18, ఏప్రిల్ 2023, మంగళవారం

సుభాషితమ్

         _*సుభాషితమ్*_


*యజ్ఞశిష్టాశివః సంతో ముచ్యంతే పర్వపర్వకిల్బిషైః౹*

*భుంజతే తే త్వఘం పాపా యే పచంత్యాత్మకారణాత్॥*

                                    ~శ్రీమద్భగవద్గీత



తా॥ 

యజ్ఞశిష్టాన్నమును తిను శ్రేష్ఠపురుషులు అన్ని పాపముల నుండి ముక్తులగుదురు. తమ శరీరపోషణకొఱకే ఆహారమును సిద్ధపఱచు (వండు)కొను పాపుల పాపముచే భుజించుచున్నారు.

: *శ్రీ సూక్తము-13* 


*ఆర్ద్రాం పుష్కరిణీం పుష్టిం పింగళాం పద్మమాలినీమ్౹*

*చన్ద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావః॥*


తా॥ 

ఓ అగ్నీ! తడిసిన దేహము కలిగినట్టియు, అభిషేకమునకు సన్నద్ధురాలైనట్టియు, పసుపువన్నె కలిగినట్టియు, పద్మమాలికలు ధరించినట్టియు, చంద్రుని వలె ప్రకాశించునట్టియు, బంగారములవంటి స్వరూపము గల్గినట్టియు నగు లక్ష్మి దేవిని నాకొఱకు పిలువుము.

: .          *శ్రీ శంకర ఉవాచ*

         *గురువు ~ శిష్యుడు*

     (నిన్నటి దానికి కొనసాగింపు)


3. గురువరా! ప్రణత జనబంధూ, కరుణాసాగరా, నీకు నమస్కరించుచున్నాను. జనన మరణ మహోదధియందు పడియున్న నన్ను రక్షింపుము. పరమానుగ్రహసుధును ప్రసాదింపుము.

కామెంట్‌లు లేవు: