🙏శివానందలహారీ 🙏
గభీరే కాసారే విశతి విజనే ఘోరవిపినే
విశాలే శైలే చ భ్రమతి కుసుమార్థం జడమతి:
సమర్పైకం చేత స్సరసిజ ముమానాథ భవతే
సుఖే నావస్థాతుం జన ఇహ న జానాతి కిమహో 09
జడుడైన మనుజుండు సల్పంగ నీ పూజ
నెంతయో శ్రమపడి చింత జేయు
భీకారాఖాతాల భీమ కాసారాల
విజన ప్రదేశాల పెను వనాల
నున్నతోన్నత శిఖ రోర్వీధరమ్ముల
విరులకై శ్రమపడి వెదుకు చుండు
శివ !శివా ! యారీతి తిరుగుచుండును గాని
తనలోని హృదయముం దలచ డెపుడు
మనసు పద్మంబుగా మార్చి మధుర ఫణితి
నర్పణము సేయు జ్ఞానంబు నరయలేక
ఘోర సంసార మొహాబ్ది నీరమందు
మగ్నుడౌచుండె నిరతంబు మాయ వలన 09 #
✍️ గోపాలుని మధుసూదన రావు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి