🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
. *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*
. *ఓం నమో భగవతే రామకృష్ణాయ*
. *🚩శ్రీ వివేకానందస్వామి🚩*
. *🚩జీవిత గాథ🚩*
*భాగం 62*
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
*కాలాంతరంలో నరేంద్రుడు ఇలా చెప్పాడు.....*
"మైల గడువు పూర్తికాక మునుపే నేను ఉద్యోగం కోసం మధ్యాహ్నపు మండుటెండలో ఒక కార్యాలయం నుండి మరొక కార్యాలయానికి (ఆకలితో,ఉత్త కాళ్ళతో) తిరిగాను. ఆప్తమిత్రులు కొందరు సానుభూతితో కొన్ని రోజులు నాతోనే ఉండే వారు. కాని కొన్ని రోజులు నాతో ఉండలేకపోయేవారు. కాని ప్రతిచోట నాకు నిరాశా నిస్పృహలే ఎదురైనాయి. కఠోర లౌకిక వాస్తవాల ప్రప్రథమ అనుభవంతో నిస్వార్థమైన సానుభూతి ఎంతో అరుదైనదనీ, దుర్బలులకూ పేదలకు ఇక్కడ స్థానం లేదనీ నాకు బాగా అర్థమయింది.
ఇదివరలో ఒకటి రెండు రోజులు నాకు సహాయం చేసినందుకు తాము కృతార్ధులమయినట్లు భావించిన వారిప్పుడు అందుకు విరుద్ధంగా చేయడమే సబబని భావించసాగారు. సహాయం చేయగల స్థితిలో ఉండి కూడా వాళ్లు నా పట్ల పెడముఖం చూప సాగారు.
“ఒక రోజు మిట్టమధ్యాహ్నం మండుటెండలో తిరిగి తిరిగి పాదాలు బొబ్బ లెక్కాయి; అలసిసొలసిపోయి మైదానంలోని 'ఓక్ టెర్లోని' స్మారకచిహ్న నిర్మాణం నీడలో విశ్రమించాను. ఆ రోజు ఒకరిద్దరు మిత్రులు నాతోపాటు ఉన్నారు; అనుకోకుండా అక్కడ కలుసుకోవడం జరిగింది. నన్ను అనునయించడానికి కాబోలు వారిలో ఒకడు, 'కృపాళువైన బ్రహ్మశ్వాస అనే పిల్లవాయువు వీచ సాగింది' అనే పాట పాడసాగాడు.
ఆ పాట వినగానే అతడు నా తల మీద సమ్మెటతో కొడుతున్నట్లు అనిపించింది. నా తల్లి, తమ్ముల నిస్సహాయ స్థితి గుర్తుకు వచ్చి, అవమానంతో నిరాశానిస్పృహలు ముప్పిరిగొనగా, 'నోరుముయ్యి, ఎవరికి ఆకలి బాధతో అలమటించే అవసరం లేదో అటువంటి భాగ్యవంతులకు ఈ కల్పనలు మధురంగా కానరావచ్చు. ఒకప్పుడు నాకూ అలాగే అనిపించేది.
కాని ఇప్పుడు కఠోర వాస్తవాలు ఎదురైనప్పుడు ఆ కల్పనలు అపహాస్యంగా తోస్తున్నాయి' అంటూ అరిచాను. నా మాటలు విని మిత్రుడు ఎంతో నొచ్చుకొన్నాడేమో! కాని ఎంతటి కటిక దారిద్ర్యం అనుభవిస్తూవుంటే ఆ మాటలు నా నోట వెలువడి ఉంటాయో అతడి కెలా అర్థమవుతుంది?🙏
*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
👉 *రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి