*1803*
*కం*
మొక్కకు పోసిన నీటికి
గ్రక్కున ఫలమొసగనటుల కర్మల ఫలముల్
దక్కెడు కాలంబువరకు
తక్కగ సత్కర్మలొనర తరిగొను సుజనా.
*భావం*:-- ఓ సుజనా! మొక్క కు పోసిన నీటికి వెంటనే ఫలముల నీయని విధంగా ఫలములు దక్కే కాలం వచ్చే వరకూ తప్పకుండా సత్కర్మలు చేయడానికి ప్రయత్నించుము(తరిగొను).
*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి