🧘♀️🧘♂️🧘♀️🧘♂️🧘♀️🧘♂️🧘♀️🧘♂️
మోక్షం
మోక్షం సాధించి పొందేది కాదు . ఉన్నదాన్ని తెలుసుకోవడమే . నీవు శరీరం కాదు . నీవు మనస్సు కాదు .
నీవు ఆత్మవు అని అనుభవపూర్వకంగా తెలుసుకోవడమే మోక్షం . ఆత్మను తెలుసుకోవడానికి ఊరక
ఉండటం తప్ప ఏమీ చేయనక్కర లేదు . నామ రూప గుణాలు అనే వేషం వేసుకొని జీవునిగా ఉన్నది బ్రహ్మమే
అని గుర్తించు . నేనే బ్రహ్మమును . బ్రహ్మమే నేను అని జీవించు . యిదే మోక్షము .
ఎంతకాలము నీ మనస్సు పనిచేస్తుందో అంతకాలం నీవు భగవంతుని చేరలేవు . మనస్సును ఖాళీ చేసి
అన్నింటినీ సాక్షిగా చూడు . దేహ తాదాప్యం చెందినవాడికే బంధం . మనస్సులో ఉన్న భావాలకే బంధం .
మనస్సులో ఏ భావాలు లేకపోతె , బంధం లేదు . బంధం లో ఉన్నాను అనుకునేవాడు మోక్షం కోసం ప్రయత్నం
చేస్తాడు . బంధం లేకపోతె మోక్షం లేదు . బంధముక్తులకు అతీతంగా ఉండేదే నీ నిజ స్థితి . ఇదె జీవన్ముక్త స్థితి .
పూర్వ జన్మలో అజ్ఞానం తో చేసిన కర్మలకు ఫలితాలను ప్రస్తుత జన్మలో అనుభవిస్తూ ఉన్నాము . ఈ జన్మలో
ఆత్మజ్ఞానం తెలుసుకొన్నావు . తెలుసుకొన్న ఆత్మజ్ఞానాన్ని త్రికరణ శుద్ధి గా ఆచరించు . యిదే నీకు ఆఖరి జన్మ
అవుతుంది .
బంధ మోక్షాలు రెండు అబద్ధాలే . మనస్సు చేత కల్పించబడ్డాయి . నీకు పుట్టుక లేదు చావు లేదు . నీకు
పరమాత్మకు భేదమే లేదు . అజ్ఞానం ముడి విడిపోవడమే మోక్షం . జ్ఞానం తో కూడిన నిర్మల చిత్తమే మోక్షం .
మనో నాశనమే నిజమైన స్వేచ్ఛ . బ్రతికి ఉండగా , మనస్సు లోని స్థితిలో ఎవరు ఉంటారో వారికే మోక్షం .
" మోక్షం కావలి " అన్న సంకల్పం కూడా బంధమే . మనస్సును 100% ఖాళీ చేసి , బ్రహ్మనిష్ఠ యందు ఉండుటే
మోక్షం.
🧘♂️🧘♀️🧘♂️🧘♀️🧘♂️🧘♀️🧘♂️🧘♀️🧘♂️🧘♀️
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి