చీమ మిడత కథ అందరూ చిన్నప్పుడు పుస్తకాల్లో చదివే ఉంటారు . అదే కథకు ఇండియన్ వెర్షన్ ఇక్కడ ఇవ్వబడింది .
ఒరిజినల్ కథ :
ఒక చీమ మండు వేసవిలో చెమటలు కక్కుకుంటూ శ్రమించి పుట్ట ని నిర్మించుకుని ఆహార ధాన్యాలను సంపాదించుకుంటూ పుట్టలో నిలవ చేసుకుంటూ ఉంటుంది . అదే సమయంలో మిడత చీమని చూసి బుద్ధిహీనురాలని హేళన చేస్తూ , ఆడుతూ పాడుతూ వేసవికాలం అంతా గడిపేస్తుంది . శీతాకాలం లో చీమ తన పుట్టలో వెచ్చగా తలదాచుకుంటూ , ఆహార కొరత లేకుండా హాయిగా జీవిస్తూ ఉంటుంది . మిడత మాత్రం గూడు తిండి లేక చలికి గజ గజ లాడుతుంది . ముందుచూపు లేని తన తెలివితక్కువ తనానికి విచారిస్తుంది .
ఇదే కథకి ఇండియన్ వెర్షన్ :
చీమ వేసవికాలంలో చెమటలు కక్కుకుంటూ శ్రమించి పుట్టని నిర్మించుకుని ఆహార ధాన్యాలను నిల్వ చేసుకుంటూ ఉంటే , మిడత దానిని అవహేళన చేస్తూ వేసవికాలం అంతా ఆడుతూ పాడుతూ గడిపేస్తుంది . శీతాకాలం లో చీమ తన పుట్టలో వెచ్చగా జీవిస్తూ ఆహార కొరత లేకుండా ఉంటుంది .
మిడత ఒక పత్రికా సమావేశం ఏర్పాటు చేసి తాను ఈ సమసమాజం లో వివక్షకు గురవుతున్నానని , చీమ హాయిగా పుట్టలో వెచ్చగా జీవిస్తూ కడుపునిండా భోజనం చేస్తుంటే తాను మాత్రం ఎందుకు ఆకలితో అలమటిిస్తూ చలికి గజ గజ లాడాలి అని ప్రశ్నించి తనకి జరుగుతున్న అన్యాయాన్ని సరి చెయ్యాలని డిమాండ్ చేస్తుంది .
NDTV , CNN IBN , Times Now , India Today, tv 9 , మొదలైన టీ వీ చానల్స్ మిడత నీ , చీమనీ పక్క పక్కన చూపించి , బ్రేకింగ్ న్యూస్ తో వాయించడం మొదలు పెడతాయి . ప్రపంచం మొత్తం మిడత కి జరుగుతున్న ఘోరమైన అన్యాయానికి విస్తుపోతుంది . R. నారాయణా, cpi నారాయణా , కత్తి మహేష్ , అరుంధతి రాయ్ మిడత కి సంఘీభావం ప్రకటిస్తూ టీ వీ ల్లో జరిగే చర్చల్లో ప్రభుత్వాన్ని ఏకి పారేస్తుంది . మేధా పాట్కర్ ఇతర పార్టీలతో కలిసి మిడత కి ఉచితంగా ఇల్లూ ఆహార సౌకర్యం కల్పించాలని రిలే నిరాహారదీక్ష లు ప్రారంభిస్తుంది . మాయావతి దీన్ని మైనారిటీల మీద జరుగుతున్న దాడిగా అభివర్ణిస్తుంది . మిడత కి న్యాయం చేయాలని ఇంటర్ నెట్ లో ఆన్ లైన్ పిటిషన్ లు వెల్లువెత్తుతాయి . కేరళ ప్రభుత్వం చీమలకి మిడత లకీ మధ్య సమానత్వం ఉండాలని , అందుకోసం చీమలు వేసవికాలంలో పని చేయడాన్ని నిషేధిస్తుంది .
విద్యా శాఖా మంత్రి మిడత జాతికి అన్ని విద్యాలయాలలో ఉచిత అడ్మిషన్ మరియు రిజర్వేషన్ కల్పిస్తారు .
రైల్వే మినిస్టర్ ఉచిత ప్రయాణం తో బాటు మిడత జాతి కోసం ప్రతి రైల్ లో ఒక ప్రత్యేక బోగీ ఏర్పాటు చేస్తారు .
ప్రభుత్వం మిడత జాతి మీద జరిగే అన్యాయ వ్యతిరేక చట్టం చేసి , చీమని అరెస్ట్ చేస్తుంది . చీమ ఇంటిని మిడత కి కేటాయించి ఒక పెద్ద సభ పెట్టి తాళాలని అందజేస్తుంది . దీన్ని అన్ని టీ వీ లు లైవ్ కవరేజ్ ఇస్తాయి . బృందా కారత్ దీన్ని ప్రజాస్వామ్య విజయం గా పేర్కొని , ప్రతి సంవత్సరం ఆరోజున వివక్ష వ్యతిరేక దినం గా పాటించాలని పిలుపు నిస్తుంది . సామాజిక న్యాయం జరగడానికి ఎంత పోరాటం చేయాల్సి వచ్చిందో సవివరంగా పత్రికలన్నీ ఆర్టికల్స్ రాస్తాయి .
.
.
జైలు నుండి విడుదలైన తర్వాత చీమ అమెరికా వెళ్ళిపోతుంది .
.
.
.
కొన్నాళ్ల తర్వాత సిలికాన్ వేలీ లో చీమ వందలాది బిలియన్ డాలర్లతో ఒక కంపెనీ ప్రారంభిస్తుంది .
.
.
.ఇండియాలో సాలీడు జాతికి కూడా మిడత జాతికి కల్పించిన సౌకర్యాలు ఇవ్వాలని ఉద్యమాలు జరుగుతూ ఉంటాయి .
.
.
.
మరో వంద సంవత్సరాలు గడిచినా ఇండియా అభివృద్ధి చెందుతున్న దేశం అని ప్రపంచం నలుమూలల అనుకుంటూ వుంటారు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి