4, నవంబర్ 2023, శనివారం

 *1976*

*కం*

కష్టం బుల చవిచూడక

స్పష్టంబగు సుఖములెపుడు సమకూరవయా.

సుష్టుగ సుఖముల నుండిన

కష్టముదరి చేరుటెల్ల కర్మము సుజనా.

*భావం*:-- ఓ సుజనా! కష్టాలు అనుభవించకుండా స్పష్టమైన సుఖములు సమకూరవు. చక్కగా సుఖములలో ఉన్నప్పుడు కష్టాలు మన చెంతకు రావడమనేది మన కర్మలయొక్క ఫలము.

*సందేశం*:-- కష్టాలను తప్పించుకుని సుఖములను పొందుచున్ననూ ఏనాటికైనా ఆ కష్టాలను అనుభవించకుండా సరైన సుఖములను పొందలేము.

*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ* 

కామెంట్‌లు లేవు: