31, మే 2024, శుక్రవారం

లలితా దేవి


 *చాలా మంది అడిగే ఒక ప్రశ్న.....*


*ప్ర: లలితా దేవిని ఒక చిత్రంలో ఒక సింహాసనం మీద శివునిపై కూర్చున్నట్లుగా ఆ ఆసనానికి నాలుగు కోళ్ళలో బ్రహ్మ, విష్ణువు, ఇంకా ఎవరో ఇద్దరు ఉన్నట్లుగా ఉంది. ఇందులో అంతరార్థం ఏమిటి...*


*జ: లలితా సహస్రనామ స్తోత్రంలో ఈ పటానికి అంతరార్ధం కనబడుతుంది.*


*'పంచ బ్రహ్మాసనాసీనా',*

*'పంచప్రేతమంచాధీశాయినీ', 'పంచకృత్యపరాయణా'...*


*అనే నామాలలో పై చిత్రం ఉంది.*


*1. సృష్టి,*

*2. స్థితి,*

*3. సంహార,*

*4. తిరోధాన,*

*5. అనుగ్రహం... అనేవి* *పంచకృత్యాలు.*


*ఇవి ఒకే పరబ్రహ్మ తత్త్వ శక్తి వలన సాగించే పంచకృత్యాలు. వాటి నిర్వహణకై ఆయన ధరించిన ఐదు బ్రహ్మల రూపాలు...*


*1. బ్రహ్మ ,*

*2. విష్ణు,*

*3. రుద్ర ,*

*4. మహేశ్వర,*

*5. సదాశివ.*


*వారిని అధిష్ఠించి ఉన్న శక్తి ఒక్కటే. ఆమె పరాశక్తి లలితాంబిక. "శివశ్శక్త్యాయుక్తో యది భవతి శక్తః ప్రభావితుం" - శక్తి లేనప్పుడు శివుడూ అశక్తుడే. అని ఆచార్యుల మాట. ఇరువురూ అవిభాజ్యులు. ఈ పంచ కృత్యాలుగా పరబ్రహ్మశక్తి వ్యక్తమవుతుంది. అయిదు బ్రహ్మలుగానున్న పరబ్రహ్మ యొక్క అధిష్ఠాతృ శక్తి అని తెలియజేసే దేవీ నామాలకు ఇచ్చిన చిత్ర రూపమే మీరు చూసే పైన ఉన్న చిత్రం...*

కామెంట్‌లు లేవు: