31, మే 2024, శుక్రవారం

హనుమాన్ జన్మోత్సవం

 🙏🙏🙏🙏🙏🙏🙏


రేపు హనుమాన్ జన్మోత్సవం


*అసాధ్య సాధక స్వామిన్ అసాధ్య తవ కింవధ|*

*రామదూత కృప సింధో మత్కార్యం సాధ్యప్రభో||*


హిందూ సంప్రదాయంలో ఎన్నో పండుగలున్నాయి. ఇందులో హనుమాన్ (జన్మోత్సవం) జయంతి సైతం ముఖ్యమైన పండుగ. హనుమజ్జయంతి సందర్భంగా భక్తులు హనుమాన్ చాలీసా పారాయణం చేయడంతో పాటు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తారు. రేపు జూన్ 1 శనివారం ఊరూరా, వాడవాడనా యావత్ దేశవ్యాప్తంగా హనుమజ్జయంతి వేడుకలు నేత్రపర్వంగా సాగుతాయి.


హిందువులు ఆంజనేయుడిని ధైర్యానికి ప్రతీకగా కొలుస్తారు. శక్తి సామర్థ్యాలకు ప్రతిరూపరంగా భావిస్తారు. సముద్ర లంఘించి లంకకు చేరి సీతమ్మవారి జాడ కనిపెట్టారు. సంజీవనీ పర్వతాన్నే పెలికించి తీసుకొచ్చి లక్ష్మణుడి ప్రాణాలను కాపాడారు స్వామివారు.


హనుమజ్జయంతి ఏడాదిలో మూడుసార్లు నిర్వహిస్తూ వస్తుంటారు.


ఒక్కో ప్రాంతంలో ఒక్కోసారి హనుమాన్ జయంతిని జరుపుకుంటారు. కొందరు చైత్ర పౌర్ణమి రోజున హనుమాన్ జయంతిని జరుపుకుంటుండగా.. మరికొందరు వైశాఖమాసం దశమినాడు ( రేపు జూన్ 1) హనుమజ్జయంతిని జరుపుకుంటారు.


ఇక తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో మార్గశిర మాసంలో హనుమజ్జయంతి నిర్వహిస్తారు.


నిజానికి పురాణాల ప్రకారం..


హనుమాన్ జీ ఇప్పటికీ భూమిపై భౌతికంగా ఉన్నాడని పురాణాలు చెబుతున్నాయి. హనుమంతుడు గంధమాదన్ పర్వతం మీద నివసిస్తున్నాడని నమ్ముతారు. అందుకే హనుమంతుడిని కలియుగ మేల్కొన్న దేవుడు అని పిలుస్తారు. మరణించిన వారి జన్మదినోత్సవం జరుపుకుంటారు.

కానీ హనుమంతుడు ఇప్పటికీ భూమిపై ఉన్నారు. కాబట్టి అతని పుట్టినరోజును జన్మోత్సవం అని పిలవడం సరైనది. అందుకే చాలా మంది హనుమాన్ జయంతిని హనుమాన్ జన్మోత్సవంగా పిలుస్తారు.

కామెంట్‌లు లేవు: