తెలుసుకోండీ... 16102020
తెలియజేయండీ....
అమ్మవారికి ఏ తిథి రోజున ఏ అబిషేకం , ఏ నైవేద్యం పెట్టాలి....!!
పాడ్యమి రోజు - ఆవు నేయి తో అభిషేకం చేస్తే సకల రోగలు నివారణ అవుతాయి.
విదియ రోజు - చక్కర తో అభిషేకమ చేస్తే దీర్గాయువు కలుగుతుంది.
తదియ రోజు - ఆవు పాలు తో అభిషేకం చేస్తే ఎలాంటి అకాల మృత్యు దోషాలు తొలిగిపోతాయి ,
చవితి రోజున - పిండివంటలు నైవేద్యం పెట్టడం వలన సకల విద్యలు లబిస్తాయి.
పంచమి రోజు - అరటి పళ్ళు నైవేద్యం పెట్టడం వలన మేధస్సు , బుద్ది శక్తి పెరుగుతుంది.
షష్టి రోజున - తేనే తో అమ్మవారిని అభిషేకించి , బ్రహ్మనునికి దానం ఇవటం వలన కాంతి పెరుగుతుంది, యషస్సు పెరుగుతుంది.
అష్టమి రోజున - బెల్లం నీటి తో అభిషేకించి, మంచి బెల్లం ఎవరికయినా దానం ఇవటం వలన అష్ట కష్టాలు అంటారు కదా అలాంటివి అనీ తీరిపొతయి అంటారు.
నవమి రోజున - పేలాలు నైవేద్యం పెట్టడం వలన సకల సౌభాగ్యలు కలుగుతాయి.
దశమి రోజున - నల్ల నువ్వులు తో చేసిన పదార్ధాలు నైవేద్యం పెట్టడం వలన సకల రోగలు పోతాయి అని , దీర్గాయుషు పెరుగుతుంది.
వారాలలో ఏ నైవేద్యం....
ఆదివారం రోజు - పాలు
సోమవారం - పాయసం
మంగళవారం - అరటిపళ్ళు
బుధవారం - వెన్న
గురువారం - పటికబెల్లం
శుక్రవారం - తీపి పదార్ధాలు
శనివారం - ఆవు నేయి
అమ్మవారికి ఇష్టమయిన అన్నం
పులగం - అన్నం + పెసరపప్పు
పాయసన్నం
పెరుగు అన్నం
బెల్లం అన్నం
నైవేద్యం పెట్టకుండా మనం తింటే అది దొంగతనం చేసి తినట్టు , అందుకని దేవునికి నివేదన చేయకుండా తినకూడదు.
అమ్మవారిని పూజ ఎలా చేయాలి....!!
ఆచమనం ముందు చేయాలి , కాల స్మరణ చేయాలి (సంకల్పం ) , అబిషేకం చేయాలి , మామిడి రసం(చూత పళ్ళు ) తో అబిషేకం చేయటం వలన సరస్వతి ఆఇంటి ని విడిచి వెళ్ళదు, అ ఇంట్లో వుండే వారికీ సరస్వతి కటాక్షం ఉంటుంది. ఆవు నేయి తో అబిషేకం చేయటం వలన సకల రోగాలు పోతాయి , పెరుగు తో అబిషేకం వలన సంపదలు కలుగుతాయి అమ్మవారికి చాల ప్రీతిగా ఉంటారు , సకల రోగాలు పోతాయి, తేనే తో అబిషేకం చేయటం వలన యశస్సు పెరుగుతుంది, మేదస్సు పెరుగుతుంది , ఆవు పాల తో అబిషేకం చేయటం వలన సకల దోషాలు పోయి , సకల శుభాలు కలుగుతాయి , గంధం తో అబిషేకం చేయటం వలన మనలో తామస గుణం పోతుంది , పసుపు తో అబిషేకం చేయటం వలన సౌభగ్యమ్ పెరుగుతుంది.
అమ్మవారిని 108 పువ్వులు తో పూజ చేయడం విశేషం . కమలాలు, జాజిపువులు , లేత బిల్వాలు - సకల సంపదలు కలుగుతాయి , దాడిమి పువ్వులు ( దానిమ్మ చెట్టుకు పూసే పువ్వులు అంటే కాయకి ముందు వచ్చే పువ్వులు కాకుండా దానిమ్మ పువ్వు చెట్లు చిన్న చిన్న గులాబిలా ఉంటాయి వేరు ఉంటాయి ) వాటితో , మల్లెలు కూడా అమ్మవారికి ఇష్టం.
....మిగతా రేపు.....
సర్వం శ్రీపరమేశ్వరార్పణమస్తు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి