13, సెప్టెంబర్ 2020, ఆదివారం

*ధార్మికగీత - 19*

🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲
                         
                                       *****
             *శ్లో:- స్వగృహే పూజ్యతే మూర్ఖః ౹*
                    *స్వగ్రామే పూజ్యతే ప్రభుః ౹*
                    *స్వదేశే పూజ్యతే రాజా ౹*
                    *విద్వాన్ సర్వత్ర పూజ్యతే ౹౹*
                                        *****
*భా:- అవిద్య, అజ్ఞానము, అహంకారము, ఆధిపత్యము, అవివేకములతో రాణిస్తున్న మూర్ఖుడు కూడా తన ఇంటిలో మకుటం లేని మహారాజులా గారవింప బడతాడు. గ్రామాధికారి ఊరిని తన ఆధీనంలో పెట్టుకొని, పెత్తనాన్ని, అధికార దర్పాన్ని చలాయిస్తూ, ఇష్టమైనా, కష్టమైనా తన గ్రామంలో ప్రజానీకముచే సాదర నీరాజనాలు అందుకుంటాడు. రాజు చతుర్విధ బలగాలతో, అధికార,అనధికార గణాలతో, మంత్రులతో, సామంతులతో, సిరిసంపదలు, భోగభాగ్యాలతో ఎనలేని స్వర్గసుఖాలలో మునిగి తేలుతూ తన దేశమంతటా నయానో, భయానో పూజింపబడతాడు. వీరందరికి పరిమితులు ఉన్నాయి. కాని సకల విద్యాపారంగతుడైన పండితుడు తన నవ నవోన్మేషమైన శేముషీ వైభవంతో పండిత పామర లోకాన్ని రంజింపజేస్తూ, ప్రపంచ మంతటా సన్మానాలు, సత్కారాలు, ప్రశంసలు అందుకుంటాడు. వ్యాస వాల్మీకాది మహర్షులు,జగద్గురువు ఆదిశంకరులు, కాళిదాసు,భారవి వంటి మేటి విద్వత్కవులు తమ అపార వైదుష్యాన్ని,పాండితీ ప్రతిభను తరతరాలకు త్రికాలవేద్యంగా, పూజ్యంగా అందజేసి,ప్రాతః స్మరణీయులు, చిరస్మరణీయులై నారు. గురువు ఇహపర సాధనా విధాన నిధానాన్ని నిర్దేశిస్తూ,మోక్షానికి మార్గం చూపిస్తాడు. కాన రాచరికం అస్థిరమని,ఆశాశ్వతమని, విద్వత్తే స్థిరమని, శాశ్వతమని, అనుసరణీయమని సారాంశము.*
                                   *****
                     *సమర్పణ : పీసపాటి*
🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲

కామెంట్‌లు లేవు: