🍀🌅 *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄
_*సుభాషితమ్*_
𝕝𝕝 శ్లోకం 𝕝𝕝
కరావివ శరీరస్య
నేత్రయోరివ పక్ష్మణి
అవిచార్య ప్రియం
కుర్యాత్తన్మిత్రం మిత్రముచ్యతే
≈భావం≈
శరీరానికి చేతుల వలె, కళ్ళకు రెప్పల వలె.... అప్రయత్నంగా ప్రియం చేకూర్చేవాడే మిత్రుడు.
కాయమునకు రెండు కరముల పగిదిగన్,
పక్ష్మ ముండు నట్టు లక్షులకును,
సంతసమున ప్రియము సమకూర్చు మనుజుండె
మిగుల శ్రేష్ఠమైన మిత్రు డరయ*1801*
*కం*
అల్పునితో తలపడితే
యల్పంబౌ నీదువిలువ యల్పుని కన్నన్
అల్పుడు బలవంతుని కడ
నల్పుని గనె మిగులి యుండు ననయము సుజనా.
*భావం*:-- ఓ సుజనా! అల్పునితో యుద్ధం చేయడం వలన నీ స్థాయి ఆ అల్పునికన్నా తగ్గి పోతుంది. కానీ అల్పుడు బలవంతుని వద్ద మాత్రం ఎల్లప్పుడూ అల్పునిగానే మిగులుతాడు.
అంటే అల్పులతో వైరము వలన నష్టపోయేది బలవంతుడే.
*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి