7, అక్టోబర్ 2022, శుక్రవారం

తస్మాత్ జాగ్రతః!


తస్మాత్ జాగ్రతః!


కో ధావతి తం చ ధావతి ఫణీ సర్పం శిఖీ ధావతి వ్యాఘ్రా ధావతి కేకినం విధివశాద్వ్యాధో ఒపి తం ధావతి స్వస్వాహార విహార సాధన విధౌ సర్వే జనా వ్యాకులాః కాల స్తిష్ఠతి పృష్ఠతః కచధరః కేనాపి నో దృశ్యతే.


పురుగును తినుటకు వెనుక నుండి కప్ప పరు గెత్తుకొని వచ్చుచున్నది. ఆ కప్పను తినుటకు దాని వెనుక నుండి పాము పరుగెత్తుకొనివచ్చు చున్నది. ఆ పామును తినుటకు నెమలి పరుగెత్తుకొనివచ్చుచున్నది. ఆ నెమలిని తినుటకు పెద్ద పులి దాని వెనుక చంపుటకు పరు గెత్తుకొనివచ్చుచున్నది. ఆ పెద్దపులిని బోయవాడు పరు గెత్తుకొనివచ్చుచున్నాడు. ఈ ప్రకారముగ జీవరాసులన్నియు వాని వాని ఎదుటనున్న ఆహార విహార సాధనవస్తువులను సంపాదించు ప్రయత్నమందు నిమగ్నములై యున్నవే కాని, వెనుక తట్టు జుట్టుపట్టుకొని ఈడ్చుకొనిపోవుటకు సిద్ధముగ నున్న యమధర్మ రాజును మాత్రము అవి చూచుట లేదు. ఆహా! ఎట్టి విచిత్రము !


(కావున జనులు తమవెనుక కాచుకొనియున్న మృత్యువును గమ నించి, అమృత్యువును జయించి అమరత్వ పదవి నొందుటకు వలసిన ఆత్మ జ్ఞానాది సాధనలను శీఘ్రముగ ఈ జన్మయందే సంపాదించుకొనవలెను )

కామెంట్‌లు లేవు: