోపల ఎంతో అశౌచమునకు లోనవుతుంది శరీరం. ఆ బట్టలతో కొండమీదకి వెళతారు. శుభ్రపడి దర్శనానికి వెడితే ఆయన కొద్దిగా చిన్నబుచ్చుకుంటాడట. ఆ క్షేత్రమునకు వెళ్ళగానే ఆశౌచంతో కూడిన శరీరంతో గుడి దగ్గరకు వెళ్లి ధూళి దర్శనమునకు వచ్చాము అని చెప్పి లోపలి వెళ్లి ఈ మట్టి కాళ్ళతో మోకాళ్ళ మీద కూర్చుని మట్టి చేతులతో శివలింగమును ముట్టుకుని, శివలింగం మీద తల తాటిస్తే పరమేశ్వరుడు పొంగి పోయి సర్వకామ్య సిద్ధిని ఇస్తాడుట. దీనిని ధూళి దర్శనం అంటారు శ్రీశైలంలో. శ్రీశైలంలో ధూళి దర్శనం చెయ్యాలి.

అసురసంధ్య వేళలో నందివాహనం భూమండలం మీదనుండి వెడుతుంది. అటువంటి సమయంలో పరమాత్మ శ్రీశైలపర్వతం మీద ఒకసారి దిగుతాడు. అంత పరమ పవిత్రమయిన సమయంలో శ్రీశైలంలో దేవాలయంలో కూర్చుని శివాష్టోత్తర శతనామములు చదువుకున్నట్లయితే అక్కడ దిగిన పరమాత్మ అది చూసి ఆయనను అన్ని పేర్లు పెట్టి పిలిచినందుకు ఎంతగానో సంతోషిస్తాడు. జన్మ చరితార్థం అయిపోతుంది. చెంచులు చెవిటి మల్లన్నా అని అరుస్తూ ఉండేవారు. చెవిటి మల్లన్న అంటే ఆయన పొంగిపోతాడట. శ్రీశైలంలో పరమేశ్వరుడు తన భక్తుల కోర్కెలను తీర్చడానికి ఒక తండ్రిగా వచ్చి కూర్చున్నాడు. శ్రీశైలం స్వామి వారిని దర్శించడానికి వచ్చిన వారి గోత్రనామమునలు ప్రత్యేకంగా ఒక చిట్టాలో వ్రాయమని అమ్మవారు గణపతికి చెప్పింది. అందుకే శ్రీశైలం వెడితే తప్పకుండా సాక్షి గణపతి దగ్గర ఆగాలి. లోపలి వెళ్లి గోత్రం, పేరు, చెపితే గణపతి మన గోత్ర నామమును చిట్టాలో రాసేసుకుంటారు.

శ్రీశైలంలో శిఖరేశ్వరం ఉన్నది. అక్కడికి నువ్వులు పట్టుకెళ్ళి నంది విగ్రహం దగ్గర పోస్తారు. పూర్వకాలంలో శివాలయంలో చరనంది ఉండేది. పూర్వం రోజులలో ఇప్పుడు ఉన్నంత వైద్య సదుపాయం ఉండేది కాదు. శివాలయం, విష్ణ్వాలయం తప్పకుండా ఉండి తీరేవి. ఎవరయినా గర్భిణీకి అనుకోకుండా నొప్పులు వస్తే పట్నానికి తీసుకు వెళ్ళడానికి అవకాశం లేకపోతే అంతరాలయం మూసేసి ఉన్నా కూడా పరుగెత్తుకుంటూ అర్చకుడి దగ్గరకు వెడితే ఆలయ ప్రధాన ద్వారం తీసేవారు. ఈ బాధ పడుతున్న గర్భిణి ఇల్లు ఎటువైపు ఉన్నదో అటువైపు చరనందిని తిప్పేవారు. ఈ చరనంది అటు తిరగగానే అటువైపు బాధపడుతూ ప్రసవం జరగకుండా ప్రాణాలు పోతాయేమో నని అనుకున్న వాళ్లకి కూడా ఎందరికో సుఖప్రసవములు జరిగేవి. అందుకే అనేక శివాలయములలో చరనంది ఉండేది. శిఖరేశ్వరంలో కూడా మనం ఈశ్వరుణ్ణి పొందలేక పడుతున్న బాధ నుంచి విముక్తం కావడానికి నువ్వులు వేసి తిప్పి శిఖరం చూడాలి. కానీ యథార్థమునాకు శిఖరము నంది శృంగములలోంచి కనపడదు. మీరు భావన చేస్తూ కళ్ళు తెరచి అక్కడ చూడాలి. ఈ కన్నులు తెరచి నంది శృంగములలోంచి చూస్తుంటే జేగురు రంగులో ఉన్న శ్రీశైల మల్లికార్జునుని ఆలయ గోపురం మీద వున్నా త్రిశూలంతో కూడి మెట్లు మెట్లుగా ఉన్న శిఖరం మీకు కనపడాలి. అలా కనపడిన వాడికి ఒక పునర్జన్మ ఉండదు. అందుకే శిఖరేశ్వర దగ్గర పరమాత్మ ఒక పరీక్ష పెట్టాడు. ఒకసారి అమ్మవారు ‘ఏమండీ శిఖరేశ్వరం దగ్గరకు వచ్చి నందిని తిప్పి శిఖరం చూస్తే ఇక పునర్జన్మ లేకుండా మోక్షమును ఇచ్చేస్తారా? అని అడిగితే శంకరుడు శ్రీశైలం వచ్చిన వారందరికీ మోక్షం ఇవ్వను. ఎవరికి ఇస్తానో నీకు చూపిస్తాను అని ఆయన ఒక వృద్ధ బ్రాహ్మణ రూపమును స్వీకరించారు. ఒక వృద్ధ బ్రాహ్మణిగా పార్వతీదేవి వచ్చింది. ఇద్దరూ ఆ శిఖరేశ్వరం దగ్గరికి వచ్చారు. మెట్లు ఎక్కుతున్నారు. నంది శృంగముల లోంచి చూస్తున్నారు. క్రిందికి దిగిపోతున్నారు. ఈశ్వరుడు అక్కడ చిన్న ఊబిని సృష్టించాడు. అందులో వృద్ధ బ్రాహ్మణుడు దిగిపోతున్నాడు. ఆ ఒడ్డున ఉన్న వృద్ధ బ్రాహ్మణి ‘మా అయన దిగబడిపోతున్నాడు. అందుకని ఎవరయినా ఒక్కసారి చేయినిచ్చి పైకి లాగండి’ అన్నది. అందరూ గబగబా వచ్చి చెయ్యి ఇవ్వబోయారు. ఆమె మీలో పాపం లేనివారు పైకి లాగండి అన్నది. ప్రతివారు తాము ఏదో పాపం చేసి ఉండక పోతానా అనుకుని వెనక్కి వెళ్ళిపోయారు. ఆ సమయంలో అటుగా ఒక వేశ్య కిందికి దిగుతోంది. ఈవిడ వేశ్య అని అందరూ అంటున్నారు. ఆవిడ దిగుతూ వచ్చి నేను లాగుతాను అంటే పార్వతీ దేవి ‘ఏమ్మా! అందరూ మాకు పాపం ఉంది అని వెళ్ళిపోతున్నారు. వాళ్ళ పాపము కంటే నీ పాపం గట్టిది కదా! నువ్వు నా భర్తను ఎలా లాగుతావు? అని అడిగింది. ఆవిడ ‘శ్రీశైల శిఖరం దృష్ట్వా పునర్జన్మ న విద్యతే’ – అమ్మా! నేను ఇప్పడు శిఖర దర్శనం చేశాను. మోక్షం రావాలంటే పాపం లేదు, పుణ్యం లేదు. రెండూ సున్నా అయిపోతేనే కదా మోక్షం. ఇపుడు నా ఖాతాలో పాపం లేదు. పుణ్యం లేదు అందుకని లాగుతున్నాను. నేను అర్హురాలను’ అన్నది. ఈవిడకు విశ్వాసం నిజంగా ఉన్నది ఈవిడకు మోక్షం ఇస్తున్నాను’ అని శివుడు పార్వతికి చెప్పాడు. నంది శృంగములలోంచి చూడడం కాదు. అక్కడ ఉన్నది తన తల్లిదండ్రులని నమ్మిన వాడు ఎవరో వానికి మాత్రమె మోక్షం ఇవ్వబడుతుంది. శ్రీశైల క్షేత్రంలో అడుగు పెట్టిన వాడికి తాను తన తల్లిదండ్రుల దగ్గర ఉన్నాననే భావన ఉండాలి. ఈ భావన పరిపుష్టమై శ్రీశైలం వెడితే మీకు అక్కడ ఎనలేని సౌభాగ్యం కలుగుతుంది.


హటకేశ్వరం

శ్రీశైలంలో హటకేశ్వరము అని ఒక దేవాలయం ఉన్నది. అది చిత్రమయిన దేవాలయం. ఒక బంగారు లింగం తనంత తాను కుండపెంకునందు ఆవిర్భవించిన హటకేశ్వర దేవాలయము క్షేత్రము కనుక దానిని ‘హటకేశ్వరము అని పిలుస్తారు. అక్కడ మెట్లు బాగా క్రిందికి వస్తే పాలధార, పంచధార అని అయిదు ధారలు పడుతుంటాయి. పరమశివుని లలాటమునకు తగిలి పడిన ధార ఫాలధార. అనగా జ్ఞానాగ్ని నేత్రమయిన ఆ కంటినుండి, పైనుండి జ్ఞానగంగ మరింతగా తగిలి క్రింద పడిన ధార. ఇది శివుడి లలాటమును తగిలి వస్తున్నధార అని లోపలికి పుచ్చుకుంటే ఉత్తర క్షణం గొప్ప ఫలితమును కలుగుతుంది. ఎందుచేత ఇలా ఏర్పడింది? ఈశ్వరాలయంలో తీర్థం ఇవ్వరు. సాక్షాత్తు సాకారరూపుడయిన శంకరునికి తగిలి పడిన ధార పాలధార. పంచధార అయిదు రకములుగా ప్రకాశిస్తున్న భగవంతుని శిరస్సులకు తగిలి పడిన ధారలు. ఆ తీర్థం తీసుకునేటప్పుడు మర్యాద పాటించాలి. చెప్పులతో వెళ్ళకూడదు. శంకర భగవత్పాదుల వారు తపస్సు చేసి అక్కడే శివానందలహరి చెప్పారు. ఆయనకు భ్రమరాంబికా దేవి ప్రత్యక్షం అయింది. చంద్రశేఖర పరమాచార్య స్వామి తపస్సు చేసుకుంటూ ఉండిపోతాను అన్న ప్రదేశం అదే. అంత పరమమయిన ప్రదేశంలో పంచధారలు పడతాయి. ఒకటి బ్రహ్మధార. ఒకటి విష్ణుధార, ఒకటి రుద్రధార, ఒకటి చంద్రధార, ఒకటి దేవధార. ఈ పంచధారలను స్వీకరించడం సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త లోకసాక్షులయిన సూర్యచంద్రులు. ఈ అయిదు తీర్థములను అక్కడ తీసుకోవచ్చు. పరమ పావనమయిన క్షేత్రం శ్రీశైల క్షేత్రం.

శ్రీశైలంలో ఉండే భ్రమరాంబా అమ్మవారి దేవాలయం వెనక నిశ్శబ్దంగా ఉన్నప్పుడు వెళ్లి చెవిని బాగా నొక్కిపెట్టి ఉంచి చాలా జాగ్రత్తగా కళ్ళు మూసుకుని వింటే ఒక తుమ్మెద ఝుంకారము వినపడుతుంది. దానిని భ్రామరీ నాదము అంటారు. అమ్మవారిని ఇప్పటికీ అక్కడ తుమ్మెదరూపంలో ఉన్న రెక్కలతో అలంకారం చేస్తారు. ఆ తల్లిముందు శంకరాచార్య స్వామి వారు శ్రీచక్రములను వేశారు. అక్కడికి వెళ్లి అమ్మవారి శ్రీచక్రం ముందు కూర్చుని ఏ తల్లి అయినా కుంకుమార్చన చేస్తే ఆమె పూర్ణంగా మూడు తరములు చూసి హాయిగా పదిమంది చేత పండు ముత్తైదువని అనిపించుకుని వార్ధక్యంలో హాయిగా ఆవిడ భర్తగారి తొడమీద తల పెట్టుకొని ప్రాణం విడిచిపెట్టగలిగిన అదృష్టం కలుగుతుంది. శ్రీశైలలింగమునకు పట్టు తేనెతో అభిషేకం చేస్తే ఉత్తరజన్మలలో గంధర్వగానం వస్తుంది. భ్రమరాంబికా అమ్మవారి దగ్గర కూర్చుని కుంకుమార్చన చేసుకోవాలి. నాలుగు మారేడు దళములు పట్టుకెళ్ళి ఆ శివలింగమును తడిమి తడిమి అభిషేకం చేసుకోవాలి. తల తాటించి నమస్కరించుకోవాలి.

పూర్వం అరుణాసురుడనే రాక్షసుడొకడు బయలుదేరాడు. వాడు బ్రహ్మ ఇచ్చిన వరముల వల్ల మిక్కిలి గర్వమును పొంది లోకముల నన్నిటిని క్షోభింపజేస్తున్నాడు. ఆ సమయంలో అమ్మవారు భ్రామరీ రూపమును పొందింది. భయంకరమయిన యుద్ధం చేసిన తరువాత భ్రామరీ రూపంతో వెళ్ళి ఆ అరుణాసురుణ్ణి సంహారం చేసింది. ఇప్పటికీ శాస్త్రంలో శ్రీశైల మల్లికార్జునుడు మల్లెపూవు అయితే అమ్మవారు సారగ్రాహి అని చెప్తారు. తుమ్మెద ఎప్పుడూ పువ్వుచుట్టూ తిరుగుతుంది. ఆయన మల్లికార్జునుడు. ఆవిడ భ్రమరాంబికా దేవి. శివుడు ఉన్నచోట అక్కడ ఆవిడ భ్రమర రూపంతో తిరుగుతూ ఉంటుంది. ఇప్పటికీ ఆ నాదము వినపడుతూ ఉంటుంది. ఈ నాదమును ఆలిండియా రేడియో హైదరాబాద్, కర్నూల్, విజయవాడ స్టేషన్లు రికార్డుచేశాయి. శ్రీశైలం వెళ్లి అమ్మవారిని చూసినట్లయితే అమ్మవారి కనుగుడ్లు స్పష్టంగా కనపడుతుంటాయి. ఆమె ముందు గల శ్రీచక్రం ముందు కూర్చుని కుంకుమార్చన చేసుకుని “అవిద్యానామంతస్తిమిర మిహిరద్వీపనగరీ” అని సౌందర్యలహరి లోని నాలుగు శ్లోకములు చెప్పుకుని వస్తే జన్మ ధన్యం అయిపోతుంది.

అక్కడ ఉన్న స్వరూపములలో వీరభద్రుడు ఒకడు. శ్రీశైల మల్లికార్జునుని దర్శనం చేసి బయటకు వచ్చి ఎడమ పక్కకు వెళ్ళినప్పుడు వీరభద్రుడు కనపడతాడు. బయలు వీరభద్రుడని క్షేత్ర పాలకుడు ఒకాయన ఉన్నాడు. రక్త సంబంధమయిన వ్యాధులు శరీరంలో పొటమరిస్తే వారు శ్రీశైల క్షేత్రంలో ఉన్న వీరభద్ర స్వరూపం దగ్గర కూర్చుని ప్రతిరోజూ ఒక గంట సేపు శివనామములు చెప్పుకుని కొద్దిరోజులు ఉండి వస్తే ఆ వ్యాధులు నయం అవుతాయి. అలా నయమయిన సందర్భములు ఎన్నో ఉన్నాయి. అక్కడ ఉన్న వీరభద్ర మూర్తిలోంచి అటువంటి శక్తి ప్రసారం అవుతుందని పెద్దలు చెప్తారు.

చంద్రవతి అనే రాజకుమార్తె ఒక భయంకరమయిన గడ్డు కాలమును ఎదుర్కొంది. తన తండ్రే తనను మోహించాడు. ఆమె పరుగెత్తి శ్రీశైల క్షేత్రమును చేరుకొని గుళ్ళోకి వెళ్ళిపోయింది. రాజు ఆమె వెనుక తరుముకు వస్తున్నాడు. గుళ్ళోకి వెళ్ళిన ఆమె శివలింగమును చూసి దానిని శివలింగమని అనలేదు. అక్కడ మల్లికార్జునుడు ఉన్నాడు అని ఆమె చేతిలో ఉన్న మల్లెపూల దండను సిగకు చుట్టుకుని ‘మల్లికార్జున నేను నీకు ఇవ్వగలిగింది ఇదే – ఇది నీ సిగకు చుట్టుకుని నన్ను నీవు కాపాడు’ అని ప్రార్థించింది. లింగోద్భవ మూర్తి స్వామి వచ్చి ఆమెను తరుముకు వస్తున్న రాజును చూసి నీవు పచ్చలబండవగుదువుగాక అని శపించాడు. అంతటి దుష్కృత్యమునకు ప్రయత్నించిన ఆ రాజు పచ్చలబండయి ఇప్పటికీ అలా పడి ఉన్నాడు. ఈవిడ ఇచ్చిన మల్లికా పుష్పముల మాలను తన సిగకు చుట్టుకుని స్వామి మల్లికార్జున అని మరొకమారు పిలిపించుకున్నాడు.

శ్రీశైలంలో ఒక శివ లింగము ముడతలు పడిపోయి ఉంటుంది. ఆ ముడతలు బాగా దగ్గరగా వచ్చేసి ఉంటాయి. ఈ మల్లికార్జునుడు ఎప్పుడు వెలసినదీ సాధికారికంగా చెప్పలేము. అక్కడ జరిగిన విచిత్రం ఒకటి ఉన్నది. మహీధర మహారాజు అని ఒక రాజుగారు ఉండేవారు. ఆయనకు ఒక కుమార్తె. ఆమె శంకరుని సౌందర్యమును ఉపాసన చేసింది. సాధారణంగా ఈశ్వరుని తండ్రిగా ఉపాసన చేస్తారు. కానీ ఆమె శివుణ్ణి మోహించింది. తనకి శివుడి వంటి భర్త కావాలి అన్నది. ఈ పిల్ల ఏమి చేస్తుందో అని శంకరుడు ఆమె కలలోకి వచ్చి “నీకు నన్ను వివాహం చేసుకోవాలని ఉంటే శ్రీగిరి పర్వతం మీద ఉన్న తెల్ల మద్దిచెట్టు కిందవున్న మల్లెపొదలో ఉన్నాను. అక్కడకు రా నిన్ను వివాహము చేసుకుంటాను’ అన్నాడు. ఆమె శంకరుడు చెప్పిన చోటికి వచ్చి ఆ చెట్టును, పొదను వెతుకుతున్నది. పార్వతీ దేవి “జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ అని చెప్తారు. మీకు ఈ బుద్ధి ఎప్పటినుంచి వచ్చింది అని శంకరుని అడిగింది. శంకరుడు ఆమె నన్ను భక్తితో ఆరాధన చేసింది. ఇక్కడ వివాహం అనగా నేను ఆవిడను నాలోకి తీసుకోవడం అని చెప్పాడు. పార్వతీ దేవి అయితే ఆమె ఉపాసనలో అంత భక్తి ఉన్నదా? అని అడిగిటే శంకరుడు ఆమె ఎంత భక్తి తత్పరురాలో చూపిస్తాను చూడమని వెంటనే 96 సంవత్సరముల వృద్ధునిగా మారి వెతుకుతున్న పిల్ల దగ్గరకు వెళ్ళి పిల్లా! నీవు ఇక్కడ ఎవరి కోసం వెతుకుతున్నావు? అని అడిగాడు. ఆమె తాను శివుడి కోసం వెతుకుతున్నానని జవాబు చెప్పింది. ఆయన నేనే శివుడిని ఇంత వృద్ధుడిని కదా! నన్ను పెళ్ళాడతావా? అని అడిగాడు. నీవు వృద్దుడవో, యౌవనంలో ఉన్నవాడివో నాకు తెలుసు. నాకు నీవే భర్త. వేరొకరిని ఈ లోకంలో నేను భర్తగా అంగీకరించనని చెప్పింది. ఆవిడకు కావలసింది ఆయనలో ఐక్యమవడం. చూశావా పార్వతీ ! ఈమె భక్తి ఈమెను నాలో ఐక్యం చేసుకుంటున్నాను అని శివుడు ఆమెను తనలో ఐక్యం చేసుకుని ఈ పిల్లను స్మరించి ఇటువంటి భక్తి తత్పరురాలికోసం సృష్టిలో లేని విధంగా ముడతలు పడిపోయిన శివలింగమని, వృద్ధ మల్లికార్జునలింగమని తలచుకున్న వాళ్ళని, పొంగిపోతూ నేను చూస్తానని వృద్ధ మల్లికార్జునుడై వెలిశాడు. అక్కడ కళ్యాణములు చేస్తున్నారు. ఈవిధంగా శ్రీశైలం ఎన్నో విశేషములతో కూడుకున్న క్షేత్రం.

ఈ క్షేత్రంలోనే శంకరాచార్యుల వారు శ్రీశైల శిఖరం మీద ఉండగా ఒక కాపాలికుడు వచ్చి శంకరాచార్యుల వారి శిరస్సు కావాలని అడిగాడు. శంకరాచార్యుల వారు ‘నా శిరస్సును ఇవ్వడానికి నాకేమీ అభ్యంతరం లేదు. నీవు నా శిరస్సును తీసుకుంటే నా శిష్యులు బాధపడతారు. నా శిష్యులు ఉదయముననే పాతాళగంగ దగ్గరకు వెడతారు. అప్పుడు వచ్చి నా శిరస్సు ఉత్తరించి పట్టుకు వెళ్ళు’ అని చెప్పారు. మరునాడు ఉదయం ఆ కాపాలికుడు వచ్చి ధ్యానం చేసుకుంటున్న శంకరాచార్యుల వారి శిరస్సును ఉత్తరించడం కోసమని చేతిలో ఉన్న కత్తి పైకెత్తిన సమయంలో స్నానం చేస్తున్న పద్మపాదాచార్యుల వారికి ఏదో అమంగళం గోచరించి అక్కడి నుండే నరసింహ మంత్రోపాసన చేశారు ఆయన. ఎక్కడి నుండి వచ్చాడో మహానుభావుడు నరసింహుడు గబగబా వచ్చి కత్తినెత్తిన కాపాలికుడి శిరస్సును త్రుంచి అవతల పారేసి నిలబడ్డాడు. ఆ తేజోమూర్తిని శంకరాచార్యుల వారు నరసింహ స్తోత్రంతో ప్రార్థన చేశారు. ఈవిధంగా నరసింహ స్వామి దర్శనం ఇచ్చిన క్షేత్రం. శివకేశవ అభేదముగా శంకర భగవత్పాదులు రక్షించబడిన క్షేత్రం శ్రీశైల క్షేత్రం. జగద్గురువులను రక్షించుకున్న మన తెలుగునాట ఉన్న కొండ.

అక్కడ ప్రవహించే కృష్ణానదిని కృష్ణానది అని పిలవరు. కృష్ణానది శ్రీశైల పర్వతశిఖరమును పామువలె చుట్టుకొని ప్రవహిస్తుంది. శివుడిని విడిచి పెట్టలేక భక్తుల పాపములను తొలగించడానికి ఉత్తరమున ఉన్న గంగ దక్షిణమునకు వచ్చి కృష్ణ పేరుతో అక్కడ ప్రవహించింది కాబట్టి దానిని ‘పాతాళ గంగ అని పిలుస్తారు. ఆలయ ప్రాంగణంలో పంచపాండవులు అరణ్యవాసం చేసేటప్పుడు శ్రీశైలంలో ప్రతిష్ఠ చేసిన లింగములు అయిదు ఉంటాయి. దేవాలయంలో తూర్పున కృష్ణ దేవరాయలు నిర్మించిన గోపురం దక్షిణమున హరిహర రాయలవారు నిర్మించిన గోపురములు కనపడతాయి. ఆ ఆలయ ప్రాంగణంలోనే మేడి, జువ్వి, రావి – ఈ మూడూ కలిసి పెరిగిన త్రిఫలవృక్షమని ఒక పెద్ద వృక్షం ఉంటుంది. ఆ చెట్టు నాలుగు వేల సంవత్సరములు. అక్కడికి సమీపంలోనే వృద్ధ మల్లికార్జునుడు ఉంటాడు. ఆ వెనుక రాజరాజేశ్వరీ దేవాలయం. సమీపంలో భ్రమరాంబ అమ్మవారి త్రిఫల వృక్షం ఉంటాయి. ఉత్తరమున శివాజీ గోపురం, కళ్యాణమంటపం, నందనవనం అనే పుష్పవాటిక ఉంటాయి. ఆ వనంలో సుబ్రహ్మణ్య స్వామి నెమలితో ఉంటారు.

శివాజీ మహారాజు అక్కడికి వెళ్లి అమ్మవారి ప్రార్థన చేశాడు. ఆ దృశ్యం శివాజీ గోపురం మీద ఇప్పటికీ చెక్కబడి ఉంటుంది. భవానీమాత ప్రత్యక్షమై ‘ఈ చంద్రహాసమును చేత పట్టుకో నీకు ఎదురు లేదు’ అని అనుగ్రహించి శివాజీకి చంద్రహాసమును బహూకరించింది. ఆ కత్తి పట్టుకునే మహానుభావుడు హిందూ ధర్మ సామ్రాజ్యమును స్థాపించాడు. అంత గొప్ప క్షేత్రం శ్రీశైల క్షేత్రం.




శ్రీ దక్షిణామూర్తి అష్టకం-

 *శ్రీ ఆదిశంకరాచార్యుల  విరచితం  శ్రీ దక్షిణామూర్తి అష్టకం- తాత్పర్యము*



*౧. విశ్వందర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం పశ్యన్నాత్మని మాయయా బహిరివోద్భూతంయధానిద్రయా యస్సాక్షాత్కురుతేప్రభోధసమయే స్వాత్మానమే వాద్వయం తస్మై శ్రీగురు మూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే!!*


*ఈ విశ్వము అద్దములో కనిపించే ప్రతిబింబము వంటిది. నిజమే బ్రహ్మము. బ్రహ్మమునకు రెండవది లేదు. మనస్సు, ఇంద్రియములు, బుద్ధి కేవలం ఆత్మ యొక్క ప్రతిబింబమును మాత్రమే గ్రహించ గలుగుతున్నవి. స్వయం ప్రకాశము (సాక్షాత్కారము) పొందిన పిమ్మటే ఆత్మ, బ్రహ్మ యొక్క గోచరమగును. ఈ సాక్షాత్కారమునకై శ్రీ గురు స్వరూపుడైన దక్షిణామూర్తికి నా నమస్కారములు.*



*౨. బీజస్యాంతతి వాంకురో జగదితం ప్రాఙ్నర్వికల్పం పునః మాయాకల్పిత దేశకాలకలనా వైచిత్రచిత్రీకృతం మాయావీవ విజృంభ త్యపి మయా  యోగేవయః స్వేచ్ఛయా తస్మై శ్రీగురు మూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే!!*


*వృక్షము మొలచుటకు ముందు బీజరూపమున నిక్షిప్తమై ఉన్నట్టు, ఈ విశ్వము కూడా తనయందు అటులనే కలిగిన ఆయనకు, తన మాయచే, యోగుల వంటి సంకల్పముచే విశ్వమును అనేక రూపములలో సృష్టించిన, శ్రీ గురు స్వరూపుడైన ఆ దక్షిణామూర్తికి నా నమస్కారములు.*



*౩. యస్యైవ స్ఫురణం సదాత్మకం అసత్కల్పా ర్థకం భాసతే సాక్షాత్తత్వమసీతి వేదవచసాయో బోధయత్యాశ్రితాన్ యస్సాక్షాత్కరణాద్భవేన్నపురనావృత్తిర్భవాంభోనిధౌ  తస్మై శ్రీగురు మూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే!!*


*ఎవరి ప్రకాశముచే ఈ మాయా ప్రపంచము నిజముగా కనిపిస్తున్నదో, ఆయన, ఆత్మ జ్ఞానము పొంద గోరు వారికి వేదముల సారము (తత్త్వమసి) ద్వారా పరబ్రహ్మ తత్త్వమును బోధిస్తున్నాడు. ఈ సంసార సాగరాన్ని అంతము చేసే, శ్రీ గురు స్వరూపుడైన ఆ దక్షిణామూర్తికి నా నమస్కారములు.*



*౪. నానాచ్ఛిద్ర ఘటోదర స్థిత మహాదీప ప్రభాభాస్వరం జ్ఞానం యస్యతు చక్షురాదికరణ ద్వారా బహిస్పందతే జానామీతి తమేవ భాంతమనుభాత్యేతత్సమస్తంజగత్ తస్మై శ్రీ గురు మూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే!!*


*ఎవరి ప్రకాశము ఇంద్రియముల ద్వారా కుండలో ఉన్న వెలుగు దాని రంధ్రముల ద్వారా వెలువడినట్లు వెలువడునో, ఎవరి జ్ఞానము వల్లనే నేనే బ్రహ్మ అను జ్ఞానము కలుగునో, ఎవరి ప్రకాశము వలన విశ్వమంతా ప్రకాశించునో, శ్రీ గురు స్వరూపుడైన ఆ దక్షిణామూర్తికి నా నమస్కారములు.*



*౫. దేహం ప్రాణమపీంద్రియాణ్యపి చలాం బుద్ధించశూన్యం విదుః స్త్రీ బాలాంధ జడోపమాస్త్వహ మితి భ్రాంతాభృశం వాదినః మాయాశక్తి విలాస కల్పిత మహావ్యామోహ సంహారిణే తస్మైశ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే!!*


*కొంత మంది తత్త్వవేత్తలు శరీరము, ఇంద్రియములు, ప్రాణము, శ్వాస మరియు శూన్యమును ఆత్మగా వాదిస్తున్నారు. అది జ్ఞానము లేని స్త్రీలు, పిల్లలు, గుడ్డివారు, బలహీనుల వాదన కన్నా లోకువైనది. మాయ వలన కలిగే భ్రాంతిని తొలగించి సత్యమును తెలియచేసే, శ్రీ గురు స్వరూపుడైన ఆ దక్షిణామూర్తికి నా నమస్కారములు.*



*౬. రాహుగ్రస్త దివాకరేందు సదృశో మాయా సమాచ్ఛాదనాత్ సన్మాత్రః కరణోప సంహరణతో యో భూత్సుషుప్తః పుమాన్ ప్రాగస్వాప్సమితి ప్రభోద సమయే యః ప్రత్యభిజ్ఞాయతే తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే!!*


*రాహువు వలన గ్రహణ సమయమున కాంతి తగ్గినట్టు కనిపించినా, సూర్య తేజము ఎల్లప్పుడూ అంతే ప్రకాశముగా యుండును. అటులనే, బుద్ధి యొక్క పూర్ణ శక్తి తన శక్తిని కోల్పోకుండా, కేవలము నిద్రావస్థ యందు నిద్రాణమై యుండును. ఇదే విధముగా, ఆత్మ ప్రకాశము కేవలం మాయచే కప్పబడి యుండును. ఎలాగైతే నిద్రనుండి మేల్కొనిన వ్యక్తి తాను అంతకు ముందు నిద్రలో యున్నాను, మరియు ఆ నిద్రలోని స్వప్నములు నిజము కావని గ్రహిస్తాడో, అలాగే, ఆత్మ ప్రకాశము పొందిన వ్యక్తి తన అంతకు మునుపటి అజ్ఞాన స్థితిని అసత్యముగా గ్రహిస్తాడు. ఎవరి అనుగ్రహము వలన ఈ ఆత్మ ప్రకాశము కలుగునో, శ్రీ గురు స్వరూపుడైన ఆ దక్షిణామూర్తికి నా నమస్కారములు.*



*౭. బాల్యాదిష్వపి జాగ్రదాదిషు తథాసర్వా స్వవస్థాస్వపి వ్యావృత్తా స్వను వర్తమాన మహమి త్యంతస్స్ఫురంతంసదా స్వాత్మానం ప్రకటికరోతిభజతాంయోముద్రయా భద్రయా తస్మైశ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే!!* 


*ఎవరి ఉనికి అయితే దేహము, బుద్ధి యొక్క వివిధ అవస్థల (దేహమునకు బాల్యం, యౌవనం, వృద్ధాప్యం; బుద్ధికి జాగ్రత్, చేతన, సుషుప్తా మొదలగునవి) వచ్చే మార్పులకు అతీతంగా ఉండునో, జ్ఞాన ముద్ర (అభయ హస్తమున బొటన వేలు, చూపుడు వేలు కలిపిన ముద్రను జ్ఞాన ముద్ర అంటారు) ద్వారా ఆత్మ జ్ఞానమును కలుగ జేసే, శ్రీ గురు స్వరూపుడైన ఆ దక్షిణామూర్తికి నా నమస్కారములు.*



*౮. విశ్వం పశ్యతి కార్యకారణతయా స్వస్వామిసంబంధతః శిష్యచార్యతయా తథైవ పిత్ర పుత్రాద్యాత్మనా భేదతాః స్వస్నే జాగ్రతి వాయు ఏష పురుషో మయా పరిభ్రామితః తస్మైశ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే!!* 


*ఎవరి మాయ వలన ఈప్రపంచమున చేతన, స్వప్నావస్థల యందు అనేక రూపముల అనుభూతి కలుగుతున్నదో (గురువు, శిష్యుడు, తండ్రి కొడుకు మొదలగునవి), శ్రీ గురు స్వరూపుడైన ఆ దక్షిణామూర్తికి నా నమస్కారములు.*



*౯. భూరంభాం స్యనలోనిలోబర మహర్నాధోపిమాంశుః పుమాన్ నిత్యభాతి చరాచరాత్మక మిదం యస్మైచ మూర్త్యష్టకం నాన్యత్కించ నవిద్యతే విమృశతాంయస్మాతత్పర స్వాదిభో తస్మై గిరి మూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే!!* 


*ఎవరి సూక్ష్మ, అష్ట పరిణామములు (రూపాంతరములు) ఈ చరాచారమును సృష్టించుచున్నవో, ఎవరి అనుగ్రహము వలన ఈ సృష్టులు అన్ని అంతర్ధానమై ఆత్మయే బ్రహ్మము అను సత్యమును తెలుపబడుతున్నదో, శ్రీ గురు స్వరూపుడైన ఆ దక్షిణామూర్తికి నా నమస్కారములు.*



*౧౦. సర్వాత్వమితి స్ఫుటీకృత మిదం యస్మాదముష్మిన్ స్తవే తేనాస్వ శ్రవణాత్త దర్థ మననా ద్ధ్యానా చ్ఛ సంకీర్తనాత్  సర్వాత్మత్వ మహావిభూతి సహితం స్వాదీశ్వత్వం స్వతః సిద్ధేత్తత్పురష్టధా పరిణతం చైశ్వర్య మవ్యాహతమ్!!*


*ఈ స్తోత్రము ఆత్మ యొక్క సర్వ వ్యాపకా తత్త్వమును తెలుపుచున్నది. దీని మననము, పఠనం, ధ్యానము వలన శిష్యుడు ఆత్మ సంయోగం చెంది, ఈ విశ్వము, ఆత్మ యొక్క ఏకత్వమును తెలుసుకొని ఎనిమిది పరిణామముల సారమగును. సంసార బంధములు, జనన మరణ ఋణములు తొలగించే, వట వృక్షము కింద ఆసీనుడై యోగులకు, మునులకు జ్ఞానోపదేశము చేసే వానిగా ధ్యానించ బడే, త్రిలోక వంద్యుడైన శ్రీ దక్షిణామూర్తికి నా నమస్కారములు.*


🕉🕉🕉🕉🕉🕉

సాక్షాత్తు నారాయణులే కార్తిక శుద్ధ ఏకాదశి

 *🙏🌹కార్తిక శుద్ధ ఏకాదశి విశిష్టత🌹🙏*


కార్తిక శుద్ధ ఏకాదశిని పరివర్తన ఏకాదశిగా వ్యవహరిస్తారు. దామోదర ఏకాదశి, మోక్షప్రద ఏకాదశి అని కూడా పేరు. ఆషాఢ శుద్ధ ఏకాదశికి చాతుర్మాస్య వ్రతం ప్రారంభమైతే కార్తిక శుద్ధ ఏకాదశికి ముగుస్తుంది. ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు శ్రీమన్నారాయణుడు యోగనిద్రలో శయనించును. కార్తిక శుద్ధ ఏకాదశినాడు మరోపక్కకు తిరుగును కావున దీనికి పరివర్తన ఏకాదశి అని పేరు. శ్రీరంగాది క్షేత్రములు, కావేర్యాది నదులు స్వామికి అభిముఖంగా ఉంటాయి. కృష్ణ, గోదావరి, తుంగభద్ర, కృతమూల, పయోద అనే నదులు స్వామికి పుష్టభాగంలో ఉంటాయి. అధర్మం నశించాలనుకునేవారు కార్తిక శుద్ధ ఏకాదశి అనంతరం కృష్ణ, గోదావరి నదులలో స్నానం ఆచరించాలి స్వామి కటాక్షం, మోక్షం కావాలనుకునే వారు గంగా, కావేర్యాది నదులలో స్నానమాచరించాలని విష్ణుధర్మం ద్వారా తెలుస్తోంది. కార్తిక శుద్ధ ఏకాదశినాడు నదీ స్నానం చేసి ఉపవసించి తులసీ, ధాత్రీలను యధాశక్తి ఆరాధించి అభీష్టమును పొందవచ్చును.


తులసీదళ లక్షేణ కార్తికే యో అర్చయేత్‌ హరిం |

పత్రే పత్రే మునిశ్రేష్ఠా మౌక్తికం లభతే ఫలం ||


కార్తిక శుద్ధ ఏకాదశినాడు కేశవునికి లక్షతులసీ పూజార్చన చేసినచో ప్రతీ తులసీదళంలో ముక్తి లభిస్తుంది. ఎన్ని తులసీదళాలతో అర్చన చేస్తే అన్ని కోట్ల ముత్యాలు లభిస్తాయి. ముత్యాలు అనగా మోక్షలక్షణాలు అని అర్థం.


కార్తికమాసంలో ప్రత్యేకించి ఈ ఏకాదశి నాడు ధాత్రీ(ఉసిరి) వృక్షాన్ని పూజించాలి. ఈనాడు ఉసిరి చెట్టు కింద కూర్చుని నారాయణ నామాన్ని జపించిన ఒక నామం కోటి నామాలతో సమానం.


కార్తికే శిత ఏకాదస్యాం నరో నియత మానస:

ధాత్రీ మూలే హరేర్నామ జపేం ముక్తి మవాప్నుయాత్‌

ఏకైకస్మిన్‌ తధా నామ్ని కోటి నామ ఫలం లభేత్‌


ఈ ఏకాదశినాడు సూర్యోదయానికి పూర్వమే స్నానం ఆచరించి అర్ఘ్యప్రదానం చేసి శ్రీహరి నామం జపించి భక్త జనులతో కలసి ధాత్రీ, తులసీ వృక్షములను పూజించి వాటి సమీపాన పగలు,రాత్రి హరి నామ సంకీర్తన చేసినవారికి పునర్జన్మ ఉండదు. కార్తికమాసంలో ప్రత్యేకించి శుద్ధ ఏకాదశి, ద్వాదశి, పౌర్ణిమ నాడు ఉసరి రసాన్ని ఒంటికి రాసుకుని స్నానమాచరించేవారికి వారి పితృదేవతలందరికీ శ్రీమన్నారాయణుడు వెంటనే మోక్షము ప్రసాదించును. ”ధాత్రి ఫల కృతాహార: నరోనారయణో భవేత్‌||”


అనగా కార్తిక మాసమంతా కేవలము ఉసిరిఫలమును ఆహారముగా తీసుకొను వారు సాక్షాత్తు నారాయణులే అయ్యెదరని శ్లోకార్థం.

కార్తీకపురాణం - 9 వ అధ్యాయము

 🌸🫐🌸🫐🌸🫐🌸🫐🌸



_*కార్తీకపురాణం -  9 వ అధ్యాయము*_



🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉



*విష్ణు పార్షద , యమ దూతల వివాదము*


☘☘☘☘☘☘☘☘☘


*'ఓ యమ దూత లారా ! మేము విష్ణు దూతలము వైకుంటము నుండి వచ్చితిమి. మీ ప్రభువగు యమ ధర్మరాజు యెటువంటి పాపాత్ములను తీసుకొని రమ్మని మిమ్ములను పంపెను'యని ప్రశ్నిచిరి. అందుకు జవాబుగా యమదూతలు ' విష్ణు దూత లారా ! మానవుడు చేయు పాపపున్యడులను సూర్యుడు , చంద్రుడు , భూదేవి , ఆకాశము , ధనంజయాది వాయువులు , రాత్రింబవళ్లు  సంధ్య కలం సాక్షులుగా వుండి ప్రతి దినం మా ప్రభువు కడకు వచ్చి విన్నవించు చుందురు. మా ప్రభువుల వారీ కార్య కలాపములను చిత్ర గుప్తునిచే చూపించి ఆ మనిజుని అవసాన కాలమున మమ్ము పంపి వారిని రప్పించెదరు. పాపులెటువంటి వారో వినుడు.  వేదోక్త సదాచారములు విడిచి వేద శాస్త్రములు నిందించు వారును , గోహత్య , బ్రహ్మ హత్యాది మహాపపములు చేసినవారు , పర స్త్రీ లను కామించిన వారును , పరాన్న భుక్కులు , తల్లిదండ్రులను - గురువులను - బంధువులను - కుల వృతిని తిట్టి హింసించు వారున్నూ , జీవ హింస చేయు వారున్నూ దొంగ పద్దులతో వడ్డీలు పెంచి ప్రజలను పిడించు వారును , జారత్వం చొరత్వంచే భ్రష్టులగు వారును , యితరుల ఆస్తిని స్వాహా చేయు వారును , చేసిన మేలు మరచిన కృతఘ్నులును , పెండిండ్లు శుభ కార్యములు జరగనివ్వక అడ్డుతగిలే వారునూ పాపాత్ములు. 


వారు మరణించగానే తన కడకు తీసుకువచ్చి నరకమందు పడద్రోసి దండింపుడని మా యమధర్మరాజు గారి యాజ్ఞ. అది అటులుండగా ఈ అజా మీళుడు బ్రాహ్మణుడై పుట్టి దురచారములకు లోనై కుల భ్రష్టుడై జీవ హింసలు చేసి , కామాంధుడై వావివరసలు లేక , సంచరించిన పాపాత్ముడు. వీనిని విష్ణు లోకమునకు యెట్లు తీసుకొని పోవుదురు ? ' అని యడగగా విష్ణు దూతలు ' ఓ యమ కింకరులారా ! మీరెంత యవివేకులు ? మీకు ధర్మ సుక్ష్మములు తెలియవు. ధర్మ సుక్ష్మములు లేట్టివో చెప్పెదము వినుడు. సజ్జనులతో సహవాసము చేయువారును , జపదాన ధర్మములు చేయువారును - అన్నదానము , కన్యాదానము , గోదానము , సాలగ్రామ దానము చేయువారును , అనాధ ప్రేత సంస్కాములు చేయువారును , తులసి వనము పెంచువారును , తటాకములు త్రవించువారును , శివ కేశవులను పూజించు వారును సదా హరి నామ స్మరణ చేయువారును మరణ కాలమందు *' నారాయణా'* యని శ్రీ హరిణి గాని , *' శివ '* అని శివుని గాని స్మరించు వారును , తెలిసిగాని తెలుయక గాని మరే రూపమున గాని హరి నామస్మరణ చెవిన బడిన వారును పుణ్యాత్ములు ! కాబట్టి అజా మీళుడు ఎంత పాపత్ముడైనాను మరణకాలమున *"నారాయణా"* అని పలికిరి.

అజా మీళుడు విష్ణు దూతల సంభాషణ లాలకించి ఆశ్చర్యమొంది *" ఓ విష్ణు దూతలారా ! పుట్టిన నాటి నుండి నేటి వరకు శ్రీ మన్నారాయణ పుజగాని వ్రతములు గాని , ధర్మములుగాని చేసి యెరుగను. నవ మాసములు మోసి కనిపెంచిన తల్లిదండ్రులకు సహితము ప్రణ మిల్లలేదు. వర్ణాశ్రమములు విడిచి కుల భ్రష్టుడనై , నీచకుల కాంతలతో సంసారము చేసితిని. నా కుమారుని యందున్న ప్రేమచో *"నారాయణా"* యని నంత మాత్రమున నన్ను ఘోర నరక భాదలనుండి రక్షించి వైకుంఠమునకు తీసుకొని పోవుచున్నారు. ఆహా ! నేనెంత అదృష్టవంతుడను ! నా పూర్వ జన్మ సుకృతము , నా తల్లి తండ్రుల పుణ్య ఫలమే నన్ను రక్షించినది. " అని పలుకుచు సంతోషముగా విమాన మెక్కి వైకుంఠమున కేగెను. కావున ఓ జనక చక్రవర్తీ ! తెలిసిగాని , తెలియక గాని నిప్పును ముట్టిన నెట్టుల బొబ్బలేక్కి భాద , కలిగించునో , అటులనే శ్రీ హరినామం స్మరించిన యెడల సకల పాపములును నశించి మోక్షము నోన్దేదరు. ఇది ముమ్మాటికినీ నిజము.


*ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహాత్య మందలి*

*నవమద్యయము- తొమ్మిదవ రోజు పారాయణము సమాప్తము.*


🌸🫐🌸🫐🌸🫐🌸🫐🌸