12, ఏప్రిల్ 2024, శుక్రవారం

మౌనం - శక్తిసామర్థ్యాలు

 *మౌనం - శక్తిసామర్థ్యాలు*


 మౌనం అనేది దైవభాష. లిపి లేని విశ్వభాష. ధార్మిక దివ్యత్వానికి ద్వారం. సనాతన భాషా స్రవంతి. మౌనమంటే మాట్లాడక పోవడం కాదు, మూగగా ఉండి సంజ్ఞలు లేదా వ్రాతలు ద్వారా మన భావనలను వ్యక్తపరచడం కాదు. నిశ్శబ్ధంగా ఆలోచించడం కాదు, వాక్కుని నిరోధించి మనస్సుతో భాషించడం కాదు.  


 *మౌనమంటే - అంతరింద్రియ విజ్రుంభణను ఆపడం.*

 (మనో, బుద్ధి, చిత్త, అహములతో కూడిన అంతఃకరణములను అంతరింద్రియమంటారు.) 


 మౌనమంటే - ఆలోచనలు, ఆవేదనలు, ఆక్రోశములు, భ్రాంతులు, వాంఛలు, వాక్కులు లేకుండా మనల్ని మనం స్పష్టంగా చూసుకోవడం. ఆత్మయందు పూర్ణమైన ఏకాగ్రత కలిగియుండడమే మౌనం. 


 మౌనమంటే - నిరంతర భాషణ. చింత, చింతన లేని తపస్సు. అఖండ ఆనందపు ఆత్మస్థితి. విషయశూన్యావస్థ. 


*యోగస్య ప్రధమం ద్వారం వాజ్నిరోధః* 

అన్నారు శ్రీ శంకరులు. 


 మౌనమే దివ్యత్వ దర్శనమునకు ద్వారం. అదే సర్వానికి మూలం. అదే మహార్ణవం. సర్వస్వమూ అందులోనుంచే మొదలై, తిరిగి అందులోనే లీనమౌతుంది. 


 *పాపాల పరిహారార్ధం నిర్దేశింపబడిన ఐదు శాంతులలో (ఉపవాసం, జపం, మౌనం, పశ్చత్తాపం, శాంతి) మౌనం ఒకటి. అహం వృత్తి ఏమాత్రం ఉదయించనట్టి స్థితినే మౌనం అంటారు.*


 *ఈ మౌనం మూడు రకాలు.*


*1. వాజ్మౌనం : 

 వాక్కుని నిరోదించడం. ఈ రకమైన మౌనం వలన కటువుగా మాట్లాడుట, అసత్యమాడుట, పరనింద చేయుట, చాడీలు చెప్పుట, అసందర్భ వ్యర్ధ ప్రలాపములు చేయుట... అనే వాగ్దోషాలు హరింపబడతాయి.ఆదిత్యయోగీ..


*2. అక్షమౌనం :

 కరచరణాది నేత్రేంద్రియములతో సంజ్ఞ చూపక ఏకాగ్రనిష్టలో ఉండుట. ఈ మౌనం వలన ఇంద్రియాల నియంత్రణ ద్వారా ధ్యాన వైరాగ్యాలు బాగా అలవడుతాయి. 


*3. కాష్ఠ మౌనం :

 దీనిని మానసిక మౌనం అంటారు. మౌన ధారణలో అనేక మార్గాలలో పయనించే మనస్సుని దైవచింతన, ఆత్మానుస్వరూప సంధానమగు నిష్టలో పెట్టి క్రమేణా పరిపూర్ణమౌనస్థితికి రావడాన్ని కాష్ఠమౌనం అంటారు. ఈ మౌనం వలనే ఆత్మసాక్షాత్కారం అవుతుంది. దీనినే 40 సంవత్సరములు మౌనదీక్షలో గడిపిన శ్రీ మెహర్ బాబా గారు ఇలా తెలిపారు - 


*'గొంతు మౌనంగా వున్నప్పుడు మనస్సు మాట్లాడుతుంది. మనస్సు మౌనంగా ఉన్నప్పుడు హృదయం మాట్లాడుతుంది. హృదయం మౌనమైనప్పుడు అంతరాత్మ అనుభూతిస్తుంది'.* 


 *మౌనం* 


 *దక్షిణామూర్తి మౌనం సత్యబోధ.* 

 *గురువు మౌనం జ్ఞానానుగ్రహం.* 

*జ్ఞాని మౌనం నిశ్శబ్ధ భాషణ.* 

 *భక్తుని మౌనం మాటల్లేని ప్రార్ధన.* 


 ఆధ్యాత్మిక సాధనకు మౌనమే అలవాలం. సాధనలో మనస్సు మాట అణగాలి. అంతఃకరణశుద్ధి జరగాలి. అప్పుడే, అక్కడే 'మౌనం' ప్రారంభమౌతుంది. ఈ మౌనం నుండియే జ్ఞానం ఉదయిస్తుంది. మౌనానుభూతే అసలైన పరిపూర్ణ జ్ఞానం. ఈ జ్ఞానమే ముక్తిని ప్రసాదిస్తుంది. మౌనం అంతరంగాన్ని ప్రబోధిస్తుంది, అంతర్ముఖ పయనం చేయిస్తుంది. అంతర్యామిని దర్శింపజేస్తుంది. మన అంతరాత్మని మన ముందు ఆవిష్కరిస్తుంది. ఆత్మసాక్షాత్కారం కావిస్తుంది. 


*మౌనమంటే పదాల ప్రతిబంధకాల్లేని నిశ్శబ్ధ సంభాషణ* -  అని శ్రీ రమణులు అంటారు. 


 మౌనం అన్నింటికంటే అతీతమైన సమర్ధవంతమైన భాష. అనేక సంవత్సరములు చర్యల ద్వారా దేనిని తెలుసుకోలేరో దానిని మౌనం ద్వారా తెలుసుకోగలరు. మాటలకు ఆటుపోట్లు ఉంటాయి కానీ మౌనం నిర్మలంగా నిదానంగా నిలకడగా ప్రవహించే జ్ఞాన స్రవంతి. మనోవాక్కాయ కర్మలను స్వాధీనం చేసుకొని సత్యంగాను, శాంతంగాను, భూతహితంగాను, మితంగాను, కరుణాన్వితంగాను, ఆత్మభావంతోను మాట్లాడువారిని సదా మహామౌనులే అని మహాత్ములు పేర్కొంటారు. 


*పలుకుల కందక భావమునంటక భాసిలు బ్రహ్మము దానగుచుం* 

*బలుమరు బల్కగ పల్కినచో నవి పల్కితినంచు దలంపక యే* 

*తలపులు లేక నిరంతర సౌఖ్యసుధారస మానుచు నుండుట ని* 

*ర్మలమగు మౌనము మారుత నందన! మానక దీవి భజింపదగున్.* 

(శ్రీ సీతారామాంజనేయ సంవాదం.) 


 ఓ వాయుపుత్రా! అవాజ్మానసగోచరమైన బ్రహ్మమే స్వరూపభూతమైనదని నిశ్చయించి యెప్పటికైనను ఏ మాటలనైనను మాటలాడక యోగి సదా యాత్మానుభవనిష్ఠుడై యుండును. ఒకవేళ మాట్లాడినను 'నేను మాట్లాడితిని' అని తలంపడు. ఇంత యేల? అతనికి సంకల్పములే ఉండవు. ఇట్టి స్థితిగలిగి సర్వకాలములయందును స్వస్వరూపానందానుభావమును చెందుచుండుటయే మౌనం. 


*'మౌనవాఖ్యా ప్రకటిత పరబ్రహ్మత్వం'* 


 వాక్కునకు మనస్సునకు అందని పరమాత్మతత్త్వం మౌనం ద్వారానే ప్రకటింపబడుతుంది. 


 *భగవంతుడు ఒక వ్యక్తి కాదు, రూపం కాదు. భగవంతుడు అంటే ఓ తత్త్వం, ఓ సత్యం. దీనిని మౌనం ద్వారానే స్మృశించి గ్రహించగలం. మౌనం మాత్రమే శబ్ధ ప్రపంచం కంటే అందమైనది, అర్ధవంతమైనది, అత్యుత్తమైనది, అద్భుతమైనది. మౌనమే సత్యం, శివం, సుందరం. ఇదే అఖండానందం. ఇదే ఆత్మసాక్షాత్కారం, ఇదే మోక్షం.*

.

*అయిదూ నీలోనే అదుపు నీతోనే!*


 *నేల, నీరు, నిప్పు, గాలి, ఆకాశం... జగత్తంతా నిండిన పంచభూతాలివి...* 


 వాటిని పరిశోధించాలి... పరిరక్షించాలి.. ఆరాధించాలి... ఎందుకంటే అవి ప్రకృతికి ప్రతిరూపాలు... మనుగడకు ఆలంబనలు... వాటిని స్వచ్ఛంగా ఉంచుకోవడం మనిషి ధర్మం. వాటికి ప్రణమిల్లుదాం. 


 పంచభూతాలకు ప్రతీక అయిన ప్రకృతిని పూజించాలని శాస్త్రాలు చెబుతున్నాయి. 


 *మనం చేసే పూజలు భూతత్త్వానికి,* 

 *అభిషేకాదులు జలతత్వానికి,* 

  *యజ్ఞయాగాది క్రతువులు అగ్నితత్వానికి,* 

  *మంత్రోచ్చారణ వాయు తత్త్వానికి,* 

 *ధ్యానం మొదలైన సాధనలు ఆకాశ తత్వానికి ప్రతీకలు.* ఆదిత్యయోగీ*


 మొత్తంగా మనిషి మనిషిగా మారడానికి, ప్రకృతితో అనుబంధం పెంచుకోవడానికి, అంతిమంగా మోక్షాన్ని సాధించటానికి పంచభూతాత్మకమైన ప్రకృతే ఆలంబన అనే సందేశం ఇందులో దాగి ఉంది.


 భూమండలాన్ని ఆవరించి ఉన్న పంచభూతాలు మనిషిలోనూ ఉన్నాయి. వాటి వల్లే మనిషి సుఖంగా జీవించగలుగుతున్నాడు. అవి తమ శక్తులు ప్రసారం చేయటంతో పాటు కర్తవ్యాన్ని ఏమరుపాటులేకుండా నిర్వహిస్తుంటాయి. అందువల్లనే మానవ జీవన వ్యవస్థతో పాటు మొత్తం ప్రాణి వ్యవస్థ నడుస్తోంది. ఈ విషయాన్ని మనిషి గుర్తించాలి. ఈ జీవనచక్రం సవ్యంగా సాగిపోవటానికి ప్రకృతితో, తనని తానను సమన్వయం చేసుకోవాలి. ప్రకృతిని ఆశ్రయించాలే కానీ ఆక్రమించకూడదు. ఈ సూత్రం ఆధారంగానే సనాతన భారతీయ ఆధ్యాత్మిక వ్యవస్థ రూపుదిద్దుకుంది.


  మనిషిలో పంచకోశాలు ఉంటాయి. అవి - *అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలు.* వీటిలో..... 


 *అన్నమయ కోశం భూ తత్త్వానికి,* 

 *ప్రాణమయ కోశం జలతత్వానికి,*

 *మనోమయకోశం అగ్నితత్వానికి,* 

 *విజ్ఞానమయకోశం వాయుతత్వానికి*

 *ఆనందమయకోశం ఆకాశతత్త్వానికి* సంబంధించి ఉంటాయి. 


 వీటితో పాటు *పంచభూతాల ప్రతీకలుగా మానవ శరీరంలో ఐదు నాడీకేంద్రాలు ఉంటాయి. వీటిని శక్తిచక్రాలు అంటారు.* వీటిలో 


 *మూలాధార చక్రం భూ తత్వాన్ని,*

 *స్వాధిష్టాన చక్రం జలతత్వానికి,* 

 *మణిపూరక చక్రం అగ్నితత్వానికి,* 

 *అనాహతచక్రం వాయుతత్త్వానికి,*

 *విశుద్ధిచక్రం ఆకాశతత్త్వానికి* ప్రతీకలుగా ఉంటాయి. 


 ఈ ఐదు చక్రాలు కాకుండా శరీరంలో ఉండే *ఆజ్ఞ, సహస్రార చక్రాలు అన్ని తత్త్వాలకు అతీతం.* మనిషి ఆలోచనలు, నడవడిక, సంస్కారం, ప్రారబ్ధకర్మ వల్ల ఇవి ప్రభావితమవుతుంటాయి.


 ప్రకృతిలోని పంచభూతాలను పరిరక్షించుకోవడం, కలుషితం కాకుండా చూడడం, భావితరాలకు ప్రాకృతిక వారసత్వ సంపద అందించడం మొదలైన అంశాల గురించి రుక్‌, యజుర్‌, అధర్వణ వేదాల్లో విస్తారంగా ఉంది.


 *‘ఓం భూఃశ్శాంతి ఓం భువఃశ్శాంతి..’* - భూమికి శాంతి కలుగుగాక. భూమ్యాకాశాల మధ్యలో ఉండే మొత్తం ప్రదేశమంతటికీ శాంతి కలుగుగా అంటుంది కృష్ణయజుర్వేదం.


 అధర్వణవేదం వాయువును మొత్తం ప్రపంచానికి వైద్యుడిగా పేర్కొంది. రుగ్వేదంలో *‘యదతో వాత తే గృహే అమృతస్య నిధిరిత: తేన నో దేహి జీవాసి...’* అంటూ ప్రార్థన మంత్రం ఉంది.  *‘నీతో అమృతనిధి ఉంది... ఓ వాయు దేవా! నీవు మాకు దీర్ఘ జీవనాన్ని ప్రసాదించము’* అని దీని అర్థం. మొత్తంగా ప్రకృతిలోని వాయుతత్త్వ ప్రాధాన్యాన్ని ఈ మంత్రాలు వివరిస్తున్నాయి.


 జలవనరుల పరిరక్షణ ప్రాధాన్యం అధర్వణవేదంలో కనిపిస్తుంది. నీటిని పాడుచేయటం మహాపాపమని, వర్షపునీరు అత్యంత పరిశుభ్రమైందని, ఈ నీటికి ఎన్నో వ్యాధులను నయం చేసే శక్తి ఉందని చెబుతుంది. ఇదే వేదంలో చెప్పిన *‘సముద్రే అంతర్నిహితాని నాభి’,* రుగ్వేదంలోని *‘ఆప ఓషధుతః.. అవస్తు ద్యౌర్వనగిరయో హృషీకేశః’* తదితర మంత్రాలు జలవనరుల ప్రాధాన్యత, సంరక్షణ గురించి వివరిస్తాయి. నదుల్లో ఉమ్మి వేయడాన్ని కూడా నిషేధించాయి మన శాస్త్రాలు.


  *ఐదు వేళ్లు...* 


 మన చేతి వేళ్లలో కూడా పంచభూత తత్త్వం నిక్షిప్తమై ఉంది. ఆ శక్తిని జాగృతం చెయ్యగలిగితే మన చేతికి ఎంతో శక్తి ఏర్పడుతుంది. ‘ఆ చేతిలో ఏదో మహత్తు ఉంద’ని చెప్పిడానికి ఏర్పడటానికి కారణం ఇదే. 


 *బొటన వేలు అగ్నితత్త్వానికి,* 

 *చూపుడు వేలు వాయుతత్త్వానికి,*

 *మధ్యవేలు ఆకాశ తత్త్వానికి,*

 *ఉంగరపు వేలు భూతత్త్వానికి,*

 *చిటికిన వేలు జలతత్త్వానికి సంకేతం.* 


 మంత్రజపాలు చేసేటప్పుడు అంగన్యాస, కరన్యాసాలు చేస్తారు. ఈ ప్రక్రియలో చేతివేళ్ల మొదలు నుంచి కొన వరకు సున్నితంగా తాకుతారు. దీనిద్వారా ఆ వేళ్లలో ఉండే పంచభూతశక్తులు ఉద్దీపనం చెందుతాయి. తద్వారా మనిషిలో ఆత్మచైతన్యశక్తి జాగృతమవుతుంది. అలాగే, ఆశీర్వచనం తీసుకునేటప్పుడు కూడా హస్త మస్తక సంయోగం ద్వారా శక్తి ప్రసారం జరుగుతుంది. అందుకే సాధకులైన పెద్దల నుంచి ఆశీర్వచనం తీసుకోవాలని చెప్పారు.ఆదిత్యయోగీ..


* ఈ సృష్టి మొత్తం పంచభూతాల కలయికతో ఏర్పడిందే. సృష్టికి ఆధారమైన ఈ పంచభూతాలు మానవ శరీరం వాటితోనే ఏర్పడింది. శరీరంలోని వివిధ భాగాల్లో వివిధ తత్త్వాలు, శక్తుల రూపంలో ఇవి కేంద్రీకృతమై ఉంటాయి. మనిషి స్థూల దేహానికే కాదు సూక్ష్మ దేహానికి కూడా ఇవే ఆధారం.


 *1. పృథివి (భూమి) :

వాక్కు, పాణి, పాదం, పాయువు, ఉపస్థ అనే కర్మేంద్రియాలు పృథివీ తత్త్వం ద్వారా ఏర్పడతాయి.


 *2. జలం :

ఇది శరీరంలో రక్తరూపంలో ఉంటుంది. శబ్దం, స్పర్శ, రూపం, రసం, గంధం అనే పంచతన్మాత్రలు జలతత్త్వానికి ప్రతీకలుగా ఉంటాయి.


 *3.అగ్ని :

జఠరాగ్ని రూపంలో శరీరంలో ఉంటుంది. చర్మం, ముక్కు, కళ్లు, చెవులు, నాలుక అనే ఐదు జ్ఞానేంద్రియాలు అగ్ని తత్త్వం ఆధారంగా ఏర్పడ్డాయి.


 *4.వాయువు *

శరీరంలో ప్రాణం వాయురూపంలోనే ఉంటుంది. ప్రాణం, అపానం, వ్యానం, ఉదానం, సమాసం అనే పంచప్రాణాలు ఈ తత్త్వం ద్వారా ఏర్పడ్డాయి.


 *5.ఆకాశం :

అంతఃకరణంగా ఆకాశతత్త్వం మనిషిలో ఉంటుంది. మనస్సు, బుద్ధి, చిత్తం, జ్ఞానం, అహంకారం అనే అంతరింద్రియాలు దీని ద్వారా ఏర్పడతాయి.....*

.

రెండు విషయాలు...*

 *మనిషిని మంచిమార్గంలో పెట్టగలిగే.. రెండు విషయాలు...*

                 

 *ప్రకృతిలో మరే జీవికీ లేని సౌలభ్యం ఒక్క మనుష్యునికే ఉన్నది. పుట్టుకతో ఒకవేళ స్వభావంలో దోషమున్నా, చెడు గుణాలున్నా, వాసనాబలంగా గత జన్మల నుంచి దోషభూయిష్టమైన విషయాలు మనసు పుచ్చుకున్నా రెండు కారణాల చేత అతను బుద్ధిని మార్చుకోగలడు.*


 *మంచి కార్యక్రమాలవైపు మనస్సును మళ్ళించగలడు.*


*అలా అత్యంత ప్రభావవంతమయినవి, బుద్ధిని ప్రచోదనం చేయగలిగినవి, మనిషిని సత్కర్మాచరణవైపు నడిపించగలిగినవి రెండు ఉన్నాయి లోకంలో–ఒకటి సత్సంగం, మరొకటి–మంచి పుస్తక పఠనం.*


 *సత్సంగం అంటే మంచి వ్యక్తులతో కూడిక. మనం ఏకాలంలో జీవిస్తున్నామో, ఆ కాలం లోనే కొంతమంది మహాత్ములు కూడా జీవిస్తుంటారు, మంచి గుణాలు కలిగిన కొంతమంది పెద్దలు జీవిస్తుంటారు, సమాజంలో లబ్ధప్రతిష్టులయినవారు, శాస్త్రాన్ని తెలుసుకుని, దానిప్రకారం అనుష్ఠానం చేసేవారు నిరంతరం శాంతికోసం పరితపించేవారు కనబడుతుంటారు.*


*ప్రయత్న పూర్వకంగా  అటువంటివారితో స్నేహాన్ని పెంచుకుని వారికి దగ్గరగా జీవించగలగడం, వారితో కలిసి ఉండడం... అనేది మన మనసును మంచి మార్గం వైపు మళ్ళించడానికి తోడ్పడుతుంది.*


 *కొన్ని గ్రంథాలయాల్లో ఉన్న పుస్తకాలన్నింటినీ చదివి, మంచి విషయాలను బాగా మనసుకు పట్టించుకుని అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకోవడానికి ఎంత కాలం పడుతుందో దానికి కోటి వంతు కాలంలో మార్పు తీసుకురాగలగినది–మంచి వ్యక్తులతో కలిసి ఉండడం.*


*అందుకే శంకర భగవత్పాదులు మోహముద్గరంలో–*


*’సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్త్వం, నిశ్చలతత్త్వే జీవన్ముక్తిః’*

అంటారు. 


*మంచి మనుషులతో కలిసి ఉన్నంత మాత్రం చేత అది విశేష ప్రభావాన్ని చూపుతుంది.*


 *రామకృష్ణ పరమహంస ఒక మాట చెబుతుండేవారు...*


 *ఏనుగు తనంతట తానుగా ఎవరికీ. లొంగదు. కానీ మావటికి లొంగి ఉంటుంది. అయినా నడుస్తూ నడుస్తూ దారిలో కనిపించిన చెట్ల కొమ్మలను తొండంతో విరిచే ప్రయత్నం చేస్తుంటుంది. కానీ మావటి   దాని తొండంమీద చిన్న దెబ్బ వేయగానే తొండాన్ని దించేస్తుంది.*


 *అలాగే మంచివారితో కూడి ఉన్న కారణం చేత మనం కూడా మంచి మార్గంలో నడవడానికి అవకాశం కలుగుతుంది.*


*సమకాలీన సమాజంలో మంచి వ్యక్తులతో కలిసి జీవించడం ప్రయత్నపూర్వకంగా వారి స్నేహాన్ని పొందడం ఎంత గొప్ప లక్షణమో, మంచి పుస్తకాలు ఇంట్లో ఉండడం –అంతమంది మహాత్ములు ఇంట్లో ఉండడంతో సమానం.*


*వివేకానందుడు రాసిన పుస్తకాలు, రామకృష్ణ పరమహంస ప్రవచనాలతో ఉన్న పుస్తకాలు, కంచి కామకోటి పూర్వ పీఠాధిపతులు చంద్రశేఖరేంద్ర మహా సరస్వతి స్వామివారి అనుగ్రహ భాషణాలు, శృంగేరీ పీఠాధిపతులు భారతీ తీర్ధ మహాస్వామి వారి దివ్యవాక్కులు... ఇటువంటి మహాత్ముల మాటలతో కూడిన పుస్తకాలు ఇంట్లో ఉండడం అంటే అటువంటివారితో కలసి జీవించడంతో సమానం.*


*మీరెప్పుడెప్పుడు అటువంటి వారినుండి నాలుగు మంచి మాటలు విందామని అనుకుంటున్నారో అప్పుడప్పుడు సిద్ధంగా ఉండి మీతో మంచి బోధలు చేయడానికి వాళ్ళు మీ ఇంట్లోనే కుర్చీ వేసుకుని సిద్ధంగా కూర్చోవడంతో సమానం.*


🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు

విచార సంగ్రహం- 15 .

 విచార సంగ్రహం- 15 .

( భగవాన్ రమణమహర్షులు )


ఈ చిన్నగ్రంధము ఎంతో విలువైనది. ఎందువలన అంటే, 1901 -02 లో భగవాన్ రమణమహర్షి మౌనవ్రతంలో వుంటున్నప్పుడు, వారి పాదాలను ఆశ్రయించుకుని వున్న బ్రాహ్మణ పరమ భక్తాగ్రేసరుడు అయిన ‘ గంభీరం శేషయ్య ‘ గారికి ఆకాలంలో, వారు అడిగిన సందేహాలకు రమణులు వ్రాతపూర్వకంగా అనుగ్రహించిన వేదాంతసారం, యిందులో పొందుపరచ పడినది. 


ఇందులో ముముక్షువులైన సర్వాధికారులకు అధికఫలం ఇచ్చే ఉపదేశములు వుండడడం వలన ఇది ' విచార సంగ్రహము ' అనే పేరుతో పిలువబడినది.


జ్ణానాష్టాంగము 


ఇక్కడ మనం యమనియమాలను గురించి క్లుప్తంగా చెప్పకుందా౦  


ముందుగా ‘ యమము ‘ అంటే, ' దేహము మొదలైన అనాత్మ విషయాలు అనిత్యము అయినవి. ' అని తెలుసుకుని, ఇంద్రియ వృత్తుల వ్యాపకాలను అణచివేయుట. విషయ రహితమైన, దృశ్య రహితమైన ప్రపంచంలో మనస్సును నిలపడానికి నిరంతరమూ కృషి చెయ్యడం.   


‘ నియమము ‘ , ఆత్మ సంబంధమైన అనగా పరమాత్మ విషయముల మీద అపరిమిత ఆసక్తి పెంచుకోవాలి. విజాతీయ విషయములందు, తిరస్కారము చూపించాలి.  


ఇక ‘ ఆసనము ‘ అనగా, ధ్యానానికి కూర్చునే ముందు, ఫలానా విధమైన ఆసనం వుండాలనే నిబంధన ఏదీలేదు. దేనిమీద కూర్చుంటే, ఎడతెగని బ్రహ్మచింతన సుఖముగా వీలు అవుతుందో, దేహముఎక్కడ సహకరిస్తుందో, అదే సరిఅయిన ఆసనము. అయితే అలాంటి సుఖమైన ఆసనము నిద్రలోకి దారితీసేటట్లు వుండకూడదు.  


ప్రాణాయామము : రేచకమంటే వాయువును ముక్కు రంధ్రములద్వారా బయటకు వదలడం అని చెప్పుకున్నాముకదా ! ఆ బయటకు వదలడమనే ప్రక్రియను దేహాది అనిత్య ప్రపంచము యొక్క నామ రూపాలను బయటకు వదలడంగా అన్వయించుకోవాలి. పూరకమంటే, వాయువును గ్రహించడం అని తెలుసు కదా ! నామరూపములను వదిలిన తరువాత కలిగే సత్ చిత్ ఆనందములనే మూడు అంశాలను గ్రహించినట్లు భావించాలి. కుంభకం అనగా వాయువును బంధించి వుంచుకున్నట్లు, ఆ గ్రహి౦చిన సచ్చిదానంద స్వరూపాన్ని నిలుపుకోవడమే.    


‘ ప్రత్యాహారం ‘ అనగా, రేచకంలో వదిలిన నామ రూపములను మనస్సు మరల గ్రహించుకోకుండా కాపాడుకోవడం. మరి ‘ ధారణ ‘ అంటే, కుంభకం లో పూరించుకున్న సచ్చిదానంద స్వరూపమే తన ఆత్మస్వరూపం అని తెలుసుకున్న తరువాత, దానిని మనసు దాటి వెలుపలకు పోనీయకుండా, హృదయ కమలంలో నిలుపుకొనడం.  


‘ ధ్యానం ‘ అంటే, పంచకోశయుత దేహము నేనుకాదని బాగుగా గుర్తెరిగి ' నేను ఆత్మ స్వరూపమును ' అని నిశ్చయించుకుని, అహం స్వరూపంలో ఎడతెగకుండా వుండుట. చివరగా, ‘ సమాధి స్థితి ‘ అంటే, అహం స్ఫురణ కూడా కొట్టుకునిపోయి వున్న పరబ్రహ్మ సాక్షాత్కార స్థితి. అనగా తురీయాతీత స్థితి అని చెప్పుకున్నాము కదా ! అది అన్నమాట. 


ప్రాణాయామము గురించి మరికొంత రేపు తెలుసుకుందాం.  


స్వస్తి.

రమణుల అనుగ్రహంతో....🙏🏻🙏🏻🙏🏻🙏🏻

సప్త వ్యసనాలు


సప్త వ్యసనాలు అంటే ఏమిటి?*


ఏ మనిషయినా దుర్వ్యసనాలకి లోనయితే జీవితంలో బాగుపడలేడు. 

ఈ వ్యసనాలకి లోనయి నాశనమయ్యేవాళ్ళు ఈ కాలంలోనే కాదు, పూర్వమూ వున్నారు. ముఖ్యంగా దుర్వ్యసనాలు ఏడు అంటారు. అవేమిటంటే

*1.పరస్త్రీ వ్యామోహం – ఏ కాలంలోనైనా మనిషిని అధఃపాతాళానికి తొక్కేసే వ్యసనం ఇది. ఈ వ్యసనంతో సర్వనాశనం తెచ్చుకున్నవాళ్ళల్లో పూర్వ కాలంలో రావణాసురుడు ముఖ్య ఉదాహరణ. సీతాదేవిని అపహరించి, ఎన్నో కష్టాలను కొని తెచ్చుకోవటమేగాక తన కుటుంబాన్నీ, వంశాన్నీ, అయినవారినీ, చివరికి రాజ్యాన్నికూడా కోల్పోయాడు.

*2.జూదం .. ధర్మరాజు అంతటి వాడు జూదం వల్ల ఎన్ని అగచాట్లు పడ్డాడో అందరికీ తెలుసు. (ఆంతటి గొప్పవాడే ఆ రోజుల్లో అన్ని అవస్తలు తాను పడటమే కాకుండా, తన తమ్ములూ, భార్యా కూడా అవస్తలు పడటానికి కారకుడయ్యాడే, మరి ఈ రోజుల్లో ఈ పేకాట వగైరా వ్యసనాలబారినపడి ఎన్ని కుటుంబాలు ఎన్ని అవస్తలు పడుతున్నాయో)

*3.మద్యపానం – పురాతన కాలంలో దీనికి ఉదాహరణ శుక్రాచార్యుడు. ఈయన రాక్షసులకు గురువు. ఆయనకి మృత సంజీవినీ విద్య తెలుసు. ఆ విద్యతో చనిపోయిన రాక్షసులను వెంటనే బ్రతికించేవాడు. అలాంటివాడు మద్యపాన మత్తులో ఏమి చేస్తున్నాడో తెలుసుకోకుండా తాను తాగే పానీయంలో కచుడి చితాభస్మం కలిపి సేవిస్తాడు. (పురాతన కధలు అందరికీ వివరంగా తెలియక పోయినా కచుడి చితాభస్మం తాగటం వివరాలు నేనూ ఇప్పుడు తెలుసుకోవాలి) నేటి సమాజంలో మద్యపాన మహిమ అందరికీ తెలిసినదే.

*4. వేట -- పూర్వం దశరధ మహారాజు వేటకోసం వెళ్ళి, నీటి శబ్దాన్నిబట్టి బాణం వేసి శ్రవణకుమారుడిని చంపుతాడు. ఆయనకి తెలియక చేసిన పాపమయినా శ్రవణుడి వృధ్ధ తల్లిదండ్రుల శాపానికి గురయి తన కుమారుడు శ్రీ రామచంద్రుడికి దూరమయి రాముణ్ణే కలవరిస్తూ మరణిస్తాడు. (ఇదివరకంటే కృర మృగాల (kroora - inscript లో ఎలా టైప్ చెయ్యాలో రాలేదు నాకు) బారినుండి ప్రజలను కాపాడటానికి రాజులు వేటాడేవారు. ఈ రోజుల్లో మాత్రం ఇది , స్ధితి పరులకు వ్యసనమే. దానితో పట్టుబడ్డవారెన్ని కేసులెదుర్కుంటున్నారో పేపర్లల్లో చూస్తున్నాంగా).ఆదిత్యయోగీ..

*5. కఠినంగా, పరుషంగా మాట్లాడటం -- దుర్యోధనుడు దీనికి మంచి ఉదాహరణ. పాండవులను దుర్భాషలాడి ఏ స్దితి తెచ్చుకున్నారో అందరికీ తెలిసిందే. (పూర్వకాలంలో కఠినంగా మాట్లాడేవాళ్ళని వేళ్ళమీద లెక్కబెట్టేవాళ్ళు...ఇప్పుడు అలా మాట్లాడనివాళ్ళని....)

*6.కఠినంగా దండించటం -- దీనికికూడా దుర్యోధనుడే ఉదాహరణ. ఒకసారి దుర్యోధనుడు తన తాతగారిని, మేనమామలని కూడా బందిఖానాలో పెడతాడు. వారికి ఆహారం కూడా అతి తక్కువ ఇచ్చి నానా ఇబ్బందులూ పెడతాడు. వాళ్ళందరికీ ఇచ్చిన అతి కొద్ది మెతుకులను శకుని ఒక్కడే తిని ప్రాణాలు నిలుపుకుని దుర్యోధనుడి చెంత చేరతాడు. కౌరవులమీద పగ తీర్చుకోవటానికి వారితో వున్నట్లు నటించి వారు నాశనమయ్యేటట్లు చేస్తాడు.

ఈ రోజుల్లోకూడా ఏ కారణంవల్లనైతేనేమి తల్లిదండ్రులు పిల్లల్ని దండించటం, టీచర్లు పిల్లల్ని కఠినంగా దండించటం ఎక్కువైంది. (ఎవరిమీదైనా ఏమైనా కక్షవుంటే దాన్ని తీర్చుకోవటానికి అనేక మార్గాలు ఎన్నుకుంటున్నారు. ఇది ఎవరికీ మంచిది కాదు).

*7.ఆఖరిది డబ్బు. కొందరికి డబ్బు వృధాగా ఖర్చుచెయ్యటం అలవాటు. బాగా డబ్బున్నా, క్రమ శిక్షణా, సరైన ఆలోచన లేకపోవటంవల్ల అవసరముందా లేదా అని కూడా ఆలోచించకుండా డబ్బు దుర్వినియోగం చేస్తారు. మహాలక్ష్మిని ప్రయోజనకరమైనవాటికి కాకుండా దుర్వ్యసనాలకు వినియోగిస్తే దుర్గతే లభిస్తుంది అపజయమే తప్ప జయం వుండదు. అందుకే ధనాన్ని సద్వినియోగం చెయ్యాలి.

మంచీ చెడూ తెలుసుకుని మనుగడ సాగించటమే మనిషి జన్మకి సార్ధకత...

.


మనని మరొకరు మన్నించడం, క్షమించడం కాదు. 'ఎవరికి వారు ఆత్మ పరిశీలనతో తన తప్పును గ్రహించి, పశ్చాత్తాపంతో తనకు తానే మానసికంగా శిక్ష విధించుకుని, నూతన జీవితాన్ని ఆశ్రయించాలి. మనసే మన 'కర్మ'లకు మొదటి సాక్షి!'..

.

*భగవంతునికి - భక్తులు - అనే అర్హత ఎప్పుడు పొందగలము?*


భగవంతుని గుర్తించి మనము స్వీకరిస్తే ఆయన ఉంటాడు, కనబడుతాడు... 

ఆయనను తిరస్కరిస్తే ఆయన ఉండడు, కాక కనబడడు కూడా.... 

హిరణ్యకశిపుడు హరి ఎక్కడా లేడన్నాడు, కనుక ఎక్కడా కనబడలేదు, అతనికి...

అంతటా ఉన్నాడని ప్రహ్లాదుడు విశ్వసించాడు... 

కాబట్టి స్తంభము నుండి వెలిసి, ప్రహ్లాదుని విశ్వాసం సత్యమని నిరూపించాడు...

అంతే కానీ, హిరణ్య కశిపుని సవాలు ఎదుర్కోవడం కోసమని స్తంభములో ప్రవేశించడం కాదు...


అన్నిటా, అంతటా నిండి ఉన్నట్లే, ఆ స్తంభములో కూడా ఆయన ఎప్పుడూ ఉన్నాడు... 

ఆ క్షణంలో తన ఉనికి ప్రదర్శించాడు, అంతే!...


సాధు సత్పురుషులు, మహర్షులు, ఆర్తితో ప్రార్ధించినపుడు, భగవంతుడు అవతరిస్తాడు...


*ఆయన కర్తవ్యాలు మూడు...!!!*


వేద రక్షణ, 

ధర్మ రక్షణ, 

భక్త రక్షణ...


నిశ్చలమైన విశ్వాసము, నిర్భయం, నిరహంకారం, సద్గుణం, ఇవి లేకుండా, ఆడంబరంగా పూజ చేస్తే, వ్యర్థమే... కాలము, శక్తీ, అన్నీ వృధా అవుతాయి...


ఇలాంటి సందర్భంలో మనము పవిత్ర గ్రంధాల నుండీ, పురాణముల నుండి, ఉపనిషత్తులనుండి, ప్రసంగాల నుండీ మనము పొందుతున్న లాభమేమిటి?...


వీటి మూలంగా మనమైనా బాగు పడ్డామా? లేక చదివితేనే పుణ్యము వస్తుంది, అనుకొంటే మనకన్నా ముందు టేబురికార్డులకు, మన సెల్లులకు ముందుగా పుణ్యం వస్తుంది, అవి నిత్యం పటిస్తున్నాయి కాబట్టి...


భగవంతుని దర్శన భాగ్యం పొందిన మనము ఎంతవరకు పురోగమించాము? 

దర్శనమాత్రమునే పుణ్యము వస్తుంది, మోక్షానికి అర్హత వస్తుంది అనుకుంటే, మనకన్నా ముందు, నిత్యం ఆయన కోవెలలో ఉన్న చీమలకు, దోమలకు, కీటకాలకు వస్తుంది...

ఎందుకనగా అవి నిత్యం ఆయనను అంటిపెట్టుకుని ఉంటున్నాయి కాబట్టి...ఆదిత్యయోగీ..


ఆయన దగ్గర నుంచి పారమార్థిక జీవిత రహస్యం , తెలుసుకున్న దానికి నిదర్శనంగా మన జీవన సరళిలో ఏదైనా మంచి మార్పు కన పడాలి...

మనలోనుండి మధుర భాషణం, విజయ, పరాజయాలకు పొంగని, కృంగని ఆత్మ నిగ్రహం మనము ప్రదర్శించాలి...

ఇవన్నీ మన భక్తికి సంకేతాలు, లేశమైన అహంభావము లేకుండా, భగవంతుని శరణాగతి పొందాలి...  

అప్పుడే మనము భక్తులు అని పించుకోగల అర్హత పొంద గలుగుతాము...

.

 ప్రత్యయస్య పరచిత్త జ్ఞానమ్


ఇదే విధంగా సంయమం ద్వారా పరుల చిత్తమును అతీత జ్ఞానముతో పరిశీలించిన యోగికి పరుల చిత్త జ్ఞానము కూడా లభిస్తుంది. ప్రతి మనిషి ప్రవర్తన అతడి చిత్తముపై ఆధారపడి వుంటుంది.


ఒక మనిషి లాగా మరొకమనిషి ప్రవర్తించకపోవడానికి అతడి మనస్సులో పుట్టే


ఆలోచనలే కారణం. ఆ ఆలోచనలనుబట్టే అతడి తీరు. ప్రవర్తన చర్యలు జరుగుతుంటాయి. ఇవి ఒక మనిషిని పోలి మరొక మనిషికి ఎప్పుడూ వుండవు. ఇందుచేతనే అనేక కోట్ల


మందిలో ప్రతి ఒక్కరూ ఎవరికి వారుగా గుర్తించ బడతారు.


ఈ చిత్త ప్రవృత్తులు ఆ వ్యక్తి ముఖ భావాలు, చూపులు, హావభావాల ద్వారా బహిర్గత మవుతుంటాయి. మనం ఒక మనిషిని చూస్తూనే అతడుచాలాకోపంగా వున్నాడని గ్రహించగలుగుతాము. అలాగే మరొకడి ముఖాన్ని బట్టి అతడు సంతోషంగా వున్నాడనో, దుఖ్కంతో వున్నాడనో గ్రహించగలుగుతాము.


మనకి ఇలాంటి గ్రహింపుకి కారణం ఆయా వ్యక్తుల హావభావాలు. ఈ హావభావాలనేవి


చిత్తములోని ఆలోచనలకి ప్రతిబింబాలుగా ప్రదర్శించబడుతాయి.ఆదిత్యయోగీ..


కనుక ఈ హావభావాలని బట్టి అతడి చిత్తములో ఎలాంటి భావాలు నెలకొని వున్నాయో సులభంగా గ్రహించగలము.అయితే మరికొందరుంటారు. వారి చిత్తములో ఎలాంటి సంఘర్షణలు జరుగుతున్నా హావభావాల ద్వారా బయటపడకుండా జాగ్రత్తపడతారు. నిండు కుండ తొణకదంటారే, అట్లా! అయినప్పటికే అలాంటి వారిని పలకరించినప్పుడు 'నాకేం. నేను బాగానే వున్నా' నంటూనే అప్రయత్నంగా సూక్ష్మంగా తమ హావభావాల ద్వారా చిత్త వృత్తిని ప్రదర్శిస్తారు. అప్పుడు మనం 'అతడలా అంటున్నాడు గానీ, మనస్సులో ఏదో వుంది' అనుకుంటాము. దీనినే చిత్తవృత్తి అంటారు.


సమాధి స్థితి పొందిన యోగికి సాధనకి పూర్వము నుండి తన చిత్త వృత్తుల తీరు స్వానుభవమే. అతడు యోగాభ్యాస సాధన ద్వారా చిత్త వృత్తులను వరుసగా జయిస్తూ సమాధి స్థితి పొందుతాడు.


అంటే అనేక భావాలకి ఆలవాలమైన తన చిత్తమును తన వశం చేసుకుంటాడు. అట్టి అనుభవజ్ఞానం తనకి వుండటం చేత, ఎట్టి కోరికలూ, వృత్తులూ లేక శూన్యంగా వున్న తన చిత్తమును పరచిత్తముతో సంయమం చేస్తాడు.


అంటే ఇతరులచిత్త స్థితిగతులను శూన్యంగావున్న తన చిత్తముద్వారావశం చేసుకున్నప్పుడు ఇతరులచిత్తము ఎలావుంది? అప్పుడే విషయం ఆలోచిస్తోంది? అది ప్రశాంతంగా వుందా? అలజడత్వస్థితిలో ఉందా? మట్టిముద్దలావుందా? అనేకసంఘర్షణలతో సతమతమవుతోందా?' అనేవిషయాలు తనకి లభించిన అతీంద్రియ జ్ఞానం ద్వారా తెల్సుకోగలుగుతాడు...


అయితే, ఈ పరచిత్త జ్ఞానము పరుల చిత్తము యొక్క స్థితి గతులను మాత్రమే గ్రహించగలదు.


అంటే ఆ వ్యక్తి చిత్తము సంతోషంగా వుందా? దుఃఖ్క పూరితమై వుందా? ఏదైనా సంఘర్షణలతో బాధింపబడుతోందా? లేక ఆలోచనారహితంగా జడత్వంలా వుందా? ఇలా ఆ వ్యక్తిచిత్తముఏస్వరూపాన్నిధరించివున్నదోమాత్రమేటయోగిచిత్తము గ్రహించగలుగుతుంది.


అంతేగానీ ఆ వ్యక్తి సంతోషము లేదా దుఃఖ్కమునకు కారణం ఏమిటో, ఆ చిత్తము ఏ విషయం గురించి ఆలోచించడం వల్ల అలాంటి చిత్త స్వరూపం కలిగిందో ఆ విషయం లేదా ఆ వస్తువు ఏమైవుంటుందో, దాన్ని గ్రహించే జ్ఞానం కలగదు. ఆ చింతన ఆ వ్యక్తికి మాత్రమే స్వంతం.


కేవలం ఆ వ్యక్తి చిత్తములో కలిగిన భావ స్వరూపాన్ని మాత్రమే యోగి చిత్త జ్ఞానము గ్రహించగలుగుతుంది.అనగా యోగి చిత్తమునకు వశమైనది ఆ వ్యక్తి చిత్తమే గానీ, ఆ చిత్త క్షోభకి కారణమైన విషయవస్తువు కాదు. కనుక ఆ వ్యక్తి చిత్తము యొక్క స్థితి గతి ఏవిధంగా వున్నదోనని మాత్రమే యోగి చిత్తము గ్రహించగలుగుతుంది..*

.

[05/04, 9:25 am] Panchagnula Srinivas: విచార సంగ్రహం- 15 .

( భగవాన్ రమణమహర్షులు )


ఈ చిన్నగ్రంధము ఎంతో విలువైనది. ఎందువలన అంటే, 1901 -02 లో భగవాన్ రమణమహర్షి మౌనవ్రతంలో వుంటున్నప్పుడు, వారి పాదాలను ఆశ్రయించుకుని వున్న బ్రాహ్మణ పరమ భక్తాగ్రేసరుడు అయిన ‘ గంభీరం శేషయ్య ‘ గారికి ఆకాలంలో, వారు అడిగిన సందేహాలకు రమణులు వ్రాతపూర్వకంగా అనుగ్రహించిన వేదాంతసారం, యిందులో పొందుపరచ పడినది. 


ఇందులో ముముక్షువులైన సర్వాధికారులకు అధికఫలం ఇచ్చే ఉపదేశములు వుండడడం వలన ఇది ' విచార సంగ్రహము ' అనే పేరుతో పిలువబడినది.


జ్ణానాష్టాంగము 


ఇక్కడ మనం యమనియమాలను గురించి క్లుప్తంగా చెప్పకుందా౦  


ముందుగా ‘ యమము ‘ అంటే, ' దేహము మొదలైన అనాత్మ విషయాలు అనిత్యము అయినవి. ' అని తెలుసుకుని, ఇంద్రియ వృత్తుల వ్యాపకాలను అణచివేయుట. విషయ రహితమైన, దృశ్య రహితమైన ప్రపంచంలో మనస్సును నిలపడానికి నిరంతరమూ కృషి చెయ్యడం.   


‘ నియమము ‘ , ఆత్మ సంబంధమైన అనగా పరమాత్మ విషయముల మీద అపరిమిత ఆసక్తి పెంచుకోవాలి. విజాతీయ విషయములందు, తిరస్కారము చూపించాలి.  


ఇక ‘ ఆసనము ‘ అనగా, ధ్యానానికి కూర్చునే ముందు, ఫలానా విధమైన ఆసనం వుండాలనే నిబంధన ఏదీలేదు. దేనిమీద కూర్చుంటే, ఎడతెగని బ్రహ్మచింతన సుఖముగా వీలు అవుతుందో, దేహముఎక్కడ సహకరిస్తుందో, అదే సరిఅయిన ఆసనము. అయితే అలాంటి సుఖమైన ఆసనము నిద్రలోకి దారితీసేటట్లు వుండకూడదు.  


ప్రాణాయామము : రేచకమంటే వాయువును ముక్కు రంధ్రములద్వారా బయటకు వదలడం అని చెప్పుకున్నాముకదా ! ఆ బయటకు వదలడమనే ప్రక్రియను దేహాది అనిత్య ప్రపంచము యొక్క నామ రూపాలను బయటకు వదలడంగా అన్వయించుకోవాలి. పూరకమంటే, వాయువును గ్రహించడం అని తెలుసు కదా ! నామరూపములను వదిలిన తరువాత కలిగే సత్ చిత్ ఆనందములనే మూడు అంశాలను గ్రహించినట్లు భావించాలి. కుంభకం అనగా వాయువును బంధించి వుంచుకున్నట్లు, ఆ గ్రహి౦చిన సచ్చిదానంద స్వరూపాన్ని నిలుపుకోవడమే.    


‘ ప్రత్యాహారం ‘ అనగా, రేచకంలో వదిలిన నామ రూపములను మనస్సు మరల గ్రహించుకోకుండా కాపాడుకోవడం. మరి ‘ ధారణ ‘ అంటే, కుంభకం లో పూరించుకున్న సచ్చిదానంద స్వరూపమే తన ఆత్మస్వరూపం అని తెలుసుకున్న తరువాత, దానిని మనసు దాటి వెలుపలకు పోనీయకుండా, హృదయ కమలంలో నిలుపుకొనడం.  


‘ ధ్యానం ‘ అంటే, పంచకోశయుత దేహము నేనుకాదని బాగుగా గుర్తెరిగి ' నేను ఆత్మ స్వరూపమును ' అని నిశ్చయించుకుని, అహం స్వరూపంలో ఎడతెగకుండా వుండుట. చివరగా, ‘ సమాధి స్థితి ‘ అంటే, అహం స్ఫురణ కూడా కొట్టుకునిపోయి వున్న పరబ్రహ్మ సాక్షాత్కార స్థితి. అనగా తురీయాతీత స్థితి అని చెప్పుకున్నాము కదా ! అది అన్నమాట. 


ప్రాణాయామము గురించి మరికొంత రేపు తెలుసుకుందాం.  


స్వస్తి.

రమణుల అనుగ్రహంతో....🙏🏻🙏🏻🙏🏻🙏🏻

బుద్ధికి

 💎🌅 *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 ॐ卐 *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎


శ్లో𝕝𝕝 

*గ్రహణం ధారణం చైవ*

*స్మరణం ప్రతిపాదనమ్ ౹*

*ఊహాపోహాఽర్ధవిజ్ఞానం*

*తత్త్వజ్ఞానం చ ధీగుణాః ||*


        *--- _కామన్దక నీతిసారం_.*


భావం : వినాలనే కోరిక కలగడం, వినిన విషయాన్ని గ్రహించటం, గ్రహించినదానిని మనస్సున నిలుపుకొనడం, నిలుపుకొనినదాన్ని గుర్తుకు తెచ్చుకోవడం, చెప్పడం, ఊహించడం, సంశయనివృత్తి చేసుకోవడం, అర్థమును చక్కగా గ్రహించడం, తత్త్వజ్ఞానాన్ని తెలుసుకొనడం అను ఈ ఎనిమిది - బుద్ధికి గల గుణాలు*.....