29, అక్టోబర్ 2022, శనివారం

రురు మహర్షి*

 *మన మహర్షుల చరిత్రలు..*


*🌹ఈరోజు 63వ రురు మహర్షి గురించి తెలుసుకుందాము...🌹*


☘️🍁☘️🍁☘️🍁☘️🍁☘️🍁


*రురు మహర్షి* 


☘️భృగు మహర్షికి పులోమయందు చ్యవన మహర్షిని కలిగారు .


🍁భృగు సంతతికి చెందిన గొప్ప ఋషి., చవన్య మహర్షి సుకన్య దంపతుల పుత్రుడు ప్రమతి.


☘️ప్రమతి మహాతపస్సంపన్నుడై  విరాజిల్లుచుండెను. ఘృతాచి అను అప్సరస అతనిని వలచి జనించిన వారి సుపుత్రుడు రురు..


🍁అతడే రురు మహర్షి. మహా ధర్మాత్ముడు తపశ్శాలి, విద్యావంతుడు, మన్మదోపముడు అయి అలరారుచుండెను.


☘️విశ్వావసుడను గంధర్వరాజు, అప్సరస యగు మేనక, స్థూలకేశుడను మహర్షి ఆశ్రమ ప్రాంతమున విహరిస్తున్న సందర్భంలో వారికి కలిగిన పుత్రికను ఆ ఆశ్రమ ప్రాంతమున విడిచిపెట్టి వెడలిపోయెను. 


🍁స్థూలకేశ మహర్షి ఆ బిడ్డను చేరదీసి, ప్రమద్వర అని నామకరణం

చేసి, విద్యాబుద్ధులు నేర్పి తీర్చిదిద్దెను.


☘️రురువు ఒకసారి స్థూలకేశ మహామునిని చూడడానికి వెళ్ళాడు . అక్కడ అందాలరాశి అయిన ప్రమద్వరని చూశాడు . 


🍁అంతే! రురు మహర్షి బ్రహ్మచర్యం ఏమయిందో ? (ప్రమద్వరని ఇష్టపడ్డాడు.) ఇంటికి వెళ్ళి తండ్రికి చెప్పాడు . 


☘️తండ్రి ప్రమతి పెద్దవాళ్ళని వెంట తీసుకుని స్థూలకేశ మహర్షి దగ్గరికి వెళ్ళి తన కొడుకు రురుడికి ప్రమద్వరనిచ్చి పెళ్ళి చెయ్యమని అడిగాడు . 


🍁అందరూ సమ్మతించి రురుడికి ప్రమద్వరకి పెళ్ళి  నిశ్చయించినారు . రురు ప్రమద్వారల పెళ్ళికి రెండు రోజులే వ్యవధి వుందనగా..


☘️ప్రమద్వర పువ్వులు కోస్తూ క్రింద పడుకుని వున్న త్రాచుపాముని చూడకుండ తొక్కింది . 


🍁అది ప్రమద్వరని కాటేయడం ప్రమద్వర ప్రాణం పోవడం జరిగిపోయింది . రురుడు బాధతో ఒక ఏకాంత ప్రదేశంలో కూర్చుని బాధపడ్తుంటే ఒక దేవదూత వచ్చి మనిషి ప్రాణం పోతే మళ్ళీ రాదు, 


☘️అయినా నీకు ఒక ఉపాయం చెప్తాను . నీ ఆయుష్షును సగం ఆమెకిస్తానంటే ఆమెని బ్రతికించవచ్చన్నాడు .


🍁రురుడు సరేనని తన ఆయుష్షులో సగం ప్రమదకిచ్చాడు . వెంటనే ప్రమద్వర లేచింది . అక్కడున్న మునులు , ప్రమతి , స్థూలకేశుడు అందరూ ఎంతో ఆనందించారు .


☘️రురుప్రమద్వరల పెళ్ళి జరిగిపోయింది . ఇద్దరూ అన్యోన్యంగా గృహస్థాశ్రమం నిర్వర్తిస్తున్నారు . రురుడు పాములమీద పగబట్టి కనిపించిన ప్రతి పాముని చంపడం మొదలుపెట్టాడు .


🍁ఒకనాడు రురుడు వనంలో తిరుగుతుండగా డుండుభుడనే పాము కనిపించింది . రురుడు వెంటనే దాన్ని చంపబోయాడు . 


☘️ఆ పాము.. మహర్షీ ! నేను నీకు అపకారం చెయ్యలేదు . నేను క్రూరసర్పాన్ని కూడా కాదు . నువ్వు భార్గవ వంశంలో పుట్టావు. 


🍁ఇలాంటి పని చెయ్యకూడదని చెప్పాడు డుండుభుడు. రురుడు ఆపాముని చూసి నువ్వు ఎవరు ? నీకు పాము రూపం , మనిషి భాష ఎలా వచ్చాయని అడిగాడు . 


☘️రురుడితో నేను పూర్వజన్మలో సహస్రపాదుడనే మహర్షిని . శాపం వల్ల ఇలా పాముగా మారాను . నీ దయవల్ల నిన్ను చూడగానే నాకు శాపవిమోచనం అయిందని చెప్పి మనిషిగా మారి రురుడిని ఆశీర్వదించి, వెళ్ళిపోయాడు డుండుభుడు .


🍁రురు మహర్షి ప్రమద్వరని పెళ్ళిచేసుకున్నాక కూడా తపోదీక్ష , వేదాధ్యయనం ఏదీ వదలకుండా గొప్ప తేజస్సుతో వెలుగుతున్నాడు .


☘️కొన్నాళ్ళకి రురుప్రమద్వరలకి ఒక కొడుకు కలిగాడు . అతడి పేరు శునకుడు . 


🍁ఇదండీ రురు మహర్షి గురించి తెలుసుకున్న విశేషాలు రేపు మరో మహర్షి గురించి తెలుసుకుందాము స్వస్తి!


*సేకరణ:*  శ్రీ కె.వి. రమణమూర్తి గారి వాట్సాప్ పోస్ట్. 


☘️🍁☘️🍁☘️🍁☘️🍁☘️🍁

కామెంట్‌లు లేవు: