22, సెప్టెంబర్ 2022, గురువారం

కంపవాతము

 కంపవాతము  ( parkinsonism ) రావడానికి గల కారణాలు - లక్షణాలు . 


   ఆయుర్వేద శాస్త్రం నందు పార్కిన్సన్స్ వ్యాధిని కంపవాతం అని అంటారు. ఈ వ్యాధి పుర్తిగా నరములకు సంబంధించిన వ్యాది. మెదడులో     "డోపమైన్ " , నార్ - ఎపినెఫ్రిన్ , సిరోటినిన్ , ఎసిటైల్ కొలిన్ , కొలిస్ట్ స్టాకిన్ -8 , సబ్ స్టెన్సు -p మెటాక్ ఫాలిన్ మరియు ల్యూ ఎన్ ఏ ఫాలిన్ మొదలయిన హార్మోన్స్ అస్తవ్యస్తంగా తయారు అవుతాయి. దీని పరిణామమే పార్కిన్సన్ వ్యాది. దీనితో పాటు మెదడు వాపు , మెదడులో గడ్డలు ఏర్పడటం , మెదడుకు రక్తప్రసరణ లోపించడంతో పాటు కార్బన్ మోనాక్సయిడ్ పాయిజనింగ్ లు కూడా కారణాలుగా గమనించాలి . ఇది వాతప్రకోప వ్యాధిగా ఆయుర్వేదం నందు చెప్పబడినది. 


  ఈ వ్యాధి లక్షణాలు - 


 * కంపవాతం నందు వణుకు విచిత్రముగా ఉంటుంది. వణుకు చేతుల్లో మొదలు అవుతుంది. 


 *  పనిచేస్తున్నప్పుడు వణుకు ఉండదు. ఖాళీగా ఉన్నప్పుడు మాత్రమే వణుకు ఉంటుంది.


 *  కండరాలు బలహీనత పడతాయి. కండరాలు బిగదీసినట్టుగా ఉంటాయి. 


 * ఒళ్ళు తూలుతుంది . నడిచేప్పుడు వంగి నడుస్తారు. చేతులతో పాటు , పెదవులు , మెడకండరాలు , తల కూడా వణుకుతుంది.


 *  నోటి నుంచి చొంగ కారుతుంది. 


 *  కంటిచూపు కొంచం తీక్షణంగా ఉంటుంది. 

 

 *  రోగి మానసికంగా కృంగిపోతాడు . 


  గమనిక  -  మొదట చేతులు వణకడంతో ప్రారంభం అయిన వ్యాధి సరైన చికిత్స తీసుకోకపోవడం మూలాన ఎక్కువ అయ్యాక పైన చెప్పిన లక్షణాలు ఒక్కొక్కటిగా మొదలవుతాయి. 


   దీనికి చికిత్స కొరకు ప్రత్యేక ఔషదాలు ఉపయోగించవలసిందే ...ఆయుర్వేదం నందు స్వర్ణభస్మం వంటి భస్మాలతో వైద్యం చేస్తూ ఆహార విషయంలో వాతం కలిగించే ఆహారం తీసుకోకుండా కఠిన పథ్యం పాటిస్తే తప్పకుండా వ్యాధి నయం అవుతుంది. దీర్ఘకాలిక చికిత్స అవసరం అవుతుంది.


       మరింత విలువైన సమాచారం కొరకు నా గ్రంథములు చదవగలరు . 


   

కామెంట్‌లు లేవు: