శారదా నవరాత్రులు: ఇంద్రకీలాద్రి.
మొదటి రోజు అలకారం 1.
స్వర్ణ కవచాలంకృత శ్రీ కనకదుర్గాదేవి.
శరన్నావరాత్రులలో పాడ్యమినాడు అమ్మవారిని స్వర్ణ కవచాలంకృత శ్రీ కనకదుర్గాదేవిగా అలంకరిస్తారు. దుష్ట రాక్షసుడైన మహిషాసురుడ్ని వధించిన దుర్గాదేవి కీలుడికిచ్చిన వరం కారణంగా భూలోకంలో కృష్ణానదీ తీరంలో వున్న కీల పర్వతం మీద వెలిసింది. అలా వెలసిన ఆ తల్లి ధగధగాయమానంగా కోటి సూర్య ప్రభలతో ప్రకాశిస్తూ, బంగారు వర్ణంలో మెరిసిపోతుందట. అలాంటి దివ్య మంగళమైన ఆ దేవి దివ్య స్వరూపాన్ని దర్శించిన దేవతలంతా దుర్గామాతను ‘కనకదుర్గా’ అని పిలిచారట. ఆనాటినుంచి దుర్గాదేవి కనకదుర్గగా ప్రఖ్యాతి చెందింది. కీలపర్వతం కాస్తా ఇంద్రకీల పర్వతంగా పేరుపొందింది. ఆ విధంగా కనకదుర్గ ప్రభలతో వెలసిన కనకదుర్గాదేవిని స్మరించుకోవడానికి దసరా మొదటి రోజున దుర్గాదేవికి కనకదుర్గ అలంకారాన్ని చేస్తారు. ఆ అలంకారంలో దుర్గాదేవి అష్ట భుజాలతో ‘తారాకాంతి తిరస్కారి నాసా భరణ భాసురా’ అన్నట్టు, తేజోమయ ముక్కుపుడకని ధరించి నిండైన పసిడి వర్ణ ముఖంతో చిరునవ్వులు చిందిస్తూ కనకదుర్గగా దర్శనిమిస్తుంది.
అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాల పె
ద్దమ్మ సురారులమ్మ కడుపాఱడి పుచ్చినయమ్మ తన్ను లో
నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడియమ్మ దుర్గ మా
యమ్మ కృపాబ్ధ్హియిచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్.
నైవేద్యం : చలివిడి,వడపప్పు,పాయసం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి