29, జనవరి 2021, శుక్రవారం

రామాయణమ్ 200

 రామాయణమ్ 200

...........................

రామాసకలసద్గుణాభిరాముడవు ,

మహాదైశ్వర్యవంతుడవు !నీతో స్నేహము నా అదృష్టము .

.

రఘుకులతిలకుడవు నీతో స్నేహము నా బందువులందిరలో నన్ను గొప్పగా నిలబెట్టును.

 అది నాకు గర్వకారణము .

.

రామా! నేను కూడా నీకు తగిన స్నేహితుడనే .

నా గుణగణముల గురించి నేనుగా నీకు చెప్పజాలను నీవే ముందుముందు తెలుసుకొనగలవు .

.

రామా ,మనస్సును సదా అదుపులో ఉంచుకొన్న నీ వంటి మహాత్ముల ప్రేమ ,ధైర్యము,కూడా స్థిరముగానే యుండును .

.

రామా ,ధనికుడైనా ,దరిద్రుడైనా ,సుఖాలలో ఉన్నాదుఖాలలోఉన్నా , ఎన్నిదోషములున్నప్పటికీ స్నేహితుడే ఉత్తమమైన గతి .

.

రామా స్నేహమనగా ఇట్టిది అని తెలిసిన వారు తన ధన ,ప్రాణములు స్నేహితునికోరకు త్యజించుటకు కూడా వెనుకాడరు.ఇదినాది, ఇది నీది అను భేద భావము వారిరువురి మధ్య పొడసూపదు.

.

అని అంటున్న సుగ్రీవుని మాటలకు అవును నిజమన్నట్లుగా రాఘవుడు తల ఊపాడు .

.

రామా నా అన్నతో నాకు కలిగిన వైరకారణము చేత . నా ఈ నలుగురు సహచరులతో నేను ఇచ్చట నివసించుంటిని. నా ప్రాణములు తీయించ వలెనని నా అన్న ఎన్నో సార్లు ప్రయత్నించినాడు .

.

మా అన్న పంపిన వారినందరినీ యమసదనమునకు పంపినాను . 

.

మా అన్నయ్య నా భయమునకు హేతువు! అందు వలననే మీరు కనపడినప్పుడు వాలి పంపిన వారేమోనని భయపడినాను .

.

భయమునకు కారణ మున్నప్పుడు భయపడుట సహజముకదా.

.

రామా నేను శోకాక్రాంతుడనై ఉన్నాను. స్నేహితుడవు కనుక నా కష్టములు నీ ముందు వెల్లడించు చున్నాను .

.

అని అత్యంత దీనముగా ,బాధ తో పలికిన సుగ్రీవుని మాటలు విని రాముడు ,

అసలు నీకు మీ అన్నకు వైరము ఏర్పడుటకు గల కారణమేమి అని ప్రశ్నించాడు .

.

వూటుకూరు జానకిరామారావు

కామెంట్‌లు లేవు: