20, జనవరి 2024, శనివారం

వేమన పద్యాలు -- 9

 వేమన పద్యములు🌹
.             అర్థము - తాత్పర్యము
.                      Part - 4
🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

💥వేమన పద్యాలు-- 7
      
అంగ మేడ బుట్టె లింగమెక్కడ బుట్టె
ఎంగి లేడ బుట్టి యేకమాయె
ఎంగి లెంగి లనుచు నెగ్గులు పడనేల
విశ్వదాభిరామ రామ వినుర వేమా !

🌹తాత్పర్యము --
ఎంగిలి ఎంగిలి అంటుంటారు.
ఎక్కడ ఎంగిలి ?
సృష్టిలో ప్రతీదీ ఎంగిలితో కూడినదే.
పంచభూతాలు ఎంగిలితో ఉండవా ?
ఈ ఎంగిలి ఎక్కడ పుట్టినది ?
అంతా ఎంగిలి మంగలమే.
తత్వాన్ని అర్థం చేసుకోవాలి.

💥వేమన పద్యాలు -- 8

అంగమ్మాలినవాడు దాత యగునా యైదారు గొడ్డేరులున్
గంగా నర్మద సింధు గౌతమగునా గంగెద్దు కాభరణముల్
శృంగారించిన శంభుతేజి యగునా క్షీరాబ్దిలో నెప్పుడున్
కొంగన్ముంచిన రాజహంస యగునా గోరాజ వేమాహ్వయా

🌹తాత్పర్యము --
దాత శరీరధారియే కదా !
నదులలోని నీరు గంగానదీ తుల్యము కాదు గదా !
దేని గొప్పతనము దానిదే !
గంగిరెద్దుకి ఆభరణములు తగిలించి ఎంత అలంకరించినా శివుని వాహనము వృషభము కాలేదు కదా !
పాలసముద్రములో కొంగను తీసుకెళ్ళి ఎంతసేపు ముంచినా అది రాజహంస కాలేదు గదా!

💥వేమన పద్యాలు -- 9
      
అంగ యోగములును ఆరుమతంబులు
మూడు యోగములను మొనయరాదు
కడమ యోగమునను కల్గును మోక్షంబు
విశ్వదాభిరామ రామ వినుర వేమా !

🌹తాత్పర్యము --
అష్టాంగయోగాలు , ఎన్ని మతములు , జ్ఞాన సిద్ధి వైరాగ్యము ఎన్ని ఉన్నను తపశ్శక్తితో మోక్షప్రాప్తికి మానవుడు పరితపించవలెను.

పార్వతీపరమేశ్వరుల దివ్య ఆశీస్సులు అందరిపై ఉండాలని మనసారా కోరుకుంటూ అందరికీ శుభరాత్రి
సర్వేజనా సుఖినోభవంతు

సేకరణ:-  శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.

కామెంట్‌లు లేవు: