27, జూన్ 2022, సోమవారం

ఉత్సవానికి వస్తావా?

 ఉత్సవానికి వస్తావా?


అవి నేను కాలేజిలో చదువుకుంటున్న రోజులు. అప్పుడు పరమాచార్య స్వామివారు అంటే తెలుసు కాని, వారిపై ప్రత్యేకమైన భక్తీ ఏమి లేదు. హఠాత్తుగా ఒకసారి స్వప్న దర్శనం ఇచ్చారు మహాస్వామి. కాని అది ఎదో ఊహ అని కొట్టిపారేయలేను. వారు తరచుగా స్వప్న దర్శనం ఇస్తూనే ఉన్నారు.


మరి ఆ స్వప్న దర్శనాలను గౌరవించాలి కదా? అందుకే ప్రతి గురువారం ఉపవాసం చెయ్యడం ప్రారంభించాను. అప్పటినుండి ప్రతి గురువారమూ నాకు దర్శనభాగ్యం ప్రసాదించేవారు. అది చాలా సంతోషకరమైన విషయం. కాని ఎంతోకాలం నిలువలేదు.


మహాస్వామివారు కలలో రావడం ఆగిపోయింది. నా వల్ల ఏమి తప్పు జరిగిందో అర్థం కాలేదు. ఆ రోజు గురువారం. నా మంచంపై కూర్చుని నిద్రకుపక్రమిస్తూ కళ్ళుమూసుకుని, “కనీసం ఈరోజైనా మీ దర్శనభాగ్యం నాకు కలగాలి” అని వేడుకున్నాను.


ఊహు! పెరియవ రాలేదు.


రెండురోజుల తరువాత పరమాచార్య స్వామివారు నా కలలో కన్పించారు. “ఇంతకుముందు పరమాచార్య స్వామివారు తరచుగా నాకు స్వప్న దర్శనం ఇచ్చేవారు. ఈమధ్య అస్సలు రావడం లేదు” అని బాధతో స్వామివారిని అడిగాను.


మహాస్వమైవారు చిన్నగా నవ్వి, “నాకు వయసైపోయింది కదా! నేను ఇప్పుడు ముసలివాణ్ణి. నేను దిన్ని మోసుకుని అంట దూరం రాలేను కనుక నువ్వే నా దర్శనానికి రా” అని దండం వైపు చూపిస్తూ చెప్పారు.


“పరమాచార్య స్వామి అనుగ్రహం నేను తప్పక రాగాలను”


“మరి ఉత్సవానికి వస్తావా?”


“మీ అనుగ్రహం ఉంటే తప్పక వస్తాను పెరియవ”


కల చదిరిపోయింది. నాకు ఏమి అర్థం కాలేదు. నేను ఏ ఉత్సవానికి వెళ్ళాలి? దానికి పరమాచార్య స్వామి దర్శనానికి సంబంధం ఏమిటి?


కాని ఆ ఆశ్చర్యకర సంఘటన మరుసటి రోజునే జరిగింది. మా పెద్దమ్మ చెన్నైలో ఒక వివాహానికి వెళ్ళాల్సి ఉంది. తనతో రమ్మని నాకు చెప్పింది. “నీవు కూడా వస్తే, అలాగే కాంచీపురం వెళ్లి పరమాచార్యుల దర్శనం చేసుకుందాము” అని చెప్పింది.


నేను వెంటనే అంగీకరించాను.


మరుసటిరోజు కంచి మఠం ప్రధాన ద్వారం దగ్గరకు చేరుకోగానే, ఊరెరిగింపుగా వచ్చిన కామాక్షి అమ్మవారు అక్కడ నిలబడి ఉంది. అక్కడ చాలామంది భక్తులు ఉన్నారు. అమ్మవారి చుట్టూ ముగ్గురు పెరియవలూ(మహా పెరియవ, పుదు పెరియవ, బాల పెరియవ) ప్రదక్షిణం చేస్తున్నారు.


“ఏమిటి ఈరోజు విశేషం” అని అక్కడున్న ఒకావిడని అడిగాను.


“నీకు తెలియదా? కామాక్షి అమ్మవారి ఆలయ ఉత్సవం జరుగుతోంది” అని చెప్పిందావిడ.


నాకు కలిగిన ఆశ్చర్యం ఆనందం గురించి చెప్పాల్సిన పనిలేదు. “ఉత్సవానికి వస్తావా?” అన్నది కేవలం కల కాదు. అది దైవ సంకల్పం.


--- జానా కణ్ణన్, మైలాపూర్. మహా పెరియవళ్ – దరిశన అనుభవంగళ్ 5


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

కామెంట్‌లు లేవు: