*** న్యస్తాక్షరి (పాదాదిగ) ***
""""""""""""''''""'''"""'"""''"""''''""''""'"
నం --- ద --- న --- ము.
తే:గీ:
నందనవనము చేసుకొనవలె బ్రతుకు
దయయు ధైర్యము న్యాయము ధర్మగుణము
నడతలోనున్న మనిషి ఘనముగనుండు
ముత్యము వలె స్వఛ్ఛమగుచొ మోక్షమదియె.
*** సమస్యా పూరణము ***
"""""""""'''''''"""""""""""''""""""""""""
గుణము ముఖ్యము మనిషికి కులము కాదు.
తే:గీ:
భారతము భాగవతమును వ్రాసినట్టి
వ్యాసునిది జాలరి కులము,భారతీయు
లెల్ల గర్వించు రాజ్యాంగ మెల్ల వ్రాయు
జ్ఞాని అంబేద్కరుడు శూద్ర జాతి రత్న
గుణము ముఖ్యము మనిషికి కులము కాదు.
💐💐💐
* యర్నాగుల వేంకట రమణా రావు *
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి