🪔 *_𝕝𝕝ॐ𝕝𝕝 సుభాషితమ్ 𝕝𝕝卐𝕝𝕝_* 💎
శ్లో𝕝𝕝 శాంతితుల్యం తపో నాస్తి
న సంతోషాత్పరం సుఖమ్|
న తృష్ణయా పరో వ్యాధి:
న చ ధర్మో దయాపర:||
*చాణక్యనీతి*
తా𝕝𝕝 శాంతి కంటే మించిన తపస్సు లేదు. తృప్తి, సంతోషాల కంటే మించిన సుఖము లేదు. పేరాశని మించిన రోగము లేదు. దయాగుణముని మించిన ధర్మము లేదు.
*సంస్కృతసుధాసింధువు_*
卐卐卐卐卐卐卐卐卐卐卐卐卐卐卐
*మణినాలంకృతో సర్పః*
*కిమసౌ న భయంకరః |*
*దుర్జనః పరిహర్తవ్యో*
*విద్యయా భూషితోఽపి సన్ ||*
భావం: దుర్మార్గుడై ఎంతటి విద్యావంతుడైనా, చాకచక్యం కలవాడైనా అతడికి దూరంగా ఉండడం అభిలషణీయం..... పాము మణితో అలంకరింపబడినా అది భయంకరమే కదా....? దాని అసలు స్వభావం కొంచెమైనా మారుతుందా?
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి