4, ఫిబ్రవరి 2026, బుధవారం

శివనామమ్ము సమస్త మానవులకుం

  *శివనామమ్ము సమస్త  మానవులకుం జేcదౌను భావింపగన్*

ఈ సమస్యకు నా పూరణ. 


ధవుగా గోరితి  జేతునే తపమునే  తప్పెన్నగా వచ్చితే


భవుడే భస్మపుధారియైన సరియే భాగ్యంబు మాదౌనులే


శివనామమ్ము సమస్త మానవులకుం -  జేcదౌను భావింపగన్


భవదీయమ్మగు బోధలున్ వినినచో  వల్లించగా నాస్తికా!



అల్వాల లక్ష్మణ మూర్తి.

కామెంట్‌లు లేవు: