_*శ్రీరమణీయం* *-(229)*_
🕉🌞🌎🌙🌟🚩
_*"మంచి, చెడులను ప్రమాణాలుగా తీసుకుని సత్యశోధన చేయవచ్చా ?"*_
_*మనం మంచివాడు, చెడ్డవాడు అని చెప్పేది దేహాన్ని, వారి మనసును బట్టేకాని ప్రాణాన్ని కాదు. దొంగకైనా, యోగికైనా ప్రాణం, దేహం అలాగే ఉంటాయి. మార్పు అంతా మనసులోనే ఉంది. కిరాతకుడైన బోయవాడు, వాల్మీకి మహర్షిగా మారినప్పుడు దేహం, ప్రాణం మారలేదు ! మారింది మనసు మాత్రమే. మంచిఫ్యాన్, చెడ్డఫ్యాన్ అనేది దానిలోవున్న కరెంట్ కాదు. అది పనిచేసే తీరు మాత్రమే. బాహ్యదృష్టితో దేహాన్ని చూడగలుగుతున్నాం కానీ ప్రాణాన్ని చూడలేకపోతున్నాం. అందుకే మనకి అంతర్దృష్టి అలవడాలి. అందరిలో నేనున్నానని చెప్పిన శ్రీకృష్ణ భగవానుడి తత్వం అప్పుడు అర్ధం అవుతుంది. శ్రీకృష్ణుడు తాను రూపం అనే ఉద్దేశ్యంతో ఆ మాట అనివుంటే స్కానింగ్ తీస్తే మనందరిలో ఆయన కనిపించాలి. డాక్టరు శాస్త్ర చికిత్స చేసినప్పుడూ ఆయన కనిపించాలి. కానీ అలాలేదు. ఎందుకంటే శ్రీకృష్ణుడు ఆమాట చెప్పింది ప్రాణస్వరూపంగానే. అందరిలో ఉన్న ప్రాణమే శ్రీకృష్ణుడు. మనలోవున్న ఆప్రాణాన్ని చూడలేం కాబట్టి ఒక రూపంలో ఆయన్ను పూజిస్తున్నాం. కృష్ణుని పెనవేసుకున్న 'రాధ' మనలోని ప్రాణ 'ధారే '. మనందరం ప్రాణధారులం (ప్రాణాన్ని ధరించాం). అందరం ఆయన రాధలమే అన్న భావన బలపడాలి. మనలోగల మనసుని 'గ్రహింపు శక్తిగా' గుర్తించిన రోజు మనలోని కృష్ణుడు ఏమిటో స్పష్టమవుతుంది !*_
_*{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}*_
_*'అంతర్దర్శనమే దివ్య చక్షువు !'*-
🕉🌞🌎🌙🌟🚩
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి