.
॥ రవివర్ణనమ్ ॥
-98- శ్లోకము :
వ్యగ్రై రగ్ర్యగ్రహోడు గ్రసనగురు
భరైర్నో సమగ్రైరుదగ్రైః
ప్రత్యగ్రై రీషదుగ్రై రుదయగిరిగతో గోగణైర్గౌరయన్ గాం
ఉద్గాఢార్చి ర్విలీనామరనగర
నగగ్రావ గర్భామివాహ్నా-
మగ్రేయోఽగ్రే విధత్తే గ్లపయతు
గహనం స గ్రహగ్రామణీర్వః ॥
-98- చంపకమాల :
మునుౘను చంద్రుఁ గ్రమ్ముచు
నపూర్ణములై నులివెౘ్చనొంది బ
ల్పును గని క్రొత్తవైతగు వెలుంగుల
వేల్పుల వీటికొండఱా
లెనసినదానిఁ జేసి భువి హెచ్చగు
పొన్జిగిమేల్దినాదినం
చినుఁడుదయాద్రి భాసిలు గ్రహేశుడు
మీ యఘముల్ దొలంచుతన్ ✋️🤚
టీకా :
[ ఇందు కవి గారు
సూర్యభగవానుని గ్రహాధిపతిగా
చెప్పుచున్నారు..]
(పగటికి ఆరంభమైన ఉదయకాలమున భాస్కరుని కిరణములు వచ్చుచున్నవనగనే పాఱి..)
మును = ముందు , ౘను = వెళ్లుచున్న , చంద్రుఁ(..ని) , (గ్ర)క్రమ్ముచున్ = ఆవరించ పూనుచు ,
+ అ పూర్ణములై = సంపూర్ణ కాంతిని పొందని లేత కిరణములై , (అటుపై ..)
నులివెౘ్చనొంది = కొద్ది వెౘ్చదనమును
పొంది , బల్పు ను గని = క్రమేణా అధికమగుచు , క్రొత్తవై , తగు వెలుంగుల(..తో) ,
< వేల్పుల = దేవతల , వీటి = స్థావరపు , కొండ > =మేరు పర్వత(..ము)పు ,
ఱా(..ళ్లు)ల్ = మణులను , + ఎనసిన దానిఁ = పోలినదానినిగా ,
దిన + ఆదిన్ = ప్రొద్దు పొడుపున ,
పొన్ = బంగార(..ము)పు , జిగిమేల్ = శ్రేష్ఠమైన కాంతిని(..పొందినదిగా)
భువి = భూమిని , జేసి ,
[ పొన్ = బంగారు , జిగిమేల్ = శ్రేష్ఠమైన కాంతిని ] , [ దిన + ఆదిన్ = ప్రొద్దు పొడుపున ], హెచ్చగు = అతిశయించును ..+ అంచు = అని ,
+ [ఇనుఁడు = రవి] , + ఉదయ + అద్రి = ఉదయించు (తూర్పు)కొండ పై ,
భాసిలు = ప్రకాశించు , గ్రహ(..ములకు) , + ఈశుడు = అధిపతి - రవి ,
మీ , (య)అఘముల్ = పాపములను , (దొ)తొలంచుతన్ = తొలగించును గాక ..
✋️🤚
భావము :
[ ఇందు కవి గారు
సూర్యభగవానుని గ్రహాధిపతిగా
చెప్పుచున్నారు..]
ఉదయకాలమున భాస్కరుని కిరణములు వచ్చుచున్నవనగనే
పాఱి ముందు వెళ్లుచున్న చంద్రుని ఆవరించ పూనుచు
సంపూర్ణ కాంతిని పొందని
లేత కిరణములై -
అటుపై కొద్ది వెౘ్చదనమును
పొంది - క్రమేణా అధికమగుచు - క్రొత్తవైన వెలుగులతో మేరు పర్వతపు మణులను పోలి - ప్రొద్దు పొడుపున బంగారపు శ్రేష్ఠమైన కాంతిని పొందినదిగా భూమిని జేసి అతిశయించును .. అని
ఉదయాద్రి (తూర్పు కొండ) పై
ప్రకాశించు గ్రహాధిపతి - రవి
మీ పాపములను తొలగించును గాక ..
✋️🤚
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి