4, మే 2021, మంగళవారం

మొగలిచెర్ల

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర...

 

*మొగలిచెర్ల ప్రయాణం..శరీర గంథం..*


*(పదిహేడవ రోజు)*


శ్రీ స్వామివారు ఇంత హఠాత్తుగా మొగలిచెర్ల కు బైలుదేరుతారని ఊహించలేకపోయిన శ్రీధరరావు దంపతుల మనసులోని భావాలను పసికట్టినట్లు..శ్రీ స్వామివారు ప్రభావతి గారివైపు తిరిగి..


"అమ్మా!..నీ మనసులో అనేక సందేహాలున్నాయి..క్రమంగా అన్నీ తీరిపోతాయి..నన్ను మొదటి సారి చూసినప్పుడే "నాయనా" అని పిలిచావు..ఆ క్షణం లోనే నువ్వు నా దృష్టిలో నాకు తల్లిగా మారిపోయావు..ఆ పార్వతీదేవి తన ఒడిలో ఇంతకాలం నాకు చోటిచ్చి..కన్నబిడ్డలా కాపాడింది..ఇక ముందు ముందు రోజుల్లో..నువ్వే నాకు తల్లి స్థానం లో వుండబోతున్నావు..నేనూ నీకు బిడ్డనయ్యాను..నీ పెద్దకుమారుడిని అనుకో!..నీ బిడ్డ నీ ఇంటికి రావడానికి ముహూర్తాలు చూడాలా తల్లీ?.." అన్నారు..


"శ్రీఘ్రమేవ సుపుత్రా ప్రాప్తిరస్తు!.." అన్న శ్రీమతి విక్రాల శ్రీదేవమ్మ గారి ఆశీర్వాదం ప్రభావతి శ్రీధరరావు గార్ల చెవుల్లో ఘంటానాదం లా వినబడింది..ఆ మహాతల్లి దీవెన ఈ నిమిషంలో ఈ స్వామివారి రూపంలో సాక్షాత్కారం అయింది..మాల్యాద్రి లక్ష్మీనృసింహుడి ఆలయంలో ఈ ఉదయం..తమను తాకుతూ వెళ్లిన కాంతిపుంజం ఇదేనేమో.. ఎప్పుడూ లేనిది ఆ నరసింహుడు తృళ్లి తృళ్లి నవ్విన కారణమూ ఇదేనేమో?..అని ప్రభావతి గారు తలపోస్తున్నారు..సరే..కొండంత లక్ష్మీనారసింహుడి ఆదేశం ఇదే అయితే..తమ పూర్వజన్మ సుకృతం వలన ఈ యోగిపుంగవుడు తమకు ఈ వయసులో దొరికిన కుమారుడిగా భావించి తరిద్దామని ఆవిడ నిర్ణయించుకున్నారు..


"అదేమీలేదు నాయనా..యోగులకొరకు ఇప్పటికిప్పుడు ఎటువంటి ఏర్పాట్లు చేయాలో తెలీక సతమతం అవుతున్నాను.." అన్నారు ప్రభావతి గారు.


"దిగంబరిని..సర్వసంగపరిత్యాగిని..నాకు ఏర్పాట్లు ఏముంటాయి తల్లీ..మీ ఇంట్లో ఏ లోటు ఉండదని నాకు తెలుసు..అవధూత లక్షణాలు మీకు కొత్త కదా..అవసరం వచ్చినప్పుడు అన్నీ వివరంగా చెపుతాను..శ్రీధరరావు గారూ కాలాతీతమవుతోంది..ఇక బైలుదేరుదాం.."అన్నారు..


శ్రీధరరావు గారి వెంట ఉన్న వారి పిన్నమ్మ కౌసల్యమ్మ గారు, రమణయ్య గార్లు జరుగుతున్న ఈ తతంగమంతా విస్తుబోయి చూస్తున్నారు..తమతో పాటు ఈ దిగంబర యోగి అదే బండిలో ఎలా కూర్చుని వస్తాడు?..తామెలా సర్దుకోవాలి?..ఈ భార్యాభర్తలు వెఱ్ఱి వెంగళప్పల్లా అన్నిటికీ తలూపుతూ వున్నారే.. తాము సరే..మొగలిచెర్ల గ్రామస్థులు వివిధ రకాలుగా అనుకోరా?..వీళ్ళిద్దరికీ ఆ ఆలోచనే లేదే!..భగవంతుడా..ఇదేం చోద్యం?..అని పరి పరి విధాల మనసులోనే మధనపడుతూ వున్నారు..


మరి, వారి ఆలోచన శ్రీ స్వామివారు గ్రహించారో.. ఏమో..గబుక్కున పార్వతీదేవి మఠం లోపలికి వెళ్లి..ఒక వస్త్రాన్ని మొలచుట్టూ కట్టుకొని, మరొక వస్త్రాన్ని భుజాల మీదుగా చుట్టూరా వేసుకొని..బైటకు వచ్చి కౌసల్యమ్మ గారితో.."ఇప్పుడు సరిపోయిందా?" అన్నారు నవ్వుతూ..కౌసల్యమ్మ గారు నిర్ఘాంతపోయారు..తన మనసులో సందేహం..ఒక్కక్షణం లో పసిగట్టి పరిష్కరించిన శ్రీ స్వామివారి కి నమస్కారం చేశారు..


అందరికంటే ముందుగా శ్రీ స్వామివారే బండిలోకి ఎక్కి కూర్చున్నారు..వారి ప్రక్కన శ్రీధరరావు గారు, ఆయన ప్రక్కన ప్రభావతి గారు, ఇటు చివరన కౌసల్యమ్మ, రమణయ్య గార్లు కూర్చున్నారు..బండి మెల్లిగా మొగలిచెర్ల వైపు బయలుదేరింది..ప్రభావతి గారి మనసులో మరో సందేహం మొదలైంది..ఇంటిదగ్గర తన అత్తగారు..శ్రీధరరావు గారి తల్లి గారున్నారు..పెద్దావిడ వున్నారు..ఇంతకాలం తామిద్దరూ మాట్లాడుకుంటుంటే శ్రీ స్వామివారి గురించి కర్ణాకర్ణిగా వినీవున్నారు.. రెండు మూడు సార్లు తమతో "ఎవరో ఏమిటో తెలుసుకోకుండా అందరినీ నమ్మకండి నాయనా!.."అని సున్నితంగా హెచ్చరించి వున్నారు..మరి ఇప్పుడు ఏకంగా శ్రీ స్వామివారిని ఇంటికే తీసుకొస్తే..ఆ పెద్దావిడ ఏమంటారో?..అని అనుకుంటూ కళ్ళుమూసుకున్నారు..


"అన్నీ సవ్యంగా జరుగుతాయమ్మా.." శ్రీ స్వామివారి కంఠం లోంచి వచ్చిందామాట..ఉలిక్కిపడి కళ్ళు తెరిచారు ప్రభావతి గారు..శ్రీ స్వామివారు ఎటో చూస్తున్నారు.."అన్నీ సవ్యంగానే జరుగుతాయి.."మళ్లీ అదేమాట ఆయన నోటినుంచి వచ్చింది..


ఇంతలో ఒక గాలి తెర శ్రీ స్వామివారు కూర్చున్న వైపునుంచి మిగిలిన వాళ్ళందరినీ తాకుతూ వెళ్ళింది..ఒకరకమైన దుర్గంధం బండి అంతా వ్యాపించింది..అందరూ గబుక్కున తమ ముక్కు మూసుకున్నట్లు చేతులడ్డంపెట్టుకున్నారు..శ్రీధరరావు గారు శ్రీ స్వామివారి వైపు చూసారు.."ఎంత యోగి అయినా..ఈ వాసన ఏమిటి?..ఇలాటి కంపు ఎలా భరిస్తాం?." అని ప్రభావతి గారు అనుకున్నారు..


ఫక్కున నవ్వారు శ్రీ స్వామివారు.."అమ్మా!..వారం రోజులుగా సమాధి నిష్ఠలో వున్నాను..స్నానం కూడా చేయలేదు..అసలు ఆ ధ్యాసే కలగ లేదు..మరి నా శరీరం నుండి దుర్గంధం కాక మరేమోస్తుంది?.." అన్నారు..ఈ సారి దంపతులిద్దరే కాక మిగిలిన వాళ్ళు కూడా ఆశ్చర్యపోయారు..తమ మనసులోని ప్రతి ఆలోచన శ్రీ స్వామివారు గ్రహిస్తున్నారు..ఇంతలో మరో గాలి తెమ్మెర మళ్లీ వీచింది..ఈసారి అత్యంత సుగంధ పరిమళం చుట్టూ వ్యాపించింది.."ఎంత మంచి వాసన!..ఎక్కడిదో!.." అప్రయత్నంగా రమణయ్య గారు పైకి అనేశారు..శ్రీ స్వామివారు తన చేతి వ్రేళ్ళకు పెరిగిన గ్రోళ్లను చూసుకుంటున్నారు..


తమవెంట వస్తున్నది ఎవరో పిచ్చివాడు కాదనీ..సమస్తమూ తెలిసిన ఒకానొక సిద్ధపురుషుడే ఈ దిగంబర యోగి గా మారి, తమను, మొగలిచెర్ల గ్రామాన్ని పునీతం చేయడానికి సాధారణ మానవునిలా మారి తమవెంట వస్తున్నాడని..తమ జన్మ జన్మల పాపాలు ప్రక్షాళన చేయడానికి తమ ఇంట అడుగుబెడుతున్నాడనీ.. ప్రభావతీ శ్రీధరరావు దంపతులకు స్పష్టంగా తెలిసివచ్చింది.."స్వామీ లక్ష్మీ నృసింహా!..నీదే భారం తండ్రీ!..శరణు!!.."అని అనుకున్నారు..


శ్రీ స్వామివారి తో సహా అందరూ మొగలిచెర్ల గ్రామం లోని శ్రీధరరావు గారి ఇంటికి చేరారు..


ఫకీరు మాన్యం..మన్నేరు నది..రేపు..


సర్వం..

శ్రీ దత్తకృప!.


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్ : 523 114..సెల్..94402 66380 & 99089 73699).

Donations for corona

 DO read 

Donations for corona till now.....


 TATA: 1500 crore

 ITC: 150 crore

 Hindustan unilever: 100 crore

 Anil agarwal (vedanta): 100 crore

 Hero cycle: 100 crore

 Bajaj group: 100 crore

 Shirdi temple: 51 crore

 BCCI: 51 crore

 CRPF: 33 crore

 Akshay Kumar, actor: 25 crore

 Sun pharma: 25 crore

 OLA: 20 crore

 Paytm: 5 crore + handwash

 Mukesh ambani: 500 crore + hospital

 Adani Group 500 crore

 Anand Mahindra: Hotels + ventilator

 Prabhas , actor: 4 crore

 Nadella (microsoft): 2 cr.

 Anita dongre: 1.5 crore

 Allu arjun:.  1.25 crore

 Ram charan: 1.40 crore

 Somnath temple trust: 1 crore

 Pawan kalyan, actor: 1 crore

 Mahesh Babu,actor: 1 crore

 Chiranjivi, actor: 1 crore

 Hema Malini, actor: 1 crore

 Bala Krishna, actor:1 crore

 Jr NTR, actor:75 lakhs

 Suresh raina , cricketer: 52 lakhs

 Sachin Tendulkar, cricketer: 52 lakhs

 Sunny deol: 50 lakh

 Kapil sharma: 50 lakh

 Rajnikant: actor :50 lakh

 Sourav ganguli: 50 lakh

Almost all Govt employes : 1-5 days of their salary.

 And many more respected legends, still pouring


 Your favorite companies contribute to the Prime Minister's Disaster Relief Fund to fight the corona virus in India.


 Subway: 00

 Pizza Hut: 00

 Dominos: 00

 McDonald: 00

 Burger King: 00

 Barista: 00

 Barbecue Nation: 00

 KFC: 00

 Flipkart: 00

 Amazon: 00

 Myntra: 00

 Rediff: 00

 Snapdeal: 00

 Hyundai: 00

 Honda:00

 KIA: 00

 Volkswagon:00

 M. Suzuki:00(Surprising)

 BMW: 00

 Audi:00

 Mercedes:00

 

 Do you understand the meaning of Swadeshi? 


Only our family stands beside us in the time of needy But all these days we love to make foreign companies earn. At least after this lock down pls only encourage Indian company products so that our GDP will increase and India will bounce back faster than any other country.


Share this message as much as possible till it reaches every true Indian

Jai Bharat


EYE Opener.

సతీదేహత్యాగము

 _*శ్రీ శివ మహాపురాణం - 75 వ అధ్యాయం*_


🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️


*సతీదేహత్యాగము*


☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️


*నారదుడిట్లు పలికెను -*


శంకరుని పత్నియగు ఆ సతి మౌనమును వహించిన పిదప, అచట జరిగిన వృత్తాంతమెయ్యది? బ్రహ్మా! దానిని ఆదరముతో చెప్పుము.


*బ్రహ్మ ఇట్లు పలికెను -*


సతీదేవి మౌనమును వహించి ప్రసన్నమగు మనస్సు గలదై తన భర్తను ఆదరముతో స్మరించి వెంటనే ఉత్తర దిక్కునందు నేలపై కూర్చుండెను. ఆమె యథావిధిగా జలముతో ఆచనమును చేసి, వస్త్రముతో కప్పుకొని, శుచియై కన్నులను మూసుకొని భర్తను స్మరించి యోగమార్గమును ప్రవేశించెను. స్వచ్ఛమగు ముఖము గల ఆ సతి ప్రాణాపానములను వాయువులను సమానములుగా చేసి, తరువాత ఉదానమును నాభి చక్రము నుండి ప్రయత్నపూర్వకముగా ఉత్థాపనము చేసెను. శంకరునకు ప్రాణములకంటె ప్రియురాలు, దోష విహీనయగు సతీదేవి ఉదానమును బుద్ధితో సహా హృదయమునందు వక్షస్థ్స లమను స్థానము నందుంచి, తరువాత కంఠ మార్గము గుండా కనుబొమల మధ్య లోనికి తీసుకొని వెళ్లెను.


ఆమె ఈ తీరున దక్షునియందలి కోపము వలన తన దేహమును త్యజించ గోరినదై, వెంటనే యోగమార్గము ననుసరించి దేహమునందు వాయువును, అగ్నిని ధరించెను. అపుడు యోగమార్గమునందు లగ్నమైన మనస్సు గల ఆ సతి తన భర్తయొక్క పాదములను ధ్యానిస్తూ ఇతరమును దేనినీ చూడలేదు. ఓ మహర్షీ !వెంటనే కల్మషములు తొలగిపోయి ఆమె దేహము ఆమె కోర్కెకు అనుగుణముగా ఆ అగ్ని చే భస్మము చేయబడి క్రిందబడెను. భూమియందు, ఆకాశమునందు గల దేవతలు మొదలగు వారు ఆ దృశ్యమును చూచి భయమును కలగించె, మిక్కిలి పెద్ద హాహాకారమును చేసిరి. ఆ దృశ్యము అద్భుతముగను, చిత్రముగను ఉండెను.


అయ్యో ! శంభునకు సతీదేవి మిక్కిలి ప్రియురాలు. ఆయన ఆమెను దైవమును వలె ప్రేమించెను. ఆమె మిక్కిలి దుష్టుడగు ఆ దక్షునిచే అవమానింపబడి ఆ కోపముతో ప్రాణములను వీడెను. ఆశ్చర్యము !చరాచర ప్రపంచము సంతానముగా గలవాడు, బ్రహ్మగారి కుమారుడు అగు ఈ దక్షుని అతిశయించిన దుష్టత్వమును పరికించును. అయ్యో! మానవతి, వృషధ్వజునకు ప్రియురాలు, సత్పురుషులచే సర్వదా సన్మానమునకు అర్హురాలు అగు ఆ సతీదేవి ఈనాడు మిక్కిలి మానసిక దుఃఖమునకు గురి అయెను. దుష్ట హృదయుడు, పరబ్రహ్మయగు శివుని ద్వేషించువాడు అగు ఆ దక్ష ప్రజాపతి సమస్త లోకములలో పెద్ద అపకీర్తిని పొందగలడు.


ఏలయనగా,శంభుని ద్వేషించు ఆ దక్షుడు తన దేహమునుండి పుట్టిన కుమార్తె ప్రయాణమై రాగా అవమానించినాడు. ఆతడు మరణించిన మహానరకము ననుభవించగలడు. దీనిలో మన అపరాధము కూడా గలదు. సతీదేవి ప్రాణములను వీడుట అను అద్భుత దృశ్యమును గాంచిన జనులు ఇట్లు పలుకుచుండగా, వెనువెంటనే శివగణములు క్రోధముతో ఆయుధములను పైకి ఎత్తి లేచి నిలబడిరి. ద్వారమునందు అరవై వేల గణములు నిలబడియుండిరి. శంకర ప్రభుని సేవకులగు వారు మహాబలశాలురు. వారు క్రోధముతో మండిపడిరి. 'మాకు నిందయగు గాక !అని' పలుకుచూ, వీరులగు శివగణ నాయకులందరు పెద్ద స్వరముతో అనేక పర్యాయములు హాహాకారములను చేసిరి.


ఆ పెద్ద హాహాకారముతో దిక్కులన్నియు పిక్కటిల్లెను. అచట నున్న దేవతలు, మునులు, ఇతరులు అందరు భయమును పొందిరి. ఆ గణములన్నియూ కోపించి, ఆయుధములను పైకెత్తి, పరస్పరము సంప్రదించుకొని, ప్రలయమును సృష్టించనారంభించిరి. వారు చేయు వాద్య ధ్వనులతోనే గాక, వారి శస్త్రములచే దిక్కులు నిండెను. ఓ దేవర్షీ !అచట కొందరు గణములు దుఃఖముచే వ్యాకులులై, ప్రాణములను తీసే మిక్కిలి పదునైన ఆయుధములతో తమ శిరస్సులను, ముఖములను, ఇతరు అవయవములను ఖండించు కొనిరి. ఈ విధముగా ఆ సమయమునందు ఇరువది వేల గణములు దక్షపుత్రితో బాటు ప్రాణములను వీడిరి. ఆ దృశ్యము అత్యాశ్చర్యమును కలిగించెను.


ఇట్లు నశించగా మిగిలిన, మహాత్ముడగు శంకరుని గణములు ఆయుధములను పైకెత్తి కోపించియున్న ఆ దక్షుని సంహరించుటకు ముందునకురికిరి. ఓ మహర్షీ !ఉరుకుచున్న వారి వేగమును విని భృగు మహర్షి యజ్ఞనాశకులగు రాక్షసులను సంహరించే యజుర్వేదమంత్రముతో దక్షిణాగ్ని యందు హోమమును చేసేను. భృగువు హోమమును చేసిన వెంటనే మహావీరులు, ఋభునామము గలవారు నగు గొప్ప దేవతలు ఆ అగ్ని నుండి పైకివేలాదిగా లేచిరి. ఓ మహర్షీ! ప్రమథగణములకు, కాగడాలను ఆయుధములుగా ధరించిన ఆ దేవతలకు అచట మిక్కిలి బీభత్సమును కలిగించునది, వినువారికి రోమహర్షణమును కలుగుజేయునది అగు యుద్ధము జరిగెను. బ్రహ్మతేజస్సుతో నిండియున్న మహావీరులగు ఆ బు భువులు అన్నివైపుల నుండి ప్రమథ గణములపై దాడి చేయగా, వారి తిరుగు ప్రయాణము వారి యత్నము లేకుండగానే సిద్ధించినది.


ఈ విధముగా శివుని మహాశక్తియుతమగు ఇచ్ఛచే ఆఋభువులు శివగణములను కొట్టి వేగముగా తరిమివేసిరి. ఆ దృశ్యము అద్భుతముగ నుండెను. అపుడా దృశ్యమును చూచి, ఋషులు, ఇంద్రుడు మొదలగు దోవతలు, మరుద్గణములు, విశ్వే దేవతలు, అశ్వినీ దేవతలు, లోకపాలురు మిన్నకుండిరి. వారిలో కొందరు విష్ణుప్రభుని చుట్టూ చేరి ప్రార్థించుచుండిరి. మరికొందరు యజ్ఞము విఘ్నము లేకుండగా జరుగు విధమును ఉద్వేగముతో పునః పునః సమాలోచన చేయుచుండిరి.


గొప్ప బుద్ధిశాలురగు విష్ణువు మొదలగు దేవతలు సతీ దేహత్యాగమునకు, శివగణములను తరిమివేయుటకు భవిష్యత్తులో కలుగుబోవు ఫలమును గూర్చి బాగుగా విచారించి తీవ్రమైన ఆదుర్దాను పొందిరి. ఓ మహర్షీ ! దుష్ట బ్రాహ్మణుడు, శివద్రోహి, దుర్మార్గుడునగు దక్షుని యజ్ఞములో అపుడీవిధమైన విఘ్నము ఘటిల్లెను.


*శ్రీ శివ మహాపురాణములో రెండవదియగు రుద్ర సంహితయందు రెండవదియగు సతీఖండములో సతీదేహత్యాగమనే ముప్పదియవ అధ్యాయము ముగిసినది.*