9, డిసెంబర్ 2024, సోమవారం

పాపము పుణ్యమేదొ తెలుపన్

 ఉ.పాపము పుణ్యమేదొ తెలుపన్ మది ధార్మిక చిత్త వృత్తితో

చూపిన మార్గముం జనులు శుధ్ధ మనస్కత నాదరించి తా

మే పొరపాటు చేసిన సహింపగ నొల్లరు గాన విజ్ఞులే

దాపరికమ్ములేని మతి ధర్మ నిబధ్ధత నుండగా దగున్౹౹ 63


ఉ.ఏ పలుకేది యైన మదికింపును గూర్చెడు రీతి నీతితో

నోపి వచింప యోగ్యమగు నుక్తిని యుక్తిగఁ బల్కగా వలెన్

తాపము గల్గ జేయని హితమ్మగు మాటల నెంచుకొన్నచో

నేపగిదిన్ వచింప నవి యిష్టములై వెలుగొందు వేడ్కమై౹౹ 64

కామెంట్‌లు లేవు: