🈸🈸🈸🈸🈸🈸🈸🈸🈸
*జగద్గురు శ్రీ ఆది శంకరాచార్య*.
*విరచిత*
*భజగోవిందం (మోహముద్గరః)*
🈸🈸🈸🈸🈸🈸🈸🈸🈸
*రోజూ ఒక శ్లోకం (లఘు వివరణతో)*
🈸🈸🈸🈸🈸🈸🈸🈸🈸
*శ్లోకం - 11*
🈸🈸🈸🈸🈸🈸🈸🈸
*మా కురు ధన జన యౌవన గర్వం*
*హరతి నిమేషాత్కాలః సర్వం|*
*మాయామయమిదమఖిలం హిత్వా*
*బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా||*
*శ్లోకం అర్ధం : ~*
*ధనము, పరివారము, యవ్వనము కలవని గర్వముతో ఉండకుము. క్షణములో వీటినన్నిటిని కాలము హరించును. ఇదంతయు మాయామయమని, మిథ్యయని, అశాశ్వతమని గ్రహించి జ్ఞానివై పరబ్రహ్మమును పొందుము.*
*వివరణ : ~*
*ఈ ప్రపంచములో అందరికన్నా నీకు మొదటి శత్రువు గర్వము. ఎప్పుడు మనసున గర్వము చేరినదో, అపుడే మనిషికి పతనము ప్రారంభమైనదని అర్ధము. గర్వము అజ్ఞానమునకు సూచన. గర్వము కలిగిన వ్యక్తి తాను ధనవంతుడిననో, అందగాడిననో, పదవిలోనో- పలుకుబడిలోనో ఉన్నతుడననో, లేక జ్ఞానిననో, మంత్రోచ్ఛారణలో దిట్టననో ఊహించుకొని, ఊహాగానాలు చేసుకొని, స్త్రీ, జ్ఞాన, వృద్ధులు అన్న తారతమ్యములు మరిచి, అందరినీ అవమానిస్తాడు. ఈ అజ్ఞానమునకు కారణము అసంపూర్ణత. కావున గర్వమును సంపూర్ణముగా నశింప చేసి, పరతత్వమును సరిగా అర్థము చేసుకొని పరమాత్మునిలో ఆత్మని ఐక్యము చేసి పరమ పదము సాధించుము.*
*ఓం నమో నారాయణాయ।*
🈸🈸🈸🈸🈸🈸🈸🈸
*(తిరిగి రేపు మరో శ్లోకంతో కలుద్దాం)*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి