23, ఫిబ్రవరి 2022, బుధవారం

ప్రశ్న పత్రం సంఖ్య: 41

 ప్రశ్న పత్రం సంఖ్య: 41

కూర్పు: సి. భార్గవ శర్మ న్యాయవాది  

క్రింద ఇచ్చిన ప్రశ్నలకు 4 జవాబులు వున్నాయి ఒక జవాబు మాత్రం ఎంచుకోండి.

1) హమ్మయ్య అని ఎప్పుడు అనుకుంటాము

i ) ఏదైనా సందిద్గత తొలగినప్పుడు 

ii ) ఆనందంగా వున్నప్పుడు

 iii ) ఈష్యతో వున్నప్పుడు

 iv ) దుఃఖంగా వున్నప్పుడు . 

2) విమానం టైర్లను ఈ గ్యాసుతో నింపుతారు

i ) నైట్రోజన్ 

  ii ) ఆక్సిజన్ 

 iii ) హీలియం 

 iv ) సాదారణ గాలి 

3) క్రింది పద్యం వ్రాసిన కవి ఎవరు.

సిరిగలవానికి చెల్లును
తరుణులు పదియారువేల తగ పెండ్లాడన్
తిరిపెమున కిద్దరాండ్రా
పరమేశా గంగ విడుము పార్వతి చాలున్

i ) పెద్దన

 ii ) రామకృష్ణ 

iii ) శ్రీనాధుడు 

iv ) తిక్కన 

4) ఇటాలియన్ అఫ్ ది ఈస్ట్ అని యేభాషను అంటారు 

i ) తమిళ 

ii ) కన్నడ

 iii ) తెలుగు

 iv ) హిందీ 

5) జాతక చక్రంలో మందకొడిగా చలించే గ్రాహం ఏది

i ) గురుగ్రహం 

ii ) రాహు గ్రాహం 

 iii ) శని గ్రాహం 

iv ) బుధ గ్రాహం 

 6) డు ము వు లు

i ) ద్వితీయ విభక్తి

తి ii ) ప్రధమా విభక్తి

తి iii ) తృతీయ విభక్తి

 iv )  విభక్తికానే కాదు

7) మన శరీరంలోని కండరాలను దీనితో పోల్చవచ్చు

స్క్రూలతో 

 ii ) నట్టులతో 

 iii ) స్ప్రింగులతో 

 iv ) స్క్రూ డ్రైవరుతో

8) పాలు పెరుగుగా మారటానికి కారణం

i ) తోడు పెట్టిన మజ్జిగలో లాక్టోబాసిల్లస్ అనే బాక్టీరియంలు

ii ) తోడుపెట్టిన మాజ్జిగలోని లాక్టోస్ 

iii ) తోడుపెట్టిన మజ్జిగలో గ్లూకోజ్ 

iv ) తోడుపెట్టిన మజ్జిగతో సంబంధం లేదు

9) వేదాంతం అనగా 

i ) వేదాల చివరి వున్నఉపనిషత్తులు 

 ii ) వేదాల చివరి వున్న  కర్మ కాండ 

iii ) వేదాలలో వున్న కర్మ కాండ 

iv ) స్వామీజీలు చెప్పే ప్రవచనాలు

10) మానవ రక్తం ఎర్రగా ఉండటానికి కారణం

i ) తెల్ల రక్తకణాలు 

 ii ) హిమోగ్లోబిన్ 

 iii ) ప్లాస్మా 

 iv ) రక్తంలోని ద్రవపదార్థం 

11) సింగరేణి బొగ్గు గనులు ఈ వూళ్ళో వున్నాయి

i  )విజయవాడ

 ii ) హైదరాబాదు

 iii ) కొత్తగూడెం

 iv ) వరంగల్లు

 12) సీలింగ్ ఫాను ఒక

i ) విద్యుతు దీపము 

ii ) విద్యుత్ ఎల్ ఈ డి డివైస్ 

 iii ) విద్యుత్ మోటారు 

 iv ) విద్యుత్ కండెన్సరు

13) వివాహానికి సంబంధించి జాతక రీత్యా లగ్నంలో ఈ  శుద్ధి ఉండాలి

i ) సప్తమ శుద్ధి 

ii )అష్టమ శుద్ధి 

iii )ద్వాదశ శుద్ధి 

iv ) పంచమ శుద్ధి  

14) తొమ్మిది విధముల భక్తి మార్గములు తెలిపినది

i ) వసిష్ఠ మహాముని 

ii )నారద మహాముని 

 iii ) త్యాగరాజు 

iv ) రమణ మహర్షి 

15) ఈ గుణాన్ని ఉత్తమ గుణంగా అంటారు

i )తామస గుణం 

 ii )  సత్వ గుణం 

 iii ) రజోగుణం 

iv ) అమాయక గుణం

16) ప్రత్యక్ష ప్రమాణం  అంటే అర్ధం

i )ఇంద్రియాలద్వారా తెలుసుకోవటం 

ii ) మనస్సుద్వారా తెలుసుకోవటం 

 iii ) ఇతరులద్వారా తెలుసుకోవటం 

 iv ) దీనినే అనుమానప్రమాణం అని కూడా అంటారు

17) దీనిని చుస్తే నోరూరుతుంది  

i ) కుంకుడు కాయ 

ii ) తరిగిన దోసకాయ  

 iii ) తరిగిన ఉల్లిగడ్డ

 iv ) జిలేబి 

18) కదళీ ఫలం అని దీనిని అంటారు

i ) అరటి ఫలం ii ) రేగి ఫలం  iii ) జామ ఫలం iv ) ద్రాక్ష ఫలం 

19)రుచి అని ఈ పదార్ధాన్ని అప్పుడప్పుడు పేర్కొంటారు

i ) లవణం 

ii )బెల్లం 

 iii ) పంచదార 

iv ) కాకర కాయ 

20)  అపుత్రస్య _______

i ) గతిమ్ నాస్తి 

ii ) సౌఖ్యం నాస్తి 

iii ) భోజనం నాస్తి 

iv ) సంపద నాస్తి 

భగవద్గీత

 🌹భగవద్గీత🌹


పదకొండవ అధ్యాయము

విశ్వరూపదర్శన యోగము 

నుంచి 39 వ శ్లోకము


వాయుర్యమోఽగ్నిర్వరుణ శ్శశాంక 

ప్రజాపతిస్త్వం ప్రపితామహశ్చ ౹

నమో నమస్తేఽస్తు సహస్రకృత్వః 

పునశ్చ భూయోఽపి నమో నమస్తే ౹౹(39)


వాయుః ,యమః , అగ్నిః , వరుణః , శశాంకః , 

ప్రజాపతిః , త్వమ్ , ప్రపితామహః , చ ౹

నమః , నమః , తే , అస్తు , సహస్రకృత్వః ,

పునః , చ , భూయః , అపి , నమః , నమః , తే ౹౹(39)


త్వమ్ = నీవు

వాయుః = వాయుదేవుడవు

యమః = యముడవు

అగ్నిః = అగ్నివి

వరుణః = వరుణుడవు

శశాంకః = చంద్రుడవు

ప్రజాపతిః = ప్రజాపతియైన బ్రహ్మవు

ప్రపితామహః , చ = బ్రహ్మకును జనకుడవు 

తే = నీకు 

సహస్రకృత్వః , నమః = వేలకొలది నమస్కార పరంపరలు

అస్తు = అగుగాక 

తే = నీకు 

భూయః , అపి = మఱల గూడ 

పునః , చ = ఇంకను 

నమః , నమః = నమస్కారములు


తాత్పర్యము :- నీవే వాయుదేవుడవు , యముడవు , అగ్నివి , వరుణుడవు , చంద్రుడవు , ప్రజాపతియైన బ్రహ్మవు. బ్రహ్మకును జనకుడవు. నీకు వేలకొలది నమస్కారములు. ఇంకను నమస్కారములు. (39)

    

         అందరికీ శుభ శుభోదయం

              Yours Welwisher

Yennapusa Bhagya Lakshmi Reddy

*మన కర్మలకు సాక్షులు

 *మన కర్మలకు పద్దెనిమిది మంది సాక్షులు* ...


🤝చుట్టూ ఎవరూ లేనప్పుడు తప్పుడు పనులకు తెగించడం మానవ బలహీనత . 

కానీ ..... 


🤝‘నేను ఒక్కడినే కదా ఉన్నాను, 

నన్ను ఎవరూ గమనించడం లేదు’ 

అని మనిషి అనుకోవటం చాలా పొరపాటు . 


🤝మనిషి ఏ పని చేస్తున్నా నిశితంగా గమనించేవి మూగసాక్షులు పద్దెనిమిది ఉన్నాయి . అవి 

నాలుగు వేదాలు, పంచభూతాలు, అంతరాత్మ, ధర్మం, యముడు, ఉభయ సంధ్యలు, సూర్య చంద్రులు, పగలు, రాత్రి . 


🤝వీటినే అష్టాదశ మహా పదార్థాలు అంటారు . ఈ మూగసాక్షులు మనిషిని అనుక్షణం నీడలా పర్యవేక్షిస్తుంటాయి . 


🤝ఇవి మనలోకంలోని న్యాయస్థానాల్లో సాక్ష్యం చెప్పపోవచ్చును గాని, 


🤝వీటి గమనిక నుండి మనిషి తప్పించుకోవడం సాధ్యపడదు .


🤝దీన్ని గుర్తించలేని కారణంగానే ఇవన్నీ జడ పదార్థాలేనని, సాక్ష్యం చెప్పడానికి నోరులేనివని మానవుడు భ్రమపడుతుంటాడు . 


🤝ఈ మహాపదార్థాలు రహస్యయంత్రాల వంటివి . 


🤝అవి మనిషి ప్రతి చర్యనూ నమోదు చేస్తాయి . 


🤝ఆ నివేదికల్ని విధికి చేరవేస్తాయి . అది వాటిని కర్మలుగా మలుస్తుంది . మనిషి చేసే పనులు మంచి అయితే సత్కర్మలుగా, చెడ్డవి అయితే దుష్కర్మలుగా విధి నిర్ణయిస్తుంది . సత్కర్మలకు సత్కారాలు, దుష్కర్మలకు జరిమానాలు అమలవుతాయి . 


🤝అవి ఏవో మరుజన్మకో ఆ తరువాతో ఫలిస్తాయని అనుకోకూడదు, ఈ జన్మలోనే అమలు చేయబడవచ్చు . 


🤝ఇది నిరంతరాయంగా సాగిపోయే సృష్టిపరిణామక్రమం .

 

🤝అంతరాత్మ అనేది ఒకటుందని ప్రతి మనిషికీ తెలుసు . 


🤝అది మనం చేసే పని మంచిదా ? చెడ్డదా ? అనే విషయాన్ని ఎప్పటికప్పుడే చెప్పేస్తుంది .


🤝 కానీ ఆవేశం, కోపం,క్షణికావేశం తో విచక్షణ కోల్పోయిన వ్యక్తి అంతరాత్మ సలహాను కాలరాస్తాడు అది అనర్థాలకు దారితీయటం మనందరికి అనుభవమే .


🤝 ఒక్కోసారి అంతరాత్మ నిలదీస్తున్నప్పుడు పశ్చాత్తాపంతో సిగ్గుతో తలదించుకుంటాం . 

కానీ దీన్ని మనమెవరితోనూ పంచుకోము . అందువల్ల అంతరాత్మ అనుభవపూర్వకంగా నిజమైనప్పుడు మిగతా పది హేడు కూడా నిజమేనని గ్రహించగలగటం వివేకం .

 

🤝నలుగురికీ తెలిసేలా దానధర్మాలు, క్రతువులు, పూజలు నిర్వహించాలన్న కుతూహలం అవివేకం .


 🤝అష్టాదశ సాక్షులు ఎల్లవేళలా గమనిస్తున్నాయంటే, ఎవరు చూడాలో వాళ్ళు చూస్తున్నట్లేగా అర్థం . 


🤝ఈ ఎరుక కలిగినప్పుడు ఏ మనిషీ చెడ్డ పనులు చేయటానికి తెగించడు .


 🤝ఎవరు చూసినా చూడకపోయినా మంచితనంతో, తోటి వారికి సాధ్యమయినంత సహాయం చేయాలనే సత్‌సంకల్పంతో జీవితాన్ని గడపడం ఉత్తమం . ఈ జ్ఞానం వల్ల మనిషి సాధ్యమైనన్ని మంచిపనులు చేయడానికి పయ్రత్నిస్తూ సుఖశాంతులకు నోచుకుంటాడు...


   🙏🌺 *సర్వేజనా సుఖినోభవంతు* 🌺🙏



To see more posts like this and join ALL INDIA BRAHMIN FEDERATION, click here 👇👇


https://kutumbapp.page.link/DuZZUutFMKNVeJAQ6

భార్యాభర్తలను విడదీసేవారు

 శ్లోకం:☝️

    *మహాప్రభేతి నరకం*

*దీప్తశూల మహోచ్ఛ్రయం l*

    *తత్ర శూలేన ఛిద్యంతే*

*పతిభార్యోపభేదినః ll*


భావం: భార్యాభర్తలను విడదీసేవారు ఏ నరకానికి పోతారో చెబుతోందీ శ్లోకం. వారు ఈ లోకంలో సుఖంగా కాలం గడపవచ్చునేమో కాని, _మహాప్రభ_ అనే నరకంలో వారు శూలాలతో అనుక్షణం చిత్రవధ చేయబడతారు. దంపతులను విడదీయడం కంటే పాపపు పని మరొకటి లేదు! పాండురాజు తెలియక ఋషి దంపతుల వియోగానికి కారణమై శాపానికి గురి అయ్యాడు కదా!

బయో క్లాక్

 *😁 BIO-CLOCK 😁*🙏


మనం ఉదయం ఎక్కడికన్నా ప్రయాణం చేయ్యల్సి వస్తే తెల్లవారుజామున 4:00 గంటలకు అలారం సెట్ చేసి నిద్రపోతాము. 

కానీ కొన్నిసార్లు మనం అలారం లేకపోయినా అనుకున్న టైంకి నిద్ర లేస్తాము. 

ఇదే *బయో-గడియారం*. 


చాలామంది 80-90 సంవత్సరాల వయస్సులో చనిపోతారని సాధారణంగా నమ్ముతారు. 


50-60 సంవత్సరాల వయస్సులో అన్ని రోగాలు వస్తాయని మనసులో 

గాఢంగా నమ్మి   

చాలామంది తమ 

సొంత బయోక్లాక్‌ ను 

ఏర్పాటు చేసుకున్నారు. 


అందుకే సాధారణంగా 50-60 వద్ద ప్రజలు అనారోగ్యం పాలవుతారు  *మనం మనకు తెలియకుండానే బయోక్లాక్‌* ను 

మానసికంగా తప్పుగా సెటప్ చేస్తాము. 


చైనాలో చాలా మంది ప్రజలు 

120 సంవత్సరాల వరకు ఆరోగ్యంగా జీవిస్తారని నమ్మి 

అలా మానసికంగా సంసిద్దులై 

వారి బయోక్లాక్ ను అలా ఏర్పాటు చేసుకున్నారు.


*కాబట్టి ..!*


1. మనము మన బయో-గడియారాన్ని మానసికంగా పాజిటివ్ ఆలోచనలతో సర్దుబాటు చేసి, రోజు క్రమం తప్పకుండా *ధ్యానం* చేస్తే తద్వారా మనం *కనీసం* 100 సంవత్సరాల వరకు ఆరోగ్యంగా జీవించవచ్చు.


2. 40 నుండి 90 సంవత్సరాల వయస్సులో ఎటువంటి వ్యాధి వచ్చే అవకాశం లేదని మనం నమ్మాలి. 

వృద్దాప్యం అనేది 120 సంవత్సరాలకు మొదలు అవుతుందని బలంగా నమ్మాలి.


3. వెంట్రుకులకు సహజ సిద్ధమైన రంగు 

(తెల్లజుట్టు ఉంటే) 

వెయ్యండి, 

యవ్వనంగా కనిపించే ప్రయత్నం చేయండి. 


*ముఖ్యంగా డ్రెస్ విషయంలో కూడ యువతి, యువకుల మాదిరి డ్రెస్ వేసుకునే ప్రయత్నం సాధ్యమైనంత వరకు చేయండి. తద్వారా మనలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి. యెట్టి పరిస్థితులలో వృద్ధాప్యంగా కనిపించడానికి మన మనసుని అనుమతించవద్దు*.


4. మనం తీసుకునే భోజనం కల్తీ అనీ, కలుషితం, అనుకుంటూ 

'నెగటివ్ థాట్స్' తో 

తీసుకోవద్దు. 

*ధ్యాన శక్తి వల్ల నేను తీసుకునే ఆహారం పరమ పవిత్రమైనది గా మారింది, ఇది నాకు నిత్య యవ్వనాన్ని, సంపూర్ణ ఆరోగ్యాన్ని నిండు 120 ఏళ్ల జీవితాన్ని ఇస్తుంది అని పరిపూర్ణంగా నమ్మండి.* 

లేదంటే 'ఋణాత్మక ఆలోచన'ల వల్ల 

మన శరీరంలో 

నెగటివ్ ఎంజైములు విడుదలై 

మన జీర్ణ వ్యవస్థను, 

మన శరీర నిర్మాణాన్ని పూర్తిగా దెబ్బతీస్తుంది.


5. ఎప్పుడూ చురుకుగా ఉండండి. 

నడవడానికి బదులుగా 

వీలైతే జాగింగ్ చేయండి. 


5. *వయసు పెరిగే కొద్దీ ఆరోగ్యం పెరుగుతుందని నమ్మండి*. 

(ఇది నిజం కూడ).


6.ఆనందానికి, వ్యాధికి పడదు. ఒకటి ఉన్నచోట ఇంకొకటి ఉండదు. 

కనుక ఆనందంగా ఉండండి 

తద్వారా ఆరోగ్యంగా ఉండండి. 

*(ప్రతిరోజు హాస్య భరిత సినిమాలు చూడండి మనసులో కాకుండా పైకి నవ్వండి*).


7. ప్రతి సమస్యకు కారణం మన మనస్సు. 

మన ఆలోచనా విధానం. ముఖ్యంగా మన మాట, 

సరదాకు కూడ.... 

"నాకు Old age వస్తుంది"

అనే మాటను అనకండి. 


కాబట్టి మీ మానసిక 

'బయో క్లాక్' ని

ఎక్కవ ఆయుర్దాయం కోసం సెట్ చేసుకోండి ....

ఆలోచనా దృక్పధాన్ని మార్చుకోండి.      

                                                      *సర్వేజన సుకినో భవంతు* *మీ రఘునందన్*🙏🙏

ఒకరి గొప్పతనాన్ని చెప్పడానికి

 దీని సమాధానానికి పెద్ద తర్కం అవసరంలేదు. కాసింత ఇంగిత జ్ఞానం చాలు. వయస్సులు, ఆయుష్షులు సత్యాన్ని నిర్ణయించలేవు. తపస్సులే సత్యప్రతిపాదన చేయగలవు.

ప్రహ్లాదుని వయస్సు, హిరణ్యకశిపుని వయస్సు పరిశీలించండి. ఎక్కువ ఆయువు, వయస్సు ఉన్న హిరణ్యకశిపుని నాస్తికత్వం సత్యమా? అయిదేళ్ళ ప్రహ్లాదుని ఆస్తికత్వం సత్యమా? సనకాదులు, ధ్రువుడు, మార్కండేయుడు, ఉపమన్యువు... వీళ్ళందరి వయస్సులెంత? 'నఖలు వయస్తేజసాం హేతుః' - తేజస్సుకి వయస్సు హేతువు కాదు - అని భర్తృహరి సుభాషితం కూడా ఆ స్వామివారు చదువుకోలేదా?

ఎనిమిదేళ్ళ ప్రాయానికే వేదవేదాంగాల నధ్యయనం చేసిన అవతారమూర్తి ఆది శంకరులు. సిద్ధపురుషులు. నేడు విశ్వమంతా అంగీకరించిన తత్వాన్ని అందించిన జగద్గురువు. విజ్ఞానశాస్త్రం, వివేకం, - ఈ రెండూ చేసే విచారణకి నిలబడగలిగే పరిపూర్ణ సత్యాన్ని ఆవిష్కరించి, సర్వధర్మ సమన్వయం ద్వారా సంస్కృతిని పటిష్టపరచిన ఏకైక మహాత్ముడు. ఆ కారణజన్ముని సత్య ప్రతిపాదనను సుప్రతిష్ఠితం చేసిన విద్యారణ్యస్వామి, చంద్రశేఖరేంద్ర సరస్వతీస్వామి దీర్ఘాయుష్మంతులు మనకు బాసటగా నిలుస్తారు.

అయితే ఆ స్వామివారు చెప్పిన ఆచార్యులు కూడా సామాన్యులు కారు. వారూ కారణజన్ములు. మహాత్ములు. సత్య ప్రాప్తికి వీరు మరో దర్శనాన్ని అనుగ్రహించారు. సాధకులకు అది ఆమోదమే. తత్పూర్వమే శంకరులు దానిని ఆమోదించారు. ఆదిశంకరులు అన్నిటినీ స్వీకరించి సమన్వయపరచి అంతిమ లక్ష్యాన్ని స్పష్టపరచిన లోకశంకరులు.

ఒకరి గొప్పతనాన్ని చెప్పడానికి ఇంకొకరిని కించపరచవలసిన అగత్యం లేదు. నిజంగా తమ సిద్ధాంతంలో బలముంటే ఎవరినీ కించపరచకుండానే ప్రతిపాదించవచ్చు. వయస్సుల్నీ, ఆయుష్షుల్నీ సత్యప్రతిపాదనకు ప్రాతిపదికగా తీసుకొనే వారి తెలివి ఏపాటిదో, కాస్త ఆలోచిస్తే మనకే అర్థమౌతుంది. అది హాస్యాస్పదం - పేలవమైన సమర్ధన.

భారతీయ ధర్మానికి పట్టుకొమ్మలైన ఆచార్యులను సిద్ధాంతాల రాద్ధాంతాలతో అవమానపరచడం ధర్మగ్లానికి హేతువౌతుంది. వాటిని గ్రహించవద్దు, గాయపడవద్దు, ఆదరించవద్దు. అదే మన కర్తవ్యం.

ప్రశ్న పత్రం సంఖ్య: 40

 ప్రశ్న పత్రం సంఖ్య: 40 

కూర్పు: సి. భార్గవ శర్మ న్యాయవాది  

క్రింద ఇచ్చిన ప్రశ్నలకు 4 జవాబులు వున్నాయి ఒక జవాబు మాత్రం ఎంచుకోండి.

1) సప్తఋషి మండలంలో ఒక నక్షత్రం ప్రక్కన చిన్నగా కనిపించే నక్షత్రం ఏది.

i ) వసిష్ఠుడు ii ) నర్మద   iii ) అనసూయ iv ) అరుంధతి . 

2) కంప్యూటరుతో ఈ పని చేయలేము

i ) లెక్కలు చేయటం ii ) టైపు చేయటం iii ) బట్టలు ఉతకటము iv ) పాటలు వినటం 

3) నిమ్మరసం ఒక 

i ) లవణము  ii ) క్షారము  iii ) ఆమ్లము iv ) తటస్థ ద్రావణము

4)ఉత్తమజాతి కలపగా దీనిని పరిగణిస్తారు 

i ) నల్ల తుమ్మ ii ) వేప  iii ) జనపనార  iv ) టేకు 

5)"చవాన" మహర్షి కనుగొనిన ఔషధము . 

i ) అమృతారిష్ఠ    ii ) భాస్కర లవణము iii ) చవనప్రాస    iv ) దసములారిష్ట 

 6) ఎంతచెట్టుకు అంత

i ) నీరు  ii ) గాలి  iii ) కాయ  iv ) పువ్వులు . 

7) మనదేశంలో కారుకి స్టీరింగ్ కుడివైపున ఉండటానికి కారణం

రోడ్డు మీద ఎడమవైపుకు వెళ్ళాలి కనుక ii ) రోడ్డు మీద కుడి వైపుకు వెళ్ళాలి కనుక iii ) రోడ్డు మీద ఎటువైపుకు  వెళ్లినా పరవాలేదు కనుక iv ) కార్ల కంపెనీ వారు అలా తయారుచేసారు కనుక .

8) మొట్టమొదటి ఇతిహాసం  అని దేనిని అంటారు.

i ) రామాయణం ii ) భగవత్గీత  iii ) భారతం iv ) బృహదారణ్యక

9) ఈ దేముడిని భోళా దేముడు అంటారు

i ) పరమేశ్వరుడు ,   ii ) బ్రహ్మ iii ) విష్ణు iv ) వేంకటేశ్వరుడు

10) ఆంధ్రప్రేదేశ్ లో రైతులకు ఆర్ధిక సహాయకరంగా ప్రెవేశపెట్టిన పథకం

i ) రైతు సహాయం ii ) రైతు బంధు iii ) రైతు భరోసా iv ) రైతులకోసం 

11)ఇది ఒక ఉత్తర  భారతదేశ నది 

i )కృష్ణ  ii ) గోదావరి    iii ) తుంగభద్రా    iv ) యమునా 

 12) ప్రపంచంలో కృష్ణ భక్తిని చాటుతున్న సంస్థ

i ) డిస్కం ii ) ఇస్కాన్ iii ) కృష్ణ అవెన్యూ   iv ) రామనామ తారక సంఘం

13) వివాహానికి సంబంధించి జాతక రీత్యా ఈ దోషం వుండకూడదని చెపుతారు 

i ) కుజ దోషం ii ) శుక్రదోషం iii )శనిదోషం    iv ) రాహుదోషం 

14) భగవంతునికి ఇలా కోరుకోవాలని అంటారు  

i ) అనాయాసేన మరణం ii )అనాయాసేన జీవనం   iii ) అనాయాసేన భోజనం iv ) అనాయాసేన శయనం 

15) మానవమానాలను సమానంగా చూసేవారిని ఏమంటారు

i ) పిచ్చివాడని అంటారు ii )  స్థిత ప్రజ్ణడు iii ) మంచివాడు iv ) అమాయకుడు

16) సర్వేంద్రియా నామ్

i ) నాసికా ప్రదానం ii ) నయనం ప్రదానం     iii ) చరణం ప్రదానం iv ) హస్తం ప్రదానం

17) దీనిని వాసన చూస్తే కళ్ళకు నీళ్లు వస్తాయి 

i ) కుంకుడు కాయ ii ) తరిగిన దోసకాయ   iii ) తరిగిన ఉల్లిగడ్డ iv ) తరగని బెండకాయ 

18) బదరీఫలం అని దీనిని అంటారు

i ) అరటి ఫలం ii ) రేగి ఫలం  iii ) జామ ఫలం iv ) ద్రాక్ష ఫలం 

19) గృహవాసారాలకు మైక్రోవేవులను ఈ పరికరాలలో వాడుతున్నారు

i ) ఓవెన్లలో  ii )ఇండక్షన్ స్టవులలో iii ) గడియారాలు  iv )   ఎయిర్ కండీషనర్లో 

20)  ఈ దేముడికి వెన్న దొంగ అనే పేరుఉంది 

i ) శ్రీ రాముడు  ii ) పరమ శివుడు  iii ) సత్యభామ వల్లభుడు iv ) లక్ష్మీ వల్లభుడు

 

ప్రశ్న పత్రం సంఖ్య: 39 జవాబులు

 ప్రశ్న పత్రం సంఖ్య: 39  జవాబులు

 కూర్పు: సి. భార్గవ శర్మ న్యాయవాది  

క్రింద ఇచ్చిన ప్రశ్నలకు 4 జవాబులు వున్నాయి ఒక జవాబు మాత్రం ఎంచుకోండి.

1) సవ్యసాచి అని ఈ వీరుని ఒక పేరు

i ) భీముడు ii ) అర్జనుడు*  iii )నకులుడు iv ) ధర్మరాజు . 

2) "పులికాపు" అనగా ఏమిటి

i ) ఇత్తడి విగ్రహాలను పుల్లని పదార్ధంతో శుభ్రపరచటం* ii ) ఇత్తడి విగ్రహాలను నిర్మా సబ్బుతో శుభ్రపరచటం iii ) ఇత్తడి విగ్రహాలను చల్లని పదార్ధంతో శుభ్రపరచటం iv ) ఇత్తడి విగ్రహాలను ఇటిక పొడితో శుభ్రపరచటం

3) నాలుగు వేదాలను ఆలా విభజించిన మహర్షి ఎవరు    

i ) వేదవ్యాసుడు* ii ) అత్రి మహర్షి iii ) పరాశరుడు  iv ) అంగీరసుడు

4) సంపెంగ పుష్పము ఒక 

i ) అందమైన పుష్పము ii ) అందము వాసన వున్న పుష్పము iii ) ఇది ఎర్రని పుష్పము iv ) సువాసన వున్న పుష్పము*

5) దేవతల గురువు ఎవరు. 

i ) వసిష్ఠుడు *   ii ) విశ్వామిత్రుడు  iii ) శుక్రాచార్యుడు*   iv ) అత్రి మహర్షి 

 6) స్వచ్ఛమైన నీరు ఒక .

i ) మంచి విద్యుత్ వాహకం ii ) విద్యుత్ వాహకం కాదు* iii ) విద్యుతికి నీటికి సంబంధం లేదు iv ) కొన్ని సార్లు విద్యుత్ వాహకంగా పనిచేస్తుంది. 

7) బంగారము ఒక

మంచి విద్యుత్ వాహకం* ii ) విద్యుత్ వాహకం కాదు iii ) విద్యుతికి బంగారానికి సంబంధం లేదు iv ) కొన్ని సార్లు విద్యుత్ వాహకంగా పనిచేస్తుంది.

8) మొట్టమొదటి ఉపనిషత్ అని దేనిని అంటారు.

i ) కేన  ii ) ఈశావాసిపనిషత్* iii ) ముండకోపనిషత్ iv ) బృహదారణ్యక

9) ఈ దేముడికి గుడులు లేవు

i ) పరమేశ్వరుడు ,   ii ) బ్రహ్*మ iii ) విష్ణు iv ) వేంకటేశ్వరుడు

10) తెలంగాణాలో రైతులకు ఆర్ధిక సహాయకరంగా ప్రెవేశపెట్టిన పథకం

i ) రైతు సహాయం ii ) రైతు బంధు* iii ) రైతు భరోసా iv ) రైతులకోసం 

11) హిమాలయాలలో పుట్టిన నది ఇది

i )కృష్ణ  ii ) గోదావరి    iii ) తుంగభద్రా    iv ) గంగానది*

 12) ప్రపంచంలో హిందూమత ప్రాశస్త్యాన్ని చాటిన శ్రీ రామకృష్ణ శిష్యుడు

i ) వాచాలుడు  ii ) గోవిందుడు  iii ) వివేకానంద*  iv ) మండనమిశ్రుడు

13) సూర్యునిలో ఈ గ్యాసు ఉంటుంది.

i ) అమ్మోనియం ii ) కార్బండైయాక్సిడ్ iii )హైడ్రోజన్*   iv ) సల్ఫర్ డీఆక్సీడ్ 

14) మన గృహవరణలో ఈ మొక్కను తప్పకుండ పెంచుకుంటాము 

i ) చామంతి   ii )తులసి*   iii ) గన్నేరు  iv ) బంతి

15) విమానం తక్కువ బరువు ఉండటానికి ఈ లోహంతో చేస్తారు

i ) ఇనుము  ii )  అల్యూమినియం* iii ) స్టీలు  iv ) రాగి

16) భూమి ఒక పెద్ద

i ) నీటిముద్ద  ii )అయస్కాంతము*    iii ) రాయి    iv ) ఉపగ్రహం

17) మనందరికీ మేనమామ ఎవరు

i ) శుక్రుడు ii ) బుధుడు   iii ) చంద్రుడు*(భూమాత అని మనం భూమిని తల్లిగా భావిస్తాము, చంద్రుడు భూమికి తమ్ముడుగా భావిస్తాము అందుకే మేనమామ అయ్యాడు) iv ) అంగారకుడు 

18) ఇది కాళిదాసు వ్రాసిన ఒక నాటకము

i ) మృత్యకటకము  ii ) మేఘసందేశము* iii ) కన్యాశుల్కము  iv ) ఆముక్తమాల్యద 

19) ప్రస్తుతం మైక్రోవేవులను ఈ పరికరాలలో వాడుతున్నారు

i ) సెల్ ఫోను* ii ) కాలింగ్ బెల్ వు iii ) గడియారాలు  iv )   ఎయిర్ కండీషనర్లో 

20)  చిలికి చిలికి 

i ) వడగళ్ల వాన అయ్యింది ii ) గాలి వాన అయ్యింది* iii ) మజ్జిగ అయ్యింది  iv ) కోవా అయ్యింది 

క్షీరసాగరమధనము

 _*మాఘమాసం*_

        🌷 _*బుధవారం*_🌷

🎋 _*ఫిబ్రవరి 23వ తేది 2022*_🎋


  _*🌷మాఘ పురాణం🌷*_ 

🌴 _*22 వ అధ్యాయము*_ 

🌴

🕉🌴🌷🌷🌷🌷🌴🕉️


*క్షీరసాగరమధనము*


☘☘☘☘☘☘☘☘


గృత్నృమదమహాముని జహ్నుమునితో నిట్లనెను. జహ్నుమునివర్యా ! వినుము, అశ్వమేధయాగము చేసినవాడును , ఏకాదశివ్రత నియమమును పాటించినవాడును , మాఘమాసవ్రతము నాచరించుచు ఏకాదశి వ్రతమును పాటించినవాడు అశ్వమేధయాగము చేసిన వచ్చునట్టి పుణ్య ఫలమునంది తుదకు మోక్షమును గూడ పొందును. స్వర్గాధిపతియై యింద్ర పదవినందును. మాఘ ద్వాదశినాడు బ్రాహ్మణులతో గలసి పారణ చేయువాదు , అన్నదానము చేయువాదును పొందు పుణ్యము అనంతము అని పలికెను.


జహ్నుముని గృత్నృమదమహాముని ! తిధులనేకములుండగా యేకాదశి అన్నిటికంటె శుభప్రదమైనది యెట్లయ్యెను ? అనేకాశ్వమేధములు చేసిన వచ్చునంతటి పుణ్యము ఏకాదశీ వ్రతమొక్కటే యిచ్చుటయేమి ? ఎవరైనను యిట్లు చేసి యితటి పుణ్యమునందిరా చెప్పుము అని అడిగెను. గృత్నృమదమహాముని యిట్లనెను. పాపములను పోగొట్టి ఆయురారోగ్యములను , సంపదలను , పుత్రపౌత్రాభివృద్ధిని పొందునట్టి వ్రతకథను చెప్పెదను వినుము. పూర్వము దేవాసురులు మేరు పర్వతమును కవ్వముగుగను , సర్పరాజువాసుకిని కవ్వపుత్రాడుగను చేసి క్షీర సముద్రమును మధించిరి. వారు వాసుకిని మేరు పర్వతమునకు మూడువరుసలుగ జుట్టి దేవతొలొక వైపునను రాక్షసులు మరియొక వైపునను పట్తిరి.


వారిట్లు సముద్రమును మధించుచుండగా పద్మాసనయగు లక్ష్మీదేవి క్షీర సముద్రము నుండి పుట్టినది. విష్ణువామెను భార్యగా స్వీకరించెను. అటు పిమ్మట ఉచ్చైశ్శ్రవమను అశ్వము , కామధేనువు , కల్పవృక్షము , అమృతకలశము మున్నగునవి సముద్రమునుండి వచ్చినవి. మహావిష్ణువు వానిని యింద్రునకిచ్చెను. దేవదానవులు మరల సముద్రమును మధించిరి. అప్పుడు దేవతలు , రాక్షసులు భయపడి సర్వలోక శరణ్యుడైన శంకరువద్దకు పోయి నమస్కరించి యిట్లు స్తుతించిరి.


*🌳దేవదానవులు చేసిన శివస్తుతి🌳*


*నమో భవాయ రుద్రాయ శర్వాయ సుఖదాయినే*

*నమోగిరాం విదూరాయ నమస్తే గిరి ధన్వవే ||*

*నమశ్శివాయ శాంతాయ నమస్తే వృషభధ్వజ*

*నమోనిత్యాయ దేవాయ నిర్మలాయ గుణాత్మనే ||*

*త్రిలోకేశాయ దేవాయ నమస్తే త్రిపురాంతక*

*త్రయంబక నమస్తేస్తు నమస్తే త్రిగుణాత్మనే ||*

*త్రయీధర్మైకసాధ్యాయ త్రిరూపాయోరురూపిణే*

*అరూపాయ సరూపాయ వేదవేద్యాయతే నమః ||*

*హరిప్రియాయ హంసాయ నమస్తే భయహారిణే*

*మృత్యుంజయాయ మిత్రాయ నమస్తే భక్తవత్సల ||*

*పాహ్యస్మాన్ కృపాయాశంభో విషాత్ వైస్వానరోసమాత్*


అని భయపీడితులైన దేవదానవులచే స్తుతింపబడిన దీనులను రక్షించు స్వభావము కల పరమేశ్వరుడా విషమును మ్రింగి తన కంఠమును నలిపెను. నల్లని విషము కంఠమున నిలువుటచే శివుని కంఠము నల్లనైనది. అందుచే శివునకు నీలకంఠుడను పేరు అప్పటినుండి యేర్పడినది. విషభయము తొలగిపోవుటచే నిశ్చంతులైన దేవ దానవులు సముద్రమును , ధనమును మాని అమృతపాత్రను స్వాధీనము చేసికొనవలయునని యత్నించిరి , ఒకరికి దక్కకుండ మరియొకరు అపహరింపవలెనని యత్నించిరి. ఏ విధముగా తీవ్రమైన గగ్గోలు యేర్పడినది.


మాయావియగు శ్రీమహావిష్ణువు మోహిని రూపము నందెను. ఆమె రూపము అన్ని ప్రాణులకు నయనానందమును కలిగించుచుండెను. మనోహరములగు నామె స్తనములు , జఘవములు చూపరులకు ఉద్రేకమును కలిగించుచుండెను. ముక్కు వికసించిన సంపెంగ పువ్వువలె నుండెను. నేత్రములు మనోహరములై విశాలములైయుండెను. మృదువైన బాహువులు , పొడవైన కేశములు , తీగవంటి శరీరము కలిగి సర్వాభరణభూషితయై పచ్చని పట్టుచీరను కట్టెను. చంచలమైన కడగంటి చూపులతో ఆ మోహిని అందరకును మోహమును పెంపొందించుచుండెను. ఆకస్మికముగ సాక్షాత్కరించిన ఆ మోహిని వివాదపడుచున్న దేవదానవులకు మధ్య నిలిచి దేవతలారా దానవులారాయని మధురస్వరమున పిలిచెను. ఆమె రూపమునకు పరవశులైన దేవదానవులామె మధుర స్వరమునకు మంత్రముగ్ధులై వివాదమును మాని నిలిచిరి.


ఆమె దేవదానవులను జూచి దేవతలారా , దానవులారా నేను మీ దేవదానవుల రెండు వర్గములకు మధ్యవర్తినైయుండి యీ అమృతకలశములోని అమృతమును మీ రెండు వర్గముల వారికిని సమానముగ పంచెదను.దేవతల వర్గమొక వైపునను , రాక్షసుల వర్గము మరియొకవైపునను కూర్చుండిరి. ఈమె యెవరో తెలియదు కనుక పక్షపాతము లేకుండ అమృతమును సమానముగ పంచునని తలచెను.


అందరిని మోహవ్యాప్త పరచుచున్న ఆ జగన్మోహిని అమృతపాత్రను చేత బట్టెను. ఆమె ఆ అమృతపాత్రను రెండు భాగములు చేసెను. ఒకవైపున అమృతమును మరియొకవైపున సురను(కల్లు) ఉంచెను. రాక్షసులున్నవైపున కల్లును , దేవతలున్న వైపున అమృతమును వడ్డించుచునెవరికిని అనుమానము రాకుండ అటునిటు దిరుగుచునుండెను. రాక్షసులు సురను త్రాగి అది అమృతమని తలచిరి చెవులకింపుగ ధ్వనించుచున్న పాదములయెందెల రవళితోను , హస్తకంకణముల సుమధుర నాదములతోను , ఆ జగన్మోహిని దేవదానవుల మధ్య విలాసముగ మనోహర , మధురముగ దిరుగుచు అమృతమును దేవతలకును , సురను దానవులకును కొసరి వడ్డించుచుండెను. దేవదానవులు తమ హస్తములను దోసిళ్ళు చేసి హస్తములే పాత్రలుగ చేసి కొన్నవారై త్రాగుచుండిరి.


*🌳రాహుకేతువుల వివరణ🌳*


రాక్షసులపంక్తిలో కూర్చున్న యిద్దరికి దేవతల ముఖముల యందు అమృతపానముచే కళాకాంతులు తేజస్సువర్చస్సు పెరుగుట తమవారందరును సముద్ర మధనజనిత శ్రమనింకను వీడకుండుట గమనింపునకు వచ్చి అనుమానపదిరి. అనుమానము వచ్చినంతనే దేవరూపములను ధరించి దేవతలవరుసలో కూర్చుండిరి. మోహిని వీరిని గమనింపలేదు. దేవతలనుకొని వారి చేతులయందు అమృతమును గరిటతో పోసెను. రాక్షసులు ఆత్రముగ దానిని త్రాగుటతో నామెకనుమానము వచ్చి వారు చేసిన మోసమును గ్రహించెను. జగన్మోహినీ రూపముననున్న జగన్మోహనుదు తననే వరించిన ఆ రాక్షసుల నేర్పునకు విస్మితుడై చక్రమును ప్రయోగించి వారి శిరస్సులను ఖండించెను. వారు తాగిన అమృతము వారి ఉదరములోనికి పోలేదు కాని కంఠము దాటెను. ఇందుచే వారు చావు బ్రతుకు కాని స్థితిలోనుండిరి. చంద్రుదు మొదలగువారు త్వరత్వరగా అమృతమును హస్తములతో త్రాగిరి. రాక్షసులకు జరిగిన మోసము తెలిపెను. తన వారిలో ఇద్దరు అమృతమును త్రాగకుండగనే చక్రఖండితులై చావు బ్రతుకులు కాని స్థితిలోనుండిరి. వారు యింతశ్రమయిట్లు అయ్యెని విచారము దుఃఖమునంది హాహాకారములను చేసిరి. దేవతలు రాక్షసులలో నిద్దరు తమను మోసగించి అమృతమును త్రాగిరని గగ్గోలు పడిరి. దానవులు కకావికలై తమ స్థానములకు చేరిరి. జగన్మోహిని శ్రీహరి అయ్యెను.


చక్రముచే నరుకబది చావుబ్రతుకు లేవి అయోమయ స్థితిలోనున్న రాక్షసులు కేశవా చావును బ్రతుకును కాని యీస్థితి మాకు దర్భరముగనున్నది. మాగతియేమి మాకాహారమేదియని దీనముగ శ్రీహరిని ప్రార్థించిరి. శ్రీహరియు పాడ్యమి పూర్ణిమతోగాని , అమావాస్యతోగాని కల సంధికాలములయందు సూర్యుని , చద్రుని భక్షింపుడు అదియే మీకు ఆహారమని పలికెను. ఆ రాక్షసులు ఆకాశమును చేరిరి.


ఇంద్రుడు మొదలగు దేవతలు అమృతకలశమును తీసికొని స్వర్గమునకు పోయిరి. బ్రహ్మ , విష్ణు , మహేశ్వరులు తమ తమ లోకములకు చేరిరి. సముద్రతీరమున అమృత కలశముంచినప్పుడు రెండు అమృతబిందువులు నేలపై బడినవి. ఒక బిందువు పారిజాత వృక్షముగను మరియొక బిందువు తులసి మొక్కగను అయినది. కొంత కాలము గడిచెను. సత్యజిత్తను సూద్రుడొకడా మొక్కలకు నీరు పోసి కుదుళ్లు కట్టి ఆ రెండిటిని సంరక్సించెను. ఆ రెండు మొక్కలున్నచోట మనోహరమైన పూలతోటగామారెను. సత్యజిత్తు సంరక్షణ వానికి దోహదమైనది. అతడును ఆ మొక్కలకు నీరుపోసి పెంచుచు పారిజాతపుష్పములను తులసీదళములను అమ్మి జీవించుచుండెను. పారిజాత వృక్షము పెరిగి పుష్పసమృద్ధమై నయనానందకరముగ నుండెను. తులసి కోమలములైన దళములతో అందముగ నుండెను.


ఇంద్రుడొకనాడు రాక్షస సంహారమునకై పోవుచు వానిని చూచి పారిజాత పుష్పములను దేవతా స్త్రీలకీయవలయునని పారిజాత పుష్పములను కోసుకొని స్వర్గమునకు దీసికొని వెళ్ళెను. శచీదేవిమున్నగు దేవతా వనితలు పారిజాత పుష్పములను చూచి ఆనందించిరి. మనోహరములగు యీ పుష్పములు మాకు నిత్యము కావలయునని కోరిరి. ఇంద్రుడును గుహ్యకుని(యక్షుని) పంపి భూలోకము నుండి పారిజాత పుష్పములను వృక్షయజమాని నడుగ కుండ వానికి తెలియకుండ దొంగతనముగ తెప్పించుచుండెను.


పుష్పములు తగ్గిపోవుటను సత్యజిత్తు గమనించెను. దొంగను పట్టుకొనదలచెను. తోటలో రాత్రియందు దాగియుండెను. పుష్పములను కోయవచ్చిన గుహ్యకుని పట్టుకొనయత్నించెను. యక్షుడు దివ్యశక్తి కలవాడగుటచే వానికి చిక్కకుండ ఆకాశమున కెగిరిపోయెను. సత్యజిత్తు యెంత ప్రయత్నించినను వానిని పట్టుకొనుట సాధ్యముకాకుండెను. దేవేద్రుడును 'నీవు యక్షుడవు , ఆకాశగమన శక్తికలవాడవు. మానవులకు దొరకవు. కావున పారిజాత పుష్పములను తెమ్మని గుహ్యకుని ప్రోత్సహించెనూ. పుష్పములు ప్రతిదినము పోవుచునే యున్నది. సత్యజిత్తునకేమి చేయవలెనో తోచలేదు. పుష్పచోరుని ఉపాయముచే పట్టుకొనవలెనని తలచెను. శ్రీహరి పూజా నిర్మాల్యమును తెచ్చి పూలతోటకు వెలుపల లోపల అంతటను చల్లెను.


యక్షుదు యధాపూర్వముగ పారిజాతపుష్పముల దొంగతనమునకై వచ్చెను. అతడా పూలను కోయుచు శ్రీహరి పూజా నిర్మాల్యమును త్రొక్కెను. పుష్పములను కోయపోవుచు శ్రీమనన్నారాయణుని పూజా నిర్మాల్యమును దాటెను. ఫలితముగ వాని దివ్యశక్తులతో బాతు ఆకాశగమన శక్తియు నశించెను. నేలపై గూడ సరిగా నడువలేక కుంటుచుండెను. యక్షుడును యెంత ప్రయత్నించినను అచటినుండి పోలేకపోయెను జరిగినదానిని గ్రహించెను. సత్యజిత్తు వానిని పట్టుకొని 'ఓరీ నీవెవరవు ఎవరు నిన్ను పంపిరి , మా పుష్పములను ప్రతిదినము యెందుకని అపహరించుచుంటివని చెప్పమని గర్జించెనూ యక్షుడును 'నేను యక్షుదను ఇంద్రుని సేవకుడను. ఈ పుష్పముల నపహరించి ఇంద్రునకు ఇచ్చుచుంటిని. ఇంద్రుని యాజ్ఞచేత నిట్లు చేసితిని. కాని బుధ్ధిసాలివైన నీకు చిక్కితిని అని పలికెను. సత్యజిత్తు యేమియు మాటలాడక యింటికి పోయెను. ఇంద్రుని సేవకుడైన యక్షుడు మూడు దినముల బందీ అయి ఆ తోటలో నుండెను.


      🌷🌷 *సేకరణ*🌷🌷

        🌴 *న్యాయపతి*🌴 

      🌿 *నరసింహారావు*🌿

🌴🎋🌾🕉️🕉️🌾🎋🌴


🙏🙏🕉️🙏🙏🕉️🙏🙏

భగవద్గీత

 🌹భగవద్గీత🌹


పదకొండవ అధ్యాయము

విశ్వరూపదర్శన యోగము 

నుంచి 39 వ శ్లోకము


వాయుర్యమోఽగ్నిర్వరుణ శ్శశాంక 

ప్రజాపతిస్త్వం ప్రపితామహశ్చ ౹

నమో నమస్తేఽస్తు సహస్రకృత్వః 

పునశ్చ భూయోఽపి నమో నమస్తే ౹౹(39)


వాయుః ,యమః , అగ్నిః , వరుణః , శశాంకః , 

ప్రజాపతిః , త్వమ్ , ప్రపితామహః , చ ౹

నమః , నమః , తే , అస్తు , సహస్రకృత్వః ,

పునః , చ , భూయః , అపి , నమః , నమః , తే ౹౹(39)


త్వమ్ = నీవు

వాయుః = వాయుదేవుడవు

యమః = యముడవు

అగ్నిః = అగ్నివి

వరుణః = వరుణుడవు

శశాంకః = చంద్రుడవు

ప్రజాపతిః = ప్రజాపతియైన బ్రహ్మవు

ప్రపితామహః , చ = బ్రహ్మకును జనకుడవు 

తే = నీకు 

సహస్రకృత్వః , నమః = వేలకొలది నమస్కార పరంపరలు

అస్తు = అగుగాక 

తే = నీకు 

భూయః , అపి = మఱల గూడ 

పునః , చ = ఇంకను 

నమః , నమః = నమస్కారములు


తాత్పర్యము :- నీవే వాయుదేవుడవు , యముడవు , అగ్నివి , వరుణుడవు , చంద్రుడవు , ప్రజాపతియైన బ్రహ్మవు. బ్రహ్మకును జనకుడవు. నీకు వేలకొలది నమస్కారములు. ఇంకను నమస్కారములు. (39)

    

         అందరికీ శుభ శుభోదయం

              Yours Welwisher

Yennapusa Bhagya Lakshmi Reddy

శివ బ్రహ్మల వివాదము

 _*మాఘమాసం*_

        🕉️ _*సోమవారం*_🕉️

🎋 _*ఫిబ్రవరి 21వ తేది 2022*_🎋


    _*🚩మాఘ పురాణం🚩*_   

 🌴 _*20 వ అధ్యాయము🌴*_


🕉🌹🕉️🌹🕉️🌹🕉️🌹


*శివ బ్రహ్మల వివాదము*


☘☘☘☘☘☘☘☘


గృత్నృమద మహర్షి మరల యిట్లు పలికెను. శ్రీమహవిష్ణువు తత్త్వమును మహత్త్యమును వివరించు మరియొక వివాదమును వినుము. బ్రహ్మ రజోగుణ ప్రధానుడు , శివుడు తమోగుణ ప్రధానుడు కదా. వారిద్దరు ఒకప్పుడు యెవరికివారు తానే ప్రధానుడనని యనుకొనిరి. సర్వలోకకర్తను , దేవతల కిస్టుడైన అధిపతిని నేనే మరియొకరు నాకంటే ఉత్తములు లేరని యెవరికి వారే తలచిరి. ఎంతకాలము గడచినను వారి వివాదము ఆగలేదు. కాలము గడచుచునేయున్నది వివాదము పెరుగుచునేయున్నది.


ఇట్లుండగా వారి యెదుటనొక మహారూపము సాక్షాత్కరించెను. ఆ రూపము అనేక సూర్యులకాంతి కలిగి తేజోమయమై యుండెను. అనేకములైన ముఖములు , నేత్రములు , బాహువులు , పాదములు కలిగి సర్వవ్యాప్తమై తనకు తానుగా జనించి సర్వతో వ్యాప్తమైయుండెను. దివ్యము మనోహరము అనంతమునగు ఆ రూపము శ్రీమహవిష్ణు రూపమని వారు గ్రహించిరి. సర్వమును ఆ రూపమునందేవారు చూచిరి. బ్రహ్మ , శివుడు ఆ రూపము చెవులలోనుండిరి. ఈ విచిత్ర మనోహరమైన అనంత రూపమును జూచి శివబ్రహ్మలిద్దరును ఆ రూపము తుది మొదళ్లను చూడదలచిరి. ఆ రూపము యొక్క ఆద్యంతములు నెరిగిన వారే తమ యిద్దరిలో నుత్తములని తలచిరి , ప్రయాణమైరి , నాలుగుదిక్కుల క్రిందను , పైనను చిరకాలము సంచరించిరి. ఆరూపమును మొదలునుగాని , చివరనుగాని చూదలేకపోయిరి , తాము ఇద్దరమును దానిని కనుగొనుటకు అశక్తులమని గమనించిరి. అప్పుడారూపము నిట్లు తలచిరి.


ఈ పురుషుడే జగత్కర సృష్టిస్థితి లయాత్మకమైన కాలస్వరూపుడు. గుణాధికుడు. గురువు రక్షించువాడు సర్వేశ్వరుడు , స్వయంప్రకాశుడు , సర్వప్రాణులయందు నివసించువాడు , సర్వప్రాణులను తనయందే నిలుపుకొనువాడు , మనము వీనికంటె అధికులముకాము. మన వలన నేమియు జరుగుట లేదు. ఇట్టి యధార్థ పరిజ్ఞానము కలిగి శ్రీమహావిష్ణువు నిట్లు స్తుతించిరి.


*🌳బ్రహ్మ శివకృత విష్ణు స్తుతి🌳*


అనంతమూర్తీ ! సర్వాద్యమూ , సర్వాధారమూ , అనంత ప్రకాశమూ సర్వమనోహరమూ అయిన నీ స్వరూపమును మాకు మరింత ప్రత్యక్సమనట్లు చేయుము. సర్వాత్మకా ! సర్వేశ్వరా ! సర్వప్రాణి నమస్కృతా !  అనుగ్రహించుము. నీవు సర్వకర్తవు , భర్తవు నీ తేజమనంతము , నీవందరికిని అన్నిటికిని యిచ్చువాడవు , సర్వస్వరూపుడవు , సర్వవ్యాప్తరూపుడవు అనుచునిట్లనిరి.


*హేవిషోవంతమూర్తే తవఘవ* *విఖిలాకారమాద్య స్వరూపం*

*సర్వాధారం సురేశందినపతి హత భుక్కోటి సూర్యప్రకాశం |*

*అవాభ్యమత్రి దృష్టం సకలముని మనోవాసమబ్జాయతాక్షం*

*చిమ్రావేం స్వాత్మశక్త్యాకురు నిఖిలగురో సర్వరూపంత్విదానం ||*

*నమస్తే విశ్వాత్మన్ విధిహరసురేంద్రాది విబురై*

*త్రయీ శాత్త్రాలాపైః విగదితన వ్యాంఘ్ర్యంబుజయుగం |*

*పరంమత్రంయంత్రం పరమపద బీజం జ్వలతియః*

*ససాక్షాత్పారూప్యం వ్రజతి తవదేవేశసతతం ||*

*త్రిలోక కర్తా భివదస్యభర్తా హరే మహద్రూపమనేక తేజాః*

*గురుర్గుర్ణాం నరదోవరాణాం మహార్ణవాంబూపల జస్త్వమేర |*

*త్రిదేవ దేవాసుర రాజయష్ట శిష్టేష్ట తుష్ట త్రిదివే వినిష్ట*

*దృష్టామృతాస్వాద్యమిరాశు పాణిః సురాసురాణామఖిలేశ్వరరస్త్వం ||*

*లక్ష్మీపతి స్త్వంతు సుగుహ్యగోప్తా గుహాశయః పంకజ పత్రనేత్ర*

*త్వంపంచ వక్త్రశ్చ చతుర్ముఖశ్చ చరాచరేశో భగవన్నమస్తేః* 


*సృష్టించ విశాలాం సృజసిత్వమేవ చైశ్వర్యవాన్* *సర్వగుణశ్చదేవ*

*త్వమేవ భూర్భూరికృత* *ప్రవేశః తధాద్య భూతం విదధాసియత్తత్ ||*

*త్వమగ్ని సూర్యౌ పవనస్త్యమేవ* *యమోభవాన్ వైశ్రవణస్త్వమేవ*

*త్వమేవశక్ర స్పురలోకనాధః* *నాధాబిమస్త్వం భగవన్ నమస్తే ||*

*పరమం పరాణాం పరమంపవిత్రం పురాణ కర్తారమనం తమాశ్రయం*

*త్వాం వేదమోహుః కవయః సుబుద్ద్వా నమోస్తుతే పన్నగవైరి కేతో ||*

*వేదాశ్చవేద్యశ్చ దిగంతరాళం యష్ఠాసురసానమపి త్వమేవ*

*కర్మాణ్యనంతాని సుఖప్రదాని ఋదశ్చవాతో నిగమాశ్చసర్వే ||*

*నదీషు గంగాహిమవాన్ నగేషు మృగేషు సింహో భుజగోష్వంతః*

*రత్నేషు వజ్రంజలజేషు చంద్రః క్షీరోదధశ్చాపి యధాతథాత్వం ||*

*అహం ప్రభు స్తద్వరహం ప్రభుశ్చ సంస్పర్ద మానౌ బహువర్ణానాం*

*తస్నాదదావీం పరిహర్తు మేవం స్వయం ప్రభుస్త్యం కరుణైకరాసి ||*

*తేనాత్రతే దర్శనబుద్ది రాసీత్ కృపాలో* *భగవన్నమస్తే*

*తూర్ణం జగనాథ* *మహత్స్వరూపం భూత్వాపున స్చామ్య వపుఃప్రసీద ||*


ఇట్లు శివుడు బ్రహ్మ చేసిన స్తుతిని విని శ్రీమహా విష్ణువు ప్రసన్నుడై సహజమైన సౌమ్య స్వరూపముతో వారికిట్లనెను. బ్రహ్మేశ్వరులారా ! మీరిద్దరును చిరకాలము వివాదపడుచుండుటచే మీ వివాదమును నిలుపుటకే నేను యిట్టి విరాట్రూపమును ప్రదర్శించితిని. మీరును నా విరాట్ రూపమును గమనింప నశక్తులై మానసిక వికారమును విడిచి ప్రశాంతబుద్దులై నన్ను స్తుతించిరి. మీ వివాదమునకు కారణమును నేనెరుగుదును. ఆ వివాదము నెవరును పరిష్కరింపలేరు. సత్వరజస్తమోగుణములు ప్రకృతి వలన కలిగినవి. ఆ గుణములకు లోబడినవారికి యదార్థము తెలియదు. సత్వగుణము నిర్మలము స్వయంప్రకాశకము అనామయము. సుఖసంగముచే దేహినిబంధించును. పరమేశ్వరాసక్తిని కలిగించును. రజోగుణము రాగాత్మకమై ఆశక్తిచే ప్రబలమగును. జీవికి కర్మాసక్తిని కలిగించును. అనగా పరమాత్మ స్వరూపజ్ఞానమును కప్పి , ఇహలోకమునకు చెందిన ప్రయోజనములను కలిగించు పనులయందు ప్రవర్తింపజేయును. తమోగుణము అజ్ఞానముచే కలుగును. ఇది జ్ఞానమును పోగొట్టి మోహమును పెంచును. దీనిచే పరమాత్మ జ్ఞాన ప్రయత్నము వెనుకబడును. దీని వలన ప్రమాదము కలుగును. ప్రమాదమనగా చేయవలసినదానిని మరచుట ఆలస్యము అనగా చేయవలసిన కార్యము తెలిసినను శ్రద్దసరిగా లేకపోవుట , శ్రద్ధాలోపముచే కార్యనిర్వహణ శక్తి లేకపోవుట జరుగును. నిద్రయనగా నీ యజ్ఞానముచే , చేయవలసిన దానిని వీడి నిద్రించుట , కావున ప్రమాదాలస్య నిద్రలు తమోగుణ జీవితములు జీవగుణ త్రయబద్దుడు కాక పరమాత్మ చింతన చేసిన మంచిది. నేను దీనిని పొందితిని. దీనిని పొందగలను , నేను చేయగలను నాకెవరును సాటి ఇట్టి బుద్ధి ఆలోచన రజస్తమోగుణముల ప్రభావము.


మీకును ఈ గుణ ప్రభావము వలన వివాదము కలిగి పెరిగినది. మొట్టమొదట నంతయు చీకటిగ నుండినది పంచభూతములప్పటి కేర్పడలేదు. అప్పుడు నేను సృష్టి చేయుటకై మొదట బంగారపు ముద్దవలెనుంటిని. తరువాత నవయవము లేర్పడినవి. తరువాత మన ముగ్గురము యేర్పడితిమి. మనము ముగ్గురము సృష్టిస్థితిలయములకు కర్తలమైతిమి. బ్రహ్మసృష్టికర్తగను , నేను పోషకునిగను , శివుడు లయకర్తగను మనము ముగ్గురము అయితిమి. కావున ఒకే దానినుండి వచ్చిన మనకు మొదట భేదములేదుకదా !


అని బ్రహ్మకు శివునికి శ్రీమహావిష్ణువు తత్త్వమును స్మృతికి తెచ్చెను , మరియు బ్రహ్మతో నిట్లనెను , బ్రహ్మ ! నీవు స్వతంత్రుడవు , నిగ్రహానుగ్రహ సమర్థుడవు. సర్వప్రాణులను సృషించినవాడవు. దేవతలకు ప్రభువువు. వేదములకు స్థానము అన్ని యజ్ఞములకును అధిపతిని. సర్వలోకములకు సంపదనిచ్చువాడవు. స్వశక్తితోడనే పరమాత్మయోగమునందినవాడవు. సర్వ రక్షకుడవు. నా నాభి కమలమందు బాలార్కునివలె ప్రకాశించువాడవు. మనకు భేదము లేదు , ఏకత్వములో నున్న నేనే అనేకత్వము నందితిని. మనమిద్ధరమొకటే. నీవును నా వలెనే సమస్త దేవతలకు పూజనీయుడవు. అని బ్రహ్మ మనసునకు నచ్చునట్లుగ తత్త్వమును బోధించెను. అని గృద్నృమదమహర్షి జహ్నుమునికి విష్ణు సర్వవ్యాపకత్వమును వివరించెను.


      🌷🌷 *సేకరణ*🌷🌷

        🌴 *న్యాయపతి*🌴 

      🌿 *నరసింహారావు*🌿

🌴🎋🌾🕉️🕉️🌾🎋🌴


🙏🙏🕉️🙏🙏🕉️🙏🙏