*మంత్రపుష్పం*
*దేవాలయంలో పూజ చేసేటప్పుడు మంత్రపుష్పం చదువుతారు.*
*పరమాత్మ సర్వత్రా ఉన్నాడని మంత్రపుష్పం చెబుతుంది.*
*మానవుల లోపల, బయట కూడా పరమాత్మ వ్యాపించి ఉన్నాడని, ఆ పరమాత్ముడు ఏ రూపంలో ఉందో మంత్రపుష్పం చెబుతుంది.*
మానవ శరీరంలో ముకుళించుకుని వున్న కమలంలో నాభి పైభాగంలో హృదయ కమలం వుంది. దానికి మొట్టమొదటి భాగాన అగ్నిశిఖలో పసుపు రంగుతో వడ్ల గింజ మొనలా దేవదేవుడు అణు రూపంలోవున్నాడు” అని మంత్ర పుష్పంలో వర్ణించబడింది.
చేతిలో పుష్పాలని తీసుకుని మంత్రపుష్పం పూర్తయిన తర్వాత ఆ పుష్పాలని భగవంతునికి సమర్పించి, నమస్కరించి, ఆ పుష్పాలని మన శిరస్సు మీద వేసుకుంటే ఆ దైవశక్తి మనలోకి ప్రవేశిస్తుందని భక్తుల విశ్వాసం.
మనిషిలో వున్న పరమాత్మ ఉనికిని తెలియజేసి భక్తుడు, పరమాత్మ ఒక్కటే అనే అద్వైత భావం కలిగించే మంత్రపుష్పాన్ని విన్నప్పుడు కళ్ళు మూసుకుని పరమాత్మని దర్శనం చేసుకోవాలి.
అన్ని శుభాల్నీ కలగజేసే శ్రీమన్నారాయణుడికి నమస్కారం అనే శ్లోకపాదం మంత్రపుష్పంలో కనిపిస్తుంది. నారాయణుడే విశ్వానికి జీవనాధారమని,ఆయన మంగళకరుడు, నాశరహితుడని మంత్రపుష్పంలోని మూడో శ్లోకం చెబుతుంది.
చీకటివెలుగులు సూర్యుడి వల్ల సంభవిస్తాయి. ఆ సూర్యుణ్ని సృష్టించింది శ్రీమన్నారాయణుడే. అందుకే “దైవం పరంజ్యోతి”అంటారు. అతనే పరబ్రహ్మ. ధ్యానం, అది చేసేవాడు- రెండూ నారాయణుడే అని మంత్రపుష్ప సారాంశం.
*రాజాధిరాజాయ ప్రసహ్య సాహినే*
*నమోవై యం వై శ్రవణాయ కుర్మహే*
*సమే కామాన్ కామకామాయ*
*మహ్యం కామేశ్వరో వై శ్రావణౌ*
*దధాతు*
*కుబేరాయవై శ్రవణాయ*
*మహారాజాయ నమః*
రాజులకు రాజైన దేవుడోయి
పరులకు లాభాలీయునోయి
వైశ్రవణునకు వందనమోయి
సకల కోరికల యజమానోయి
మా కోరికలన్ని తీర్చునోయి
అతడే కుబేరుడు వైశ్రవణుడోయి
ఆ మహారాజుకు వందనమోయి.
*ఓం తద్బ్రహ్మ, ఓం తద్వాయు,*
*ఓం తదాత్మా* *ఓం తత్సత్యమ్*
*ఓం తత్సర్వం, ఓం తత్పురోమ్ నమః*
అతడే బ్రహ్మమతడే వాయువు
అతడే సత్యమతడే ఆత్మ
అతడే సర్వమతడే ఆదిదైవం
*అన్తశ్చరతి భూతేషు*
*గుహాయామ్ విశ్వమూర్తిషు*
జీవులందున్నవాడు
బయటా వున్నవాడు
తెలియని వాడు
విశ్వమంతా వున్నవాడు.
*త్వం యజ్ఞ్యస్త్వం* *వషట్కారస్త్వం*
*మిన్ద్రస్తగ్ం* *రుద్రస్త్వం విష్ణుస్త్వం*
*బ్రహ్మత్వం ప్రజాపతిః*
*త్వం తదాప ఆపొజ్యోతీ*
*రసో ౭ మృతం*
*బ్రహ్మ*
*భూర్భువస్సువరోమ్*
నీవే యాగము యాగమంత్రము
నీవే విష్ణువు బ్రహ్మ ఇంద్రుడవు
నీవే జలము తేజము రసము
నీవే శాశ్వతము విశ్వరూపము
నీవే ఓం కారబ్రహ్మవు
*ఈశాన స్సర్వ విద్యానా మీశ్వర*
*స్సర్వభూతానామ్ బ్రహ్మధిపతిర్*
*బ్రహ్మణో ౭ ధిపతిర్ బ్రహ్మశివోమే*
*అస్తు సదా శివోమ్*
సకల విద్యల కు ఈశుడవు
సకల జీవులకు ఈశుడవు
నీవే బ్రహ్మ యజమాని
నీవే బ్రాహ్మల యజమాని
నీవే బ్రహ్మ సదాశివుడవు
*తద్విష్ణో పరమం పదగ్ం*
*సదా పశ్యన్తి సూరయః*
*దివీవ చక్షు రాతతమ్*
ఆ విష్ణు లోకము నోయి
ఆ పరమ పధమునోయి
జ్ఞానులు సదా చూచేరోయి ఆకాశమంతా చూచేరోయి
*తద్విప్రాసో విపన్వవో*
*జాగృవాం స్సమిన్దతే*
*విష్ణోర్య త్పరమం పదమ్*
కోరికలు దోషాలు లేని వారు
జాగృతి చలనాలు కలవారు
విష్ణులోక కాంతులు పెంచేరు
పరలోక ప్రకాశము
*ఋతగ్ం సత్యం పరమ్బ్రహ్మ*
*పురుషం కృష్ణ పింగళమ్*
*ఊర్ధ్వరేతమ్ విరూపాక్షం*
*విశ్వరూపాయ వై నమో నమః*
ముక్తినాధుడు సత్యరూపుడు
బ్రహ్మ రూపుడు నల్లనివాడు
పైకి వెలుగు తేజోవంతుడు
విరూపనేత్రుడు విశ్వరూపుడు
దేవదేవునకు మరల వందనము.
*నారాయణాయ విద్మహే*
*వాసుదేవాయ ధీమహి*
*తన్నో విష్ణు ప్రచోదయాత్*
నారాయణుని ఉహించెదను
వాసుదేవుని ధ్యానించెదను
విష్ణు చైతన్యము కలుగు గాక
*ఆకాశ త్పతితం తోయమ్*
*యథా గచ్ఛతి సాగరం*
*సర్వదేవ నమస్కారః*
*కేశవమ్ ప్రతి గచ్ఛతి*
ఆకాశ ధారాల నీరులు
ఎలా సాగరమే చేరునో
సకలదేవ వందనాలు
ఆ పరందామునే చేరును
*మంత్రపుష్పం సంపూర్ణం*
*సర్వం శ్రీపరమేశ్వరా ర్పణమస్తు*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి