3, ఫిబ్రవరి 2023, శుక్రవారం

భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి లీలామృతం

 🙏 నమస్కారం అండి 🙏


🌹 శుభోదయం 🌹


🔥ఓం నారాయణ.         ఆదినారాయణ🔥


భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి లీలామృతం


320. శ్రీ స్వామివారి ఆశీర్వాదం పొందిన మెగాస్టార్ చిరంజీవి.


            మన భారత దేశంలో గోవులను ప్రేమించడం పూజించడం ఒక ఆచారంగా వుండేది. పూర్వం రోజులలో ప్రతి ఇంట్లో గోవులు వుండేవి. అందరూ ఆవు పాలు, పెరుగు, ఆవు నెయ్యి నే, ఉపయోగించేవారు. వ్యవసాయ ఆధారిత ప్రాంతాలలో తెల్ల జాతి పశువులును కుటుంబం సభ్యుల వలే ప్రేమించేవారు. సరైన పశువైద్య సౌకర్యం లేక అనేక పశువులు వ్యాధుల బారిన పడుతుంటే ఆ రైతులందరు శ్రీ స్వామివారి దగ్గరకు వచ్చేవారు. పశువులు కనపడకపోతే, శ్రీ స్వామి దగ్గరకు వస్తే వాటి క్షేమ సమాచారం ఆ చూకీ చెప్పేవారు, అది తెలుసుకొని వెళ్ళి వాటిని తెచ్చుకునేవారు.అవి ఎక్కడ వుంది, ఎలా వుంది కూడా కళ్ళ తో చూసి నట్లుగా చెప్పేవారు. వారు చెప్పిన విధంగా జరిగేది.


                   పశువులకు వ్యాధులు వచ్చినప్పుడు మంత్రించి దారాలు ఇచ్చి ఆ పశువుల మెడలో కట్టమనే వారు. వేలు ముద్రలు వేసిన చీటీలు ఇచ్చి పశువుల కొట్టంలో కట్టి సాంబ్రాణి ధూపం వేయ మనేవారు. కొన్ని సందర్భాలలో వారే స్వయంగా వెళ్ళి పశువులను త్రాకే వారు. ఇసుక మంత్రించి చల్లేవారు. పశువులు బాధతో ప్రార్థిస్తే ఎక్కడున్నా వెళ్ళి కౄర మృగాల నుండి, తీవ్రమైన వ్యాధుల నుండి కాపాడిన శ్రీ స్వామివారి జీవ కారుణ్యం ఏ మాటలతో వర్ణించగలం..? మాటలలో వర్ణించలేము. ఆ నోరులేని మూగ జీవులను కాపాడే దైవంగా ఆనాటి ప్రజలు శ్రీ స్వామివారిని కీర్తించేవారు. శ్రీ స్వామివారిని తలచుకొని వస్తుంటేనే వాటికున్న జబ్బులు తగ్గి పోయేవి. అటువంటి దయామయులైన శ్రీ స్వామివారికి ఆ మూగ జీవాల ఆక్రందన తెలుస్తుంది అందుకే ఎక్కడైన అవి కష్టంలో వుంటే వెతుక్కుంటూ వెళ్ళి  ప్రమాదం నుండి రక్షించేవారు.


              ఒకరోజు నెల్లూరు పతేఖాన్ పేటలో ఒక ఇంట్లో ఆవు మూడు రోజులు నుండి ప్రసవవేదన అనుభవిస్తూ వుంది. ఆ యజమాని కొణిదెల వెంకట్రావు చాలా బాధ పడుతున్నాడు. ఆయన ఎక్సైజ్ డిపార్ట్మెంటులో కానిస్టేబుల్ గా పని చేస్తున్నాడు. ఒంగోలు నుండి నెల్లూరుకి బదిలీ అయి కొత్తగా వచ్చారు. అతనికి అక్కడ పరిచయాలు అంతగా లేవు. ప్రతిరోజు గోసేవ చేసుకుంటూ వుండే ఆ ఇంటి ఇల్లాలు అంజనీ దేవి అంతగా బాధ పడుతున్న గోవుని చూసి కలత చెందారు. ఏమి చేయ లేక తన ఇష్ట దైవమైన ఆంజనేయ స్వామిని ప్రార్ధించింది.


              ఆ రోజు ఆ యింటి వైపుగా ఒక పెద్దాయిన వచ్చాడు. ఆ మూగ జీవికి ఆత్మ బందువుగా వచ్చి పలకరించి పరిచయం చేసుకుని లోపలికి వచ్చి భరించలేని ప్రసవ వేదన పడుతున్న ఆ గోమాత ఆక్రందన విన్నాడు. తన హస్త స్పర్శతో నేనున్నాను నీ సుఖ ప్రసవానికి ఏర్పడిన ఆటంకం నివృత్తి చేస్తున్నానని ధైర్యాన్ని ఇచ్చి ప్రేమతో దాని శరీరం అంతా నిమిరారు. దానికి  వేదన నుండి విముక్తి లభించింది. కొద్ది నిమిషాలలోసుఖంగా ప్రసవించింది. అందరూ సంతోషించారు వెంకట్రావు శ్రీ స్వామివారిని బిక్ష స్వీకరించమని అడిగాడు. శ్రీ స్వామివారు సున్నితంగా  తిరస్కరించి బయలు దేరారు. రెండు అడుగులు వేసారు అప్పుడు ఒక సంఘటన జరిగింది.

భిక్షువులా వున్న ఆ సాధుపుంగువుడు వచ్చిన పని అయి పోయింది కాబట్టి తిరుగు ప్రయాణంలో, ఆ ఇంటి నుండి వెళ్ళి పోతూ అక్కడ మెట్ల మీద కూర్చున్న వారి పెద్దబ్బాయి వైపు చూసారు. అతన్ని చూసి ఒక్క నిమిషం ఆగి పరీక్షగా చూసాడు. ఆ అబ్బాయి లేచి గౌరవం గా నిలబడ్డాడు. శ్రీ స్వామివారు వాళ్ళ నాన్న వైపు చూసి అయ్యా నేడు మెట్ల మీద కూర్చున్న ఈ అబ్బాయి మెట్టు మెట్టు ఎక్కి ఉన్నత శిఖరాన్ని చేరుకుంటాడు కదయ్యా అన్నారు. ఆ సమయంలో ఆ మాటలు వెంకటరావు అంతగా పట్టించుకోలేదు. ధన్యవాదాలు తెలుపుకుని పయనమై వెళుతున్న ఆ మహనీయుని చూస్తూ గుమ్మంలో నిలబడ్డాడు. ఆ అబ్బాయి లోపలికి వాళ్ళ అమ్మ దగ్గరకు వెళ్ళాడు.


             అప్పుడు  బయటకు వచ్చి, ఆ పెద్దాయన  గురించి విచారిస్తే వారు భగవాన్ శ్రీ వెంకయ్య స్వామివారు అని తెలిసింది. తమ ఇంటికి వచ్చి, మా గోవుకు ప్రాణభిక్ష పెట్టారు. వారిని ఈ జన్మలో మరిచి పోలేను అని మనసులో కృతజ్ఞతా పూర్వకమైన నమస్సులు తెలుపుకున్నాడు.


               ఆ అబ్బాయి పేరు శివ శంకర వర ప్రసాదు అప్పుడు  నర్సాపురంలో B.com డిగ్రీ చదువుతున్నాడు.తండ్రి ఉద్యోగ రీత్యా నెల్లూరులో ఉండటం వలన అప్పుడప్పుడు వచ్చి వెళ్తువుంటాడుు. తల్లి అంజనాదేవి అంటే అతనికి చాలా ఇష్టం.గోవు పడే బాధను తగ్గించిన ఆమహానుబావుని చూసి ఏదైనా భిక్ష సమర్పించాలని శ్రీీ స్వామివారి కోసం భిక్ష సిద్ధంచేస్తుంటే ఇంట్లో వున్న అమ్మకి ఆయన వెళ్ళి పోయారు అనే వార్త చెప్పాడు.


            చిన్నప్పటి నుండి ఎవరైనా మాట్లాడుతూ వుంటే అది విని ఇమిటేట్ చేయడం, వాళ్ల లాగా నటించడం అతనికి అలవాటు బహుశా అదే నేడు అతను మహత్తరమైన నటుడిగా చేయడానికి మూలం అయివుండవచ్చు. అంతర్గతంగా, సహజ సిద్ధంగా ఆ లక్షణాలు ఉండటం చాలా విశేషం. ఆరోజు సరదాగా వాళ్ళ అమ్మతో శ్రీ స్వామివారు చెప్పిన మాటలను అమ్మా నీకొడుకు మెట్టు మెట్టు ఎక్కి శిఖరాన్ని చేరుకుంటాడని అని వాళ్ళ అమ్మకి స్వామిలా మాట్లాడి వినిపించాడు.


              అంతలో బయటకు వెళ్ళిన వాళ్ళ నాన్న  వచ్చాడు. ఆ వచ్చిన పెద్దాయిన ఎవరో పూర్తి వివరాలు కనుక్కున్నారు. ఎక్సైజు డిపార్ట్మెంటులో కానిస్టేబుల్ గా చేస్తున్న అతనికి శ్రీ స్వామివారి గురించి ఇన్వెస్టిగేషన్ పెద్ద కష్టం కాలేదు. వారు గుండం వేసుకుని గొలగమూడిలో వుంటారని, భక్తులు ఆయనను వెంకయ్య స్వామి అంటారని మంచి చెడులు చెప్పడమే కాకుండా పశువులకు జబ్బులు వచ్చినా గొర్రెలు, మేకలు, గేదెలు ఏవి తప్పి పోయినా స్వామి దగ్గరకు వెళ్తే వాటి సంగతి చెప్తారని వారు చెప్పింది జరుగుతుందని వచ్చి చెప్పారు.


           తల్లి కొడుకుల ముఖంలో ఆనందం తాండవించింది. ఒక సత్పురుషుడు దీవించిన దీవెన వృధాగా పోదు. ఆ పుణ్యపురుషుని ఆశీర్వాదం తప్పకుండా లభిస్తుంది అని కొడుకును తాను కూడా ఆశీర్వదించింది. తల్లి కొడుకులు శ్రీ స్వామివారికి వెంటనే కృతజ్ఞతలు చెప్పుకున్నారు. తరువాత వెంకట్రావు అంజనీ దేవి దంపతులు వెళ్ళి గొలగమూడిలో శ్రీ స్వామివారిని దర్శించుకుని కృష్టజ్ఞతలు తెలియ చేసారు. ఆ విధముగా భగవాన్ శ్రీ వెంకయ్య స్వామివారి అనుగ్రహాంతో ఆనాటి శివ శంకర వర ప్రసాద్ నేడు చిరంజీవిగా కోట్లాది మంది అభిమానుల హృదయ శిఖరాలు అధిరోహించి విశ్వ విఖ్యాత నటుడయ్యాడు.


            ఆనాడు శ్రీ స్వామివారి చూపులకు చిక్కిన చిరంజీవి మెట్టు మెట్టు ఎక్కి స్వయం కృషితో జీవితంలో ఉన్నత శిఖరాలను చేరు కోవడంలో శ్రీ స్వామివారి ఆశీస్సులు వుండటం అతని పూర్వ జన్మ సుకృతం.


🔥ఓం నారాయణ.         ఆదినారాయణ🔥


🌹🌹🌹🌹🌹🌹🌹🌹


*శ్రీసాయినాథ ప్రబోధామృతము పారాయణ.*


రచన:- శ్రీ ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు


                *క్రొత్తయుగానికి క్రొత్తమతం*


చెన్నబసప్ప, వీరభద్రప్ప అనే వెనుకటి భక్తులు ద్వేష అసూయల వలన పాము, కప్పలుగా ఎలా జన్మించారో వివరించారు. వెనుకటి తమ స్నేహితులు ద్వేషాలవలన ఈ జన్మలో రెండు మేకలుగా ఎలా జన్మించారో చెప్పారు. ఇలానే ఇంకెందరి గురించో చెప్పి హిందూ బౌద్ధ, జైన ధర్మాలకు కొమ్మయనదగిన పునర్జన్మ సిద్ధాంతాన్ని ధృవపరచారు. వేదమంత్రం మరచిన దక్షిణాది బ్రాహ్మణులకు వేదమంత్రం గుర్తుచేశారు. 


ఇతర వివరములకు శ్రీసాయినాథ ప్రబోధామృతము అను  గ్రంథ మును(పరమ పూజ్య ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ విరచిత) పరిశీలించ గలరు.

online లో చూచుటకు... https://www.saibharadwaja.org/books/readbook.aspx?book=Sri-Sainathaprabodhamruthamu&intropage=0 

*ఓం సాయి రాం......జై సాయి మాస్టర్*

కామెంట్‌లు లేవు: