17, డిసెంబర్ 2020, గురువారం

ద్రాక్షారామం

   ద్రాక్షారామం ఆలయం గురించి :-ఈ ద్రాక్షారామం దివ్యక్షేత్రం నకు క్చేత్రపాలకుడు లక్ష్మీనారాయణుడు. ఈ దివ్య క్చేత్రము ఐదు ప్రాకారాలతో, నాలుగు వైపులా రాజగోపురములతో శిల్పకళావైభవము కలిగి విలసిల్లుతున్నది. ఆలయ ప్రధాన ద్వారం నకు కుడి ఎడమ వైపున నాట్యగణపతి, డుండి గణపతి ముందుగా దర్శనము ఇస్తారు. ప్రధాన ప్రాకారము లో తూర్పున నందీశ్వరుడు, అశ్వద్దవ్రుక్చము, ధ్వజస్తంభం కలవు. దక్షిణ భాగంలో అన్నపూర్ణ సమేత విశ్వేశ్వరుని ఆలయము, దక్చిణామూర్తి ఆలయము, నైరుతి భాగం లో మంగళవార మండపం, వాయువ్యమునందుడెభై స్తంభములతో చక్కని శిల్పకళానైపుణ్యముతో నిర్మితమైన సోమవార మండపం కలవు. ఈ లింగము పరమేశ్వరుని మామగారు అయిన హిమవంతుడుగా తలుస్తారు. ఈశాన్య భాగంలో రుద్రతీర్ధము, అష్ట భైరవ లింగాలను దర్శించ వచ్చును. ఇక్కడ ఉన్న కాలభైరవ మందిరం ఉన్న విగ్రహం సిద్ధభైరవస్వామి. ఈ సిద్ధభైరవస్వామి కి దంతాలు ఉంటాయి. ఈ ప్రాకారము లో లక్ష్మి నారాయణుడు శ్రీకృష్ణ దేవరాయలుచే ప్రతిష్టుతుడైన విరూపాక్చుడు, బాల భీమేశ్వరుడు, నటరాజస్వామి, చతుర్ముఖబ్రహ్మ, సప్తమాత్రుకలు, మహిషాషురమర్దిని, వీరభద్రేశ్వరుడు, లక్ష్మీ గణపతి, వటుకభైరవుడు మనకు దర్శనము ఇస్తారు. వటుకభైరవుడు సమీపంలో జపముచేసిన త్వరగా మంత్రసిద్ధి లభిస్తుంది అని చెబుతారు. నవగ్రహ మండపములు, అష్టదిక్పాలకుల మండపములు కలవు. అష్ట దిక్పాలక మండపము ఉండుట ఇచ్చట ప్రత్యేకత. ప్రధాన గర్భాలయం మూడు ప్రాకారములు కలిగి ఉంటుంది. మొదటి ప్రాకారములో మూల విరాట్టుకు ప్రదక్షిణ మార్గములో మోక్షద్వారముగా చెప్పబడుచున్న శంఖుస్థాపన స్తంభముకానవచ్చును. ఆ స్తంభముపై ఆదిశేషుని విగ్రహాన్ని దర్శించవచ్చును. ఈ స్తంభమునకు ఎడమద్వారము మోక్షద్వారముగానూ, కుడివైపు యమ ద్వారము గా చెప్పబడుచున్నది.

ఈ ప్రాకారము చీకటి కోణముగా పిలుస్తారు. ఇక్కడ గోడలలో బిగించిన రాళ్లు ఇదివరలో వెలుతురు వెదజల్లుతూ ఉండేవట. తర్వాత ప్రాకారము లో ప్రదక్షిణ దిశగా దిగువ అంతస్తులో ఉన్న మూలవిరాట్టును దర్శించాలి. ఈ భీమేశ్వర లింగము యొక్క ఎత్తు సుమారు 14అడుగులు కలిగి పై అంతస్తు వరకూ వ్యాపించి ఉంటాడు. పానపట్టము కోణములు కలిగి ఉండుటవలన ఈ లింగము భోగలింగముగా చెప్పబడినది. ఈ పరమేశ్వరుని దర్శనము అపర కైలాస దర్శనము తో సమానము. ఈ స్వామి దర్శనం అనంతరం దక్షిణ ప్రాకార మెట్ల ద్వారా నంది మంటపము లో ప్రవేశిస్తాము. నంది మంటప ప్రాకారము ఇరవై స్తంభాలతో నెలకొని ఉన్నది. ఈ మండపంలో నైరుతి భాగాన కల స్తంభమును వ్యాస స్తంభము అంటారు.

          ఈ ప్రదేశము వద్ద దేవతలు నిర్మింస్తుండగా సూర్యోదయం అగుటచే దేవాలయ కట్టడం ఆగిపోయిందట.ఈ ఆగ్నేయదిశలో గోడభాగము ఎన్ని సార్లు కట్టిననూ కూలిపోయేదట. ఒకసారి కంచి పరమాచార్య వారు 108రోజులు మహాయఙ్ఞము చేసిన తర్వాత ఆ గోడ నిలబడిందట. ఈ వ్రుక్చం చాయలోనే యఙ్ఞశాల నిర్మించబడినది.

కామెంట్‌లు లేవు: