30, సెప్టెంబర్ 2020, బుధవారం

*గోవు విశ్వరూపం

 సేకరణ... 


*🐄🐄🐄🐄🐄🐄🐄🐄



  గోవు యొక్క కంఠం మస్తకం మధ్య గంగ ఉంటుంది. గోవు యొక్క సమస్త అంగములయందు సమస్త దేవతలున్నారు. సప్తర్షులు, నదులు, తీర్థములు గోవులో ఉన్నాయి.🔥🐄🔥🐄


 ఆవు యొక్క నాలుగు పాదాల్లోనూ ధర్మార్ధ కామ మోక్షములుంటాయి.🐄


 అందుకే ఆవు కాళ్ళు కడిగి ఆ నీరు తలపై చల్లుకుంటే పాపాలు నశిస్తాయి.🐄🔥


ఆవు ముఖంలో నాలుగు వేదాలు ఉంటాయి. అందుకే ఆవును ముందు ప్రవేశపెట్టి ఆ తర్వాతనే నూతన గృహంలో యజమాని ప్రవేశిస్తాడు.🔥🐄🔥🐄🔥🐄


గోధూళి తో నవగ్రహ దోషాలు తొలగిపోతాయి.🐄


 గోవుకు నవధాన్యాలు ఆకుకూరలు పళ్ళు మొదలైనవి ఆహారంగా ఇస్తే శుభం కలుగుతుంది.

రుణగ్రస్తులు బాధల నుండి బయటపడతారు.🐄


 అందుకే పండుగలలోను, శుభకార్యాల సందర్భంగా ను గోపూజలు, గోదానం చేయడం జరుగుతోంది.🐄


 సూర్యచంద్రులు, శివుడు, కుమారస్వామి, గణపతి, విష్ణుమూర్తి, బ్రహ్మ, సరస్వతి, హనుమంతుడు, నవగ్రహాలు, కుబేరుడు, పర్వతాలు, అగ్ని, వరుణుడు, నారదుడు, లక్ష్మి, భౌమాదేవి, భైరవుడు, వాయుదేవుడు మొదలగు ముప్పైమూడు కోట్లమంది దేవతలు గోవు శరీరంలో నివసించి ఉంటారు.🐄


 గోవుకు ఆహారం సమర్పించినట్లైతే 33 కోట్ల దేవతలకు నైవేద్యం సమర్పించినట్లే.🐄


అందుకే గో ప్రదక్షిణం చేస్తే భూప్రదక్షణం చేసినట్లు అన్నారు. 🔥గోమాత విశ్వమాత🔥

కామెంట్‌లు లేవు: