ఉత్పలమాల
ఎందరు భక్తులో తనివి దీరక స్తోత్రము జేసి గొల్చి రిం
కెందరు పుణ్యులో జనిరొకే పథమందు నమేయ దీక్షతో ,
మందుడ నిట్టి యోగ్యతణు మాత్రము లేదు, దయాళు వీవు, నా
బంధములన్ని మాపి నను భక్తి పథోన్ముఖు జేయుమా ప్రభో.🙏🙏
🙏🌷🙏🌷🙏🌷🙏🌷
ఉత్పలమాల
చెల్వపు పూల మాలికల జేర్చితి నీ కొరకై ప్రభో, సదా
కొల్వగ నాకు చిత్తమున కొల్లలుగా కలిగించు భక్తి, నే
గెల్వగ లేనయా భవము, క్లేశము బాపగ వేడుకొందు, నీ
పిల్పుకు వేచి యుండెడి పిపీలికు బ్రోవుము శోక నాశనా. 🙏🙏
🙏🌷🙏🌷🙏🌷🙏🌷
శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః 🙏🙏🙏🙏
శ్రీ రామ జయ రామ జయ జయ రామ 🙏🙏🙏🙏
శ్రీ రామ జయం
ప్రపంచ కవులకు స్వగతం. మీ కవితలను ఇక్కడ పబ్లిష్ చేయవచ్చు. మీరు ముందుగా follow by Email బాక్సులో మీ మెయిల్ అడ్రసుని నింపి submit చేయండి. తరువాత followers ని click చేసి follower అవ్వండి. తరువాత మీ రచనను కొత్త కవులు పేజీలో అక్కడ సూచించిన విధంగా పంపండి. .
20, జనవరి 2024, శనివారం
బ్రోవుము శోక నాశనా
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి