25, నవంబర్ 2020, బుధవారం

మొగలిచెర్ల అవధూత

 *రుద్రహోమము..ఒక వివరణ..*


"ప్రసాద్ గారూ..వచ్చే *కార్తీక పౌర్ణమి* నాడు మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి మందిరం వద్ద *రుద్రహోమము* నిర్వహిస్తున్నామని సూచన ప్రాయంగా తెలిపారు ..ఏ తేదీన *రుద్రహోమము* నిర్వహిస్తున్నారు?..ఎలా పాల్గొనాలి?" అంటూ చాలా మంది సోషల్ మీడియా పాఠకులు  నన్ను వివిధ మాధ్యమాల ద్వారా అడుగుతున్నారు..రుద్రహోమము గురించి వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందని భావించి..ఈరోజు ఈ పోస్ట్ పెడుతున్నాను..


*నవంబర్ 30వతేదీ సోమవారం నాడు శ్రీ దత్తాత్రేయ స్వామివారి మందిర ప్రాంగణంలో రుద్రహోమము నిర్వహించాలని సంకల్పించాము..*  

ఆషాఢమాస పౌర్ణమి నాడు (గురుపౌర్ణమి) దత్తహోమము... శ్రావణ మాస పౌర్ణమి నాడు చండీ హోమము..భాద్రపద మాసం లో లక్ష్మీగణపతి హోమము..ఆశ్వీయుజ మాసం దసరా ఉత్సవాల లో భాగంగా భవానీ కంకణ దీక్షా కార్యక్రమం..ఇలా ప్రతినెలా ఏదో ఒక కార్యక్రమం శ్రీ స్వామివారి మందిరం వద్ద నిర్వహిస్తూ ఉన్నాము..సాధ్యమైనంత వరకూ భక్తులను ఆయా కార్యక్రమాలలో భాగస్వాములు గా చేయాలని ఒక చిన్న సంకల్పం..


నవంబర్ 30వతేదీ సోమవారం నాడు జరుపబోయే *రుద్రహోమము* లో కూడా భక్తులు పాల్గొనవచ్చు..ముందురోజు ఆదివారం నాటి సాయంత్రానికి మొగలిచెర్ల శ్రీ దత్తాత్రేయ స్వామివారి మందిరం వద్దకు చేరుకోవాలి..ఆరోజు రాత్రికి భక్తులందరికీ అన్నప్రసాద ఏర్పాట్లు ఉన్నాయి..ప్రక్కరోజు సోమవారం ఉదయం 9 గంటలకు రుద్రహోమము మొదలు అవుతుంది..మధ్యాహ్నం 1.30 గంటలకు  హోమము పరిసమాప్తి అవుతుంది..

*శని, ఆది, సోమవారాల్లో (నవంబర్ 28, 29, 30 తేదీలలో ) శ్రీ స్వామివారిని దర్శించుకొనడానికి వచ్చిన ప్రతి భక్తుడికీ రెండు పూటలా ఉచిత ఆహార వసతి ఏర్పాట్లు చేయడం జరిగింది..*


రుద్రహోమము నందు పాల్గొనాలి అనే ఆసక్తి ఉన్నవారు నేరుగా మమ్మల్ని సంప్రదించండి..(సంప్రదించడానికి సెల్ నెంబర్ల ను ఈ పోస్ట్ చివర ఇవ్వడం జరిగింది..) ముందుగా మీ గోత్రనామాలను నమోదు చేసుకుంటాము..హోమము లో పాల్గొనే వారు సంప్రదాయబద్ధంగా దుస్తులు ధరించాలి..హోమము లో పాల్గొనే వారికి హోమద్రవ్యాలు, పూజా సామాగ్రి శ్రీ స్వామివారి మందిరం వద్ద మేము ఏర్పాటు చేస్తాము..


*రుద్రహోమము గురించి సంప్రదించవలసిన సెల్ నెంబర్లు : 94419 16557 మరియు 99497 53615.*


సర్వం.. 

శ్రీ దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..వయా కందుకూరు..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్ : 523114.).

కామెంట్‌లు లేవు: