18, జనవరి 2025, శనివారం

ఆల్ ఇండియా ట్యాక్స్ పేయర్స్ ఆర్గనైజేషన్

 (ఫ్లాష్ న్యూస్) ప్రపంచంలోనే అతిపెద్ద సంస్థగా అవతరించనున్న ఆల్ ఇండియా ట్యాక్స్ పేయర్స్ ఆర్గనైజేషన్ ఏర్పాటుకు కమిటీని ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు నిన్న నిర్ణయించింది.  ఏ ప్రభుత్వం పాలిస్తున్నప్పటికీ, ఈ సంస్థ ఆమోదం లేకుండా ఏ ప్రభుత్వం కూడా ఉచిత విద్యుత్, ఉచిత నీరు, ఉచిత పంపిణీ లేదా రుణమాఫీని ప్రకటించదు.  డబ్బు మా పన్ను చెల్లింపుదారులకు చెందినది కాబట్టి, దాని వినియోగాన్ని పర్యవేక్షించే హక్కు పన్ను చెల్లింపుదారులకు ఉండాలి.  రాజకీయ పార్టీలు ఓట్ల కోసం ఉచితంగా పంపిణీ చేస్తూ ప్రజలను మభ్యపెడుతున్నాయన్నారు.  ప్రభుత్వం ప్రకటించే ఏ ప్రాజెక్టులైనా ముందుగా వాటి బ్లూప్రింట్‌లను సమర్పించి ఈ సంస్థ నుండి అనుమతి పొందాలి.  ఇది MPలు మరియు MLAల జీతాలకు మరియు వారు పొందే ఇతర విచక్షణ రహిత ప్రయోజనాలకు కూడా వర్తింపజేయాలి.  ప్రజాస్వామ్యం కేవలం ఓటుకు మాత్రమే పరిమితమా?  ఆ తర్వాత పన్ను చెల్లింపుదారులుగా మనకు ఎలాంటి హక్కులు ఉన్నాయి?  పార్లమెంటును అడ్డుకున్నందుకు ఎంపీలు, ఎమ్మెల్యేలను బాధ్యులను చేసే హక్కు పన్ను చెల్లింపుదారులకు ఉండాలి మరియు వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలి.  వారు అన్ని "సేవకులు" తర్వాత పన్ను చెల్లింపుదారులచే చెల్లించబడతారు.  అటువంటి "ఉచితాలను" ఉపసంహరించుకునే హక్కు కూడా తక్షణమే వినియోగించబడుతుంది.  మీరు అంగీకరిస్తే, దయచేసి వీలైనంత ఎక్కువ మందిని సంప్రదించండి.  దీన్ని చేయడానికి, పోస్ట్‌ను భాగస్వామ్యం చేయండి.  దీన్ని మీ స్నేహితుల్లో కనీసం 10 మందికి పంపండి.  దయచేసి ఈ సందేశాన్ని వైరల్ చేయడానికి షేర్ చేయండి.  🙏  చాలా కాలంగా ఎదురుచూస్తున్న శుభవార్త.

ఆదివారం🌞* *🌹19, జనవరి, 2025🌹* *ధృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

       *🌞ఆదివారం🌞*

*🌹19, జనవరి, 2025🌹*  

    *ధృగ్గణిత పంచాంగం*


  *స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం* 

*ఉత్తరాయణం - హేమంత ఋతౌః*

*పుష్యమాసం - కృష్ణపక్షం*

*తిథి      : పంచమి* ఉ 07.30 వరకు ఉపరి *షష్ఠి*

*వారం    : ఆదివారం* ( భానువాసరే )

*నక్షత్రం  : ఉత్తర* సా 05.30 వరకు ఉపరి *హస్త*

*యోగం  : అతిగండ* రా 01.58 వరకు ఉపరి *సుకర్మ* 

*కరణం  : తైతుల* ఉ 07.30 *గరజి* రా 08.41 

ఉపరి *వణజి*

*సాధారణ శుభ సమయాలు* 

 *ఉ 07.00 - 11.00   మ 02.00 - 04.00*

అమృత కాలం  : *ఉ 09.30 - 11.17*

అభిజిత్ కాలం  :  *ప 11.56 - 12.41*

 

*వర్జ్యం            :  రా 02.57 - 04.45 తె*

*దుర్ముహూర్తం  : సా  04.27 - 05.12*

*రాహు కాలం   : సా 04.32 - 05.57*

గుళికకాళం       : *మ 03.08 - 04.32*

యమగండం     : *మ 12.18 - 01.43*

సూర్యోదయం :*ఉ 06.40* 

సూర్యాస్తమయం :*సా 05.57*

సూర్యరాశి : *మకరం*  

చంద్రరాశి : *కన్య*    

*ప్రయాణశూల  : పడమర దిక్కుకు పనికిరాదు*

*వైదిక విషయాలు* 

ప్రాతః కాలం :  *ఉ 06.40 - 08.55*

సంగవ కాలం :*08.55 - 11.11*

మధ్యాహ్న కాలం    :      *11.11 - 01.26*

అపరాహ్న కాలం    : *మ 01.26 - 03.41*

*ఆబ్ధికం తిధి : పుష్య బహుళ షష్ఠి*

సాయంకాలం  :  *సా 03.41 - 05.57*

ప్రదోష కాలం  :*సా 05.57 - 08.29*

రాత్రి కాలం : *రా 08.29 - 11.53*

నిశీధి కాలం :*రా 11.53 - 12.44*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.58 - 05.49*

________________________________

         *🌷ప్రతినిత్యం🌷*

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


    *🌞IIశ్రీ సూర్య సోత్రంII🌞*


*ఉదయాద్రిచారుచామర హరితహయఖురపరిహితరేణురాగ*

*హరితహయ హరితపరికర గగనాంగనదీపక నమస్తేఽస్తు*


🙏 *ఓం నమో సూర్యాదేవాయ నమః* 

          

🌞🪷🌹🛕🌹🌷🪷🌷🌞

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><>

         🌷 *సేకరణ*🌷

      🌹🌿🌞🌞🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🌞🌞🍃🌷

 🌹🌷🌞🌞🌞🌞🌷🌹

Panchang

 


ప ద్య సౌ ర భ ము

 


ప ద్య సౌ ర భ ము

          -‍చొప్పకట్ల.


జోటీభారతి!యార్భటిన్మెరయుమీ!చోద్యంబుగానేను, క

ర్ణాటాధీశ్వరుఁబ్రౌఢదేవనృపతిన్ ,నాసీరధాటీచమూ

కోటీఘోటక ధట్టికా ఖురపుటీకుట్టాక సంఘట్టనా

స్ఫోటీ ధూతధరారజశ్చుకిళితాంబోధిన్

బ్రశంసించెదన్!


  చాటుపద్యం-


              - శ్రీనాథకవిసార్వభౌముడు!

"దీనారటంకార

లతీర్థమాడించిన,కర్ణాటకసార్వభౌముని, "ప్రౌఢదేవరాయని" ప్రశంసించినపద్యరత్నము.

            రాయలుగొప్పపరాక్రమవంతుడు.,సముద్రమేహద్దుగా విశాలకర్ణాటకము నేలినసార్వభౌముడు.కవిపండితాభిమాని.రాయలఔదార్యమును,అతడుశ్రీనాధునకొనరించిన కనకాభిషేకము ఋజువుపరచినది. మరియతని యవక్రవిక్రమమో?అది పైపద్యము వలన బోధపడుచున్నది.

       తల్లీ!భారతీ నన్నుగ్రహింపుము.ఆసముద్రముద్రిత వసు ధావలయమంతయు నేలు కర్ణాటసార్వభౌముడగు ప్రౌఢదేవరాయని

పరాక్రమును పొగడబోవుచున్నాను.కాన నీవు నావాక్స్థానమున నిలచి"ఆరభటీవృత్తి"తోనన్ననుగ్రహింపుము.అని కవిసార్వభౌముని,వినతి .

        ఈసార్వభౌముడు సముద్రసీమితమైనధరావలయమున కధినాధుడు.

       తన సేనాపరివారములోని గుఱ్ఱములడెక్కలతాకిడికి లేచిన ధరణీపరాగముచే,ఔపోసించినసముద్రముగలవాడు.(అనగా గుర్రములడెక్కలధూళి సముద్రమునుగూడ కనిపించనీయకున్నదనిభావము)

అతిశయోక్తి అలంకారము.

ఆరభటీ వృత్తి!

కఠినపదములకు అర్ధము:

జోటీ-స్త్రీవాచకము, వనితా!

ఆరభటి-ఇదియొకశబ్దవృత్తి,పద్యరచనావిధానమునకఠినమైనపెద్దపెద్దసమాసములతోసాగును,వీర భయానకరసవర్ణనకు ఉపయుక్తము.

చోద్యంబుగా-ఆశ్చర్యకరముగా.

ఆసీర-ఆసముద్రపర్యంతము-సరహద్దు.

ధాటీ -పరుగెత్తు,

చమూ-సైన్యం.

కోటీ -సమూహం.

ఘోటక-గుర్రముల.

ఖురపుటీ-దొప్పలవంటిడెక్కల,

కుట్టాక-కఠినమైన.

సంఘట్టనాస్ఫోటీ-ఒరిపిడివలన.

ధూత-పైకిలేచుచున్న.

ధరారజః-నేలనుండివచ్చినదుమ్ము.

చుకిళిత-పుక్కిలిబట్టుచున్న.(మ్రింగబడుచున్న)

అంబోధిన్-సముద్రుని,

ప్రశంసించెదన్-పొగిడెదను.

                    

                        స్వస్తి!!🙏🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

ప్రబంధ కవుల ప్రతిభ

 శు భో ద యం🙏


ప్రబంధ కవుల ప్రతిభ!! తెనాలి వారి ప్రాగల్భ్యం!!


ఉ: " సారధి ఛాదసుండు; బడి సాగదు చక్రయుగంబు ;ప్రాఁత సం

చారపు గుఱ్ఱముల్ ; రధియు శౌర్యమునందరమాని ;సాత్మవి

స్తారము ఖండ ఖండములు ; తానట మాసరి! యంచుఁదత్పురిన్

దేరులు నవ్వు శంకరుని తేరిని , కేతన కింకిణీ ధ్వనిన్ 

పాండురంగ మాహత్మ్యము-ప్రథమా శ్వాసము-115 పద్యము; తెనాలి రామకృష్ణ కవి;

పాండురంగ మాహాత్మ్యము చక్కని ప్రౌఢ ప్రబంధం. పాండురంగ విభుని పదగుంభనమునకు నిలయము. 

ఈప్రబంధం కాశీపుర వర్ణనతో ప్రారంభమౌతోంది. అక్కడ చాలా పెద్దపెద్ద రథాలు ఉన్నాయట. అవి పరమేశ్వరుని రథాన్ని చూచి

గణగణ మని నవ్వుతున్నాయట. (వెక్కిరిస్తున్నాయని భావం) ఎందుకూ నవ్వటం? మీరు మాకు సరిగారు అని;

ఇంతకూ శివుని రథానికున్న లోపాలేమిటీ? ఒకటా రెండా ? అన్నీ లోపాలేనట!

సారధి చూద్దామా పరమ ఛాందసుడు. లోకంలో ఈఛాందసుడు అనేపదం వట్టి చాదస్తం కలవాడు అనే యర్ధంలో 

వాడబడుతోంది. అంటే ఒకరిమాటవినడు తనకు తోచిందే చేస్తాడని యర్ధం. ఇక ఛాందసుడు అనేపదానికి వేదవిదుడు అనే అర్ధంకూడా ఉంది. శివుని రథ సారధి బ్రహ్మగారు. చతుర్వేదములు ఆయన ముఖతః పుట్టాయి.కాబట్టి ఆయన ఛాందసుఁడయ్యాడు.

ప్రస్తుతం మనమిక్కడ చాదస్తం కలవాడనే అనుకోవాలి.

బడి సాగదు చక్రయుగంబు- చక్రాలా ఒకేలా నడిచేవికావు. శివుని రధానికి చక్రాలు సూర్య చంద్రులు,సూర్యుడు పగలు,చంద్రుడు రాత్రి ,మాత్రమే ఉంటారు. ఒకసారి యిద్దరూ ఉండరు.అందువల్ల చక్రాలు సమంగా సాగవు.

ప్రాఁత సంచారపు గుర్రముల్: గుర్రాలు తిరిగి తిరిగి ముసలివైపోయాయి. ఇకవాటికి శక్తిలేదు.ఇంతకీ గుర్రాలు యేవి? వేదాలే

చతుర్వేదాలూ శివుని రథానికి గుర్రాలు. వేదాలు చాలా ప్రాచీనమైనవే! అందుచేత ముసలి గుర్రాలట!

రథియు శౌర్యమునం దరమానిసి"- ఇంక ఆరథమెక్కి తిరిగే ఆయన ఆడో మగో తెలియనివాడు. (పరాక్రమంలో సగంమనిషి!) అర్ధనారీశ్వరుడుగదా!

ఆత్మ విస్తారము ఖండఖండములు "- దాని పొడవు వెడల్పులు చుద్దామా ?ముక్కలూ చెక్కలు. శివుని రథం

భూమి. భూవలయం నవఖండ మండితమైనది. అంటే తొమ్మిది ముక్కలుగా ఉంటుంది. విరిగిన చెక్కముక్కలతో చేసిన రథం.దానికి

బలమెక్కడిది? అనియీసడింపుతో ఆవూరి రథాలు తమ జండాలకు కట్టిన చిరుగంటల మ్రోతలతో శివుని రథాన్ని చూసి నవ్వుతాయట!

ఆహా కవిదెంత గొప్పయూహ! దానికి శ్లేషను జోడించి , చక్కని పద్యాన్ని ప్రకల్పన చేశాడు!

ఇందులో నిందా స్తుతి గర్భితమైన శ్లిష్టోత్ప్రేక్షాలంకారం చోటుచేసికొన్నది!


                                              స్వస్తి!🙏🌷🌷🙏🌷☝🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

పదవిని బట్టి విలువ

 పదవిని బట్టి  విలువ!

              

           ఉ: "స్థాన  విశేష మాత్రమున  'తామఱపాకున  నీటిబొట్ట'! నిన్


                 బూనిక  మౌక్తికంబనుచుఁ బోల్చినమాత్రన  నింత గర్వమా?


                 మానవతీ శిరోమణుల  మాలిక లం దునఁ గూర్ప వత్తువో?


                 కానుక లీయవత్తువొ?  వికాసము నిత్తువొ?  విల్వ నిత్తువో?


                  చాటుపద్యం-- నందితిమ్మన-- రాయల యాస్థాని!


                       

                            విచిత్రమైన పద్యమే ! కానీ  లోకంలో  నకీలీల బారిన పడి బాధపడుతున్నవారెందరో?  అలాంటి కవులెవ్వరో  రాయల పరిసరాలలో చేరి డాబుచేస్తూ, తిమ్మనకు దక్కవలసిన గౌరవాన్ని  దక్కకుండా చేస్తున్నారేమో? వారిని మనస్సులో 

పెట్టుకొని  తిమ్మనగారు యీపద్యం వ్రాశారు.


               "  ఉదయపువేళలో  సరోవరాలలో  కనిపించే  దృశ్యం,తామఱాకుపై పడిన  నీరు ముత్యంలా  తళతళలాడుతూ  కనిపిస్తుంది.సూర్యరస్మి వలన తామరపాకుకుండే  స్నిగ్ధత్వంవలన  ఆవిధంగా కనిపిస్తుంది.చూచేవారికది ముత్యమేమోనని  భ్రమకల్గిస్తుంది.

అది నీరేగానీ  ముత్యంగాదు. అదిగో దాన్ని నిందిస్తున్నట్లుగా  సాకుచేసికొని  తిమ్మనగారు  యీవిధంగా అంటున్నారు.


                            "ఓనీటి చుక్కా! తామఱపాకుపై  నిలచి నేను  ముత్యాన్నని డాబులు కొట్టబోకు. తెలియని వారు నిన్ను ముత్య

మనుకొనినంత మాత్రమున నీకంతగర్వమా? నీవేమైనా  ఆడవారి పూమాలలలో  నలంకరింప దగియున్నావా? కానుకలిచ్చుటకు పనికివత్తువా? నీవల పరిసరములకేదైన వికాసము కలుగునా? అమ్ముకొందమనిన నీకేమైన  విలువయున్నదా? గాలివాటుకు నీటిలోకిజారితివా? ఇకనీపనిశూన్యము. ఇంతదానికంత మిడిసిపడుటయేల? మేలుగాదు సుమా?"-అని హెచ్చరిక!


                   నేడు గూడా  యేమాత్రము విలువలేనికొందరు  మహానాయకుల నాశ్రయంచి  తామేదో మహనాయకులమన్నట్లు

డాబులు చేయువారున్నారు. అట్టి నకిలీల కందరకూ యాపద్యము చెంపపెట్టు.


                      మహా కవుల  నర్మగర్భసందేశము  లిట్లుండును!


                                               స్వస్తి!🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

మంత్రపుష్పం

 *మంత్రపుష్పం* 

                

 *దేవాలయంలో పూజ చేసేటప్పుడు మంత్రపుష్పం చదువుతారు.* 


*పరమాత్మ సర్వత్రా ఉన్నాడని మంత్రపుష్పం చెబుతుంది.*


*మానవుల లోపల, బయట కూడా పరమాత్మ వ్యాపించి ఉన్నాడని, ఆ పరమాత్ముడు ఏ రూపంలో ఉందో మంత్రపుష్పం చెబుతుంది.*

మానవ శరీరంలో ముకుళించుకుని వున్న కమలంలో నాభి పైభాగంలో హృదయ కమలం వుంది. దానికి మొట్టమొదటి భాగాన అగ్నిశిఖలో పసుపు రంగుతో వడ్ల గింజ మొనలా దేవదేవుడు అణు రూపంలోవున్నాడు” అని మంత్ర పుష్పంలో వర్ణించబడింది.


చేతిలో పుష్పాలని తీసుకుని మంత్రపుష్పం పూర్తయిన తర్వాత ఆ పుష్పాలని భగవంతునికి సమర్పించి, నమస్కరించి, ఆ పుష్పాలని మన శిరస్సు మీద వేసుకుంటే ఆ దైవశక్తి మనలోకి ప్రవేశిస్తుందని భక్తుల విశ్వాసం.


మనిషిలో వున్న పరమాత్మ ఉనికిని తెలియజేసి భక్తుడు, పరమాత్మ ఒక్కటే అనే అద్వైత భావం కలిగించే మంత్రపుష్పాన్ని విన్నప్పుడు కళ్ళు మూసుకుని పరమాత్మని దర్శనం చేసుకోవాలి.


అన్ని శుభాల్నీ కలగజేసే శ్రీమన్నారాయణుడికి నమస్కారం అనే శ్లోకపాదం మంత్రపుష్పంలో కనిపిస్తుంది. నారాయణుడే విశ్వానికి జీవనాధారమని,ఆయన మంగళకరుడు, నాశరహితుడని మంత్రపుష్పంలోని మూడో శ్లోకం చెబుతుంది. 


చీకటివెలుగులు సూర్యుడి వల్ల సంభవిస్తాయి. ఆ సూర్యుణ్ని సృష్టించింది శ్రీమన్నారాయణుడే. అందుకే “దైవం పరంజ్యోతి”అంటారు. అతనే పరబ్రహ్మ. ధ్యానం, అది చేసేవాడు- రెండూ నారాయణుడే అని మంత్రపుష్ప సారాంశం.

                    

*రాజాధిరాజాయ ప్రసహ్య సాహినే*

*నమోవై యం వై శ్రవణాయ కుర్మహే* 

 *సమే కామాన్ కామకామాయ* 

 *మహ్యం కామేశ్వరో వై శ్రావణౌ*

 *దధాతు*

 *కుబేరాయవై శ్రవణాయ* 

 *మహారాజాయ నమః*


రాజులకు రాజైన దేవుడోయి

పరులకు లాభాలీయునోయి

వైశ్రవణునకు వందనమోయి

సకల కోరికల యజమానోయి

మా కోరికలన్ని తీర్చునోయి

అతడే కుబేరుడు వైశ్రవణుడోయి

ఆ మహారాజుకు వందనమోయి.

*ఓం తద్బ్రహ్మ, ఓం తద్వాయు,*

 *ఓం తదాత్మా* *ఓం తత్సత్యమ్*

*ఓం తత్సర్వం, ఓం తత్పురోమ్ నమః*


అతడే బ్రహ్మమతడే వాయువు

అతడే సత్యమతడే ఆత్మ

అతడే సర్వమతడే ఆదిదైవం

 *అన్తశ్చరతి భూతేషు* 

*గుహాయామ్ విశ్వమూర్తిషు*


జీవులందున్నవాడు

బయటా వున్నవాడు

తెలియని వాడు

విశ్వమంతా వున్నవాడు.

 *త్వం యజ్ఞ్యస్త్వం* *వషట్కారస్త్వం* 

*మిన్ద్రస్తగ్ం* *రుద్రస్త్వం విష్ణుస్త్వం*

*బ్రహ్మత్వం ప్రజాపతిః*

*త్వం తదాప ఆపొజ్యోతీ*

*రసో ౭ మృతం*

*బ్రహ్మ*

*భూర్భువస్సువరోమ్*


నీవే యాగము  యాగమంత్రము

నీవే  విష్ణువు బ్రహ్మ ఇంద్రుడవు

నీవే  జలము తేజము రసము

నీవే శాశ్వతము  విశ్వరూపము

నీవే  ఓం కారబ్రహ్మవు

*ఈశాన స్సర్వ విద్యానా మీశ్వర*

*స్సర్వభూతానామ్ బ్రహ్మధిపతిర్*

*బ్రహ్మణో ౭ ధిపతిర్ బ్రహ్మశివోమే*

*అస్తు సదా శివోమ్*


సకల విద్యల కు ఈశుడవు

సకల జీవులకు ఈశుడవు

నీవే బ్రహ్మ యజమాని

నీవే బ్రాహ్మల యజమాని

నీవే బ్రహ్మ సదాశివుడవు

*తద్విష్ణో పరమం పదగ్ం*

*సదా పశ్యన్తి సూరయః*

*దివీవ చక్షు రాతతమ్*


ఆ విష్ణు లోకము నోయి

ఆ పరమ పధమునోయి

జ్ఞానులు సదా చూచేరోయి ఆకాశమంతా చూచేరోయి

*తద్విప్రాసో విపన్వవో*

*జాగృవాం స్సమిన్దతే*

*విష్ణోర్య త్పరమం పదమ్*


కోరికలు దోషాలు లేని వారు

జాగృతి చలనాలు కలవారు

విష్ణులోక కాంతులు పెంచేరు

పరలోక ప్రకాశము

 *ఋతగ్ం  సత్యం పరమ్బ్రహ్మ* 

*పురుషం కృష్ణ పింగళమ్*

*ఊర్ధ్వరేతమ్ విరూపాక్షం*

*విశ్వరూపాయ వై నమో నమః*


ముక్తినాధుడు సత్యరూపుడు

బ్రహ్మ రూపుడు నల్లనివాడు

పైకి వెలుగు  తేజోవంతుడు

విరూపనేత్రుడు విశ్వరూపుడు

దేవదేవునకు మరల వందనము.

*నారాయణాయ విద్మహే*

*వాసుదేవాయ ధీమహి*

*తన్నో విష్ణు ప్రచోదయాత్*


నారాయణుని ఉహించెదను

వాసుదేవుని ధ్యానించెదను

విష్ణు చైతన్యము కలుగు గాక

*ఆకాశ త్పతితం తోయమ్*

*యథా గచ్ఛతి సాగరం*

*సర్వదేవ నమస్కారః*

*కేశవమ్ ప్రతి గచ్ఛతి*


ఆకాశ ధారాల నీరులు

ఎలా సాగరమే చేరునో

సకలదేవ వందనాలు

ఆ పరందామునే చేరును

 *మంత్రపుష్పం సంపూర్ణం*


*సర్వం శ్రీపరమేశ్వరా ర్పణమస్తు*

కత్తులు దూసిన నోరులేని

 **కత్తులు దూసిన నోరులేని పందెం కోళ్లు **

**చేతులు మారిన వేల కోట్లు **

@@@@@@      @@@@

**పంతం పడుతుంది పందెం **

**గెలిస్తే ఎవడికి అందం **

**కోడికి మనిషికి విడదీయరాని బంధం **

**అక్షరాలలో చెప్పలేనిది అ అనుబంధం **

**కోటేశ్వరుడిని సైతం నిముషాలలో కూటికి లేని ఈశ్వరుడు ని చేయగలదే పందెం **

**కాలానికి అందరూ సమానులే **

**కాలం కలిసోస్తే కోటేశ్వరులే **

**అదే కక్ష కడితే బికారులే **😂

**500 నోట్లే నోరేళ్లబెట్టాయి **

**అదృష్టవంతుడుకి పట్టం కట్టాయి **

**దురదృష్టవంతులను రోడ్ మీద నిలబెట్టాయి **

**ఆలోచించండి వేల బతుకులు చితికి పోయాయి **

**లాభం వచ్చినవాడికి సంక్రాంతి పండగ **

**లాస్ అయినవాడికి జీవితం దండగ **😂😂

**అవునా కాదా?**

**నిజాన్ని చెప్పేవాడికి ధైర్యం ఎక్కువ **

**నిజాన్ని దాచే వాడికి భయం ఎక్కువ **

**బొమ్మిన వెంకట్ **

ఎప్పుడూ వద్దు..

 ఇవి ఎప్పుడూ వద్దు..


* చదువులో పోలిక వద్దు..


* టెన్షన్ వద్దు..


* అనవసరపు వాదన వద్దు..


* అతి మంచితనం వద్దు..


* మొహమాటం వద్దు..


* నిర్లక్ష్యం వద్దు..


* అనుమానం వద్దు..


982


* అకాల భోజనం, నిద్ర వద్దు..


* భార్య భర్త మద్య మూడో వ్యక్తి జోగు


RE


* ఒంటరితనంతో బాధ పడకు వద్దు.


* అతి వేగం వద్దు..


2


* పొదుపు చేయకుండా ఖర్చు పెట్టవద్దు.)


* మితి మీరి తినవద్దు..



అనువాదపద్యం

 శుభోదయమ్ సుభాషితమ్ 


> *అనవాప్యం చ శోకేన శరీరం చోపతప్యతే*

> *అమిత్రాశ్చ ప్రహృష్యన్తి మా స్మ శోకే మతిం కృథా:*

> విదురనీతి

------------------------------------------------

 అనువాదపద్యం:

ఆ॥వె॥

కోరి భంగపడిన కూడి పరిహసించు 

శత్రువర్గమెల్ల చవట యనుచు 

మనసు దుఃఖపడును మాన్యత చెడిపోవు 

కోర్కె శోకమిచ్చు కోర్కె వలదు 

*~శ్రీశర్మద*

మహాభారతం

 🙏 మహాభారతం - శాంతి పర్వం 🙏

               మూడవ భాగం 

భీముడు మాటలకు కూడా ధర్మరాజు లో ఏమీ మార్పు రానందున అర్జునుడు అందుకుని " ధర్మజా ! నాకు తెలిసిన ఒక ఇతిహాసం చెప్తాను విను. పూర్వం కొంత మంది బ్రాహ్మణ బ్రహ్మచారులు తమ కులముకు ఉచితమైన ఆచారములను వదిలి అడవులకు వెళ్ళారు. వారి మీద దయ కలిగిన ఇంద్రుడు ఒక పక్షి రూపంలో వారి వద్దకు వెళ్ళి" మీరు ఎంచుకున్న మార్గం తప్పు " అని చెప్పాడు. ఆ బ్రహ్మచారులు ఆ పక్షిని మహాత్ముడిగా గుర్తెరిగి తమకు తగిన మార్గం ఉపదేశించమని అడిగారు. అప్పుడు పక్షి రూపంలో ఉన్న ఇంద్రుడు ఇలా చెప్పసాగాడు " చతుష్పాదములలో గోవు, శబ్ధములలో మంత్రం, మనుష్యులలో బ్రాహ్మణుడు అత్యంత శ్రేష్టమైన వారని వేదవిదులు చెప్తారు. కనుక బ్రాహ్మణుడు మంత్రోపాసన చేసి తనకు నిర్ధేశించిన కర్మలు చెయ్యడం అతడి కర్తవ్యం. కానీ నిర్లక్ష్యంచేత కాని, కోపంచేత కానీ, శోకంచేత కానీ, తనకు నిర్దేశించిన విద్యుక్త కర్మలను చెయ్యకపోవడం మహాపాతకం. అజ్ఞానులు, అర్ధహీనులు సన్యాసం గురించి తెలియక ఉభయభ్రష్టులు ఔతున్నారు. ఎవరైతే గృహస్థు ధర్మాలను పాటిస్తూ అతిథులను, దేవతలను, పితృదేవతలను సంతృప్తిపరుస్తాడో అతడికి పుణ్యలోకములు అరచేతిలో ఉంటాయి. మంచి కర్మలు చేసి వాటిని బ్రహ్మార్పణం చేస్తే మహదానందం కలుగుతుంది " అని చెప్పాడు. ఆ మాటలు విన్న బ్రాహ్మణ బ్రహ్మచారులు గృహస్థాశ్రమం స్వీకరించి తమతమ విద్యుక్త ధర్మం నిర్వర్తించుటకు వెనుకకు వెళ్ళారు. కాబట్టి ధర్మరాజా ! నీవు నీ రాజ్యమును జనరంజకంగా పాలించు. యజ్ఞ యాగాదులు చేసి పుణ్యలోకాలను సంపాదించు " అని పలికాడు.


తరువాత ధర్మరాజు మనస్థాపం నివారించుటకు నకులుడు ఇలా చెప్పాడు. " అన్నయ్యా ! బ్రాహ్మణులు తమ విద్యుక్త ధర్మమైన యజ్ఞయాగాదులు చేసినపాపము నుండి విముక్తులు ఔతున్నారు. కేవలం యజ్ఞయాగాదులు చేసినందువలన ఏమి ప్రయోజనం ఉంటుంది. ఫలాపేక్ష లేకుండా ధనమును సంపాదించి యజ్ఞయాగాదులు చేసి బ్రాహ్మణులను తృప్తిపరిచిన అది నిస్సంగప్రవృత్తి ఔతుంది కాని మనలోని కామక్రోధాలను, శోకమోహాలను విడిచి పెట్టకుండా అడవులకు పోయి తపస్సు చేసినందువలన ప్రయోజనం ఏమిటి ? అదియును కాక గృహస్థాశ్రమధర్మం, బ్రహ్మచర్యం, వానప్రస్థం, సన్యాసధర్మాలలో గృహస్థాశ్రమం శ్రేష్టమైంది. క్షత్రియులు ధనమును కూడబెట్టి క్రతువులు చెయ్యకపోయిన పాపం వస్తుందని వేదములు చెప్తున్నాయి, గాఢాంధకార బంధురమైన ఈ విశాలవిశ్వానికి వెలుగునిచ్చే ఈశ్వరుడే ఆశ్రమధర్మాలను వర్ణవ్యవస్థను ఏర్పాటు చేసాడు. ఈ యుద్ధం కూడా ఆయన కల్పించినదే ! భగవంతుడు నిర్ణయించిన యుద్ధమున జరిగిన హింసను తలచి నీవిలా శోకించి నీ ఆశ్రమధర్మమును విడుచుట తగునా ! యుద్ధంలో హింస జరిగిందని బాధపడుతున్నావు. మనకు ముందు పాలించినరాజులు యుద్ధములు చేయలేదా వారు ఉత్తమగతులు పొందలేదా ! నీకు ఈ యుద్ధమున ఏమీ పాపం అంటదు. ధర్మాత్ముడవైన నీకు తప్పక ఉత్తమగతులు ప్రాప్తిస్తాయి. క్షత్రియుని పాలనలో ప్రజలు రక్షణ కోరుకుంటారు. ప్రజలు సుఖంగా జీవించడానికి కావలసిన పరిస్థితులను కల్పించడం రాజువిధి. అది నెరవేర్చకపోవడం పాపంకాదా ! దానధర్మాలు చెయ్యడం క్షత్రియధర్మం. అర్హులైన వారికి నీవు దానధర్మాలు చెయ్యాలి. అవన్ని వదిలి నీవిలా అడవులకు పోవడం ఉత్తమధర్మమా ! నీకిది భావ్యమా ! " అని పలికాడు నకులుడు.


తరువాత సహదేవుడు " అన్నయ్యా ! మానవుడు పైపైన ఉన్న కోరికలు విడిచి జీవించిన అది మోక్షకారకం ఔతుందా ! అన్నయ్యా ! నీవు కూడా శారీరక సుఖం వదిలి నీ వంశధర్మములు నిర్వర్తించు. మమత బంధమును కలిగిస్తుంది. మమతను విడిచిన మోక్షం లభిస్తుంది. నీవు అడవులకు వెళ్ళినా ఈ లోకంలోని వస్తువులను, సౌఖ్యాన్ని నీ మనస్సు కోరిన అది నీకు ఉత్తమలోక ప్రాప్తికి ప్రతి బంధకం ఔతుంది. అన్నయ్యా ! నీవు నాకు తల్లి, తండ్రి, గురువు, దైవం, చెలి, చుట్టం. నా మాట విని నీ మనస్సుమార్చుకో. నేను చెప్పింది అబద్ధమో, నిజమో నాకు తెలియదు. నేను భక్తితో పలికిన ఈ మాటలను నీవు కరుణతో విశ్వసించు " అని పలికాడు. నకులసహదేవుల మాటలకు ధర్మరాజు బదులు చెప్పలేదు.


అప్పటి వరకు పెదవి విప్పని ద్రౌపది లేచి ధర్మరాజు వద్దకు వచ్చి " నాధా ! మీరు అనుమతి ఇచ్చిన నాకు తోచినమాటలు చెప్తాను " అని, ధర్మజుని అనుమతితో ఈ విధంగా చెప్పసాగింది. " నాధా ! మనం ఆడవులలో ఉన్నకాలాన్ని ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి. అరణ్య అజ్ఞాతవాసాలు ముగియగానే సుయోధనుడిని చంపి మన రాజ్యసంపదలను తిరిగి కైవశం చేసుకుంటామని మీరు మీ తమ్ములకు నచ్చచెప్ప లేదా ! చెప్పినట్లు రాజ్యాన్ని కైవశం చేసుకుని ఇప్పుడిలా మాటతప్పి రాజ్యత్యాగం చేసి అడవులకు పోతానని చెప్పడం ధర్మమా ! ధర్మం సత్యం వ్రతముగా పెట్టుకున్న మీకు ఈ విధంగా పలకడం న్యాయమా ! రాజు ఎప్పుడూ పేదమనసుతో ఉండ కూడదు. రాజు తన రాజ్యమును, ప్రజలను రక్షించాలి, దుర్మార్గులను నిర్ధయగా శిక్షించి సన్మార్గులను దయతో రక్షించాలి. బ్రహ్మదేవుడు లోకాన్ని రక్షించడానికే క్షత్రియ కులాన్ని సృష్టించాడు. రాజు మనుష్యరూపంలో ఉన్న దేవుడు. అలాంటి రాజు చేతకాని వాడైన దుర్మార్గులు విజృంభిస్తారు. రాజునందు దేవుడు రాజనీతిని ప్రతిష్ఠించాడు. అపరాధులను శిక్షించడం రాజధర్మం దానిని నెరవేర్చిన ఇహపరములు సిద్దిస్తాయి. తప్పు చేసిన బ్రాహ్మణుడి నయినా రాజు శిక్షించడమే రాజధర్మం. ఇప్పుడు నీవు అదే రాజధర్మాన్ని నిర్వర్తించావు. రజస్వలను, ఏకవస్త్రను అయిన నన్ను సభకు ఈడ్చి వలువలు ఊడదీసి, తొడచూపి అవమానించిన దుర్యోధన, దుశ్శాసన, కర్ణులను నీవు ఒక రాజుగా శిక్షించావు. అది పాపంకాదు కనుక నీవు చింతించ పనిలేదు. విషప్రయోగం చేసిన వారిని, గృహదహనం చేసిన వారిని, రాజకీయ రహస్యములను బహిరంగపరచిన వాళ్ళను, హంతకులను, పరసతిని కోరిన వారిని, బందువులను చంపిన వాడిని శిక్షించడం రాజధర్మం. అది పుణ్యకార్యం. దండించ వలసిన వారిని దండించక పోవడం మహాపాపం. రాజు దండనీతిని అవలంబించడం పేదలకు, సాధువులకు, తాపసులకు మేలుచేస్తుంది. వారికి రక్షణ కలిగిస్తుంది, దుష్టశిక్షణ, శిష్టరక్షణ చెయ్య వలసిన రాజు బ్రాహ్మణుల వలె ఇంద్రియనిగ్రహం పాటించడం ధర్మమా ! కనుక నీ మనసులోని శంకను తొలగించు. నాధా ! నా మాదిరి జీవితంలో కష్టపడిన వారు ఉన్నారా ! కాని నేను అన్నీ మరచి గృహస్థు ధర్మాలను విడువక నిర్వర్తించడం లేదా ! కౌరవులు వారి గోతిని వారే తవ్వుకున్నారు. వారిపాపం వారే అనుభవించారు. అందుకు మీరు బాధపడటం ఎందుకు. కనుక మీరు రాజ్యభారం వహించి ప్రజలను జనరంజకంగా పాలించండి. మీకు తెలియని యుద్ధనీతి లేదు. పూర్వం బృహస్పతి, శుక్రుడు యుద్ధనీతిని లోకానికి తెలిపారు. ఆ నీతిని కూలంకుషంగా అభ్యసించిన మీరు ఈ రాజ్యాన్ని పాలించుట ధర్మం " అని చెప్పింది.

                    సశేషం 

సమర్పణ 

మారేపల్లి ఉదయ భాస్కర శర్మ

శనివారం🍁* *🌹18, జనవరి, 2025🌹*

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

          *🍁శనివారం🍁*

  *🌹18, జనవరి, 2025🌹*  

      *ధృగ్గణిత పంచాంగం*


  *స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం* 

*ఉత్తరాయణం - హేమంత ఋతౌః*

*పుష్యమాసం - కృష్ణపక్షం*

*తిథి      : పంచమి* పూర్తిగా రోజంతా 

రాత్రితో సహా 

*వారం    : శనివారం* ( స్ధిరవాసరే )

*నక్షత్రం  : పుబ్బ* మ 02.51 ఉపరి *ఉత్తర ఫల్గుణి ( ఉత్తర )*

*యోగం  : శోభన* రా 01.16 వరకు ఉపరి *అతిగండ*

*కరణం  : కౌలువ* సా 06.26 *తైతుల* రాత్రంతా పూర్తిగా

 *సాధారణ శుభ సమయాలు* 

 *ఉ 11.00 - 01.00   సా 04.00 - 06.00*

అమృత కాలం  : *ఉ 07.53 - 09.38*

అభిజిత్ కాలం  :  *ప 11.55 - 12.41*

 

*వర్జ్యం  :  రా 10.51 - 12.37*

*దుర్ముహూర్తం  : ఉ 06.40 - 08.10*

*రాహు కాలం   : ఉ 09.29 - 10.53*

గుళికకాళం : *ఉ 06.40 - 08.04*

యమగండం  : *మ 01.43 - 03.07*

సూర్యరాశి : *మకరం*  

చంద్రరాశి : *సింహం/కన్య*

సూర్యోదయం :*ఉ 06.40* 

సూర్యాస్తమయం :*సా 05.56*    

*ప్రయాణశూల  : తూర్పు దిక్కుకు పనికిరాదు*

 *వైదిక విషయాలు* 

ప్రాతః కాలం  :  *ఉ 06.40 - 08.55*

సంగవ కాలం  :      *08.55 - 11.10*

మధ్యాహ్న కాలం    :      *11.10 - 01.26*

అపరాహ్న కాలం    : *మ 01.26 - 03.41*

*ఆబ్ధికం తిధి  : పుష్య బహుళ పంచమి*

సాయంకాలం  :  *సా 03.41 - 05.56*

ప్రదోష కాలం  :  *సా 05.56 - 08.29*

రాత్రి కాలం     :  *రా 08.29 - 11.53*

నిశీధి కాలం    :*రా 11.53 - 12.43*

బ్రాహ్మీ ముహూర్తం :   *తె 04.58 - 05.49*

______________________________

         *🌷ప్రతినిత్యం🌷*

       *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


*🌹II శ్రీ వేంకటేశ పంచక స్తోత్రంII🙏*


*ఉపేన్ద్రమిన్దుశేఖరారవిన్దజామరేన్ద్ర*

*బృన్దారకాదిసేవ్యమానపాదపఙ్కజద్వయమ్ ।*

*చన్ద్రసూర్యలోచనం మహేన్ద్రనీలసన్నిభమ్*

*నాగరాఙ్గిరీశ్వరం నమామి వేఙ్కటేశ్వరమ్ ॥*


*🙏ఓం నమో వేంకటేశాయ🙏*

******************************


*🍁 అంజని పుత్ర స్తోత్రం..!!🍁*


*ఓంకార ప్రియ హనుమంత ఐక్య వినాయక హనుమంత*

*జయ బజరంగబలి జయజయ జయ బజరంగబలి*


           *🍁ఓం శ్రీ🍁* 

 *🌹ఆంజనేయాయ నమః🌹* 


🍁🪷🌹🛕🌹🌷🪷🌷🍁

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><>

           

          🌷 *సేకరణ*🌷

      🌹🌿🍁🍁🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🍁🍁🍃🌷

🌹🌷🍁🍁🍁🍁🌷🌹

ఈశ్వరచైతన్యం

 *యో రుద్రో విశ్వాభువనావివేశ తస్మై రుద్రాయ నమో అస్తు*


ఏ రుద్రుడు సమస్త భువనములందు అంతటా ప్రవేశించి ఉన్నాడో ఆ రుద్రునకు నమస్కారములు(యజుర్వేదం)


పరమేశ్వరుడైన రుద్రుడే అన్ని భువనాలలో, ప్రత్యణువునా వ్యాపించి ఉన్నాడు.

'యో రుద్రో అగ్నౌ అప్సు య ఓషధీషు...' అని ప్రారంభించి సాగే పై మంత్రం 'అగ్ని యందు, జలము లందు, ఓషధులందు' వ్యాపించిన పరమేశ్వరుని ప్రస్తుతించింది.

ఈ తత్త్వమే యజుర్వేదంలోని రుద్రనమక మంత్రాలలో విస్తృతమై కనిపిస్తుంది.


ఈశ్వరచైతన్యం ఈ ప్రపంచమంతా వ్యాపించి ఉంది. 'వ్యాపించిన ఈశ్వరు'ని విష్ణువు అంటారు. కనుక ఈశ్వరుడే విష్ణువు. ఈ భావమే 'నమో భగవతే రుద్రాయ విష్ణవే' అని శ్రుతి మరొక చోట చెప్పింది. 'శివాయ విష్ణురూపాయ' అనే మాటలోని

ఆంతర్యమిదే. ముజ్జగాలకీ, మూడు గుణాలకీ అతీతమైన బ్రహ్మమే 'శివుడు'. ఆయన విశ్వమందు ఘోర, అఘోర రూపాలతో వ్యాపించి ఉన్నాడు. పంచభూతాలలో,

సూర్యచంద్రాది జ్యోతిర్గణాలలో అనంత విశ్వమందంతటా అనంతంగా వ్యాపించాడు.

ఈ ఘోరాఘోర స్వరూపుడైన శివుడే 'రుద్ర' నామంతో వ్యవహరించబడుతున్నాడు.


జీవుల కర్మలకు అనుగుణంగా ఈ ప్రకృతిలో వ్యాపించిన ఈశ్వరశక్తి సుఖదుఃఖాలుగా లభిస్తుంది. దుఃఖానుభవమే ఘోరం - సుఖానుభవమే అఘోరం. అగ్ని

మేలూ చేస్తుంది - కీడూ కలిగిస్తుంది. ఇలా ప్రకృతిలో ప్రత్యంశంలోనూ ఈ రెండు లక్షణాలు ఉంటాయి. ఈ రెండు లక్షణాలు అనివార్యం. కానీ ఈ రెండు ఒకే ఈశ్వరశక్తి స్వరూపాలేనని గ్రహించడమే 'శివజ్ఞానం'.


రుద్ర శబ్దానికి ఘోరపరమైన అర్థం 'దుఃఖకారకుడు'. ఈశ్వరుడు (ప్రభువు) ధర్మరక్షణ కోసం పాపకర్ములను శిక్షిస్తాడు. అదే పాపానుభవ ప్రదానం. అదేవిధంగా ధర్మపరులను, భక్తులను ఆనందింపజేసే 'శాంతస్వరూపుడు' - ఇది రుద్ర శబ్దానికి అఘోరపరమైన

అర్థం. నిజానికి ఈ శిక్షగానీ - రక్షగానీ జీవుల కర్మానుగుణంగా లభించేదే కానీ-ఆ రుద్రుడు సుఖదుఃఖాలకు అతీతుడైన పరమాత్మ (శివుడు). ఈ రెండు రకాల జీవులను అనుగ్రహించడానికేనని 'శివ' నామ తాత్పర్యం.


'శివుడు రుద్రుడై విష్ణువైనాడు' అనేది చక్కని సమన్వయం. 'త్రిగుణాతీతుడైన పరమాత్మ మంగళస్వరూపుడు (శివుడు) కనుకనే, ఘోర అఘోర రూపాలతో జగతిని శాసిస్తున్న ఈశ్వరుడై (రుద్రుడై), విశ్వమంతా వ్యాపించి (విష్ణువై) నిర్వహిస్తున్నాడు”.


పై రుద్రమంత్రంలో‘వివేశ” శబ్దం - 'ప్రవేశించుట' అనే అర్థంలో ప్రయోగింపబడింది.


విశ్వవ్యాపకుడైన రుద్రుని ఆరాధించడం వల్ల - ఘోర, అఘోర అనుభవాలు కూడా పరిణామంలో 'మంగళం'(శివం)గా లభిస్తాయి. ఇదే శివోపాసన, వేదమతం ప్రకారం

'శివ' 'రుద్ర' 'విష్ణు' శబ్దాలు ఒకే పరమేశ్వరునికి చెందినవి.


పంచభూతాలలో, సూర్యచన్దులలో, క్షేత్రజ్ఞుడైన జీవునిలో ఉన్న ఈశ్వర చైతన్యాన్నే 'అష్టమూర్తులు'గా ఉపాసించాలి. ఈ ఎనిమిది స్వరూపాలు ఈశ్వరుని ప్రత్యక్షమూర్తులు.వీటిలో 'ఘోరాఘోరం'గా ఉన్న రుద్రుడే అష్టమూర్తి స్వరూపుడు. ఈ ఎనిమిది మూర్తులు మనలోనూ, మనచుట్టూ ఉన్న విశ్వంలోనూ వ్యాపించి ఉన్నారు. వారు మనలను

శివ(శుభ) రూపాలుగా అనుగ్రహించాలనీ, తద్వారా శాంతం, సుఖం లభించాలనీ అష్టమూర్తి స్వరూపుడైన ఈశ్వరుని ఆరాధిస్తాం. క్రమంగా 'అంతా ఈశ్వరమయం'

అనే జ్ఞానం (ఈశావాస్యమిదం సర్వం) లభిస్తుంది. అదే శివజ్ఞానం (ఆత్మజ్ఞానం).అంతటా వ్యాపించిన ఆత్మయే శివం. ఘోరాఘోరాలకు అతీతమైన ఆత్మతత్త్వమిది.


దీనిని ప్రకటించడానికై వేదంలో రుద్రమంత్రాలు చెప్పబడినాయి. బ్రహ్మజ్ఞులైనరమణమహర్షి ఈ అంశాన్నే -


'జగత ఈశధీ యుక్త సేవనం

అష్టమూర్తి భృత్ దేవ పూజనం' (ఉపదేశసారం) - అని తెలియజేశారు.


'శర్వ, భవ, రుద్ర, ఉగ్ర, భీమ, ఈశాన, మహాదేవ, పశుపతి' - ఈ ఎనిమిది

క్రమంగా 'భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం, సూర్యుడు, చంద్రుడు,యజమాని(క్షేత్రజ్ఞుడు)' - అనే ఎనిమిది మూర్తులుగానున్న రుద్రుని నామాలు.

ఇహంలో ఈ ఎనిమిది మనకు అనుకూలంగా ఆనందాన్ని అందించడం లౌకిక ప్రయోజనం. అంతా శివమయం అనేది పారమార్థిక లక్ష్యసిద్ధి.

గురువే బ్రహ్మయు

 గురువే బ్రహ్మయు కనగా 

గురువే విష్ణువు మరియును గురువే శివుడున్ 

గురువే బ్రహ్మమగుట నా 

గురువుకు నతులిత్తు నేను గురుతభక్తిన్ 

*~శ్రీశర్మద*

వశిన్యాది వాగ్దేవతలు

 *వశిన్యాది వాగ్దేవతలు...🙏🙏🌹🌺*




'వాక్కు' అనగా ప్రకటింపబడిన జ్ఞానం . అర్ధరహితమైన శబ్దం కాదు .


వశిన్యాది వాగ్దేవతల దయ లేకపోతే, మనం పలకలేం, పలికినది తెలుసుకోలేం .


వశిన్యాది వాగ్దేవతలు మొత్తం ఎనిమిది మంది. వీరు సాక్షాత్తు అమ్మవారి నుండి వచ్చిన అమ్మవారి యొక్క పూర్ణ స్వరూపాలు.


వీరు శ్రీ చక్రంలో బిందువు నుండి మూడవది, "త్రైలోక్య చక్రం" అనే "చతురస్రం" నుండి ఏడవది అయిన "సర్వరోగహర చక్రం" లో వుండి, వీరిని స్మరించి నంత మాత్రమున, "ఆది"(మనసుకు వచ్చిన రోగం) మరియు "వ్యాధి"(శరీరానికి వచ్చిన రోగం) లను తొలగించగలరు.


వీరు అక్షర స్వరూపులు. సర్వ మంత్ర స్వరూపులు. వాక్కు విభూతి అనగా వాక్ వైభవము కలవారు. 


వీరు మన ఉపాధులలో అనగా  శరీరములలో ఉండుటవల్లనే మనము మాట్లాడ గలుగుతున్నాం.


దీర్ఘ అక్షరాలను తీసివేస్తే, అక్షర సంఖ్య 50.ఆ 50 అక్షరాలను 8 వర్గాలుగా విభజిస్తారు.


ఆ ఎనిమిది అక్షర వర్గాలకు, ఎనిమిది మంది వశిన్యాది వాగ్దేవతలు అధికారిణులు.


*వీరే ఆ ఎనిమిది మంది వశిన్యాది వాగ్దేవతలు...*


1. వశిని అమ్మవారు...


అ నుండి అః అనే 16 స్వరాక్షరములకు ఆది దేవి. మన కంఠములొ  ఉంటారు. వశీకరణ మంత్రాధి దేవతా. ఈమె దయ ఉంటే లోకంలో అన్ని మన పాదాక్రాంతం అవుతాయి.


2. కామేశ్వరి అమ్మవారు...


'క' వర్గమునకు దేవి. మన తాళువులలో(దవడలలో ) ఉంటారు. కోరికలను ఈడేర్చే మంత్రాధి దేవతా. ఈమె దయ ఉంటే  అన్ని కోరికలు తీరుతాయి. 


3. మోదినీ అమ్మవారు...


'చ' వర్గమునకు దేవి. మన ఔష్టములు (పెదవులలో ) ఉంటారు. ఆనందము, త్రుప్తి కలిగించే మంత్రాధి దేవతా. ఈమె దయ ఉంటే  అన్ని ఆనందాలే. 


4. విమలా అమ్మవారు...


'ట' వర్గమునకు దేవి.  మన దంతములలో ఉంటారు . ఈమె దయ ఉంటే  నిర్మల జ్ఞానం అనగా బ్రహ్మ జ్ఞానం లభిస్తుంది.


5. అరుణా అమ్మవారు...


'త' వర్గమునకు దేవి. మన అంగిళిలో ఉంటారు. ఈమె దయ ఉంటే సకల దేవతల కృప కలుగుతుంది. 


6. జయినీ అమ్మవారు...


'ప' వర్గమునకు దేవి మరియు అభ్యంతర వాక్ స్థానము . ఈమె దయ ఉంటే జయం లభిస్తుంది.


7. సర్వేశ్వరీ అమ్మవారు...


'య' వర్గమునకు దేవి మరియు బాహ్య వాక్ స్థానము . ఈమె దయ ఉంటే అధికారం లభిస్తుంది.


8. కౌళినీ అమ్మవారు...


'ష' వర్గమునకు దేవి. మన నాలుక పైన నడయాడు తల్లీ. ఈమె దయ ఉంటే కుండలినీ యోగం లభిస్తుంది...