*1915*
*కం*
ఒక రకమగు వారలెపుడు
నొకకడ సమకూరుచుండు నుర్విజ గణమున్.
సకలజనుల సమకూర్పున(ఒకకడగొన)
నకటవికటమెంచు చుండ నమరరు సుజనా.
*భావం*:-- ఓ సుజనా!భూజనులలో ఒకరకమైన వారంతా ఒకచోట చేరుదురు. అందరూ ఒకే చోట చేసేటప్పుడు వారి మధ్య విభేదాలు (అకటవికటములు) ఎంచుకుంటే ఇమడలేరు.
*సందేశం*:-- అందరూ కలిసి ఉండాలనుకునేటప్పుడు విభేదాలకు తావివ్వరాదు. మనస్సు లో భేదభావాలు తొలగకపోతే జన సమాకలనం అసాధ్యం.
*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి