20, జనవరి 2024, శనివారం

భాగవతము

 పోతనామాత్యులవారి భాగవతము నందలి ఆణిముత్యాలు🌹
🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹
ద్వితీయ స్కంధము

రామ! గుణాభిరామ! దినరాజ కులోంబుధి సోమ! తోయద
శ్యామ! దశాననప్రబలసైన్య విరామ! సురారి గోత్ర సు
త్రామ! సుబాహు బాహుబల దర్ప తమః పటు తీవ్ర ధామ! ని
ష్కామ! కుభృల్ల లామ! గరకంఠ సతీ నుత నామ! రాఘవా!

శ్రీరామా! నీగుణాలన్నీ చాలా మనోహరములయినవయ్యా! సూర్యదేవుని కులం అనే సముద్రంలో పుట్టిన చంద్రుడవు నీవు. నీలమేఘం వంటి మేనిఛాయతో అలరారుతూ ఉంటావు. పదితలల రక్కసుని పిక్కటిల్లిన బలం కల సేనలను రూపుమాపినవాడవు. దేవతల పగవారు అనే కొండలకు ఇంద్రుడవు. సుబాహువు ఆనే రాక్షసుని బాహువుల బలం వలన కలిగిన పొగరు ఒక చీకటి అయితే దానికి నీవు సూర్యుడవు. నీకు ఏ కోరికలూ లేవు. భూమిని పాలించేవారిలో మేలుబంతి అయినవాడవు. పరమేశ్వరుని యిల్లాలు పార్వతీదేవి నీ నామాన్ని నిరంతరమూ జపిస్తూ ఉంటుంది. రఘువంశం నీ వలన మహిమను పొందిందయ్యా.

సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.

కామెంట్‌లు లేవు: