27, జులై 2023, గురువారం

Sadaachaar


 

Modiji


 

సత్కర్మలు చేయడానికి

 *1803*

*కం*

మొక్కకు పోసిన నీటికి

గ్రక్కున ఫలమొసగనటుల కర్మల ఫలముల్

దక్కెడు కాలంబువరకు

తక్కగ సత్కర్మలొనర తరిగొను సుజనా.

*భావం*:-- ఓ సుజనా! మొక్క కు పోసిన నీటికి వెంటనే ఫలముల నీయని విధంగా ఫలములు దక్కే కాలం వచ్చే వరకూ తప్పకుండా సత్కర్మలు చేయడానికి ప్రయత్నించుము(తరిగొను).

*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*

మణిపూర్

 



*మణిపూర్ "కుకీ" క్రిస్టియన్ లకు AK47, AK 56లు ఎలా వచ్చాయి.??????   ఎవరిచ్చారు???వీళ్ళ కాల్పుల్లో 160మంది హిందూ ఆదివాసీలు మరణించారు. హిందూ దేవాలయాలు, విగ్రహాలు కొల్లగొట్టబడ్డాయి 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭            వీళ్ళకు ఆయుధ సప్లై నిరంతరాయంగా ఎవరు చేస్తున్నారు????🤭🤭🤭🤭🤭🤭🤭🤭 @@ మయన్మార్,బంగ్లాదేశ్ నుంచి వలసలు-శరణార్థులుగా వచ్చిన క్రిస్టియన్-రోహింగ్యా ముస్లిమ్స్ మణిపూర్ లో నివసించే హిందువులపై అరాచకాలు చేస్తూ,.. యదేచ్చగా మతమార్పిడి లు చేయడమే లక్ష్యంగా హిందువులను ఇలా చంపుతున్నారు 😭😭😭😭           @@ స్వలాభం కోసం, దేశాన్ని అస్థిర పరచాలని కోరుకునే దేశద్రోహులంతా కలిసి,.. ఇటువంటి చొరబాటుదారులకు మద్దతిస్తూ, ఆయుధాలు సరఫరా చేస్తూ, వాళ్ల గెలుపు కోసం దేశ వినాశనాన్ని కోరుకునే దేశద్రోహులకు మద్దతు ఎవరిస్తున్నారు😭😭😭😭😭😭 @@ సామాన్య పౌరులకు అత్యాధునిక  ఆయుధాలు ఎలా వచ్చాయి?? ఎవరిస్తున్నారు. ఒక ప్రైవేటు సైన్యం ఎలా నడుస్తుంది      @@ జర ధమాక్ పెట్టి ఆలోచించు ఓ హిందువా!! లేకుంటే మన తెలంగాణలో నీ భార్యాబిడ్డలను కూడా నీ ముందే చెరచుతారు జాగ్రత్త🤭🤭🤭🤭🤭🤭🤭🤭🤭🤭🤭 మేలుకుంటే పరువు మిగులుతుంది. లేకుంటే దేశానికి బరువుగా నువ్వు మిగులుతావు  😭😭😭😭😭😭😭😭😭😭😭* 😭😭

దైవసాన్నిధ్య అభ్యాసము

 QUOTE OF THE DAY

🌷Practising the Presence of God🌷

July 27

How easy it is to pack the day with foolishness, how difficult to fill it with worthwhile activities and thoughts! Yet God is not so much interested in what we are doing as in where the mind is. Everyone has a different difficulty, but God doesn’t listen to any excuses. He wants the devotee’s mind to be engrossed in Him in spite of any troublesome circumstances.

🌷– Sri Sri Paramahansa Yogananda
“Man’s Eternal Quest”


నేటి సూక్తి

🌷దైవసాన్నిధ్య అభ్యాసము🌷

July 27

రోజంతా పనికి మాలిన పనులతో గడపడం ఎంత సులభం, మంచి పనులతోనూ ఆలోచనలతోనూ గడపడం ఎంత కష్టం! అయినా, మనం ఏమి చేస్తున్నామనే దానికంటె మన మనస్సు ఎక్కడ ఉంది అనేదే దేవుడు చూస్తాడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క కష్టం ఉండవచ్చు కాని దేవుడు సాకులు ఏవీ వినడు. క్లిష్ట పరిస్థితులు ఎన్నిఉన్నప్పటికీ భక్తుని మనస్సు తనయందే లగ్నమై ఉండాలని ఆయన కోరతాడు.

🌷– శ్రీ శ్రీ పరమహంస యోగానందా,
“Man’s Eternal Quest”


 

 


కాల చక్రం

 కాల చక్రం ... కాలచక్రగమనంలో ఋతువు మారింది వరుణ దేవుడు ఆనందంతొ పుడమి తల్లి దాహార్తిని తీరుస్తున్నాడు .. ప్రకృతి పురుషుల ప్రణయం నాదం ... వాన చినుకుల వీణయపై వేణువులా వినిపిస్తోంది . జీవాత్మ పరమాత్మ తో తాదాత్మ్యం చెందుతుంది .. ప్రకృతి జీవులు పుడమి తల్లి ఒడిలో క్రొత్త అందాలు చూస్తున్నాయి .. పుడమి తల్లి గర్భం క్రొత్త జీవుల ప్రసవానికి పురిటి నొప్పులు పడుతోంది ... సకల జీవులు క్రొత్త జీవుల ఆగమనానికి స్వాగత తెరలు కడుతున్నవి ... కాలచక్రం గ తితప్పలేదని కాల గమనం తెలసిన జీవులు పంచ భూతాల పారవశ్యంతో పరవిశేషించి పోతున్నాయి ... పుడమి తల్లి ప్రసనాన్ని చూడలేకున్నాడు .. పంచ భూతాల పారవశ్యాన్ని పొందలేకున్నాడు ... ప్రకృతి ఒడిలో దూరంగా మిగిలి పోతున్నాడు ... గమ్యం తెలియని జీవిలా . కాలచక్ర గమనంలో కలసి పోతున్నాడు ... చినుకు చినుకులో పచ్చని ప్రకృతి చిత్తరువును చూస్తూ💐💐💐💐 Us rao💐


 

ఇడ్లీలు - బ్రహ్మానుభూతి

 ఇడ్లీలు - బ్రహ్మానుభూతి


తిరుచిరాపల్లి భిక్షందర్ దేవాలయలో ఉండే మా మావయ్య కీర్తిశేషులు శ్రీ సుందరేశ్వర అయ్యర్ ఒకసారి తిరువణ్ణామలై వెళ్లారు. దేవాలయంలో దర్శనం చేసుకుని రమణ మహర్షుల దర్శనం కోసం రమణాశ్రమానికి వెళ్లారు. బహుశా 1940 లేదా 1945 సమయం అప్పుడు అనుకుంటా. భగవాన్ రమణుల గురించి ఎంతో విన్నారు కానీ వారిని మొదటిసారిగా దర్శించుకోబోతున్నారు. భగవానులు అందరితో కలసి ఫలహారము, భోజనం చెయ్యడం చూసి ఆశ్చర్యపోయారు. రమణులు ఇడ్లీలు తినడం చూసి అమితాశ్చర్యానికి లోనయ్యారు.


భగవాన్ రమణులు భక్తులకు దర్శనం ఇవ్వడానికి హాలులోకి రాగానే, మా మావయ్య కూడా అందరితోపాటు కూర్చున్నారు. అప్పుడు మా మావయ్యకి ఒక ఒళ్ళు జలదరించే అద్భుతం జరిగింది. రమణుల కళ్ళు మా మావయ్య కళ్ళతో కలిశాయి. వెంటనే మా మావయ్య శరీరం తేలిక అయ్యింది. చాలా ఆనందం కలిగింది. వెంటనే బాహ్యస్మృతిని కోల్పోయారు. కొద్దిసేపటి తరువాత భగవాన్ రమణులు చూపు తిప్పుకోవడంతో మరలా స్మృతి కలిగింది. చుట్టూ ఏం జరుగుతోందో తెలియక, బాహ్యస్మృతి కోల్పోయి అలా ఎంతసేపు ఉన్నారో కూడా వారికి అర్థం కాలేదు. ఇదంతా వారికి చాలా గందరగోళంగా ఉంది. ఎవర్నైనా అడిగి తెలుసుకోవాలనుంది - కానీ ఎవరిని అడగాలి? చివరకు పరమాచార్య స్వామివారిని అడిగి నివృత్తి చేసుకోవాలని నిశ్చయించుకున్నారు.


వెంటనే వెళ్ళి మహాస్వామి వారిని దర్శనం చేసుకున్నారు. స్వామివారు విశ్రాంతిగా ఉన్నప్పుడు వారి వద్దకు వెళ్ళి, స్వామివారి పాదాలపై పడి తమ తాతగారి పేరు (శ్రీ నారాయణ అయ్యర్), తండ్రిగారి పేరు (శ్రీ గణపతి అయ్యర్), అమ్మగారి పేరు (శ్రీమతి ఈశ్వరి) చెప్పి, వారి మేనమామ గారైన శ్రీ పైంగానాడు పంచపకేశ అయ్యర్ (పరమాచార్య స్వామివారు మహేంద్రమంగళంలో చదువుకుంటున్నప్పుడు, స్వామివారికి ఋగ్వేదం బోధించినవారు) గారి పేరు చెప్పి, చివరగా తమ పేరు చెప్పి నమస్కరించారు. తరువాత వారికి కలిగిన అనుభవాన్ని చెప్పారు.


“ఇటీవలే తిరువణ్ణామలై వెళ్ళాను”


స్వామివారు చురునవ్వుతో, “స్వామీ దర్శనం చేసుకున్నావా?” అని అడిగారు.


మేమందరమూ “స్వామీ” అని కొలుచుకునే దేవుడు, భగవాన్ రమణులను “స్వామీ” అని సంబోధిస్తూ “స్వామీ” దర్శనం చేసుకున్నవా అని మా మావయ్యని అడిగారు!!!


“హా చేసుకున్నాను”


“ఏమి? ‘హా చేసుకున్నాను’ అని అంటున్నావు? ఏం జరిగింది?”

మా మావయ్య ఏదో చెప్పాలనుకుంటున్నారని, కానీ చెప్పడం సరియా? కాదా? అని శంసయిస్తున్నారని స్వామివారికి తెలుసు. అందుకనే చెప్పమని స్వామివారు ప్రోత్సహిస్తున్నారు.

మావయ్య : “లేదు... భగవానుల దర్శనం చేసుకున్నాను. దర్శనం బాగా జరిగింది. వారు అందరితో కూర్చుని భోజనం కూడా చేశారు. . .”


స్వామివారు : “అందరితోపాటు తిన్నారు . . .” ఎందుకు దీర్ఘం తీస్తున్నావు? ఎందుకంటే రమణులు ఇడ్లీలు కూడా తిన్నారని కదూ? అందుకేనా?


స్వామివారికి తెలియని విషయం ఏదైనా ఉందా? వారి సందేహాన్ని స్వామివారు గ్రహించారు.


మావయ్య : “అవును. అవును... తిన్నారు... ఇడ్లీలు తిన్నారు...!”


స్వామివారు : “కనుక నీకు అనిపించింది. ‘ఏమిటిది? కంచి మఠంలో స్వామివారు ఇడ్లీలు తినరు, కానీ ఇక్కడ రమణులు ఇడ్లీలను తింటున్నారు’ అవునా?”


మావయ్య : “అవును... స్వామీ”


స్వామివారు చిరునవ్వుతో చెప్పడం మొదలుపెట్టారు.


“రమణులు అన్నీ ఆశ్రమ పరిధులను దాటిపోయారు. వారికి మఠము, నియమము, పరిధి లేవు. కానీ ఇక్కడ అలా కాదు. ఈ మఠానికి సాంప్రదాయాలున్నాయి. నియమాలున్నాయి, హద్దులున్నాయి. మరియు నాకు వాటినాన్నిటిని పాటించి పాలించాలసిన బాధ్యత ఉంది. అందుకే ఇక్కడ ఇడ్లీలు తినరు (తమని చూపుతూ చిరునవ్వుతూ). అర్థమైందా?”


మావయ్య : “హా...” తలూపారు మా మావయ్య.


స్వామివారు : “సరే. అక్కడ ఇంకేం జరిగింది?”


మావయ్య : “మేము సాయంత్రం మహర్షుల దర్శనానికి వెళ్లాము. అప్పుడు నేను రమణుల వైపే తీక్షణంగా చూస్తున్నాను. హఠాత్తుగా వారు నావైపు చూశారు. వారి చూపు నా కళ్ళల్లోకి పడగానే, నాకు ఏదో జరిగింది. నా స్మృతిని కోల్పోయాను. నా శరీరం తేలికైపోయింది. చాలా అద్భుతమైన అనుభవం. అలా ఎంతసేపు ఉండిపోయానో నాకు తెలియలేదు. హఠాత్తుగా నాకు బాహ్యస్మృతి పొందగానే రమణులు వేరేవైపు చూస్తున్నారు...”


స్వామివారు : “అంటే, ఏం జరిగిందో నీకు తెలియదు అంటావు?”


మావయ్య : “అవును”


స్వామివారు : “అంతేకాక, ఎవరికైనా ఆ స్థితి శాశ్వతంగా ఉండిపోవాలని అనుకుంటున్నావు, కదూ?”


మావయ్య : “అవును”


స్వామివారు చిన్నగా నవ్వారు. కొద్దిసేపు మౌనంగా ఉన్నారు. తరువాత నిదానంగా చెప్పనారంభించారు.


“రమణులు కొద్దిసేపు నీ మనస్సును లేకుండా చేశారు. మనస్సు లేకపోతే, మనస్సు లుప్తమయిపోతే, ఇక ఉండేది ఆనందం మాత్రమే. అటువంటి శాశ్వత ఆనందాన్ని నీకు కాస్త రుచి చూపించారు. నీకు ఎప్పుడు వీలైతే అప్పుడు వెళ్ళి వారి దర్శనం చేసుకో”


మా మావయ్య స్వామివారికి సాష్టాంగం చేసి నమస్కరించి ఊరికి వెళ్ళిపోయారు. తరువాత, ఎన్నోసార్లు భగవాన్ రమణుల దర్శనం చేసుకున్నారు.


ఈ సంఘటనను మా మావయ్య ఎన్నోమార్లు చెబుతూ, ప్రతిసారీ ఆ బ్రహ్మానంద అనుభవాన్ని పొందేవారు.


--- విశి నాథన్


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం ।।

పుత్రులు ఏడు రకాలుగా జన్మిస్తారు

 పుత్రులు ఏడు రకాలుగా జన్మిస్తారు.....!!


1) పూర్వ జన్మలో తన సొమ్మును దాచమని ఒక వ్యక్తికి ఇచ్చి, అది తీసుకోకుండానే మరణించినవాడు, తాను దాచిన సొమ్ము తీసుకోవడానికి ఆ ఇంట్లో పుత్రుడుగా జన్మిస్తాడు.


2) తాను పూర్వ జన్మయందు బాకీపడిన అప్పును (ఋణాన్ని) చెల్లించుటకు పుత్రుడుగా జన్మిస్తాడు.


3) పూర్వ జన్మలోని శత్రుత్వం తీర్చుకోవడానికి ఈ జన్మలో పుత్రునిగా జన్మిస్తాడు.


4) పూర్వ జన్మలో తనకు ఒకడు అపకారం చేసాడు. దానికి ప్రతీకారం తీర్చుకోలేదు. ఈ జన్మలో ప్రతీకారం తీర్చుకోవడానికి అపకారం చేసినవాడికి పుత్రునిగా జన్మిస్తాడు.


5) పూర్వ జన్మలో తాను అనుభవించిన సేవ - సుఖములకు బదులు తీర్చడానికి పుత్రునిగా జన్మించి తల్లిదండ్రులకు సేవ చేస్తాడు.


6) పూర్వ జన్మలో తాను ఏ వ్యక్తి నుండి ఉపకారం పొందుతాడో, ఆ ఉపకారానికి బదులుగా ఉపకారం చేయుటకు పుత్రునిగా జన్మిస్తాడు.


7) ఏమీ ఆపేక్షించనివాడు కూడా పుత్రునిగా జన్మించి, తన విధులను తీరుస్తాడు.


ఇలా పుత్రులుగా జన్మించినవారు కర్మానుసారముగా తమ పనులు పూర్తికాగానే మరణిస్తారు, లేదా దీర్ఘకాలం జీవించి ఉపకారం చేయడమో, ప్రతీకారం తీర్చుకోవడమో చేస్తారు. కేవలం పుత్రులే కాదు, భార్య - భర్త - సోదరుడు - పనిమనిషి - ఆవు - కుక్క మొదలైన పశువులు కూడా కర్మరుణం తీర్చుకోవడానికి మనతో ఉంటారు. ఋణము తీరగానే వదిలి వెళ్ళడమో, పరలోకానికి చేరడమో జరుగుతుంది.

(పరలోక - పునర్జన్మాంకము నుండి)

కాశీ యాత్ర చేయదలచినవారు

 దక్షిణభారతదేశం నుంచి కాశీ యాత్ర చేయదలచినవారు ఎవరైనా ముందుగా రామేశ్వరం చేరుకోవాలి. రామేశ్వరానికి ఇరవై ఎనిమిది కిలో మీటర్ల దూరంలో ఉన్న ధనుష్కొడి కి వెళ్ళాలి. అక్కడ సముద్రస్నానం చేసి కాశీ యాత్రకు సంకల్పం చెప్పుకోవాలి. ఆ సమయంలో ఆసముద్రపు ఇసుకతో నాలుగు శివలింగాలను చేయాలి. సేతు మాధవ, వేణీమాధవ, బిందుమాధవ, రామనాథస్వాములని ఆ లింగములకు పేర్లు పెట్టాలి. వాటికి పూజ చెయ్యాలి. తరువాత వేణీమాధవ సైకతలింగాన్ని ప్రయాగలోని త్రివేణీసంగమం లో నిమజ్జనం చేయటానికి ఒక పెట్టెలో భద్రంగా ఉంచాలి. మిగిలిన మూడు లింగాలను సముద్రంలో కలిపివేయాలి. అక్కడినుంచి రామేశ్వరం చేరుకోవాలి. అక్కడ రామేశ్వరస్వామివారి గుడి ప్రాంగణంలో ఉన్న నూతుల నీళ్ళతో స్నానం చేసి అక్కడ ఉన్న నూతలలోని జలాలను ఒక పాత్రలో భద్రం చేసుకోవాలి.

అక్కడి నుంచి కాశీ యాత్రకు ప్రయాణం ప్రారంభించాలి. కాశీ యాత్ర అంటే ... ముందు ప్రయాగ ...అక్కడి నుంచి కాశీ ...అక్కడి నుంచి గయ వెళ్ళటమన్నమాట.ప్రయాగలో ... సంకల్పం, వేణీదానం, త్రివేణీ సంగమంలో తమతో ధనుష్కోడి నుంచి తెచ్చిన సైకతలింగాన్ని నిమజ్జనం చెయ్యటం, వేణీమాధవస్వామి దర్శనం చేసుకోవటం, అక్కడి గంగనీటిని సేకరించటం, హిరణ్యశ్రాద్ధం, పిండప్రదానం, తిలతర్పణం చెయ్యటం అనేవి ముఖ్య విధులు. అక్కడి నుంచి కాశీ చేరుకోవాలి.

కాశీలో మొదటి రోజు గణపతి పూజ, మహాసంకల్పం, తర్పణం, మణికర్ణిక ఘాట్ లో స్నానం, ఫలదానం, అన్నరూపహోమశ్రాద్ధం, పిండప్రదానం, తిలతర్పణం చెయ్యాలి. ఆ రోజు సాయంకాలం శ్రీకాశీవిశ్వేశ్వరస్వామి, అన్నపూర్ణ, విశాలాక్షి అమ్మవార్ల దర్శనం చేసుకోవాలి. అక్కడ శ్రీకాశీవిశ్వనాథస్వామివారికి శ్రీరామేశ్వరం నుంచి తెచ్చిన సముద్రజలాలతో అభిషేకం చెయ్యాలి.

కాశీలో రెండవరోజు అసి ఘాట్, వరుణఘాట్, దశాశ్వమేధఘాట్, పంచగంగా ఘాట్, మణికర్ణికఘాట్ లలో పిండప్రదానం, తిలతర్పణం చెయ్యాలి. అక్కడి నుంచి బిందుమాధవదర్శనం చేసుకుని గంగా పూజ చెయ్యాలి. మూడవరోజు గయకు చేరుకోవాలి. గయలో మహాసంకల్పం, పల్గుణీ తీర్థస్నానం, హిరణ్యశ్రాద్ధం, పిండప్రదానం, విష్ణుపాద హిరణ్య శ్రాద్ధం, హోమసహిత అన్నశ్రాద్ధం, అక్షయవటం దగ్గర పిండప్రదానం, ఫలదానం చెయ్యాలి.

నాల్గవరోజున తిరిగి వారణాశికి (కాశీకి మరో పేరు వారణాశి) చేరుకుని అక్కడ గంగాతీరంలో దంపతీ ఫూజ చేసి అక్కడినుంచి కాలభైరవస్వామి ఆలయంలో భైరవదర్శనం చేసుకుని రక్షతాడు కట్టుకోవాలి. కాలభైరవ దర్శనంతో కాశీ దర్శనం పూర్తి అయ్యింది అన్న మాట. అక్కడి నుంచి తిరిగి రామేశ్వరానికి చేరుకుని శ్రీరామనాథస్వామిని ప్రయాగలో సేకరించిన గంగాజలాలతో అభిషేకించాలి. ఈ అభిషేకవిధితో కాశీయాత్ర పరిపూర్ణమౌతుంది. కాశీలో తొమ్మిది రోజులు బస చెయ్యాలి అనేది ఒక విశ్వాసం తో కూడిన ఆచారమే కాని తప్పని సరి నియమం కాదు.

Triple jump


 

Finger dancing


 

గురువారం, జూలై 27, 2023*రాశి ఫలాలు

.       *🌹ఓం శ్రీ గురుభ్యోనమః🌹*

.  *శ్రీరస్తు - శుభమస్తు - అవిఘ్నమస్తు*


*గురువారం, జూలై 27, 2023*

*శ్రీ శాలివాహన శకం: 1945*

*శ్రీ శోభకృత్ నామ సంవత్సరం*

*దక్షిణాయనం - వర్ష ఋతువు*

*అధిక శ్రావణ మాసం - శుక్ల పక్షం*

*తిధి*      :  *నవమి ఉ10.17* వరకు 

.                *🌹రాశి ఫలాలు🌹* 


*మేషం*


దూర ప్రయాణాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి.   దీర్ఘ కాలిక ఆరోగ్యసమస్యలు భాదిస్తాయి. బంధు మిత్రులతో  ఆకస్మిక  వివాదాలు కలుగుతాయి.  వృత్తి ఉద్యోగాలలో ఇతరులతో  వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. దైవ చింతన పెరుగుతుంది. వ్యాపారాలు అంతగా కలిసిరావు.

---------------------------------------

*వృషభం*


స్ధిరాస్తి  వ్యవహారాలలో  నూతన ఒప్పందాలు కలసి వస్తాయి. నూతన వ్యాపారాలు ప్రారంభించిన ఆశించిన  లాభాలు అందుకుంటారు. జీవిత భాగస్వామితో దైవ సేవా కార్యక్రమాలలో  పాల్గొంటారు. చిన్ననాటి మిత్రులతో  కీలక విషయాలు చర్చిస్తారు.  ఉద్యోగులకు ప్రోత్సాహకాలు అందుతాయి.  నిరుద్యోగులకు ఉద్యోగ అనుకూలత కలుగుతుంది.

---------------------------------------

*మిధునం*


సోదరులతో ఆస్తి వివాదాలు తొలగి ఊరట చెందుతారు. వాహన వ్యాపారస్తులు నూతన  లాభాలు అందుకుంటారు. అవసరానికి  సన్నిహితులు సాయం అందుతుంది. కుటుంబ వాతావరణం సందడిగా ఉంటుంది. వృత్తి  ఉద్యోగాలలో  హోదాలు పెరుగుతాయి. ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి. గృహోపకరణాలు కొనుగోలు  చేస్తారు.

---------------------------------------

*కర్కాటకం*


వృత్తి వ్యాపారాలు నిదానంగా  సాగుతాయి. చేపట్టిన వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. దూర  ప్రయాణాలు  సూచనలున్నవి.  కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయాలలో  కొంత చికాకు తప్పదు. ఇంటా బయట అప్రమత్తంగా  వ్యవహరించాలి.  ఉద్యోగమున  అదనపు బాధ్యతలుంటాయి. ఆర్థికంగా కొంత నిరాశ తప్పదు.

---------------------------------------

*సింహం*


తల్లి తండ్రుల ఆరోగ్యం విషయంలో  అశ్రద్ధ  చేయడం మంచిది కాదు. వృత్తి వ్యాపారాలలో  గందరగోళ పరిస్థితులు ఉంటాయి. నూతన రుణ ప్రయత్నాలు  చేస్తారు. బంధువులతో వివాదాలు కలుగుతాయి. ఉద్యోగమున అధికారుల నుండి ఒత్తిడి పెరుగుతుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలించక నిరాశ పెరుగుతుంది. 

---------------------------------------

*కన్య*


నూతన పరిచయాలు పెరుగుతాయి. చేపట్టిన పనులు అప్రయత్నంగా పూర్తిచేస్తారు.  ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగ యత్నాలలో విజయం సాధిస్తారు. సంఘంలో  స్నేహితుల నుండి ఊహించని ధనలాభం కలుగుతుంది. వృత్తి వ్యాపారాలలో  ఆర్ధిక పురోగతి సాధిస్తారు. నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు.

---------------------------------------

*తుల*


ముఖ్యమైన వ్యవహారాలలో కుటుంబ పెద్దల  సలహాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది. ప్రయాణాల వలన శారీరక శ్రమ పెరుగుతుంది. బంధుమిత్రుల నుండి ఋణ ఒత్తిడి  పెరుగుతుంది.   వ్యాపారమునకు  పెట్టుబడులు సకాలంలో అందవు. వృత్తి  ఉద్యోగాలలో అధిక శ్రమతో అల్ప ఫలితం పొందుతారు.

---------------------------------------

*వృశ్చికం*


అన్ని రంగాల వారికి అనుకూల వాతావరణం. విలువైన వస్తువులు  కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యుల  ఆదరణ పెరుగుతుంది. భూ సంబంధిత క్రయ విక్రయాలలో  ఆశించిన  లాభాలు అందుకుంటారు. వృత్తి వ్యాపారములు పుంజుకుంటాయి.  ఉద్యోగస్తులకు  అధికారుల సహాయ సహకారాలు అందుతాయి.

---------------------------------------

*ధనస్సు*


వృత్తి వ్యాపారమున  నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి. సోదరులతో స్ధిరాస్తి వివాదాలు కలుగుతాయి. దూర ప్రయాణాలలో మార్గ అవరోధాలు  కలుగుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో  పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి  నిరాశ కలిగిస్తుంది.

---------------------------------------

*మకరం*


సన్నిహితుల నుండి విలువైన విషయాలు సేకరిస్తారు. వృత్తి వ్యాపారాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు. ఉద్యోగ విషయమై ఆశించిన  మార్పులు చోటు చేసుకుంటాయి. కుటుంబ సభ్యులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక అనుకూలత కలుగుతుంది.

---------------------------------------

*కుంభం*


కీలక వ్యవహారాలలో స్వంత నిర్ణయాలు తీసుకుని ముందుకు సాగుతారు. మిత్రుల  నుండి శుభకార్య  ఆహ్వానాలు అందుతాయి. ఆకస్మిక ధన లాభాలుంటాయి. స్ధిరాస్తి  సంబంధిత వివాదాల నుంచి బయటపడతారు.  వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పనికి  తగిన గుర్తింపు లభిస్తుంది.

---------------------------------------

*మీనం*


కొన్ని వ్యవహారాలలో  సన్నిహితుల నుండి మాటలు పడవలసి వస్తుంది.  నూతన వ్యాపారాలు ప్రారంభానికి ఆటంకాలు కలుగుతాయి. ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. తగినంత ఆదాయం లభించదు. చేపట్టిన పనులలో జాప్యం కలిగిన నిదానంగా  పూర్తిచేస్తారు.  వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి పెరుగుతుంది.


సేకరణ:- శ్రీ కె.వి. రమణమూర్తి గారి వాట్సాప్ పోస్ట్. 

🎄🌲🪻🎄🌲🪻🎄🌲🪻🎄

👉 *అహింసా పరమో ధర్మః - ధర్మ హింసా తథైవ చ !!*

👉 *ధర్మో రక్షతి రక్షితః - వృక్షో రక్షతి రక్షితః*


🐐🐂👩‍❤️‍👨🦀🦁💃⚖️🦂🏹🐊🏺🦈                                                                   

*ఇష్టదేవతానుగ్రహప్రసాదసిద్ధిరస్తు,*🙏🏻

*లోకాసమస్తా సుఖినోభవంతు,*🙏🏻

*సర్వేజనాః సుఖినోభవంతు,*🙏🏻


🐄 *గోమాత రక్షణ వేదమాత పోషణ మనందరి బాధ్యత*🙏🏻

🐐🐂👩‍❤️‍👨🦀🦁💃⚖️🦂🏹🐊🏺🦈

Reservation for brahmins


 

 The Minister of State for Home Affairs, Shri Ajay Kumar Mishra, in a written reply to a question in the Rajya Sabha answered the following today. 


During the 3 years from 2019 to 2021, a total of 30,196 females from Andhra Pradesh which includes (7918 girls below 18 years) and (22,278 women, above 18 years) went missing. 


A closer look at the numbers tell that the number of missing girls and women in our Andhra Pradesh has been on a rising trend. Why are our girls and women missing? What’s happening to them? Who will take responsibility?  


Will the AP Mahila Commission come to the press and talk about this in public tomorrow? Will the AP Mahila Commission demand an explanation from the Home Ministry and DGP? Will the AP Mahila Commission finally act and question the YCP Govt?


JanaSena demands the Home Minister and DGP to respond. 


#WakeupAPMahilaCommission 


#SaveAPfromYCP

Bhagavath geeta


 

Rose



 

Lean persons


 

అల్పునితో తలపడితే

 🍀🌅 *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄


                _*సుభాషితమ్*_


 𝕝𝕝 శ్లోకం 𝕝𝕝


కరావివ శరీరస్య 

నేత్రయోరివ పక్ష్మణి

అవిచార్య ప్రియం

కుర్యాత్తన్మిత్రం మిత్రముచ్యతే


≈భావం≈

శరీరానికి చేతుల వలె, కళ్ళకు రెప్పల వలె.... అప్రయత్నంగా ప్రియం చేకూర్చేవాడే మిత్రుడు.


కాయమునకు రెండు కరముల పగిదిగన్,

పక్ష్మ ముండు నట్టు లక్షులకును,

సంతసమున ప్రియము సమకూర్చు మనుజుండె 

మిగుల శ్రేష్ఠమైన మిత్రు డరయ*1801*

*కం*

అల్పునితో తలపడితే

యల్పంబౌ నీదువిలువ యల్పుని కన్నన్

అల్పుడు బలవంతుని కడ

నల్పుని గనె మిగులి యుండు ననయము సుజనా.

*భావం*:-- ఓ సుజనా! అల్పునితో యుద్ధం చేయడం వలన నీ స్థాయి ఆ అల్పునికన్నా తగ్గి పోతుంది.  కానీ అల్పుడు బలవంతుని వద్ద మాత్రం ఎల్లప్పుడూ అల్పునిగానే మిగులుతాడు.

అంటే అల్పులతో వైరము వలన నష్టపోయేది బలవంతుడే.

*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*

మృదంగ శైలేశ్వరి దేవి

 *🙏🌹మృదంగ శైలేశ్వరి దేవి*🌹🙏


🌹🌹🔥🔥🌹🌹🔥🔥🌹🌹


కేరళ లోని ఈ ఆలయంలో విగ్రహాన్ని🌻 దొంగతనం చేసిన ప్రతిసారి ఆ విగ్రహాన్ని తీసుకుని వెళ్లలేక దొంగలు మళ్ళీ వదిలి వెళ్ళటం ఇలా 3సార్లు జరిగింది...


"మృదంగ శైలేశ్వరి ఆలయం" అనేది దక్షిణ కేరళ రాష్ట్రంలోని కన్నూర్ జిల్లా, ముజక్కున్ను వద్ద ఉన్న ఒక పురాతన దేవాలయం. ఋషి పరశురామునిచే స్థాపించబడిన 108 దేవాలయాలలో ఇది ఒకటిగా చెప్పబడుతోంది.


కేరళ శాస్త్రీయ నృత్యం "కథాకళి" ఇక్కడే ఉద్భవించింది.


దీనిని జ్ఞానానికి సంబంధించిన ఒక తాంత్రిక శక్తి పీఠంగా చెప్తారు. ఇక్కడ ప్రధాన దేవి దుర్గను "మిఝావిల్ భగవతి" అని కూడా పిలుస్తారు. ఈ ఆలయానికి "మృదంగ శైలేశ్వరి" అని పేరు రావడం వెనుక ఒక కథ ఉంది. ఈ ప్రదేశంలో మృదంగ ఆకారంలో ఉన్న ఒక శిల స్వర్గం నుండి పడిపోయింది అని చెప్తారు. ఈ శిలలోనే శక్తి లేదా దేవి యొక్క ఉనికిని గమనించిన పరశురాముడు ఆమెను విగ్రహంలోకి ఆహ్వానించి ఆమె కోసం ఆలయాన్ని నిర్మించాడు అని స్థలపురాణం.


ఈ ఆలయంలో కొద్ది దశాబ్దాలుగా జరుగుతున్న అద్భుతం ఏమిటంటే, నాలుగుసార్లు, దొంగలు ఈ ఆలయ విగ్రహాన్ని దొంగిలించారు, కానీ వారు దానితో ఎక్కువ దూరం వెళ్ళలేక దానిని వెంటనే వెనక్కి తెచ్చి యథాస్థానం లో ఉంచేశారు.


ఇటీవల కేరళ రిటైర్డ్ డిజిపి శ్రీ అలెగ్జాండర్ జాకబ్ భగవతి గారు విగ్రహాన్ని దొంగిలించిన ఆ దొంగల కథను ఒక టివి ఛానల్ లో వివరించాడు. ఈ ఆలయంలో ఉన్న ‘పంచలోహ విగ్రహం’ మార్కెట్ విలువ దాదాపు 1 నుంచి 2 కోట్ల వరకు ఉంటుంది. ఆయన డి జి పి పనిచేస్తున్నప్పుడు ఆయన సిఫారసు చేసినప్పటికీ కూడా ఇప్పటి వరకు ఈ ఆలయానికి ప్రభుత్వం సెక్యూరిటీ గార్డులును ఇవ్వలేదట. ఎందుకంటే ఆ విగ్రహాన్ని దొంగిలించడం అసాధ్యమని వారు నమ్మడమే.


మొదటిసారిగా దొంగలు ఈ విగ్రహం దొంగతనం చేసిన తరువాత దానిని పారక్కడవు వద్ద రోడ్డుపక్కన ఒక నోట్‌తో వదిలేశారు - "ఈ విగ్రహం మృదంగ శైలేశ్వరీ ఆలయానికి చెందినది, దాన్ని ముందుకు తీసుకెళ్లలేకపోతున్నాం, దానిని తిరిగి ఆలయానికి తీసుకెళ్లవచ్చు అని".


రెండో సారి, 3 సంవత్సరాల తర్వాత, దొంగలు దానిని 300 మీటర్ల దూరం మాత్రమే తీసుకెళ్లారు. రెండు సందర్భాల్లోనూ ఆలయ ఆవరణలో మరియు వారు విగ్రహం వదలిపెట్టిన స్థలంలో కూడా మలవిసర్జనలు జరిగాయి.


మూడవసారి దొంగలు దానిని కాల్పేట వరకు తీసుకెళ్లారు. కానీ విగ్రహానికి సంబంధించిన వివరాలను సమీపంలోని పోలీస్‌స్టేషన్‌కు తెలియచేసి ఆ విగ్రహాన్ని అక్కడి లాడ్జిలో వదిలిపెట్టారు.


Mr. అలెగ్జాండర్ అనే పోలీసు అధికారి ఈ మూడు సందర్భాల్లో తనే డ్యూటీలో ఉన్నందున దొంగలు మూడు సార్లు విఫలం కావడంతో అతను

అబ్బురపడ్డాడు. తరువాత, చాలా సంవత్సరాల తరువాత దొంగలు పట్టుబడినప్పుడు, వారు దొంగిలించబడిన విగ్రహంతో తప్పించుకోలేకపోవడానికి ఖచ్చితమైన కారణాన్ని అడిగితే వారు విగ్రహాన్ని దేవాలయం నుండి తీసి తమ వెంట తీసుకెళ్తున్నప్పుడు, వారు తమ వెళ్లాల్సిన దిశను పూర్తిగా మర్చిపోతున్నారని, వాళ్ళు నిద్రాణ స్థితిలోకి వెళ్ళిపోతున్నట్టు ఉంటుందని మరియు అన్నిటి కంటే భయంకరమైన విషయం ఏమిటంటే, వారు తమ ప్రేగు కదలికలపై నియంత్రణను కోల్పోయి మూత్ర విసర్జన మరియు మల విసర్జన అనియంత్రితంగా చేస్తారు అని దొంగలు చెప్పారు.


ఇదే విషయమై ఆలయ పూజారులను ప్రశ్నించినప్పుడు, విగ్రహం యొక్క 'ప్రతిష్ట కర్మ' చాలా సుదీర్ఘమైన ప్రక్రియ (9 రోజుల కంటే ఎక్కువ జరిగింది) అని, ఈ దొంగల వైఫల్యాని కి కారణం ఆ 'ప్రతిష్ట కర్మ' యొక్క 'తాంత్రిక విధి విధానాల' యొక్క ఫలితమే అని చెప్పారు.


అయితే ఈ మూడు విఫల ప్రయత్నాలు కూడా విగ్రహాల దొంగల ముఠా తదుపరి ప్రయత్నాలను ఆపలేదు.


ఈసారి అది కేరళ రాష్ట్రంలోని మైనారిటీ వర్గానికి చెందిన అనుభవజ్ఞులైన దొంగల ముఠా ప్రయత్నించారు. కారణం వారు విగ్రహంలోని అతీంద్రియ శక్తులను విశ్వసించలేదు. కానీ వారు కూడా విగ్రహాన్ని వదిలిపెట్టారు. తరువాత వారు పట్టుబడినప్పుడు కూడా, వారు విగ్రహాన్ని విడిచిపెట్టడానికి పైన చెప్పిన కారణాలే చెప్పారు.


మన తెలివితేటలు మరియు మన శాస్త్రీయ పరిజ్ఞానానికి అంతు పట్టని విషయాలు మన ఈ ప్రకృతిలో ఎన్ని ఉన్నాయో.


*సర్వేజనాసుఖినోభవంతు*🙏🙏


🙏🌹🙏🌹🙏🌹

బండి ఆగిపోయిందా..

 బండి ఆగిపోయిందా..


83339 93360కు వాట్సప్ చేయండి


అందుబాటులోకి తెచ్చిన సైబరాబాద్ పోలీసులు

- హైదరాబాద్: ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షా లతో నడిరోడ్డుపై వాహనాలు మొరాయించి ట్రాఫిక్ జామ్లు పెరు గుతున్నాయి. ఈ సమస్య పరిష్కరించేందుకు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక నంబరు అందుబాటులోకి తెచ్చారు. కమిషన రేట్ పరిధిలో ఎక్కడైనా రహదారిపై వాహనం నిలిచిపోతే.. ప్రజలు సంప్రదించేందుకు

 83339 93360 ప్రత్యేక వాట్సప్ నంబరు ఏర్పాటు చేశారు.

 ఇది 24 గంటలు పనిచేస్తుందని సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీలు హర్షవర్ధన్, శ్రీనివాస్ రావు తెలిపారు. వర్షాల నేప థ్యంలో సాయం కోసం సంప్రదించేందుకు నంబర్లు ఇచ్చారు.


మేడ్చల్ ట్రాఫిక్ డీసీపీ మాదాపూర్ ట్రాఫిక్ డీసీపీ


87126 63011


87126 63010


సైబరాబాద్ పోలీసుల వాట్సప్ నంబరు 9490617346

సాలగ్రామము

 *🍁సాలగ్రామములు - పుట్టు పూర్వోత్తరాలు*🍁




సాలగ్రామము విష్ణుప్రతీకమైన ఒక శిలా విశేషము. సర్వకాల సర్వావస్థలయందు విష్ణువు సాక్షాతూ సాన్నిధ్యం కలిగి ఉండేది సాలగ్రామంలో మాత్రమే. అందుచేత గృహ దేవతార్చనలలోగానీ, దేవాలయాలలో గానీ సాలగ్రామము (మూర్తి) లేకుండా పూజలు కొనసాగవు. ద్వైతులు, విశిష్టాద్వైతులు, అద్వైతులు తమతమ దేవతార్చనలలో సాలగ్రామములను పూజకు ఉపయోగిస్తారు.


భారతదేశంలో సాలగ్రామ పూజ బహు పురాతనమైనది. క్రీస్తు కంటే ప్రాచీనుడైన అపస్తంబుడు సాలగ్రామ పూజను పేర్కొన్నాడు. త్రిమతాచార్యులు తమతమ భాష్యాలలో సాలగ్రామాలు విష్ణురూపాలని వివరించారు. దేవాలయాలలో పంచాయతన మూర్తులకు శిలా ప్రతిమలు ఉంటే గృహస్థులకు మణి, స్వర్ణ నిర్మితమైన మూర్తులు, సాలగ్రామములు ఉంటాయి. సాధారణంగా ప్రతిమలకు నిత్య పూజా సమయంలో ఆవాహనాది షోడశోపచారాలు చేయాలి. సాలగ్రామాలలో దేవత నిత్యం సన్నిహితమై ఉండడం వల్ల వాటికి పూజా సమయంలో అవాహనాది ఉపచారాలు అవసరం లేదు.

హిందువులందరికీ తులసి, శంఖం, సాలగ్రామం పూజనీయమైనవి. తులసి హిందువుల ఇహపర సాధనానికి భూలోకంలో అవతరించిన వనదేవత. ఈ తులసి అపూర్వమైన మూలిక కూడా. శంఖం అత్యంత పవిత్రమైనది. శంఖారావం వ్యాపించినంత దూరం సూక్ష్మక్రిములు నశిస్తాయి అంటారు. నీరు శంఖంలో పూరిస్తే తీర్థం అవుతుంది. వట్టివేళ్ళు, ఏలకులు, లవంగాలు, పచ్చ కర్పూరం మొదలైన సుగంధ ద్రవ్యాలు చేర్చిన నీటిని శంఖంలో పోసుకుంటూ సాలగ్రామాలకు పురుషసూక్తం పఠిస్తూ అభిషేకం చేసిన తీర్థం సర్వశక్తివంతం. ఇటువంటి తీర్ధాన్ని భక్తితో సేవిస్తే ప్రాయశ్చిత్తం, పాపక్షయం కలుగుతుంది. తీర్ధాన్ని మూడుసార్లు తీసుకుంటారు. మొదటిది కాయసిద్ధి కొరకు, రెండవది ధర్మసాధనకు, మూడవది మోక్షం పొందడానికి.  తీర్ధం తీసుకోవటం ద్వారా అకాల మృత్యుహరణం, సర్వవ్యాధి నివారణం, సమస్త పాపక్షయం కలుగుతాయి.


సాలగ్రామాలు ఉన్న ఇల్లు గొప్ప పుణ్యక్షేత్రంతో సమానం. సాలగ్రామ దర్శనం వల్ల, స్పర్శవల్ల, అర్చనవల్ల అంతులేని పుణ్యం లభిస్తుంది. సాలగ్రామాలు శిలాజాలు. శాస్త్రజ్ఞులు ఈ శిలలను ఒక విధమైన ప్రాణి నిర్మిస్తుందని అంటారు. ఆలి అనే ఒక విధమైన మత్స్యం శీతాకాలంలో తన శరీరం నుంచి వెలువడే ఒక విధమైన రసాయనిక పదార్ధంతో శిలామయమైన కవచాన్ని నిర్మించుకుని దానిలో నివశిస్తుందని అది మరణించినప్పుడు లేక వదిలి వెళ్ళినప్పుడు అవి సాలగ్రామాలుగా మనకు లభిస్తాయని అంటారు. సాలగ్రామాల మీద వివిధ దేవతా చిహ్నాలు ఉంటాయి. ముఖ్యంగా చక్రం, పద్మం ప్రధాన చిహ్నాలు. విష్ణు భక్తులైన మధ్వలకు, వైష్ణవులకు ఇవి పూజకు ఎంతో విలువైనవి. వైష్ణవ పురాణాలు, ఇతవ వైష్ణవ గ్రంధాలు వీటిని గురించి సవిస్తరంగా వివరిస్తాయి.

నేపాల్ దేశంలో ఖట్మండుకు సుమారు 197 మైళ్ళు దూరంలో ముక్తినాధ్, గండకీ నదీ తీరంపై ఉన్న మహాక్షేత్రంలో ఇవి లభిస్తాయి. ఇవి సాధారణంగా స్థలజాలు, జలజాలు అని రెండు రకాలు. గండకీ నదీ తీరాన్ని ఆనుకుని ఉన్న సాలగ్రామ గిరిపైన స్థలజాలు, గండకీ నదీ గర్భంలో జలజాలు లభిస్తాయి.


సాలగ్రామాలలో బంగారం ఉంటుంది. అందుకే వాటిని హిరణ్యగర్భ అని కూడా అంటారు. సాలగ్రామాలు అమోనైట్ శిలాజాలు. ఇండియాలో ఈ సాలగ్రామాలు సముద్రంలో నివసించే టెథైస్ అనే ప్రాణి వల్ల ఏర్పడతాయి. ఇటువంటి శిలాజాలు అనేక రకాలు ఉన్నాయి. 250 మిలియన్ సంవత్సరాలలో ఇండియా ఉత్తర దిక్కుగా 9,000 కి.మీ. జరిగిపోయింది. హిమాలయాలు ఏర్పడ్డాయి. వీటి నుండి అనేక నదులు ప్రవహించాయి. ఇండో మైదానంలోకి ప్రవహించిన అటువంటి నదులలో ఒకటి గండకి. సాలగ్రామములు మన శాస్త్రం అనుసరించి కొన్ని సౌమ్యమైనవి. కొన్ని ఉగ్రమైనవి. శాస్త్ర సమ్మతంగా చక్రశుద్ధి, వక్త్రశుద్ధి, శిలాఉద్ధి, వర్ణశుద్ధి గల వాటినే పూజించాలి. రకరకాల రంగులు గలిగిన కారునలుపు, భగ్నమైన, మొక్కవోయిన సాలగ్రామాలను పూజించకూడదు. నారసింహ పాతాళ నారసింహ, గండభేరుండ, మహాజ్వాల మొదలైనవాటిని సన్యాసులు, బ్రహ్మచారులు పూజించాలి. విష్ణు, సీతారామ, గోపాల వంటి శాంతమూర్తులనే గృహస్థులు పూజించుకూవాలంటారు. పరిమాణాన్నిబట్టి కూడా పూజార్హతను నిర్ణయించుకుంటారు.. సాధారణంగా ఇవి ప్రతి గృహంలోనూ వంశపారంపర్యంగా సంక్రమిస్తుంటాయి. సాలగ్రామ శిలామహత్మ్యం గురించి వేరే చెప్పనక్కరలేదు. తిరుపతిలో శ్రీ వేంకటేశ్వరునికీ, మంత్రాలయంలో శ్రీ రాఘవేంద్ర స్వామి వారికీ అంతటి మహిమ ఉండడానికి కారణం అక్కడ ఉండే సాలగ్రామాలు అంటారు. సాలగ్రామాన్ని పూజిస్తే ఎంత పుణ్యం లభిస్తుందో దాని దానం వలన కూడా అంతటి ఫలం లభిస్తుంది.


2 )పూర్వం విదేహరాజ్యంలో ప్రియంవద అనే స్ర్తీమూర్తి ఉండేది. అత్యంత రూపవతి, గుణవతి అయిన ఆమె, శ్రీమన్నారాయణుని ప్రసన్నం చేసుకుని, ఆయన తన కుమారునిగా జన్మించాలని కోరుకుంటుంది. ఆమె కోరికను మన్నించిన స్వామివారు, మరుజన్మలో ఆమె గండకీ నది రూపాన్ని ధరించేటట్లుగా చేసి, తాము సాలగ్రామ రూపంలో ఆ నది నుంచి ఉద్భవిస్తున్నారని కథ.సాలగ్రామ శిలయందు, చరాచరాత్మకమగు మూడు లోకాలు అణిగి ఉన్నాయి.


ఆ కారణంగా సాలగ్రామాన్ని భక్తిశ్రద్ధలతో, పరిపూర్ణ విశ్వాసంతో, శాస్త్ర ప్రకారం అభిషేకిస్తే, కోటి యజ్ఞాలు చేసినంత పుణ్యఫలానికి సమానమవుతుంది. మరియు కోటి గోవులను దానం చేసినంత ఫలితాన్ని పొందుతారు. సాలగ్రామ పూజచే, శివకేశవులని పూజించిన ఫలితం కలుగుతుందిట.

సాలగ్రామం వున్న ప్రదేశాలలో స్నానం చేసినా, దానం చేసినా, కాశీ క్షేత్రంలో పవిత్ర గంగానదీ స్నానంకంటే, ఆ పుణ్యక్షేత్రంలో చేసిన దానం కంటే, నూరు రెట్లు అధిక ఫలము కలుగుతుంది. సాలగ్రామమును అభిషేకించిన పుణ్య జలాలను ప్రోక్షించుకొనినచో, సర్వపాపాలను నశింపజేస్తుంది. సర్వరోగాలు తొలగిపోతాయి. సకల సంపదలు కలుగుతాయి, సర్వశుభాలను కలిగించి, మోక్ష సామ్రాజ్యమును సిద్ధింపజేస్తుంది. సాలగ్రామమును అభిషేకించిన జలాలను ప్రోక్షించుకొనిన యెడల, పవిత్ర గంగానదీ స్నానమాచరించిన యెడల సర్వ తీర్థాలలో స్నానమాచరించిన పుణ్యఫలం కలిగి, సర్వదేవతలను ఆరాధించిన ఫలితం కలుగుతుంది.


ఒక్కసారి భక్తిశ్రద్ధలతో సాలగ్రామాన్ని శాస్త్ర ప్రకారం పూజించి, అభిషేకించితే కోటి లింగాలను దర్శించి, పూజించి, అభిషేకించిన ఫలితం కలుగుతుంది. సాల గ్రామ తీర్థం సేవించినచో, వెయ్యిసార్లు పంచామృత మును సేవించిన ఫలితముకంటే, ప్రాయశ్చిత్తముల యందు ఆచరించు దానాలు ఫలితం కంటే అధిక  ఫలితం ఉంటుంది. కనీసం, సాలగ్రామాన్ని అర్చించు టకు మంత్రాదులు తెలియకున్నప్పటికీ, శక్తిననుసరించి పూర్తి భక్తివిశ్వాసాలతో పూజిస్తే, కొన్ని ఫలితాలైనా కలుగుతాయి. సాలగ్రామ శిల యందు ఉంచిన అన్ని పదార్థములు పవిత్రములవుతాయి. సాలగ్రామమును ముందుంచుకుని పితృదేవతలకు తర్పణాలను ఇచ్చిన ఎడల, ఆ పితృదేవతలు స్వర్గంలో శాశ్వత సుఖాలను పొందుతారు. అన్ని విధాలైన పుణ్యాలకు పరిమితులున్నాయి గాని, ఈ సాలగ్రామశిలా పూజచే కలుగు పుణ్యానికి పరిమితులు లేవు. అతల, వితల, రసాతల, పాతాళాది పదునాలుగు లోకాలలో ఈ సాలగ్రామ శిలకు సరిపడునట్టి వేరొక శిల లేదన్నదే శాస్తవ్రచనం.

కార్తీక మాసంలో సాలగ్రామ శిలపై ‘స్వస్తిక’ మండల మును రచించినచో అనంతమైన పుణ్యఫలము కలుగుతుంది. సంవత్సరకాలం గృహంలో ‘నిత్యాగ్ని హోమం’ చేసిన ఫలితానికి సమానమైన ఫలితాన్ని పొందుతారు. సాలగ్రామంపై శుద్ధమైన మట్టితో గాని, రంగులతో గాని, ఏ కొద్దిపాటి కేశవనామాలను వ్రాసినా, కోటి కల్పాల వరకూ స్వర్గంలో నివసించే భాగ్యం కలుగుతుందిట. పూజాపీఠంలో సాలగ్రామమును ఉంచితే, సమస్తమైన పూజలు సక్రమంగా సాగి పరిపూర్ణ ఫలితాలను పొందుతారు. సాలగ్రామాలు ఎంత చిన్నవిగా ఉంటే అంత మంచిది. సాలగ్రామాలు పగిలినప్పటికీ, పెచ్చు వూడినప్పటికీ కూడా పూజార్హత కలిగి ఉంటాయి. కొన్ని సాలగ్రామాలు ఇంట్లో పెట్టుకుని పూజించుటకు అర్హత కలిగి ఉండవు. విపరీత పరిణామాలు కలుగుతాయి, కాబట్టి ఇంట్లో పెట్టుకుని పూజించాలనుకుంటే, సాలగ్రామములను గురించి క్షుణ్ణంగా తెలిసిన పండితుల అమూల్యమైన అభిప్రాయాలను తెలుసుకుని ఆచరించటం శ్రేయస్కరం.

సాలగ్రామంపై గల చక్రాలను బట్టి వాటికి వివిధము లైన పేర్లు ఉన్నాయి.


1 చక్రం ఉంటే - సుదర్శనం అని,


2 చక్రములు ఉంటే - లక్ష్మీనారాయణ అని,


3 చక్రములు ఉంటే - అచ్యుతుడు అని,


4 చక్రములు ఉంటే - జనార్ధనుడు అని,


5 చక్రములు ఉంటే - వాసుదేవుడు అని,


6 చక్రములు ఉంటే - ప్రద్యుమ్నుడు అని,


7 చక్రములు ఉంటే - సంకర్షణుడు అని,


8 చక్రములు ఉంటే - పురుషోత్తముడు అని,


9 చక్రములు ఉంటే - నవ వ్యూహము అని,


10 చక్రములు ఉంటే - దశావతారము అని,


11 చక్రములు ఉంటే - అనిరుద్ధుడు అని,


12 చక్రములు ఉంటే - ద్వాదశాత్ముడు అని,


12 చక్రముల కన్నా ఎకువ ఉంటే ‘అనంతమూర్తి’ అని అంటారు. సాలగ్రామాలు తెల్లనివైతే సర్వపాపాలను హరిస్తాయి. పసుపుపచ్చనివి అయితే సంతానభాగ్యాన్ని కలిగిస్తాయి. నీలవర్ణంగలవి అయితే సర్వసంపదలను ఇస్తాయి. ఎరుపురంగు గలవి అయితే రోగాలను కలిగిస్తాయి, వక్రముగా వున్న సాలగ్రామాలు దారిద్య్రాన్ని కలిగిస్తాయి.నలుపు రంగు కలిగి, దానికి గల చక్రం మధ్య భాగంలో కొద్దిగా ఉబ్బినట్లుగా వుండి, రేఖపొడవుగా ఉంటే, దానిని ‘ఆదినారాయణ సాలగ్రామం’ అని అంటారు.


తెలుపురంగు కలిగి రంధ్రంవైపున రెండు చక్రాలు ఒక దానితో ఒకటి కలిసిపోయినట్లు ఉంటే, దానిని ‘వాసు దేవ సాలగ్రామం’ అని అంటారు. ఇది సర్వ శ్రేష్టమై నది.  ఆధ్యాత్మికతను పెంపొందిస్తుంది.


పసుపు పచ్చ రంగు కలిగి గుండ్రంగా వుండి, రంధ్రం వైపున మూడు రేఖలు ఉండి, ‘పద్మ చిహ్నం’ పైముఖంగా ఉంటే దానిని ‘అనిరుద్ధ సాలగ్రామము’ అని అంటారు. ఇది చాలా మంచిది. కపిలవర్ణం కలిగి, చక్రం పెద్దదిగా ఉంటే, దానిని ‘నర సింహ సాలగ్రామం’ అని అంటారు. దీనిని బ్రహ్మచర్య దీక్షతోనే పూజించాలి. బంగారు వర్ణంతో పొడవుగా వుండి మూడు బిందువులతో వున్నదానిని ‘మత్య్సమూర్తి సాలగ్రామం’ అని అంటారు. ఇది భక్తిని పెంచి ముక్తిని కలిగిస్తుంది. సంపదలను ఇస్తుంది. నలుపు రంగుతో, మెరుస్తూ వుండి ఎడమవైపున గద, చక్రాలు, కుడి వైపున రేఖ వున్నదానిని ‘సుదర్శనమూర్తి సాలగ్రామం’ అని అంటారు. శత్రుబాధలను నివారిస్తుంది.


వివిధ వర్ణములతో వుండి, అనేక చక్రాలు, అనేక రేఖలు వున్నదానిని ‘అనంతమూర్తి సాలగ్రామము’ అని అంటారు.


ఈ సాలగ్రామం సకలాభీష్టములను తీర్చుతుంది.       3 ముఖాలు, 6 చక్రాలు కలిగి నేరేడు పండు ఆకారంలో ఉన్న దానిని ‘షట్చక్రసీతారామ సాల గ్రామం’ అని అంటారు. ఇలాంటి సాలగ్రామం        దొరకటం దుర్లభం. ఈ సాలగ్రామాన్ని పూజించనవారికి అష్టైశ్వర్యములు కలుగుతాయి. ఇంకా కొన్ని అపురూపమైన సాలగ్రామాలు కూడా ఉన్నాయి. ఇంట్లో పూజించు సాలగ్రామానికి నిత్యనైవేద్యం తప్పనిసరిగా పెట్టాలి.


కుటుంబ సభ్యులు మినహా అన్యులు సాలగ్రామాన్ని దర్శించరాదు.సర్వపాపపరిహారమైనది, సర్వవిధాలైన కష్టాల నుండి రక్షించేది, సర్వ పుణ్యఫలాలను ఇచ్చేది, సర్వదేవతా పూజా ఫలితాలను ఇచ్చేది, సర్వశ్రేయస్కరమైనది, సర్వో త్కృష్టమైనది, సర్వాంతర్యామి యొక్క ప్రతీక అయిన ‘సాలగ్రామాన్ని’ పూజించుకునే భాగ్యం ఈ కలియుగం లో మానవులమైన మనకు కలగటం, నిజంగా అపూర్వమైన అదృష్టం. అటువంటి అవకాశాన్ని వినియోగించుకుని, జీవితాన్ని ధన్యం ఒనర్చుకుని,శాశ్వతానందాన్ని పొంది ముక్తిని పొందటం భక్తిపరుడైన మానవునికి ముఖ్యకర్తవ్యం అనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అవకాశం దొరికితే, ఆ పుణ్యఫలాన్ని దక్కించుకునేందుకు ప్రయత్నించాలి. మరోకథ ప్రకారం, ఒకానొకసారి సృష్టిలోని జీవులన్నీ విపరీతమైన పాపపు చేష్టలను చేస్తుండేవి. ఆ దృశ్యాలను చూసిన బ్రహ్మదేవుడు, ఇదంతటికీ కారణం తన సృష్టే కదా! తాను చేసిన సృష్టిలో లోపం ఉండబట్టే కదా, జనం ఇలా పాపకృత్యాలలో మునిగిపోతున్నారని బాధపడు తుండగా, ఆయన కళ్ళెంబడి రెండు కన్నీటి చుక్కలు రాలిపడ్డాయట. ఆ కన్నీటి చుక్కలే గండకీనదిగా మారాయని కథనం. ఇలా సాలగ్రామాన్ని గురించిన అనేక కథలు మన పురాణాలలో కనబడుతున్నాయి.

సాలగ్రామాలను ఆవుపాలతో గాని, పంచామృత ముతోగాని శుద్ధి చేయాలి. 


‘రుద్రాక్షధారణ’ నియమాలనే, సాలగ్రామ పూజలోనూ పాటించాలి. ప్రత్యేక సమయాలలో, సంక్రమణ కాలాలలో, గ్రహణ సమయాలలో ఆయా సాలగ్రామాల ననుసరించి ఆయా దైవజపాలను 1008 సార్లు చేసినా, చేయించుకున్నా, ఆ సాలగ్రామము యొక్క శక్తి ద్విగుణీకృతమవుతుంది.

సాలగ్రామశిలను షోడ శోపచార పూజా విధానం ద్వారా అర్చించిన భక్తులకు యావత్‌ కల్పాంతముల వరకు వైకుంఠంలో నివసించే భాగ్యం కలుగుతుంది. కనీసం సాలగ్రామంకు భక్తి శ్రద్ధలతో  నమస్కరించి, యథావిధిని పూజిస్తే, మరుజన్మ లేకుండా ముక్తి పొందుతారని ప్రతీతి.


సాలగ్రామ మును స్మరించినా, దర్శించినా, నమస్కరించినా, సర్వపాపాలు పరిహరింపబడతాయి.🙏

Tirumala


 

దత్తాత్రేయుడు

 *నిత్యాన్వేషణ:*       


*దత్తాత్రేయుడు ఎవరు?*


 దత్తాత్రేయుడు అత్రి మహర్షి మరియు అనసూయ దేవిల కుమారుడు.


*దత్తాత్రేయ జన్మ వృత్తాంతం:*

అనసూయ దేవిని అత్రి ఋషి యొక్క భార్య. పతివ్రత. మరియు విశ్వంలో ఆమె వంటి పతివ్రతయైన భార్య ఎవరూ ఉండరని ప్రసిద్ధి. ఒక సందర్భంలో అనసూయ పాపులారిటీ చూసి, సరస్వతీ దేవి, లక్ష్మి మరియు పార్వతి అసూయ చెందారు. వారు ఆమె యొక్క పాతివ్రత్యాన్ని పరీక్షించాలని నిర్ణయించుకున్నారు.  వారు తమ తమ భర్తలైన బ్రహ్మ, విష్ణు, శివులను అనసూయ పరీక్ష చేయమని కోరారు.


బ్రహ్మ, విష్ణు మరియు శివుడు తమ భార్యలకు వలదని ఒప్పించడానికి తమ శాయశక్తులా ప్రయత్నించారు కానీ వారు వారిని బలవంతం చేశారు.  ఫలితంగా,  అత్రిమహర్షి ఇంట లేని సమయంలో త్రిమూర్తులు బ్రాహ్మణ వేషంలో అనసూయ ఆశ్రమాన్ని సందర్శించారు.  అనసూయ వారికి ఆతిథ్యాన్ని ఇచ్చింది. ఆ బ్రాహ్మణులు ఆమె నగ్నంగా ఉన్నప్పుడే ఆహారం తీసుకుంటామని చెప్పారు.


అనసూయ వారిని తనపాతివ్రత్యమహిమచేత పసిబిడ్డలుగా చేసి తాను కన్నతల్లిగా భావించుకొని త్రిమూర్తులు కోరినవిధంగా నగ్నంగా మారి వారికి స్తన్యమిచ్చినది. తరువాత ఆ ముగ్గురికీ మూడు ఉయ్యాలలు ఏర్పాటుచేసి వాటిలో పసిబాలురైన త్రిమూర్తులను పరుండబెట్టి జోలపాడి నిద్రబుచ్చినది. 


చాలా కాలం తర్వాత కూడా త్రిమూర్తులు తమ లోకంలోకి రాకపోవడంతో వారి భార్యలు ఆందోళన చెందారు.  వారు అనసూయ యొక్క ఆశ్రమాన్ని సందర్శించి, తమ భర్తలను విడిచిపెట్టమని అభ్యర్థించారు.


త్రిమూర్తులవంటి బిడ్డను ఇవ్వాలనే ఒక షరతుతో అనసూయ అంగీకరించింది. ఆ వరం ఫలితంగా ఫలితంగా, అనసూయ దత్తాత్రేయనకు జన్మనిచ్చింది.

Shankara charya


 

27-07-2023* *రాశి ఫలాలు

 *27-07-2023*

   *రాశి ఫలాలు* 

*మేషం*

దూర ప్రయాణాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి.   దీర్ఘ కాలిక ఆరోగ్యసమస్యలు భాదిస్తాయి. బంధు మిత్రులతో  ఆకస్మిక  వివాదాలు కలుగుతాయి.  వృత్తి ఉద్యోగాలలో ఇతరులతో  వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. దైవ చింతన పెరుగుతుంది. వ్యాపారాలు అంతగా కలిసిరావు.

*వృషభం*

స్ధిరాస్తి  వ్యవహారాలలో  నూతన ఒప్పందాలు కలసి వస్తాయి. నూతన వ్యాపారాలు ప్రారంభించిన ఆశించిన  లాభాలు అందుకుంటారు. జీవిత భాగస్వామితో దైవ సేవా కార్యక్రమాలలో  పాల్గొంటారు. చిన్ననాటి మిత్రులతో  కీలక విషయాలు చర్చిస్తారు.  ఉద్యోగులకు ప్రోత్సాహకాలు అందుతాయి.  నిరుద్యోగులకు ఉద్యోగ అనుకూలత కలుగుతుంది.

*మిధునం*

సోదరులతో ఆస్తి వివాదాలు తొలగి ఊరట చెందుతారు. వాహన వ్యాపారస్తులు నూతన  లాభాలు అందుకుంటారు. అవసరానికి  సన్నిహితులు సాయం అందుతుంది. కుటుంబ వాతావరణం సందడిగా ఉంటుంది. వృత్తి  ఉద్యోగాలలో  హోదాలు పెరుగుతాయి. ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి. గృహోపకరణాలు కొనుగోలు  చేస్తారు.

*కర్కాటకం*

వృత్తి వ్యాపారాలు నిదానంగా  సాగుతాయి. చేపట్టిన వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. దూర  ప్రయాణాలు  సూచనలున్నవి.  కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయాలలో  కొంత చికాకు తప్పదు. ఇంటా బయట అప్రమత్తంగా  వ్యవహరించాలి.  ఉద్యోగమున  అదనపు బాధ్యతలుంటాయి. ఆర్థికంగా కొంత నిరాశ తప్పదు.

*సింహం*

తల్లి తండ్రుల ఆరోగ్యం విషయంలో  అశ్రద్ధ  చేయడం మంచిది కాదు. వృత్తి వ్యాపారాలలో  గందరగోళ పరిస్థితులు ఉంటాయి. నూతన రుణ ప్రయత్నాలు  చేస్తారు. బంధువులతో వివాదాలు కలుగుతాయి. ఉద్యోగమున అధికారుల నుండి ఒత్తిడి పెరుగుతుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలించక నిరాశ పెరుగుతుంది. 

*కన్య*

నూతన పరిచయాలు పెరుగుతాయి. చేపట్టిన పనులు అప్రయత్నంగా పూర్తిచేస్తారు.  ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగ యత్నాలలో విజయం సాధిస్తారు. సంఘంలో  స్నేహితుల నుండి ఊహించని ధనలాభం కలుగుతుంది. వృత్తి వ్యాపారాలలో  ఆర్ధిక పురోగతి సాధిస్తారు. నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు.

*తుల*

ముఖ్యమైన వ్యవహారాలలో కుటుంబ పెద్దల  సలహాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది. ప్రయాణాల వలన శారీరక శ్రమ పెరుగుతుంది. బంధుమిత్రుల నుండి ఋణ ఒత్తిడి  పెరుగుతుంది.   వ్యాపారమునకు  పెట్టుబడులు సకాలంలో అందవు. వృత్తి  ఉద్యోగాలలో అధిక శ్రమతో అల్ప ఫలితం పొందుతారు.

*వృశ్చికం*

అన్ని రంగాల వారికి అనుకూల వాతావరణం. విలువైన వస్తువులు  కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యుల  ఆదరణ పెరుగుతుంది. భూ సంబంధిత క్రయ విక్రయాలలో  ఆశించిన  లాభాలు అందుకుంటారు. వృత్తి వ్యాపారములు పుంజుకుంటాయి.  ఉద్యోగస్తులకు  అధికారుల సహాయ సహకారాలు అందుతాయి.

*ధనస్సు*

వృత్తి వ్యాపారమున  నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి. సోదరులతో స్ధిరాస్తి వివాదాలు కలుగుతాయి. దూర ప్రయాణాలలో మార్గ అవరోధాలు  కలుగుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో  పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి  నిరాశ కలిగిస్తుంది.

*మకరం*

సన్నిహితుల నుండి విలువైన విషయాలు సేకరిస్తారు. వృత్తి వ్యాపారాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు. ఉద్యోగ విషయమై ఆశించిన  మార్పులు చోటు చేసుకుంటాయి. కుటుంబ సభ్యులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక అనుకూలత కలుగుతుంది.

*కుంభం*

కీలక వ్యవహారాలలో స్వంత నిర్ణయాలు తీసుకుని ముందుకు సాగుతారు. మిత్రుల  నుండి శుభకార్య  ఆహ్వానాలు అందుతాయి. ఆకస్మిక ధన లాభాలుంటాయి. స్ధిరాస్తి  సంబంధిత వివాదాల నుంచి బయటపడతారు.  వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పనికి  తగిన గుర్తింపు లభిస్తుంది.

*మీనం*

కొన్ని వ్యవహారాలలో  సన్నిహితుల నుండి మాటలు పడవలసి వస్తుంది.  నూతన వ్యాపారాలు ప్రారంభానికి ఆటంకాలు కలుగుతాయి. ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. తగినంత ఆదాయం లభించదు. చేపట్టిన పనులలో జాప్యం కలిగిన నిదానంగా  పూర్తిచేస్తారు.  వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి పెరుగుతుంది.

🕉️

శరీరానికి చేతుల వలె

 🍀🌅  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄


                _*సుభాషితమ్*_


 𝕝𝕝 శ్లోకం 𝕝𝕝


*_కరావివ శరీరస్య* 

*నేత్రయోరివ పక్ష్మణి|_*

*_అవిచార్య ప్రియం*

*కుర్యాత్తన్మిత్రం మిత్రముచ్యతే||_*


≈భావం≈

శరీరానికి చేతుల వలె, కళ్ళకు రెప్పల వలె.... అప్రయత్నంగా ప్రియం చేకూర్చేవాడే మిత్రుడు.

తిరుమల బాలాజీ ప్యాకేజీ

 *తిరుమల బాలాజీ ప్యాకేజీ  దర్శన్ టిక్కెట్స్ కలవు* –


వివరాలు మీ కోసం

తిరుమల బాలాజీ దర్శనం టిక్కెట్స్ దొరకలేదని విచారం వద్దు .


ప్రభుత్వ రంగ పర్యాటక ఏజన్సీ *ట్రావెల్ ఇండియా* మీకోసం ప్రత్యేక తిరుమల స్పెషల్ శీఘ్ర దర్శనము తో కూడిన స్పెషన్ టూర్ ను తెలుగు రాష్ట్రాలు మరియు దేశం లోని  వివిద ప్రాంతాల నుండి అందించడం జరుగుతుంది .


మరిక ఆలస్యం ఎందుకు ఇప్పుడే మీ స్నేహితులకి ఈ సమాచారాన్ని అందించి తిరుమల బాలాజీ దర్శన భాగ్యాన్ని కల్పించండి .


*తిరుమల రైలు యాత్రల వివరాలు* ;

*ప్రతి రోజూ తిరుమల దర్శనం రైలు టిక్కెట్ తో కలిపి* :


1) సికింద్రాబాద్ , లింగంపల్లి , నల్గొండ ,గుంటూరు రైల్వే స్టేషన్ నుండి ప్రతి రోజూ

 స్లీపర్ క్లాస్ ( మనిషి కి :-*3800*/- నుండి మొదలు ), 

3rd ఏ.సీ ( మనిషి కి :-*5660*/- నుండి మొదలు )


2) సామర్లకోట , రాజమండ్రి విజయవాడ , తెనాలి రైల్వే స్టేషన్ల నుండి : 

ప్రతి శుక్రవారం స్లీపర్ క్లాస్ ( మనిషి కి :-3840/- నుండి మొదలు ), 

3rd ఏ.సీ ( మనిషి కి :-5485/- నుండి మొదలు )


*రెండు రోజుల తిరుపతి టూర్ బాలాజీ దర్శనం తో* :


1) కరీంనగర్ , వరంగల్ ,పెద్దపల్లి , ఖమ్మం రైల్వే స్టేషన్ల నుండి :

 ప్రతి గురు వారం రెండు రోజుల తిరుపతి టూర్ 

స్లీపర్ క్లాస్ ( మనిషి కి : *5660* /- నుండి మొదలు ), 

3rd ఏ.సీ ( మనిషి కి :-*7560* /- నుండి మొదలు )


2) సికింద్రాబాద్ , లింగంపల్లి , నల్గొండ ,గుంటూరు రైల్వే స్టేషన్ నుండి 

ప్రతి రోజూ స్లీపర్ క్లాస్ ( మనిషి కి :-5660/- నుండి మొదలు ), 

3rd ఏ.సీ ( మనిషి కి :-7510/ నుండి మొదలు )



3) తిరుపతి నుండి రెండు రోజుల టూర్ ప్రత్యేక తిరుమల దర్శనం మరియు స్టానిక 5 దేవాలయాల తో ప్రతి రోజూ మనిషికి రూ . 5760/-నుండి మొదలు


తిరుమల స్పెషల్ టూర్ *బస్ సర్వీస్* తో :

1) సికింద్రాబాద్ , నుండి ప్రతి రోజూ వోల్వో బస్ సర్వీస్ తో తిరుమల స్పెషల్ టూర్ : మనిషికి 3700/- ( దర్శనం టిక్కెట్ తో కలిపి )

2) బెంగూళూర్ నుండి ప్రతిరోజూ వోల్వో బస్ సర్వీస్ తో తిరుమల స్పెషల్ టూర్ : మనిషికి 2650/-( దర్శన టిక్కెట్ తో కలిపి )


మరిన్ని వివరాలకు

*ట్రావెల్ ఇండియా*

ప్రభుత్వ పర్యాటక బుకింగ్ ఏజన్సీ

హైదారాబాద్

*9848829574*

*8801393100*.

ॐ శ్రీ శివ సహస్రనామ స్తోత్రమ్

 ॐ   శ్రీ శివ సహస్రనామ స్తోత్రమ్ 


                             శ్లోకం :29/150 


ప్రజాపతిర్విశ్వబాహు 

ర్విభాగ స్సర్వతోముఖః I 

విమోచన స్సుసరణో 

హిరణ్యకవచోద్భవః ॥ 29 ॥  


* ప్రజాపతిః = సృష్టికర్తయైన బ్రహ్మ తానే అయినవాడు, 

* విశ్వబాహుః = ప్రపంచమునే తన భుజములుగా కలవాడు, 

* విభాగః = ప్రపంచంయొక్క భాగము తానే అయినవాడు, 

* సర్వతోముఖః = అన్ని విషయములు బాగుగా తెలిసినవాడు, 

* విమోచనః = విముక్తి కలుగచేయువాడు, 

* సుసరణః = తేలికగా ప్రసరించు(వ్యాప్తిచెందు) వాడు, 

* హిరణ్య కవచోద్భవః = బంగారుకవచములతో ఉద్భవించినవాడు.


                    కొనసాగింపు ... 


https://youtu.be/L4DZ8-2KFH0 


                    =x=x=x= 


  — రామాయణం శర్మ 

           భద్రాచలం

వైదిక ధర్మ ప్రభావం

 వైదిక ధర్మ ప్రభావం


ఆచార్యపురుషులకు, తదనుయాయులకు ఆత్మబలం సచ్చరిత్రం, నీతీసంపదా ఉన్నట్టయితే వారి మతములకు సుస్థిరత్వం ఏర్పడుతుంది. అట్టి ఆచార్య పురుషుల వల్లనే వైదిక మతము అనేక గండములు గడచి నేటికి సుస్ధిరంగా వుంటున్నది.


గౌతమబుద్దుడు కపిలవస్తు నగరంలో అవతరించి, 2500 ఏండ్ల గడచినవి. వారి త్యాగనిరతీ, వైరాగ్యనిష్ఠ ప్రజల మనస్సులను లోగొన్నవి. బుద్ధుని జీవితగాథ విన్నప్పుడు దేశమంతటా కానవచ్చే బుద్ధవిగ్రహాలను కన్నప్పుడు మనకు శాంత్యానందములు, కరుణా లభిస్తూవుంటవి. బౌద్ధము నాస్తిక మతమైన కారణాన దానికే దేశంలో నిలువనీడ లేకపోయిందనే అభిప్రాయ మొకటి ఈ వరకు ఉంటూవచ్చేది. కాని, సంస్కృతంలో పాళీభాషలో వున్న బౌద్ధధర్మ గ్రంథాలను, అశోకుని శిలాశాసనాలను పరికిస్తే బుద్ధదేవుని మహానుభావం మనకు తెలిసివస్తుంది. అట్టి మహనీయుని పుట్టుకచే ఈ దేశం ధన్యమయినదనిపిస్తుంది. ''ప్రాగ్దిశాజ్యోతి'' అనే గ్రంథంలో ఎడ్విను ఆర్నాల్డు కవి బుద్ధుని దివ్యజీవనాన్ని కీర్తించాడు. ఈ బౌద్ధమతం తమిళ దేశంలోను వ్యాపించింది. బౌద్ధధర్మాలనేకం తమిళ గ్రంథాలలో కానవస్తున్నవి. ఇంతగా గౌరవాస్పదమైన బౌద్ధమతం మనదేశంలో ఏల నిలువ జాలకపోయిందా అని ఆశ్చర్యం కలుగుతూ వుంటుంది.


తమిళ సాహిత్యంలో ఎక్కడ చూచినా జైనమత ప్రచారం కనిపిస్తుంది. దీనినిబట్టి బౌద్ధముకంటే జైనధర్మానికే తమిళనాడులో ప్రాబల్యం లభించిందనుకోవాలి. ఉత్తర భారతంలో గుజరాతు మొదలైన ప్రాంతాల్లో జైనమతస్థు లధికంగా ఉంటున్నారు. బౌద్ధ జైనములు రెండూ అహింసనే పరమధర్మంగా చెపుతున్నా, బౌద్ధులు ఇతరులు చంపిన మృగముల మాంసం తినేవారు. జైనులు మాంససేవనం చప్పగా నిషేధిస్తారు. జైన విగ్రహాలు, ధర్మశాసనాలుకూడా మన దేశమంతటా కనిపిస్తున్నవి. సాంఖ్యమతమనేది కూడా పురాతనమే. బౌద్ధ, జైనములందు కంటే సాంఖ్యమతంలో జ్ఞానులు, ఋషులు ఎక్కువగా ఉన్నా, వారివారి విగ్రహాలుగాని, వారి మతాన్ని ప్రచారంచేసే గాధలు, గీతములుగానీ ఎక్కడా వినరావు మరి తత్త్వశాస్త్ర గ్రంథాలలో చూడబోతే, బౌద్ధ, జైనముల కంటే సాంఖ్యమతానికి ఎక్కువ ప్రస్తావము కనిపిస్తుంది.


వైదికమతాలలో శైవ వైష్ణవాలు తమిళదేశంలో బహుళప్రచారాన్ని పొందినవి. వైష్ణవసిద్దాంతానికి శ్రీమధ్వమునీ శ్రీ రామానుజులు ఆచార్యపురుషులు, రామానుజుల వైష్ణవాన్ని, శైవసిద్ధాంతమూలకమైన శైవాన్ని అవలంబించినవారు తమిళనాడులో విరివిగా ఉన్నారు. వైష్ణవాలయాలన్నిటా రామానుజులకు, నమ్మాళ్వారులకు, మనవాళమునికి వేదాంత దేశికులకు, మరియెందరో ఆళ్వారులకు అర్చా విగ్రహాలు వెలసినవి. శైవాలయాల్లో అట్లే అప్పయ్య, సుందరయ్య, సంబంధయ్య, మాణిక్యవాచకయ్యవార్ల విగ్రహాలు పూజలందుకొంటున్నవి. అంతేకాదు; శేవదివ్యస్థలాల్లో అరువత్తిమూడు నాయనార్ల విగ్రహాలుకూడా నెలకొన్నవి. వైష్ణవాలయాలలో ప్రబంధాలను, శైవాలయాలలో తిరిమరైలను గానంచేసేవారి కోసం వృత్తులు ఏర్పాటైవున్నవి. మరి అద్వైత స్థాపనాచార్యులైన శంకరుల విగ్రహాలు చూడబోతే శైవ వైష్ణవాచార్య విగ్రహాల్లో వెయ్యోవంతుకూడా కనుపించవు. అద్వైతాచార్యులలో ముఖ్యులైన సురేశ్వరాచార్యులకు, అప్పయ్యదీక్షితులకు ఎక్కడా విగ్రహములే కానరావు. పురావస్తుశాఖాధికారి ఒకరు చెప్పినట్లు శాసనాలు, విగ్రహాలు మెదలైన పురావస్తువులను బట్టి దేశచరిత్ర తిరిగి రచించి నట్లయితే, అద్వైతమతప్రసక్తే ఎక్కడా కనుపించకపోవచ్చు.


బౌద్ధమతం వైదిక మతాన్ని ఖండించింది. జైనమేమో బౌద్ధాన్ని ఖండించింది. ఇట్లే మతాచార్యులందరూ వారి వారి కాలములందు ప్రచారంలో ఉన్న మతాలను ఖండిస్తూ, తమ మతాలను స్ధాపింపజూచారు. శైవం, వైష్ణవం మొదలైన ఈ మతాలన్నిటికీ వేర్వేరు లక్షణాలు స్ఫుటంగా కనిపిస్తూ ఉంటవి. శైవవైష్ణవాలు రెండూ ప్రతిమార్చనను అంగీకరించినవే అయినా, వైష్ణవం ఈశ్వరునకు సుగుణమూర్తిని కల్పిస్తే, శైవం ఈశ్వర సంకేతమాత్రమయిన లింగం చాలునంటుంది. ఇస్లాము, క్రైస్తవమతస్థులు, ఆర్య సమాజికులూ ప్రతిమార్చన మొదలైనవే పనికిరాదంటారు. హిందువులు అంగీకరించే వేద ప్రామాణ్యాన్ని బౌద్ధులు, జైనులు అంగీకరించరు. ఈ మతాచార్యులందరిచుట్టూ శిష్యగణం విస్తారంగా పోగవుతూ వుండేది.


నేడు మతస్థులస్థితిని పరిశీలించిచూస్తే మానవలోకంలో సగంమంది క్రైస్తవమును, ఇంచుమించు తక్కినసగం బౌద్ధమును అవలంబించియున్నారు. ఈ రెంటికీ చెందనివారు తక్కినమతాల నాశ్రయించి ఉన్నారు. మరియెన్నో మతాలు పుట్టి పెరిగి నశించిపోయినవి. ఈ మతాలిలా యెందుకు పుట్టుతున్నవి? ఎలా నశిస్తున్నవి? ప్రతిమతమూ తనకే సత్యదర్శనమైనదనీ, తన్ను మించిన పరమధర్మంలేదనీ చెప్పుకుంటూ వుంటుంది. నిజానికి సత్యమనేది ఒక్కటే. అది యిన్నివిధాల వుండదు. మరి ప్రతిమతానికి ప్రజలు అసంఖ్యాకంగా ఎగబడుతూనే వుంటారు. మతాల ఉత్కృష్టతను, వాని నవలంభించిన జనుల సంఖ్యను బట్టి నిర్ణయించుదామా అంటే సత్యం తమనొసటనే పొడిచిందని చెప్పుకొన్న మతములు క్షీణించిపోవుట ఎందువల్ల?


సత్యబలంవల్ల మతములు ప్రజారంజకములవుతున్నవా? ప్రజారంజకములైన మతములే సత్యమతము లవుతున్నవా? ప్రజలు సత్యంకోసం మతాన్ని అవలంబిస్తా రనుకొందామా? అంతరించిపోయిన మతాలన్నీ అసత్యమతములనుకుందామా? ఇలా ఎన్నో ప్రశ్నలుదయిస్తున్నవి. ఇవన్నీ పరిశీలించిచూస్తే, ఒక్కవిషయం స్పష్టమవుతుంది. ప్రజారంజనమునుబట్టి, సంఖ్యాబలాన్ని బట్టి మతాలకు స్థిరత్వంగాని ప్రమాణ్యంగా ని నిలభించదని, మనకండ్లయెదుటనే గాంధిధర్మంకోసమని వేలాది ప్రజలు ఉపవాసంచేసి, బంధిఖానాలు నింపి, ప్రాణాలుకూడా అర్పించారు. మరి ఆ గాంధిధర్మమును, ఆ గాంధీజీ ప్రాయోపవేశాలను పట్టించుకోక ఎగతాళి చేసిన వారినీ మనమే చూచాము. అంతేకాదు, ఆ గాంధి ధర్మానుయాయుల సంఖ్య నానాటికి దిగనాసిల్లటంకూడా మనమే చూస్తున్నాము.


కాబట్టి సత్యప్రతిపాదనంవల్లనే మతాలు సుస్థిరములు, ప్రబలములు అవుతవని చెప్పలేము. మతములు ఏకారణంవల్ల పతనమైనవో తెలిసికొంటే వాని వృద్ధికిగల రహస్యంకూడా తెలిసిపోతుంది. మహాబలిపురంలో గుట్టలను ఆలయాలుగా మలిపించిన మహేంద్రవర్మ అనే రాజు ''మత్తవిలాస'' మనే ప్రహసనం రచించాడు. దానిలో బౌద్ధధర్మచ్యుతులైన భక్షువుల స్వేచ్ఛాచారాన్ని గూర్చిన ప్రస్తావనకనిపిస్తుంది. పురుషులతో పాటు స్త్రీలకు గూడా భిక్షుదీక్షలివ్వడం అపాయకరమని బుద్ధుడు ముందే ఊహించాడు. కాబట్టి తమ సచ్చరిత్రంవల్ల ఇతరులకు మార్గదర్శకులు కాదగిన భిక్షుమండలి ధర్మభ్రష్టమగుటవల్లనే బౌద్ధమతానికి పతనంకలిగిందని ఏర్పడుతున్నది. దీనినే వ్యతిరేకలక్షణతో చెపితే మతపరిరక్షణ కొర కేర్పడిన వారు నిష్కళంక చరిత్రులై తత్వజ్ఞులై ఉదారబుద్ధితో ఆచరణ ప్రచారములు ఎప్పటికప్పుడు చేస్తూవుంటే, మతములు సుస్థిరంగా వర్థిల్లుతవని చెప్పవచ్చు. మతకర్తల మహానుభావం వల్లనే మతాలకు ఆదిలో చోదనలభించుట నిజమే అయినా, తదనంతరం వచ్చే ఆచార్యపరంపరకు ఉత్సాహశక్తి, నియమనిగ్రహాలు, సచ్చరిత్రమూ అలవడాలి. తదనుయాయులకు శ్రద్ధా భక్తులుండాలి. అప్పుడే ఆ మతాలకు సుస్థిరత్వం, ప్రజారంజనం లభిస్తుంది. ప్రజాసామాన్యాన్ని ఆకరించేది ఆచార్యపురుషుల మహానుభావమే. కాని, మత పరమార్థం కాదు. ఎవరో పండితులు మాత్రమే ఆ పరమార్థాన్ని విచారించగలుగుతారు. చిరప్రతిష్ఠితములైన, మతములు గూడా మహనీయులైన ఆచార్యపురుషులు కరవగుటవల్లనే క్రమంగా క్షీణించిపోతవి.


కనుక ఏమతమయినా తదనుయాయులు భక్తిశ్రద్ధలతో ధర్మాచరణం చేస్తూవుంటే సుప్రతిష్ఠితమై వర్ధిల్లుతుంది. ప్రజాబాహుళ్యం ఎగబడి సందడి చేసినంతమాత్రాన చేకూరేది వాపేగాని బలుపుగాదు. నిజానికి సాంఖ్యాద్వైతమతాలకు సందడి చాలాతక్కువ. అనాదియైన వైదికమతానికి కర్తలెవరో ఎరుగము. అయినా, అది నేటికీ బహుజనుల కాలంబమై నిలిచి వున్నదంటే త్యాగధనులు, సచ్చరిత్రులు, భక్తులు అయిన ఆచార్యపురుషు లెందరో దానికాలంబమై ఆచరణ ప్రచారములు చేస్తూవుండటమే కారణం. కనుక, మనయీమతం చిరకాలం ఇలాగే వర్ధిల్లి లోకాన్ని ఉద్ధరించాలనే అభిలాష మనకుండాలి. అట్టి అభిలాషతో మనం సదాచారులమై, ధర్మపరాయణులమై, మనోవాక్కాయములచే సత్కర్మాచరణం చేస్తూవుండాలి.


--- “జగద్గురు బోధలు” నుండి


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

షోడశ గణపతి స్తోత్రం

 *షోడశ గణపతి స్తోత్రం (సకల శుభాలను ఇచ్చే స్తోత్రం)*


ఈ స్తోత్రం 'షోడశ గణపతి స్తోత్రం' గా ప్రసిద్ధి పొందింది, ద్వాదశ గణపతి స్తోత్రం వలెనే ఇదికూడ సమస్త శుభ ఫలితములను ఇచ్చును.


ప్రథమం బాలవిఘ్నేశం ద్వితీయం తరుణం భవేత్!

తృతీయం భక్తవిఘ్నేశం చతుర్థం వీరవిఘ్నకం!!


పంచమం శక్తి విఘ్నేశం షష్ఠం ధ్వజగణాధిపం!

సప్తమం పింగళం దేవం అష్టమోచ్ఛిష్ట నాయకమ్!!


నవమం విఘ్నరాజం స్యాత్ దశమం క్షిప్రనాయకం!

ఏకాదశం తు హేరంబం ద్వాదశం లక్ష్మీనాయకమ్!!


త్రయోదశం మహా విఘ్నం భువనేశం చతుర్దశం!

నృత్తాఖ్యం చ పంచదశం షోడశోర్ధ్వగణాధిపమ్!!


గణేశ షోడశం నామ ప్రయతః ప్రాతరుత్తితః!

సంస్మరేత్ సర్వకుశలం సంప్రయాతి నసంశయః!!


1. బాలగణపతి

2. తరుణగణపతి

3. భక్తగణపతి

4. వీరగణపతి

5. శక్తిగణపతి

6. ధ్వజగణపతి (ద్విజ)

7. పింగళ గణపతి (సిద్ధి)

8. ఉచ్ఛిష్టగణపతి

9. విఘ్నరాజగణపతి

10. క్షిప్రగణపతి 

11. హేరంబగణపతి

12. లక్ష్మీగణపతి

13. మహావిఘ్నగణపతి

14. భువనేశ గణపతి (విజయ)

15. నృత్త గణపతి

16. ఊర్ధ్వగణపతి


ప్రతి దినము ప్రాతఃకాలమున ఈ 16 గణపతుల నామములు స్మరించిన సకల శుభములు కలుగును.


🙏 సర్వే జనాన్ సుఖినోభవంతు 🙏



సేకరణ: