ప్రశ్న పత్రం సంఖ్య: 40
కూర్పు: సి. భార్గవ శర్మ న్యాయవాది
క్రింద ఇచ్చిన ప్రశ్నలకు 4 జవాబులు వున్నాయి ఒక జవాబు మాత్రం ఎంచుకోండి.
1) సప్తఋషి మండలంలో ఒక నక్షత్రం ప్రక్కన చిన్నగా కనిపించే నక్షత్రం ఏది.
i ) వసిష్ఠుడు ii ) నర్మద iii ) అనసూయ iv ) అరుంధతి .
2) కంప్యూటరుతో ఈ పని చేయలేము
i ) లెక్కలు చేయటం ii ) టైపు చేయటం iii ) బట్టలు ఉతకటము iv ) పాటలు వినటం
3) నిమ్మరసం ఒక
i ) లవణము ii ) క్షారము iii ) ఆమ్లము iv ) తటస్థ ద్రావణము
4)ఉత్తమజాతి కలపగా దీనిని పరిగణిస్తారు
i ) నల్ల తుమ్మ ii ) వేప iii ) జనపనార iv ) టేకు
5)"చవాన" మహర్షి కనుగొనిన ఔషధము .
i ) అమృతారిష్ఠ ii ) భాస్కర లవణము iii ) చవనప్రాస iv ) దసములారిష్ట
6) ఎంతచెట్టుకు అంత
i ) నీరు ii ) గాలి iii ) కాయ iv ) పువ్వులు .
7) మనదేశంలో కారుకి స్టీరింగ్ కుడివైపున ఉండటానికి కారణం
రోడ్డు మీద ఎడమవైపుకు వెళ్ళాలి కనుక ii ) రోడ్డు మీద కుడి వైపుకు వెళ్ళాలి కనుక iii ) రోడ్డు మీద ఎటువైపుకు వెళ్లినా పరవాలేదు కనుక iv ) కార్ల కంపెనీ వారు అలా తయారుచేసారు కనుక .
8) మొట్టమొదటి ఇతిహాసం అని దేనిని అంటారు.
i ) రామాయణం ii ) భగవత్గీత iii ) భారతం iv ) బృహదారణ్యక
9) ఈ దేముడిని భోళా దేముడు అంటారు
i ) పరమేశ్వరుడు , ii ) బ్రహ్మ iii ) విష్ణు iv ) వేంకటేశ్వరుడు
10) ఆంధ్రప్రేదేశ్ లో రైతులకు ఆర్ధిక సహాయకరంగా ప్రెవేశపెట్టిన పథకం
i ) రైతు సహాయం ii ) రైతు బంధు iii ) రైతు భరోసా iv ) రైతులకోసం
11)ఇది ఒక ఉత్తర భారతదేశ నది
i )కృష్ణ ii ) గోదావరి iii ) తుంగభద్రా iv ) యమునా
12) ప్రపంచంలో కృష్ణ భక్తిని చాటుతున్న సంస్థ
i ) డిస్కం ii ) ఇస్కాన్ iii ) కృష్ణ అవెన్యూ iv ) రామనామ తారక సంఘం
13) వివాహానికి సంబంధించి జాతక రీత్యా ఈ దోషం వుండకూడదని చెపుతారు
i ) కుజ దోషం ii ) శుక్రదోషం iii )శనిదోషం iv ) రాహుదోషం
14) భగవంతునికి ఇలా కోరుకోవాలని అంటారు
i ) అనాయాసేన మరణం ii )అనాయాసేన జీవనం iii ) అనాయాసేన భోజనం iv ) అనాయాసేన శయనం
15) మానవమానాలను సమానంగా చూసేవారిని ఏమంటారు
i ) పిచ్చివాడని అంటారు ii ) స్థిత ప్రజ్ణడు iii ) మంచివాడు iv ) అమాయకుడు
16) సర్వేంద్రియా నామ్
i ) నాసికా ప్రదానం ii ) నయనం ప్రదానం iii ) చరణం ప్రదానం iv ) హస్తం ప్రదానం
17) దీనిని వాసన చూస్తే కళ్ళకు నీళ్లు వస్తాయి
i ) కుంకుడు కాయ ii ) తరిగిన దోసకాయ iii ) తరిగిన ఉల్లిగడ్డ iv ) తరగని బెండకాయ
18) బదరీఫలం అని దీనిని అంటారు
i ) అరటి ఫలం ii ) రేగి ఫలం iii ) జామ ఫలం iv ) ద్రాక్ష ఫలం
19) గృహవాసారాలకు మైక్రోవేవులను ఈ పరికరాలలో వాడుతున్నారు
i ) ఓవెన్లలో ii )ఇండక్షన్ స్టవులలో iii ) గడియారాలు iv ) ఎయిర్ కండీషనర్లో
20) ఈ దేముడికి వెన్న దొంగ అనే పేరుఉంది
i ) శ్రీ రాముడు ii ) పరమ శివుడు iii ) సత్యభామ వల్లభుడు iv ) లక్ష్మీ వల్లభుడు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి