25, జులై 2021, ఆదివారం

రామప్ప దేవాలయానికి అంతర్జాతీయ

 తెలంగాణలోని రామప్ప దేవాలయానికి అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ప్రపంచ వారసత్వ స్థలంగా యునెస్కో గుర్తించింది. చైనాలోని ఫ్యూజులో జరిగిన ప్రపంచ వారసత్వ కమిటీ వర్చువల్‌ భేటీలో నిర్ణయం తీసుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో వారసత్వ గుర్తింపు పొందిన తొలి కట్టడంగా రామప్ప రికార్డు సృష్టించింది. ములుగు జిల్లాలో ఉన్న పాలంపేటలో 800 ఏళ్ల కాలం నాటికి చెందిన ఆలయం కాకతీయ శిల్పకళా వైభవం ఖండాంతరాలు దాటింది. పూర్వపు వరంగల్‌ జిల్లా కేంద్రానికి 70 కిలోమీటర్ల దూరంలో (ప్రస్తుత ములుగు జిల్లా) పాలంపేట గ్రామంలో ఉంది.. రామప్ప దేవాలయం. ఈ అపురూప శిల్పాలయాన్ని క్రీ.శ. 1213లో కాకతీయ ప్రభువు గణపతిదేవుని సైన్యాధ్యక్షుడు రేచర్ల రుద్రుడు కట్టించాడు.

మద్యపానం

 *మద్యపానం ఆరోగ్యానికి మంచిది అది ఎలా* 


చాలామంది మధ్యపానం అనగానే తాగుబోతు తిరుగుబోతు అని రకరకాలుగా విమర్శిస్తుంటారు.


కానీ మద్యం సేవించడం ఆరోగ్యానికి చాలా మంచిది.


మన నిత్య జీవితంలో అవసరానికి మించి ఏది వాడిన అది విమర్శలకు దారి తీస్తోంది అలాంటిదే మద్యపానం


నిజ జీవితంలో చాలా ఆస్తులు సంపాదిస్తే వచ్చేది - *పొగరు*


స్వీట్లు విచ్చలవిడిగా తింటే వచ్చేది - *షుగరు*


ఇవి రెండు ఉన్న ప్రతి ఒక్కరు బతుకుతారు - *గౌరవంగా*


కానీ మద్యపానం అతిగా సేవించి విచ్చలవిడిగా వాగిన వాడికి అంటారు - *తాగుబోతు*


*మద్యపానం సేవించే విధానం*


మద్యం సేవించడం ఒక కళ దానిని ఒక్కొక్క ప్రాంతంలో వాతావరణ అనుకూలమునుబట్టి సేవించడం.


మద్యం లో రకాలు బ్రాందీ, విస్కీ, వైన్, వోడకా, రమ్, జిన్, బీర్ మొదలగు రకాలు మనం చూస్తూ ఉంటాం.


*🥃బ్రాందీ :-* ప్రతిరోజు 90 ఎమ్మెల్ సేవించడం వల్ల ఆరోగ్యంగా ఉండడమే కాకుండా మన బాడీ టెంపరేచర్ ను కంట్రోల్ చేస్తుంది.


*🥃విస్కీ:-* ప్రతిరోజు 90 ఎమ్మెల్ రాత్రి పడుకోబోయే ముందు నిదానంగా కొద్దికొద్దిగా తీసుకోవడం వల్ల బాడీలోని అవయవాలన్నీ స్పందించి నిద్ర రావడానికి పుష్కలమైన అవకాశం కలదు.


*🍷వైన్:-* ఉదయము 30 ml మధ్యాహ్నము 60 ml రాత్రి 90 ml తీసుకోవటం స్త్రీలకు పురుషులకు చాలా మంచిది వైన్ తాగడం వలన రక్త ప్రసరణ బాగా జరిగి ఆరోగ్యకరంగా నూ నిత్య యవ్వనంగా కనిపించుటకు మరియు ఉత్తేజంగా ఉండుటకు మరియు హాట్, లివర్, కిడ్నీలను, శుభ్రంగా ఉంచడానికి దోహదపడుతుంది, మార్కెట్లో రెడ్ వైన్, వైట్ వైన్, రోజ్ వైన్,Sangiovese, Cabernet, classic chainin, క్లాసిక్ merlot, Shiraz, మొదలగు రకాలు అందుబాటులో ఉన్నాయి.


*🍹రమ్:-* 90ml శీతాకాలంలో బాడీ యొక్క టెంపరేచర్ (వెచ్చదనంగా) కంట్రోల్ చేయడానికి రమ్ సేవించడం జరుగుతుంది.


*🥂వోడకా:-* 90 ml సేవించడం వల్ల బాడీ యొక్క టెంపరేచర్ వేడిని ఉంచుతూ ఉత్తేజంగా ఉల్లాసంగా ఉండటానికి దోహదపడుతుంది ఇందులో యాపిల్, ఆరెంజ్, చాక్లెట్, లెమన్, మొదలగు flavor లభించును.


*🧉జిన్:-* 30 ml కొబ్బరి నీళ్లలో ఉదయం తాగడం వల్ల శరీరంలో ఉన్న అల్సర్ నివారణకు బాగా దోహదపడుతుంది.


*🍺బియర్:-* 750 ml నిత్యం సేవించడం వల్ల మూత్ర నాళాలు శుభ్రంగా ఉండటమే కాకుండా కిడ్నీలను కాపాడుటకు ఉపయోగపడుతుంది.


పైన తెలిపిన మోతాదు కాకుండా విచ్చలవిడిగా సేవిస్తే అనారోగ్యం పాలవడంతో కాకుండా తాగుబోతు తిరుగుబోతు అని బిరుదు పొందవలసి వస్తుంది.


తగిన మోతాదులో సేవించినవారిక ఆరోగ్యంతో పాటు మంచి నిద్ర, మంచి ఆకలి, యవ్వనంగా కనిపించడానికి దోహదపడుతుది, కరోణ లాంటి జబ్బులు రావడానికి కూడా వీలు ఉండదు.

నాన్న ఎవరు

 *⚜️నాన్న ఎవరు??⚜️*


*బ్రహ్మదేవుడు చాలా బిజీగా తల రాతలు రాసే పనిలో ఉన్నాడు. ఇంతలో నేను, భూమి మీదకు వెళ్ళను అని మారాం చేయడం మొదలుపెట్టాను.*


*“భూమి మీద నాకు ఎవ్వరూ తెలీదు. నేను ఎలా బతకగలను? అని అడిగాను. నువ్వేం భయపడకు. నిన్ను కాచి కాపాడటానికి నా అంశగా ఒక అమ్మను తయారుచేశాను. ఆమె కడుపులో నిన్ను పుట్టిస్తా” అన్నాడు బ్రహ్మదేవుడు.*


*“అయితే సరే, కానీ నాకు ఎప్పుడు ఏ ఇబ్బంది వచ్చినా నేను ఏడవటం మొదలుపెడతా. అప్పుడు మీరు నా ఇబ్బందిని తొలగించాలి” అనే షరతు పెట్టాను.*


*దానికి బ్రహ్మా, “సరే నీకు మాటలు రానంత వరకు బ్రహ్మా విష్ణు మహేశ్వరులం ముగ్గురు నీకు సహాయం చేస్తాం” అన్నాడు.*


*“మరి, ఆ తర్వాత చెయ్యరా?” అని అడిగా.*


*“అదేం లేదులే. నీకు మాటలోచ్చాకా నీకో మహా మంత్రం భోదిస్తాం. నీకు ఏ కష్టం వచ్చినా, ఒక్కసారి ఆ మంత్రం పఠిస్తే తప్పకుండా నీకు సహాయం దొరుకుతుంది.” అని చెప్పాడు బ్రహ్మా.*


*మళ్ళీ ఇంకేదో అడగబోయే లోపల ఆ పరబ్రహ్మ, తన బెడ్రూం బాల్కనీ లోంచి నన్ను కిందకి త్రోసేశాడు. ఎలా వచ్చి చేరానో తెలియదు గానీ, ఆసుపత్రి బెడ్ మీద మా అమ్మ పక్కన వచ్చిపడ్డాను.*


*అమ్మ పక్కన హాయిగా నిద్రపోతున్న నన్ను, ఓ పెద్దమనిషి తన చేతిలోకి తీసుకున్నాడు. భయమేసి, అమ్మ వైపు చూసి ఏడుపు ముఖం పెట్టాను. “మీ నాన్నగారు రా!” అంటూ అమ్మ తన కంటి చూపు తో ఆయన్ని పరిచయం చేసింది.*


*బ్రహ్మాదేవుడు నాకు అమ్మ గురించి చెప్పి పంపాడు. తను అన్ని చోట్ల ఉండటం కుదరక అమ్మని సృష్టించాను అని. మరి నాన్న అంటే ఎవరు? భూమి మీద పడిన మొదటి రోజే నా బుర్రలో ఎన్నో ఆలోచనలు మొదలయ్యాయి.ఆ దేవుడినే అడిగి తెలుసుకుందామని ఏడుపు మొదలుపెట్టా.*


*“ఇప్పుడే కదా భూమి మీద పడ్డావు. అప్పుడే నన్ను గుర్తుచేసుకున్నావేమిటి?” అని అడిగాడు. అమ్మ గురించి చెప్పారు గాని, నాన్న గురించి ఏమీ చెప్పలేదెంటని అడిగా.*


*“నీ జన్మకి నాంది, నీ భవితకు పునాది” అని ముక్తసరిగా బదులిచ్చి, “అర్ధమైందా?” అని ప్రశ్నించాడు.*


*“పాలు తాగే పసివాడి ప్రశ్నకి ప్రాస తో బదులిస్తే ఎలా అర్ధం అవుతుంది స్వామి” అని సమాధానం చెప్పాను.*


*ఒక అర్ధం లేని చిరునవ్వు నవ్వి, “నీకూ మీ అమ్మకు కాపుగా నేను నియమించిన అంగరక్షకుడు” అని క్లుప్తంగా చెప్పాడు. అప్పుడు అర్ధమైంది నా బుజ్జి బుర్రకి, నా కష్టం తీర్చేది అమ్మ అని. మాకు ఏ కష్టం రాకుండా చూసుకునే బాధ్యత నాన్నదని.*



*ఆ రోజు నుంచి నా చిన్ని కళ్ళు నాన్న కోసం వెతుకుతూనే ఉండేవి. ఎప్పుడో ఉదయన్నే వెళ్ళిపోయి సాయంత్రం వచ్చేవాడు. “ఏం, నేనంటే ప్రేమ లేదా” అని ప్రశ్నించా ఆ దేవుడిని మళ్ళీ. “నీ మీద ప్రేమ ఉంది కాబట్టే, రోజు బయటికి వెళ్ళి కష్టపడి పని చేసి వస్తున్నాడు” అని బదులిచ్చాడు బ్రహ్మా. అర్ధం కాలేదని చెప్పాను. కొన్నేళ్లకు నీకే అర్ధం అవుతుందిలే అన్నాడు.*


*ఈయన అన్నీ తల తిక్క సమాధానాలే చెబుతాడులే అనుకుని, నా దగ్గరికి వచ్చిన మా నాన్న మొహం చూసా. మా నాన్న ముఖం నీరసంగా కనిపించింది. పలకరింపు కోసం ఒక చిరునవ్వు నవ్వా. మా నాన్న ముఖం లోని నీరసం మాయమైంది. నన్ను చూసిన ఆయన ముఖం పున్నమి చంద్రుడిలా మెరిసిపోసాగింది. ఆ దేవ దేవుడు నా నవ్వులో ఇంత మహిమ దాచాడా! అని గర్వపడటం మొదలుపెట్టా.*


 *మళ్ళీ మళ్ళీ నవ్వడం నేర్చుకున్నా. నేను నవ్విన ప్రతి సారి, మా నాన్న ముఖంలో ఆనందం పది రెట్లు ఎక్కువగా కనిపించేది. మా నాన్న నన్ను ముద్దులతో ముంచేయటం మొదలుపెట్టారు. అలా ఆ సాయంత్రాలు మా ఇద్దరి మధ్య సాన్నిహిత్యాన్ని పెంచాయి.*


*కొన్నాళ్ళకి, నా చిట్టి పాదాలకి కొంచెం బలం చేకూరింది. నడక నేర్చుకుందామని ప్రయత్నించా. కానీ ఫలితం లేదు. పదే పదే పడిపోతూనే ఉన్నా. ఇంతలో నాన్న తన చూపుడు వేలును నాకు అందించాడు. నేను నడవలేకపోతున్నానని వెక్కిరిస్తున్నాడనుకున్నా! “నా వేలు పట్టుకుని నిల్చో నాన్నా” అన్నారు.*


*నిలబడగలిగాను కానీ, నా అడుగులు ఇంకా తడబడుతూనే ఉన్నాయి. ఆ మహా శివుణ్ణి, మనసులో ప్రార్దించడం మొదలుపెట్టా. తన ఢమరుక నాదంతో నా పాదాలని ప్రేరేపించమని ప్రాధేయపడ్డాను. ఆ ఢమరుక నాదపు సడిలో, వడి వడిగా అడుగులు వేయటం నేర్చుకుని మా నాన్నను ఆశ్చర్యపరుద్దామనుకున్నా. ఆ మహా శివుడికి నా మొర వినిపించలేదేమో! నా ప్రార్థనకి జవాబు దొరకలేదు. ఇంతలో మా నాన్న వెల్లకిలా పడుకున్నారు. నన్ను తన రెండు చేతులతో పట్టుకుని తన గుండెల మీద నిలబెట్టుకున్నారు. డమరుక నాదం లేకపోతేనేం!, నా గుండే చప్పుడుని నీ అరికాళ్ళతో అనుభవించి అడుగులు వేయటం నేర్చుకోమని అభయమిచ్చారు. ఏం మాయో తెలీదు. నాన్న గుండె చప్పుడు నా కాళ్ళకి తగలగానే నేనే శివుడిలా మారిపోయా. నడక రాని నేను నాన్న గుండెల మీద యధేచ్చగా నాట్యం చేయటం మొదలుపెట్టా.*


*నడక నేర్చిన నా చిన్ని పాదాలు కొత్త గమ్యాలను వెతకటం ప్రారంభించాయి. నడవటం మొదలుపెట్టాను. కొంత దూరం వెళ్ళాక, అటూ ఇటూ చూశాను. ఎవ్వరూ కనిపించలేదు. భయం వేసింది. ఆ శ్రీ మహా విష్ణువు అన్ని చోట్ల ఉంటాడుగా, మరి నాకు భయమెందుకు. ఆయన్నే పిలుద్దాం అని మనసులో తలుచుకున్నా. ఆయన కనిపించలేదు గాని వినిపించాడు. “ఏమైంది బాలకా” అని అన్నాడు. “భయం వేసింది స్వామి. అందుకే పిలిచా” అన్నా నేను.*


*“భయం ఎందుకు? నీవు నడుస్తుంది మీ నాన్న నీడ లోనేగా” అన్నాడు. ఆశ్చర్యం వేసి వెనక్కి తిరిగి చూసా. అవును నాన్న నా వెనకే ఉన్నారు. నాకు తగినంత స్వేచ్చనిస్తూ, నా ప్రయాణాన్ని గమనిస్తూ, నన్ను ఏ ప్రమాదం తాకకుండా, నాకు రక్షణగా నా వెనకే నడుస్తున్నారు. నా మనసులో భయం తొలగి ముఖంలో చిరునవ్వు మొదలయ్యింది. అప్రయత్నంగానే నా పెదవులు ‘నాన్న’ అని పలకటం మొదలుపెట్టాయి. నాన్న నన్ను ఎత్తుకుని నా ముఖమంతా ముద్దులతో ముంచేశారు. మళ్ళీ మళ్ళీ నాన్న అని పిలవమన్నారు. నేను పిలిచిన కొద్దీ, నాన్న ముఖంలో ఆనందం రెట్టింపు అవుతూనే ఉంది.*



*నాకు ఏ అవసరం వచ్చినా, ఏడ్చి ఆ దేవుడిని పిలిచే బదులు, మా నాన్నని పిలవడమే మేలు అనిపించింది. దేవుడు వచ్చేవాడో, రాడో తెలీదు గాని మా నాన్న మాత్రం నన్ను కంటికి రెప్పలా కాపాడుతూనే ఉన్నాడు. నా అవసరాలన్నీ, నేను చెప్పక ముందే తెలుసుకుని మరీ తీర్చేవాడు. కొన్నాళ్ళకు నాన్న కూడా ఆ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయారు. కానీ ఆయన నేర్పిన జీవిత పాఠాలు నాకు తోడుగా ఉండేవి.*


*ఆఖరికి నేను కూడా ఆ దేవుడి దగ్గరికి తిరుగు ప్రయాణం మొదలుపెట్టాను.*


*“నీ జీవిత మజిలీ ఎలా సాగింది?” అని ప్రశ్నించారు బ్రహ్మా విష్ణు మహేశ్వరులు.*


*“మీరు నాకు ఏ మంత్రమూ భోదించకపోయినప్పటికీ, నా జీవన చక్రం బాగానే సాగింది ప్రభు.” అని సమాధానం చెప్పాను గర్వంగా.*


*“అదేంటి అలా అంటావ్! మేము నీ నోట పలికించిన మంత్రాన్ని రోజు నువ్వు పఠిస్తుండటం ఉండటం మేము గమనిస్తూనే ఉన్నాం” అన్నారు మూకుమ్మడిగా.*


*“నాకు ఏం అర్ధం కావట్లేదు స్వామి” అని బదులిచ్చా నేను. బ్రహ్మా విష్ణు మహేశ్వరులు ముగ్గురు ఒకరిలో ఒకరు ఐక్యం అవుతూ ఒకే రూపంగా మారి ప్రత్యక్ష్యమయ్యారు. ఆశ్చర్యపోయాను. మా నాన్న రూపం నా ముందు ప్రత్యక్ష్యమైంది. అప్పుడు గానీ అర్ధం కాలేదు ఈ మనిషి బుర్రకి, (మట్టి బుర్రకి). “అమ్మ ఆ దేవుడి అంశ అని” “నాన్న సాక్ష్యాత్ దేవుడని”. మిమ్మల్ని గుర్తించలేకపోయాను, నన్ను క్షమించండి స్వామి. అని ఆయన పాదాలమీద సాగిలపడ్డాను.*


*ఆ దేవుడి ముఖంలో అదే చెరగని చిరునవ్వు. నా భుజాల మీద చేయి వేసి పైకి లేపారు. ప్రేమగా హత్తుకున్నారు. నన్ను క్షమించి, నా ఆత్మకు మోక్షం ప్రసాదించండి స్వామి అని అడిగా ఆయన చెవిలో. క్షమిస్తా, కానీ ఒక్క షరతుతో అన్నాడు ఆ దేవ దేవుడు. ఏమిటది స్వామీ! అని అడిగా ఆశ్చర్యంగా. నన్ను ఆఖరుసారిగా ‘నాన్న’ అని సంభోదించగలవా అని అడిగారు ఆ సర్వేశ్వరులు. ఆ మహా మంత్రాన్ని ఇంకోసారి జపించడానికి, నిముషం కూడా ఆలస్యం చేయలేదు నేను. నాన్న అని పిలిచి ఆయనలోనే ఐక్యం అయిపోయా.*


*🙏“అమ్మ దేవుడి అంశ అయితే, నాన్న సాక్ష్యాత్ దేవుడే”🙏*

*ఈ వ్యాసం ప్రతి ఒక్క నాన్నకు అంకితం... 


నా మనస్సును కదిలించింది. నాన్న గొప్పదనాన్ని వచ్చే తరానికి,యువతకు తెలియాలి. నా బాధ్యత గా మీకు షేర్ చేస్తున్నాను. మీరు షేర్ చెయ్యండి. మంచిని  పెంచుదాం.🙏🙏


మానస సరోవరం 👏

మొగలిచెర్ల అవధూత

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారితో అనుభవాలు..


*అజ్ఞాతభక్తుని అన్నదానం..*


"శ్రీ స్వామివారి మందిరం వద్ద వచ్చేనెల మొదటివారం లో శ్రీ భరద్వాజ మాస్టారు గారు వ్రాసిన గురుచరిత్రను పారాయణం చేద్దామని మాష్టారుగారి శిష్యబృంద సభ్యులం నిర్ణయించుకున్నాము..సుమారు యాభై మందిమి వస్తాము..ఇబ్బందేమీ లేదు కదా?.." అని ఒంగోలు నుంచి శ్రీ శ్రీనివాస్ గారు ఫోన్ చేసి అడిగారు..


మందిరం వద్ద అన్ని ఏర్పాట్లూ చేస్తాను..నిరభ్యంతరంగా రండి అని చెప్పాను..


2012 వ సంవత్సరం మధ్యలో జరిగిన సంభాషణ ఇది..అనుకున్న విధంగానే శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో శ్రీ ఎక్కిరాల భరద్వాజ మాష్టారు గారి శిష్యబృంద సభ్యులు శ్రీ స్వామివారి మందిరానికి వచ్చి..గురుచరిత్ర పారాయణం పూర్తి చేసి..శ్రీ స్వామివారి సమాధిని దర్శనం చేసుకొని తిరిగి సాయంత్రానికి వెళ్లిపోయారు..వెళ్ళేముందు..శ్రీ స్వామివారి మందిరం వద్ద సామూహిక పారాయణానికి అనువైన వాతావరణం ఉన్నదని.. తమకు ఎంతో సంతోషం కలిగిందనీ చెప్పి మరీ వెళ్లారు..కార్యక్రమం సాఫీగా జరిగిపోయినందుకు మేమూ సంతోషించాము..


ఆ ప్రక్కరోజు ఉదయం ఒక సంఘటన జరిగింది..యాభై ఏళ్ళ పైబడిన మధ్యవయస్కుడు ఒకాయన వచ్చి.."ఏమండీ..నేను చాలా దూరం నుంచి వస్తున్నాను..నిన్న ఈ మందిరం లో గురుచరిత్ర పారాయణ జరిగిందట కదా..నిజానికి నేను కూడా పాల్గొని ఉండాల్సింది..కానీ నాకు కుదరలేదు..నా పేరు సీతారామారావు..గుంటూరు జిల్లా వాడిని..ఈరోజు శుక్రవారం కదా..ఈరోజు నుంచి మూడురోజుల పాటు ఇక్కడే వుండి.. నేనూ పారాయణం చేసుకుంటాను..మీకేమీ అభ్యంతరం లేదు కదా?.." అన్నాడు..


ఆయనను చూడడానికి నెమ్మదస్తుడు లా అనిపించాడు..ఆయన పాటికి ఆయన పారాయణం చేసుకోవడానికి ఇబ్బందేముంది?..ఎలాగూ అన్నదానం జరుగుతున్నది..ఆయన కొరకు ప్రత్యేకంగా చేయాల్సిన ఏర్పాట్లేవీ లేవు..అందువల్ల పెద్దగా ఆలోచించకుండా..సరే అన్నాను..ఒక గది ఆయనకు కేటాయించాము..ఆయన సంతోషపడి..స్నానం చేసి వచ్చి..శ్రీ స్వామివారి సమాధి ముందు నిలబడి నమస్కారం చేసుకొని..మంటపం లో ఓ మూల కూర్చొని పారాయణం చేసుకోసాగారు..ఆరోజు గడిచిపోయింది..ఆ ప్రక్కరోజు శనివారం తెల్లవారుఝామునే తయారైపోయి మంటపంలో పారాయణం మొదలుపెట్టారు..మేము మా పనులు మేము చేసుకుంటూ వారిని పెద్దగా పట్టించుకోలేదు..ఆయన ఆరోజు మధ్యాహ్నం భోజనం చేయలేదు..సాయంత్రం జరిగిన పల్లకీసేవ లో శ్రద్ధగా పాల్గొన్నారు..అన్నదాన సత్రానికి వెళ్లి..అన్నదానం జరిగే తీరును కూడా అత్యంత కుతూహలం తో పరిశీలించారు..


ఆదివారం ఉదయం నాలుగున్నరకు నేను మందిరం లోకి వెళ్ళేసరికి..ఆయన వచ్చి మంటపం లో నాకోసం వేచి చూస్తున్నారు..నన్ను చూడగానే..గబ గబా నా దగ్గరకు వచ్చి.."ప్రసాద్ గారూ..ఈరోజు నా పారాయణం పూర్తి అవుతుంది..పూర్తి కాగానే అన్నదానం చేయించాలని నా మనసుకు తోచింది..ఈరోజు మధ్యాహ్నం కూడా మీరు భక్తులందరికీ అన్నదానం చేస్తారట కదా?..ఆ ఖర్చు మొత్తం ఎంత అవుతుందో చెప్పండి..నేను ఇస్తాను.."అన్నారు..


నేను కొద్దిగా తటపటాయించాను..ఎందుకంటే..ఆయన వద్ద అంత మొత్తం ఉంటుందో లేదో తెలీదు..ఆమాటే ఆయనతో అన్నాను..ఎందుకనో ఫక్కున నవ్వారు.. నాకు కొద్దిగా ఇబ్బంది అనిపించింది..ఇక తాత్సారం చేయకుండా ఖర్చు వివరాలు చెప్పాను..వెంటనే జేబులోంచి డబ్బు తీసి టేబుల్ మీద పెట్టారు..ఒక్క మాట మాట్లాడకుండా వెనక్కు వెళ్లి పారాయణం లో కూర్చున్నారు..సరిగ్గా మధ్యాహ్నం అన్నదానం సమయానికి..ఆయన ఆ సత్రం దగ్గరకు వెళ్లి..తాను కూడా వడ్డన చేసి వచ్చారు..సాయంత్రం నాలుగు గంటలకు నా దగ్గరకు వచ్చి..అన్నదానానికి తనకు అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెప్పి..ఊరికి వెళుతున్నాననీ చెప్పారు..ఆయన చిరునామా అడిగాను..నవ్వి.."మళ్లీ వచ్చి చెపుతాను.." అన్నారు..రూముకు వెళ్లొచ్చి చూపుతారేమో అని అనుకున్నాను..ఎదురుచూస్తూ వున్నాను..కొంచెం సేపటి తరువాత అర్ధం అయిందేమిటంటే..ఆయన..నేరుగా బస్ ఎక్కి వెళ్లిపోయారని..


ఈరోజు దాకా..ఆ సీతారామారావు గారి గురించి ఎటువంటి వివరాలూ తెలియలేదు..కేవలం అన్నదానం చేయడానికి వచ్చారేమో అనిపించింది..అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది.. ఎవరో పిలిచినట్లు వచ్చి..పారాయణం చేసుకొని..అన్నదానం చేసి..ఏమీ చెప్పకుండా వెళ్ళేవాళ్ళు ఈరోజుల్లో ఎందరుంటారు?..అని..ఆ సీతారామారావు గారు ఏ ప్రాంతం వారో కానీ..ఈనాటికీ మాకు గుర్తువస్తూ వుంటారు..


సర్వం..

శ్రీ దత్తకృప.


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం.. లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్:523114..సెల్..94402 66380 & 99089 73699).

పంచేంద్రియాల్లో

 పంచేంద్రియాల్లో ప్రమాదకరమైంది ఏది?


🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷


కనిపించని ఏదో ఒక దివ్యశక్తి ఈ ప్రపంచాన్ని శాసిస్తోంది. ఆ శక్తినే దైవశక్తి అంటాం. అలాగే కనిపించని ఏదో శక్తి ఈ మనిషి జీవితాన్ని నడిపిస్తోంది. దాన్నే మనసు అంటాం. మనసు ఎక్కడుందో, ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. మన శరీరంలో రక్తం ప్రవహించినంత కాలం ఆ మనసు ఆజ్ఞలు జారీ చేస్తూనే ఉంటుంది. మనం ఊపిరి తీస్తున్నంత కాలం, ఆ మనసు మనల్ని ఆడిస్తూనే ఉంటుంది.


మనసు సముద్రం లాంటిది. సముద్రం అనంతమైనది. అపారమైనది. లోతైనది. సముద్రంలో జలచరాలుంటాయి. జలసంపదలుంటాయి. అమృతం, హాలాహలం అక్కణ్నుంచే పుట్టాయంటాయి పురాణాలు. సముద్రంలోంచి ఉప్పెనలొస్తాయి. సముద్రం అందమైనది. కల్లోలమైనది. చెలియలికట్ట దాటనంతవరకు సముద్రంతో ఏ ప్రమాదం ఉండదు.


మనసూ అంతే! మనసు ప్రపంచాన్ని ఉద్ధరించగలదు. ప్రపంచాన్ని భస్మం చెయ్యగలదు. మనిషిలో సత్వగుణం అమృతం. సత్వగుణం పెంచుకుంటే మనిషి వల్ల సమాజానికెంతో మేలు జరుగుతుంది. తమోగుణం పెరిగితే జరిగేవన్నీ చెడ్డ పనులే!

నదులన్నీ సముద్రంలో కలుస్తాయి. ప్రపంచంలో విషయాలన్నీ మనసును చేరతాయి.


మనిషికి కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం అనే పంచేంద్రియాలున్నాయి. ప్రపంచంలో ప్రతి దృశ్యాన్నీ కన్ను ఆకర్షిస్తుంది. అందమైన వస్తువులన్నీ సొంతం కావాలనుకుంటుంది. చెవి మంచి, చెడు శబ్దాలను వింటుంది. మంచిని మాత్రమే గ్రహించి, చెడును విడిచిపెట్టగలిగితే మనిషి ఉన్నతుడవుతాడు. ముక్కు సువాసనలే పీలుస్తుంది. దుర్వాసనలను ఎలాగూ పీల్చదు. జిహ్వ రుచులను కోరుతుంది. దీంట్లో తినరానివి తినకూడదని విడనాడితే మనసు నిర్మలమవుతుంది. చర్మం సుఖాన్ని కోరుతుంది. ఇలా పంచేంద్రియాలు మనిషి మనసును, మంచి చెడులవైపు ప్రేరేపిస్తాయి.


పంచేంద్రియాల్లో ప్రమాదకరమైనది నోరు. ఇది రెండు పనులు చేస్తుంది- తింటుంది, మాట్లాడుతుంది. రెండూ మితమైనప్పుడే మనసు సత్వ సంపన్నమవుతుంది. అప్పుడే సమాజ సేవ, ఆధ్యాత్మిక చింతన, అరిషడ్వర్గాల అదుపు పెరిగి మానవ జీవితానికి సార్థకత చేకూరుతుంది.


ధర్మరాజు జూదమాడాడు. ఆస్తిపాస్తులను, భార్యను పణంగా పెట్టాడు. పరాజితుడయ్యాడు. అతడిలో తప్పున్నా లోకం అతణ్ని పన్నెత్తు మాటనలేదు. కారణం ఆయన మనసు వెన్న లాంటిది. దానధర్మాలు చేస్తాడు. దైవభక్తి కలవాడు. దుర్యోధనుడు అసూయాపరుడు కావడం, ధర్మవ్యతిరిక్తమైన పనులు చెయ్యడంతో అతడు లోక నిందితుడయ్యాడు. కారణం అతడి మనసు. సకల శాస్త్ర పారంగతుడు, పరాక్రమశాలి, సకల సంపన్నుడు రావణుడు. మనసు చెడ్డతనం వల్ల లోకనిందకు గురయ్యాడు. రాక్షస కులంలో పుట్టినా విభీషణుడు మనసును ధార్మిక చింతన వైపు మళ్ళించడంతో లోకం అతణ్ని మెచ్చుకుంది. అందుకే మనసును అదుపులో ఉంచుకోకపోతే జీవితం కష్టాల కడలి తరంగాల సంక్షుభితం అవుతుంది. మనసును అదుపులో ఉంచుకుంటే ఆనందాల నందనవన సంశోభితమే అవుతుంది!


🚩 హరహర మహాదేవ శంభోశంకర 🚩


🙏🚩 సర్వేజనా సుఖినోభవంతు

సమస్త సన్మంగళాని భవంతు 🚩🙏


🚩🚩 హరి నామ స్మరణం 

సమస్త పాప హరణం 🚩🚩


🐄🐄గోమాతను పూజించండి

గోమాతను సంరక్షించండి

గోశాలలను నిర్మించండి🐄🐄


🚩జై శ్రీరామ్ జై హనుమాన్ 🚩