.. ☘️మట్టికుండ
☘️మిత్రులారా ఇది మెసేజ్ మాత్రమే మీ ఇష్టం మీరు ఎలాగైనానీరు త్రాగండి
.
. -- వేసవి తాపానికి తాళలేక రిఫ్రిజిరేటర్ లోంచి బాటిల్ తీసి కూలింగ్ వాటర్ తాగేయటం మనలో చాలామందికి అలవాటే. ఐతే యీ అలవాటు తక్షణమే మానుకోవాలి. మన శరీరంలో ఉష్ణోగ్రత బయటి వాతావరణానికి పూర్తిగా భిన్నంగా ఉండకూడదని మనం తెలుసుకోవాలి. బయటి ఎండ వేడి నుంచి రాంగానే.. వచ్చిన వెంటనే ఫ్రిజ్ లో ఉంచిన చల్లని నీరు తాగేయకూడదు. ఓ 10-15 నిమిషాల తర్వాత తాగడం శ్రేయస్కరం. ఇలా చేయడం వల్ల దుష్పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని వైద్యులు పరిశోధకులు చెబుతున్నారు. రిఫ్రిజిరేటర్ వాటర్.. మామూలు మంచినీళ్ళలా గడగడ తాగేయకూడదు. మాత్రలు క్యాప్సూల్స్ వేసుకోవడానికి ఫ్రిజ్ వాటర్ వాడకూడదు. భోజన ఫలహారాలు అవగానే కూడా ఈ చల్లని నీళ్ళు తాగకూడదు. మిగతా సమయాల్లో రెండు మూడు గుక్కల కంటే ఎక్కువగా ఫ్రిజ్ వాటర్ తీసుకోకూడదు. అతిథులు వస్తే చల్లని నీరు అడిగితే మిక్స్ చేసి ఇవ్వడం మంచిది. చాలామంది వేడి వాతావరణంలో ఐస్ క్రీం లు తింటుంటారు. ఇదికూడా మంచిదికాదు. ఐస్ లోపల వేడి ఉంటుంది. వేసవి దాహాన్ని తీర్చుకోవడానికి.. మట్టి కుండలు.. ది బెస్ట్. మట్టి కుండలో ఏరోజుకారోజు మంచినీటితో నింపి చల్లబడ్డాక ఆ మంచినీళ్ళు తాగడం అంత ఉత్తమం మరొకటి లేదు. మంచి ఆరోగ్యం కూడా. ఆహారం తీసుకున్నాక మట్టి కుండలో నీరు తాగితే జీర్ణ ప్రక్రియ సజావుగా సాగుతుందని ఆయుర్వేదం చెబుతోంది. రిఫ్రిజిరేటర్ లు లేని పూర్వపు రోజుల్లో చల్లని నీరు మట్టి కుండలో నుంచి తీసుకుని తాగేవారు. వాళ్ళు అంత ఆరోగ్యంగా ఉండటానికి ఇది కూడా ఓ కారణమే అని మనం తెలుసుకోవాలి. మట్టి కుండలో చల్లని నీరు తీయగా సహజంగా ఉంటుంది. ఓ పాటలో.. మట్టి కుండలో నీరు తీయనా.. అని చరణంలో వస్తుంది. కొత్త కాపురం మట్టి కుండ నీటిలో ఉన్నంత తీయగా ఉండాలని అంటారు. మన సౌత్ లో పలమనేరు టెర్రకోట మట్టి కుండలు చాలా ప్రసిద్ధి పొందాయి. మట్టికుండని కడవ అనికూడా అంటారు. మొక్కల్ని పెంచే మట్టికుండలను పూలకుండీలు అంటారు. మట్టి కుండలు, పూలకుండీలు అందరి ఇళ్ళలో ఉండటం ఆరోగ్యపరంగా చాలా అవసరం.. మంచిది కూడా. ఫ్రిజ్ వాటర్ బదులు మట్టి కుండ నీళ్ళే మనం అలవాటు చేసుకోవాలి.. ----- గాదె లక్ష్మీ నరసింహ స్వామి (నాని) విజయనగరం ఫోన్ 99855 61852....
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి