ప్రశ్న పత్రం సంఖ్య: 39 జవాబులు
కూర్పు: సి. భార్గవ శర్మ న్యాయవాది
క్రింద ఇచ్చిన ప్రశ్నలకు 4 జవాబులు వున్నాయి ఒక జవాబు మాత్రం ఎంచుకోండి.
1) సవ్యసాచి అని ఈ వీరుని ఒక పేరు
i ) భీముడు ii ) అర్జనుడు* iii )నకులుడు iv ) ధర్మరాజు .
2) "పులికాపు" అనగా ఏమిటి
i ) ఇత్తడి విగ్రహాలను పుల్లని పదార్ధంతో శుభ్రపరచటం* ii ) ఇత్తడి విగ్రహాలను నిర్మా సబ్బుతో శుభ్రపరచటం iii ) ఇత్తడి విగ్రహాలను చల్లని పదార్ధంతో శుభ్రపరచటం iv ) ఇత్తడి విగ్రహాలను ఇటిక పొడితో శుభ్రపరచటం
3) నాలుగు వేదాలను ఆలా విభజించిన మహర్షి ఎవరు
i ) వేదవ్యాసుడు* ii ) అత్రి మహర్షి iii ) పరాశరుడు iv ) అంగీరసుడు
4) సంపెంగ పుష్పము ఒక
i ) అందమైన పుష్పము ii ) అందము వాసన వున్న పుష్పము iii ) ఇది ఎర్రని పుష్పము iv ) సువాసన వున్న పుష్పము*
5) దేవతల గురువు ఎవరు.
i ) వసిష్ఠుడు * ii ) విశ్వామిత్రుడు iii ) శుక్రాచార్యుడు* iv ) అత్రి మహర్షి
6) స్వచ్ఛమైన నీరు ఒక .
i ) మంచి విద్యుత్ వాహకం ii ) విద్యుత్ వాహకం కాదు* iii ) విద్యుతికి నీటికి సంబంధం లేదు iv ) కొన్ని సార్లు విద్యుత్ వాహకంగా పనిచేస్తుంది.
7) బంగారము ఒక
మంచి
విద్యుత్ వాహకం* ii ) విద్యుత్ వాహకం కాదు iii ) విద్యుతికి
బంగారానికి సంబంధం లేదు iv ) కొన్ని సార్లు విద్యుత్ వాహకంగా పనిచేస్తుంది.
8) మొట్టమొదటి ఉపనిషత్ అని దేనిని అంటారు.
i ) కేన ii ) ఈశావాసిపనిషత్* iii ) ముండకోపనిషత్ iv ) బృహదారణ్యక
9) ఈ దేముడికి గుడులు లేవు
i ) పరమేశ్వరుడు , ii ) బ్రహ్*మ iii ) విష్ణు iv ) వేంకటేశ్వరుడు
10) తెలంగాణాలో రైతులకు ఆర్ధిక సహాయకరంగా ప్రెవేశపెట్టిన పథకం
i ) రైతు సహాయం ii ) రైతు బంధు* iii ) రైతు భరోసా iv ) రైతులకోసం
11) హిమాలయాలలో పుట్టిన నది ఇది
i )కృష్ణ ii ) గోదావరి iii ) తుంగభద్రా iv ) గంగానది*
12) ప్రపంచంలో హిందూమత ప్రాశస్త్యాన్ని చాటిన శ్రీ రామకృష్ణ శిష్యుడు
i ) వాచాలుడు ii ) గోవిందుడు iii ) వివేకానంద* iv ) మండనమిశ్రుడు
13) సూర్యునిలో ఈ గ్యాసు ఉంటుంది.
i ) అమ్మోనియం ii ) కార్బండైయాక్సిడ్ iii )హైడ్రోజన్* iv ) సల్ఫర్ డీఆక్సీడ్
14) మన గృహవరణలో ఈ మొక్కను తప్పకుండ పెంచుకుంటాము
i ) చామంతి ii )తులసి* iii ) గన్నేరు iv ) బంతి
15) విమానం తక్కువ బరువు ఉండటానికి ఈ లోహంతో చేస్తారు
i ) ఇనుము ii ) అల్యూమినియం* iii ) స్టీలు iv ) రాగి
16) భూమి ఒక పెద్ద
i ) నీటిముద్ద ii )అయస్కాంతము* iii ) రాయి iv ) ఉపగ్రహం
17) మనందరికీ మేనమామ ఎవరు
i ) శుక్రుడు ii ) బుధుడు iii ) చంద్రుడు*(భూమాత అని మనం భూమిని తల్లిగా భావిస్తాము, చంద్రుడు భూమికి తమ్ముడుగా భావిస్తాము అందుకే మేనమామ అయ్యాడు) iv ) అంగారకుడు
18) ఇది కాళిదాసు వ్రాసిన ఒక నాటకము
i ) మృత్యకటకము ii ) మేఘసందేశము* iii ) కన్యాశుల్కము iv ) ఆముక్తమాల్యద
19) ప్రస్తుతం మైక్రోవేవులను ఈ పరికరాలలో వాడుతున్నారు
i ) సెల్ ఫోను* ii ) కాలింగ్ బెల్ వు iii ) గడియారాలు iv ) ఎయిర్ కండీషనర్లో
20) చిలికి చిలికి
i ) వడగళ్ల వాన అయ్యింది ii ) గాలి వాన అయ్యింది* iii ) మజ్జిగ అయ్యింది iv ) కోవా అయ్యింది
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి