ఒకసారి శ్రీకృష్ణుడు హస్తినాపురం నుంచి ద్వారకానగరానికి వెడుతూ ఉదంక మహర్షి ఆశ్రమానికి వచ్చాడు. ఉదంక మహర్షి ఆయన్ని పూజించి స్వామి! నువ్వు సంధి చెయ్యకలిగి కూడ కౌరవులకీ, పాండవులకీ యుద్ధం జరిగేలా ఎందుకు చేశావు ? అని అడిగాడు
శ్రీకృష్ణుడు ఉదంక మహర్షితో సత్త్వ, రజ, తమోగుణాలు నావశంలో ఉంటాయి మరుత్తులు, వసువులు అందరూ నాలోంచే పుట్టారు. ఓంకారంతో ఉన్న వేదాలు నేనే నాలుగు ఆశ్రమాలు, అన్ని కర్మలు, అన్ని మోక్షాలు నావశంలో ఉంటాయి. మనస్సు చేసే ధర్మాలన్నింటికి కారణం నేనే. బ్రహ్మ, విష్ణువు, ఈశ్వరుడు ఈ మూడూ నేనే. లోక రక్షణకోసం అధర్మాన్ని జయించి ధర్మాన్ని కాపాడతాను. కౌరవులు అధర్మం గల పన్లే చేశారు, వాళ్ళని చంపడం కోసమే యుద్ధం జరిగేలా చేశానని చెప్పాడు.
అప్పుడు ఉదంక మహర్షి విశ్వరూపం చూపించమని అడిగి విశ్వం అంతా వ్యాపించి ఉన్న ఆయన రూపాన్ని చూసి నా జన్మ ధన్యమైందని ఆనందించాడు.
శ్రీకృష్ణుడు ఉదంకుడుకి బ్రతికినంత కాలం నువ్వు తల్చుకోగానే వర్షాలు పడతాయని వరమిచ్చాడు
ఆ మేఘాన్ని 'ఉదంకమేఘం' అంటారు
ఉదంకుడు బ్రతికినంతకాలం లోకాన్ని ఉద్ధరించడానికే బ్రతికి చివరకి మోక్షం పొందాడు.
ఉదంక మహర్షి మనం గురుభక్తితో, స్వార్ధం లేకుండ అందరి కోసం మంచి పనులు
చెయ్యడం ఎలాగో తెలియచెప్పాడన్నమాట.
🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి