23, జులై 2024, మంగళవారం

పద్యఛందములు

 _*🌸మన తెలుగు పద్యఛందములు🌸*_


_*సీసపద్యము.*_

చంపకోత్పలముల చతురసౌరభములు

     లలిత భావములకు నెలవనంగ!

శార్దూల మత్తేభ ఛందమ్ము లలరంగ

     గంభీరసాదృశ్య కవనములకు

తరువోజ తరలమ్ము తళుకులీనుచునుండు!

     అలతి పదములందు అక్కరలును!

తేటితేనెలు చిల్కు తేటగీతుల యందు!

     ఆటవెలదు లందు అందమొలుకు!

చేవగల్గిన ఠీవి సీసపద్యము సొత్తు!

     దేశికవితలందు ద్విపద లెస్స!

వృత్తపద్యములొప్పు నుత్తమశైలితో!

     జాత్యుపజాతుల శైలి మృదువు!    


_*ఆటవెలది.*_

కొండ అద్దమందు కొంచెమై యున్నట్లు

నెంత భావమైన నిముడునట్టి

అందమైన నడక కందపద్యపు సొమ్ము!

కంద మెపుడు తెల్గు కందమనగ!  2

కామెంట్‌లు లేవు: