*సర్వ దేవతలకు తాంబూల సమర్పణ దాని ఫలం*
*తాంబూల విధిః*
మహాపిప్పలపత్రం చ క్రముకస్య ఫలాని చ |శుక్తిక్షారేణ సంయుక్తం తాంబూలమితి సంజ్ఞితమ్ || శ్వేతపత్రం చ చూర్ణంచ క్రముకాణాం ఫలాని చ | నారికేల ఫలోపేతం మాతులుఙ్గ సమాయుతమ్ ॥ ఏలాకంకోల కర్పూరై ర్ముఖవాసం ప్రచక్షతే ।
ఏతేషా మప్యలాభేతు తత్తద్రవ్యం స్మరేద్బుధః ॥ తత్తద్రవ్యం తు సంకల్ప్య పుష్బైర్వాపి సమర్చయేత్ అర్చనేషు విహీనం యత్తత్తోయేన సమర్చయేత్ ॥
ఇతిరత్నకోశే
తమలపాకు వక్కలు కాచు సున్నపు పదార్థం
ఈ మూడింటి కలయికనే తాంబూలంగా పిలుస్తారు. తెల్లని తమలపాకులో పొడి లేదా సున్నం. వక్కపొడి లేదా వక్క ముక్కలు.కొబ్బరి ముక్కలను పంపరపనసకాయ లేదా దానిమ్మ గింజలు యాలకులు, లవంగాలు, మరియు కర్పూరంతో కలిపిన మిశ్రమాన్ని 'ముఖవాసన' అంటారు. ఈ మూడు పదార్థాలు సువాసనగా ఉన్న తాంబూలం దేవతలకు గురువులకు సమర్పించాలి,ఒకవేళ ఇది అందుబాటులో లేకపోతే.ఇతర సుగంధ ద్రవ్యాలను ఉపయోగించవచ్చు. ఏ వస్తువుతోనైతే పూజ చేయాలనుకుంటున్నామో, దానిని మనసులో సంకల్పించుకొని,పూలతో కూడా పూజించవచ్చు
ఒకవేళ పూజకు అవసరమైన వస్తువులు లేనప్పుడు అప్పుడు నీటితో పూజ చేయవచ్చు.
( అర్ఘ్యం ఇవ్వచ్చు)
పంచసౌగంధికోపేతం యస్తాంబూలం నివేదయేత్ | శివాయగురవేచైవ తస్యపుణ్యఫలం శృణు || సుగన్ధిదేహ స్స్వౌజస్వీ సర్వావయవ సుందరః | వర్షకోటిశతం దివ్యం రుద్రలోకే మహీయతే ॥
భవిష్యపురాణే ॥
ఐదు సుగంధ ద్రవ్యాలు కలిపిన తాంబూలాన్ని ఎవరైతే శివునికి మరియు గురువుకు సమర్పిస్తారు
వారికి లభించే పుణ్యఫలం గురించి వినుము.
(యాలకులు,లవంగాలు,జాజికాయ,జాపత్రి,కర్పూరం,) వారి శరీరం సువాసనతో, తేజస్సుతో ప్రకాశిస్తుంది. అతని అన్ని అవయవాలు అందంగా, ఆకర్షణీయంగా ఉంటాయి. కోటి సంవత్సరాల పాటు దివ్యమైన కాలం. రుద్రలోకంలో గౌరవించబడతాడు.
*పంచ సౌగంధికములు*
ఏలాజాతిఫలం జాతిపత్రం వై దాక్షిణీత్వంచం లవఙ్గ సంయుతం పంచ సౌగన్ధిక మితీరితం॥
ఏలకులు, జాజికాయ, జాపత్రి, దాల్చినచెక్క, లవంగములు, పంచ సౌగంధికములు అంటారు
*తమలదళపర్ణ సంఖ్యా*
పఞ్చ సప్తాష్ట దశ వా పర్ణాని ద్వాదశాపిచ !
పఞ్చ సౌగన్ధిసంయుక్తంతామ్బూలంచో త్తమోత్తమం|
తామ్బూలమర్పయేద్విద్వాన్ సర్వభోగప్రదం హితత్ |
అన్యధాద్విజదైవేభ్యః తామ్బూలం నార్పయేదితి ॥
(స్మృతివాక్యం చరకః)
5-7-8 10-12 సంఖ్యగల తమలపాకులు, పంచ సౌగంధికములతో పీఠివక్కలతో సమర్పించిన తాంబూలము ఉత్తమము. మరియు సర్వభోగ ప్రదము, బ్రాహ్మణులకుగాని, దేవతలకుగాని పంచ సౌగంధిక యుక్తమైన తాంబూలమునే సమర్పించాలి వేరుగా ఇవ్వకూడదు .
*పూగసంఖ్యా*
సౌఖ్యమారోగ్యమేకంచ ద్విపూగంనిష్పలం భవేత్ | త్రిపూగం సర్వదా శ్రేష్ఠమధికం నైవదూష్యతి ॥
ఒకవక్క ఆరోగ్యప్రదము రెండు వక్కలు నిష్ఫలము మూడు వక్కలు సర్వదా శ్రేష్ఠము. అంతకన్న అధిక సంఖ్య గల వక్కలు కూడ దూష్యముకాదు....
*తమలపాకులూ పోకలూ*
ప్రాచీన కారిక:
ఏక పూగం మహా పాపం; ద్విపూగా న్నిప్పలా భవేత్!
త్రిపూగాన్ సుఖ మాzప్నోతి; తస్మా త్పూగత్రయం శుభమ్.
తాంబూలమునందు -
ఒక పక్క (పోక చెక్క) పెట్టినచో - మహాపాపము కలుగును రెండు పోకలు పెట్టినచో - ఫలము నశించును!
'మూడుపోకలు పెట్టినచో సుఖమూ - శుభమూ ప్రాప్తించును;
*తములపు ఆకులు మాత్రము సరి సమాన సంఖ్యలో వుండినచో - సమఫలము లభించును/
విషము (బేసి) సంఖ్యలో వుండినచో - విషమ ఫలము ప్రాప్తించును!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి