: *🌹🙏సర్వాంతర్యామి....!!*
🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸
🌿భగవంతుని దర్శించే తీరాలి అని పట్టుదల పట్టిన తన శిష్యుడిని
,ఒక సాధువు
దట్టమైన యీ అడవిలోనే ఈశ్వరుడు వున్నాడు చూసిరమ్మని పంపాడు.
🌸అడవిలో కి వెళ్ళిన యువకుడు మరునాడు ప్రొద్దున్నే వేరొక మార్గం
గుండా అడవి బయటకు
వచ్చాడు.
🌿అలసిసొలసి నిరాశతో కనిపించినతన శిష్యుడిని ఆ సాధువు అడవిలో భగవంతుని
దర్శించావా? అని అడిగాడు.
🌸" లేదు, మీరు చెప్పినట్లు
భగవంతుడు అక్కడ ఎక్కడా లేడు.
మీరు నన్ను మీ మాటలతో మోసగించారు "
అని అన్నాడు ఆ శిష్యుడు.
🌿" అలాగా, సరే అయితే నీవు అడవిలో ప్రవేశించి నప్పటి నుండి ఏం జరిగిందో వివరంగా చెప్పమని అడిగాడు సాధువు.
🌸శిష్యండు చెప్పడం మొదలెట్టాడు. " కొంచెం దూరం వెళ్ళగానె మామిడి,పనస,
అరటి చెట్ల తోటలు కనిపించాయి. ఆరముగ్గిన ఆ చెట్లపళ్ళు చూడగానే
వాటిని తినాలనే కోరిక ఏర్పడింది.
🌿 తినగలగినన్ని తిని, మళ్ళీ కొంచెం దూరం ముందుకు
వెళ్ళాను. అక్కడ ఒక పులి నన్ను
వెంట తరిమింది. పులిని తప్పించుకొని
పరిగెత్తేటప్పుడు , ఎదురుగా
ఒక వేటగాడు వచ్చి పులిని తరిమికొట్టాడు.
🌸అలసటతో మెల్లిగా ఒక దేవాలయం చేరుకున్నాను. ఆలయంలో వున్న ఆహారం భుజించి, అక్కడే నిద్రపోయి
ఈ రోజు ప్రొద్దున లేచి అడవి బయటకు వచ్చాను.
🌿ఇదే జరిగినది. మీరు చెప్పినట్లు అక్కడ నాకు ఏ భగవంతుడు కనిపించలేదు." అని ఆ శిష్యుడు నిందాత్మకంగా అన్నాడు.
🌸అది విన్న సాధువు " ఓరి మూర్ఖుడా! నీ వలె ఇన్ని సార్లు భగవంతుని దర్శించిన అనుగ్రహం మరెవరికీ కలిగి వుండదు? కనిపించిన దైవాన్నే పోల్చుకోలేక నన్ను తప్పుపడుతున్నావు" అని అనగా
🌿ఆ శిష్యుడు ఆశ్చర్యంగా ఎలాగ ? అని ప్రశ్నించాడు. సాధువు తిరిగి చెప్పనారంభించాడు.
" పరమేశ్వరుడు సృష్టి , స్ధిత, లయ కారకుడు.
🌸 నీవు అడవిలోకి వెళ్ళగానే సుందరమైన ఫల వనాలలో పలురకాల పళ్ళను తిని రుచి చూశావు కదా ,
ఆ పండ్లను ఎవరు సృష్టించారనుకుంటున్నావు? అది ఈశ్వరనుగ్రహమే.
🌿ఒక క్రూరమైన పెద్దపులి నిన్ను వెంటాడినప్పుడు, వేటగాని రూపంలో వచ్చి కాపాడినది ఆ భగవంతుడు కాదా ! తను సృష్టించిన అమాయక జీవులను రక్షించడం భగవంతుని బాధ్యత.
🌸పులి బారి నుండి తప్పించుకొని వస్తే చాలు అని అనుకొన్నావు కదా ?
అప్పుడే నీ లోని అహంకారాన్ని
భగవంతుడు అణిచి వేశాడు. అది లయ కారకం. అలసి పోయిన నీకు
ఆ భగవంతుడు అనుగ్రహించిన ప్రసాదాన్నే కదా తిని నిశ్చింతగా నిద్రపోయేవు .
🌿అప్పుడే కదా భగవంతుడు
అదృశ్యమైనాడు. అదే భగవంతుని లీలా విలాసం. ఇవన్ని కూడా నా ద్వారా భగవంతుడు నీకు బోధ
పరిచాడు కదా, అదే భగవదనుగ్రహం.
🌸అటువంటి భగవంతుని గుర్తించగలగడమే జ్ఞానం. ఆ జ్ఞానం కోసమే మునులు , సాధువులు , సన్యాసులు నిరంతరం పరితపించేది.
ఆది అంతములు లేని ఆ సర్వాంతర్యామి జ్యోతి స్వరూపుడై
సర్వుల ఆత్మలో వున్నాడు.
🌿 ఎల్లప్పుడూ, చైతన్య స్వరూపుడై సృష్టి, స్ధితి, లయ కార్యములను నిర్వహించి ప్రాణులను అనుగ్రహిస్తున్నాడు.
🌸అట్టి పరమాత్మను నిశ్చలమైన ధ్యానం ద్వారానే దర్శించే
మహద్భాగ్యం లభిస్తుంది...స్వస్తీ..🚩🌞🙏🌹🎻
🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸https://chat.whatsapp.com/I2tcfQFZEtnBaGSLuO8h88
[5/30, 22:44] mbourutu: 👆click lost line 👍👆👆
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి